![Manish Sisodia Seeks Interim Bail In Liquor Case For Election Campaign - Sakshi](/styles/webp/s3/article_images/2024/04/12/manishsisodia.jpg.webp?itok=3K1PQN-i)
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కోర్టు శుక్రవారం(ఏప్రిల్ 12) విచారించింది. ఈ నెల 20లోపు సిసోడియా బెయిల్ పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐలకు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది.
లోక్‌సభ ఎన్నికలు సమీపించింనదున ఆమ్‌ఆద్మీపార్టీ తరపున ప్రచారం కోసం తనకు మధ్యంత బెయిల్ ఇవ్వాలని కోర్టును సిసోడియా కోరారు. ఈ నెల 20వ తేదీన కోర్టు సిసోడియా మధ్యంతర బెయిల్‌పై విచారణ జరిపే అవకాశం ఉంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో గతేడాది ఫిబ్రవరి 26న సీబీఐ మనీష్ సిసోడియాను అరెస్టు చేసింది. అనంతరం ఈడీ కూడా సిసోడియాను ఇదే కేసులో అరెస్టు చేయడం గమనార్హం. అరెస్టు అనంతరం ఢిల్లీ డిప్యూటీ సీఎం పదవికి సిసోడియా రాజీనామా చేశారు. ఇదే కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల అరెస్టయిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి.. రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ నిందితుల అరెస్టు.. స్పందించిన ‘దీదీ’
Comments
Please login to add a commentAdd a comment