
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ మెడికల్ బెయిల్‌ను సుప్రీంకోర్టు పొడిగించింది. జైన్ మధ్యంతర బెయిల్‌ను సెప్టెంబర్ 25 వరకు పొడిగించింది. ఈ మేరకు ఏఎస్ బోపన్న, బేల ఎం త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం వెల్లడించింది.
కాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఢిల్లీ హైకోర్టు తనకు బెయిల్ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ సత్యేందర్ జైన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు నేడు విచారించింది. ఈడీ తరుపున అడిషనల్ సొలిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తూ జైన్ కేసును వాయిదా వేయాలని, బెయిల్ పొడిగించాలని కోరారు. దీనికి అంగీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్‌ను పొడిగిస్తూ విచారణను సెప్టెంబర్ 25కి వాయిదా వేసింది.
జైన్‌కు వెన్నుముక సర్జరీ తర్వాత ఆయన మెడికల్ బెయిల్‌ను పొడిగించడం ఇది మూడోసారి. తొలిసారి మే 26న సత్యేందర్ జైన్‌కు సుప్రీంకోర్టు ఆరు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. గత నెల ఆగస్టులో రెండోసారి పొడిగించింది. అయితే మీడియాతో మాట్లాడకూడదు, అనుమతి లేకుండా ఢిల్లీ వదిలి వెళ్లరాదని పలు ఆంక్షలు విధించింది.
కాగా ఆమ్ ఆద్మీ నేత, మాజీ మాంత్రి మనీలాండరింగ్ కేసులో మే నెలలో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. 2015 ఫిబ్రవరి 14నుంచి వివిధ వ్యక్తుల పేరిట అక్రమ ఆస్తులు సంపాదించారనే ఆరోపణలపై నమోదైన సీబీఐ ఫిర్యాదుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ కేసును విచారిస్తోంది.
చదవండి: ఎట్టకేలకు భారత్ వీడిన కెనడా ప్రధాని.. రెండు రోజులు ఆలస్యంగా
Comments
Please login to add a commentAdd a comment