న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ పార్టీ ముఖ్య నేతలు జైలులో మగ్గుతున్న ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్)కి సంజయ్ సింగ్ రూపంలో బ్రహ్మాస్త్రం దొరికిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. లిక్కర్ కేసులో గతేడాది అక్టోబర్ నుంచి జైలులో ఉన్న ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ బుధవారం(ఏప్రిల్ 2) సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాన్ని తమ పార్టీకి ‘మూమెంట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ హోప్’గా ఆప్ నేతలు అభివర్ణిస్తున్నారు.
ఆప్ సీనియర్ నేత అయిన సంజయ్‌సింగ్‌కు మంచి ఎన్నికల వ్యూహకర్తగా, వక్తగా పేరుంది. పకడ్బందీ ఎన్నికల వ్యూహాలు రచించి పరిస్థితులను పార్టీకి అనుకూలంగా మార్చి ఎన్నికల్లో విజయాలు సాధించడంలో సంజయ్‌సింగ్‌ది అందె వేసిన చేయి అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గతంలో ఆప్ సాధించిన అన్ని విజయాల్లో సంజయ్‌సింగ్ ఆర్గనైజేషనల్ స్కిల్స్ కీలక పాత్ర పోషించాయి. దీంతో ప్రస్తుతం పార్టీ కీలక నేతలు జైలులో ఉన్న వేళ లోక్‌సభ ఎన్నికల ప్రచారం సంజయ్ సింగ్ విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లగలరని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇదీ చదవండి.. కేజ్రీవాల్ ఆరోగ్యం.. తీహార్ జైలు కీలక ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment