
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి రెజ్లర్, రెండు ఒలింపిక్ పతకాల విజేత సుశీల్ కుమార్ దాదాపు ఏడాదిన్నర తర్వాత జైలునుంచి బయటకు రానున్నాడు. కుటుంబపరమైన సమస్యను ఎదుర్కొంటున్న కారణంగా మానవతా దృక్పథంతో ఈ నెల 12 వరకు అతనికి ఢిల్లీ కోర్టు మధ్యంతర బెయిల్ జారీ చేసింది.
సుశీల్ భార్య తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతుండటంతో శస్త్రచికిత్సకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆమె బాగోగులు చూసుకునేందుకు 3 వారాల బెయిల్ ఇవ్వాల్సిందిగా సుశీల్ న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. అయితే చివరకు కోర్టు వారం రోజుల బెయిల్ కోసం ఆదేశాలు ఇచ్చింది. యువ రెజ్లర్ సాగర్ రాణా హత్యకేసులో నిందితుడిగా ఉన్న సుశీల్ 2021 జూన్ 2నుంచి జైల్లో ఉన్నాడు.