బొమ్మనహళ్లి: హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్‌కు భారీ ఊరట లభించింది. ఆయనతోపాటు ఏడుగురికి హైకోర్టు బెయిలిచ్చింది. వెన్నునొప్పితో బాధపడుతున్న దర్శన్ మధ్యంతర బెయిల్‌పై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టులో వేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది.
అనంతరం దర్శన్, అతడి సన్నిహితురాలు పవిత్రా గౌడ, ప్రదోశ్, అనుకుమార్, నాగరాజు, లక్ష్మణ్, జగదీష్‌కు బెయిల్ మంజూరు చేస్తు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురికి బెయిల్ లభించింది. పవిత్రా గౌడను దుర్భాషలాడాడనే కోపంతో రేణుక స్వామి అనే వ్యక్తిని చంపారనే ఆరోపణలపై దర్శన్‌ను జూలైలో పోలీసులు అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment