సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ బావ, వాణిజ్యవేత్త రాబర్ట్ వాద్రా బుధవారం భార్య ప్రియాంక గాంధీతో కలిసి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. మనీల్యాండరింగ్ కేసులో ఈనెల ఆరున ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాలని గతవారం ముందస్తు బెయిల్‌కు వాద్రా దరఖాస్తు చేసుకున్న క్రమంలో ఢిల్లీ కోర్టు ఆయనను ఆదేశించింది.
లండన్‌లో పలు స్ధిరాస్ధుల కొనుగోలు, స్వాధీనానికి సంబంధించి మనీల్యాండరింగ్ కేసులో వాద్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా, ఢిల్లీ కోర్టు వాద్రాకు ఈనెల 16 వరకూ మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. కాగా లండన్‌లో స్ధిరాస్తుల కొనుగోలుకు సంబంధించిన లావాదేవీలు, ఆస్తుల వివరాలపై వాద్రాను ప్రశ్నించనున్న ఈడీ మనీల్యాండరింగ్ చట్టం కింద ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనుంది. మరోవైపు వాద్రాను ఈడీ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలతో విరుచుకుపడింది. యూపీఏ హయంలో రాబర్ట్ వాద్రా భారీగా లబ్దిపొందారని, ఈ మొత్తంతో వాద్రా విదేశాల్లో కోట్లాది రూపాయలతో విలాసవంతమైన ఆస్తులను కొనుగోలు చేశారని బీజేపీ ప్రతినిధి సంబిట్ పాత్ర ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment