
జమ్మూ: ఎన్‌ఐఏ విచారణలో జిప్లైన్ ఆపరేటర్ ముజమ్మిల్ తీరుపై పలు అనుమానాలు వెలుగులోకి వస్తున్నాయి.
పహల్గాం ఉగ్రదాడి సమయంలో జిప్లైన్‌పై ప్రయాణిస్తున్న ఓ టూరిస్ట్ తీసిన వీడియోలో ఉగ్రదాడి ఘటన రికార్డైంది. అయితే అప్పటికే కాల్పులు ప్రారంభమైనా తనను హెచ్చరించకుండా ఆపరేటర్ అల్లహో అక్బర్ అని అరుస్తూ తనను ముందుకు తోశాడని గుజరాత్‌కు చెందిన టూరిస్ట్ రిషి భట్ చెప్పాడు. రిషి వీడియో బయటకు రావడంతో జిప్ లైన్ ఆపరేటర్‌ను ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకొని విచారిస్తోంది.
ఎన్‌ఐఏ విచారణలో ముజమ్మిల్ అల్లాహు అక్బర్ అని అనడంలో ఎలాంటి అనుమానం లేదని ఎన్‌ఐఏ వర్గాల సమాచారం. ఆపత్కాలంలో హిందువులు రామా అని ఎలా స్మరిస్తారో.. ముజమ్మిల్ సైతం తాను కూడా అల్లాహో అక్బర్ అని పలికినట్లు చెప్పినట్లు తెలుస్తోంది. అంతవరకు బాగానే ఉన్నా.. ఎన్‌ఐఏ ప్రాథమిక విచారణలో ముజమ్మిల్‌కి ఈ ఉగ్రదాడిలో ప్రత్యక్ష పాత్ర లేకపోయినా, అతని తీరుపై పలు అనుమానాలు ప్రస్పుటమవుతున్నాయి.
#PahalgamTerrorAttack
A zipline operator when hears the first shot, said “Allah-hu-Akbar.” He’s at a vantage point—he sees everything unfolding below
Instead of stopping the ride, he waves next tourist in. He wasn’t scared. He seems complicit & aware!@smitaprakash@AartiTikoo pic.twitter.com/Fam4sYYOjg— Fatima Dar (@FatimaDar_jk) April 28, 2025
ఘటనా స్థలంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపినప్పుడు జిప్‌లైన్ ఆపరేటర్ ముజమ్మిల్.. టూరిస్ట్ రిషి భట్‌ని అల్లహో అక్బర్ అని అరుస్తూ ముందుకు తోశాడనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఎన్‌ఐఏ అధికారులు జిప్ లైన్ ఆపరేటర్ ముజమ్మిల్ ప్రశ్నిస్తే.. ఆయన వ్యవహార శైలీ అనుమానాస్పదంగా మారింది. దీంతో ఎన్‌ఐఏ అధికారుల తమ దర్యాప్తును మరింత లోతుగా ముమ్మరం చేశారు.