Jammu Kashmir
-
జమ్మూకశ్మీర్ కథువా జిల్లాలో ఎన్ కౌంటర్
-
కార్గిల్‌లో భూకంపం
కార్గిల్: కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌తో పాటు జమ్ముకశ్మీర్‌లో భూమి కంపించింది(Earthquake). హోలీ రోజున తెల్లవారుజామున 2.50 గంటలకు లడఖ్‌లోని కార్గిల్‌లో 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలు జమ్ముకశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలలోనూ కనిపించాయి. భూకంప కేంద్రం 15 కిలోమీటర్ల లోతులో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. EQ of M: 5.2, On: 14/03/2025 02:50:05 IST, Lat: 33.37 N, Long: 76.76 E, Depth: 15 Km, Location: Kargil, Ladakh. For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/7SuSEYEIcy— National Center for Seismology (@NCS_Earthquake) March 13, 2025కార్గిల్‌లో భూకంపం సంభవించిన మూడు గంటలకే ఈశాన్య భారతదేశంలో కూడా ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని పశ్చిమ కామెంగ్ ప్రాంతంలో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉదయం 6 గంటలకు ఇక్కడ భూకంపం సంభవించింది. మార్చి 13న మధ్యాహ్నం 2 గంటలకు టిబెట్‌లో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. కాగా లెహ్,లడఖ్(Leh, Ladakh) రెండూ భూకంప జోన్-IV పరిధిలోకి వస్తాయి. అంటే భూకంపాల పరంగా ప్రమాదం అధికంగా ఉన్న ప్రాంతాలివి. జమ్ముకశ్మీర్‌లో భూకంపం సంభవించిన సమయంలో తమ అనుభవాలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.ఇది కూడా చదవండి: నేడు హోలీ.. రంజాన్ ప్రార్థనలు.. దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం -
ఆరేళ్ల తర్వాత తొలి బడ్జెట్
జమ్ము: కొంగొత్త ఆశలతో ఆరేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్లో తొలి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కేబినెట్ ప్రతిపాదనకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదం తెలపడంతో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం మార్చి మొదటి వారంలో తొలి అసెంబ్లీ సమావేశాలకు సమయాత్తమవుతుంది. అసెంబ్లీ సమావేశాలు మార్చి 3నుండి ప్రారంభమై 21 రోజుల పాటు జరగనున్నాయి. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా 2025-2026 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. జనవరి 21న ఒమర్ అబ్దుల్లా అధ్యక్షతన జరిగిన జమ్మూకశ్మీర్ కేబినెట్ మార్చి మొదటి వారం నుంచి సెషన్‌ను నిర్వహించాలని ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదనకు సిన్హా ఆమోదం తెలిపారని, మార్చి మొదటి వారంలో సెషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.లెఫ్టినెంట్ గవర్నర్ మార్చి 3 నుంచి తొలి రాష్టబడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు స్పీకర్ రహీమ్ రాథర్తో సంప్రదింపులు జరిపారు. ఇరువురి చర్చల అనంతరం అసెంబ్లీ కార్యదర్శి తెలియజేస్తారని, సమావేశాల ప్రారంభ తేదీ,వ్యవధిని చర్చిస్తారని సమాచారం. కాగా, జమ్మూ కశ్మీర్లో శాసనసభ లేకపోవడంతో మునుపటి ఐదు బడ్జెట్లను పార్లమెంటు ప్రవేశపెట్టింది. అయితే పీడీపీ-బీజేపీ ప్రభుత్వం పతనం తర్వాత అప్పటి గవర్నర్ సత్యపాల్ మాలిక్ నేతృత్వంలోని 2019-2020 బడ్జెట్‌ను ఆమోదించింది. -
గుట్టు వీడిన అంతుచిక్కని వ్యాధి.. క్వారంటైన్లో గ్రామం
శ్రీనగర్: అంతుచిక్కని వ్యాధి కారణంగా జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో ఇప్పటివరకు 17 మంది మృతిచెందారు. ఈ నేపధ్యంలో తాజాగా చండీగఢ్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (సీఎఫ్ఎస్ఎల్) బృందం రాజౌరి జిల్లాలోనిబుధల్ గ్రామాన్ని సందర్శించింది.ఈ సందర్భంగా డాక్టర్ అమర్జిత్ సింగ్ భాటియా మాట్లాడుతూ ఈ అంతుచిక్కని వ్యాధికిగల కారణం వెల్లడయ్యిందని, బాధితులకు మెరుగైన చకిత్స అందిస్తామని, వారంతా త్వరలోనే కోలుకుంటారని అన్నారు. మరోవైపు స్థానిక వైద్యాధికారులు గ్రామాన్ని క్వారంటైన్ చేశారు. రాజౌరి పరిపాలన అధికారులు 150 పడకల తాత్కాలిక వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో బాధితులకు 24 గంటలూ వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని అధికారులు తెలిపారు.డాక్టర్ అమర్జీత్ సింగ్ భాటియా తెలిపిన వివరాల ప్రకారం ఈ మరణాలకు బాధితుల మెదడుకు హాని జరగడమే ప్రధాన కారణం. ఫలితంగా వారి నాడీ వ్యవస్థ దెబ్బతింది. తాజగా ఈ వ్యాధితో ఆస్పత్రిలో చేరిన తొమ్మదిమందిలో ఐదుగురు కోలుకున్నారు. ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు స్థానిక వైద్యాధికారులు చర్యలు చేపట్టారు. ఇక్కడి జనం ఆహార పదార్థాలను పరస్పరం పంచుకోవద్దని సూచిస్తున్నారు.గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో తక్షణ వైద్య సహాయం అందిస్తున్నారు. బాధిత కుటుంబాలకు పోషకాహారం అందిస్తున్నారు. దుస్తులు, మందులు, పరిశుభ్రతా పరికరాలను అందిస్తున్నారు. ఈ కేంద్రంలో వైద్యులు 24 గంటలూ అందుబాటులో ఉంటున్నారు. మరోవైపు పోలీసుశాఖ గ్రామంలో చోటుచేసుకున్న మరణాలకు నేరపూరత చర్యలేవైనా కారణమై ఉండవచ్చనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: Los Angeles Fire: మళ్లీ కార్చిచ్చు.. రెండు గంటల్లో 5,000 ఎకరాలు ఆహుతి -
Omar Abdullah: బీజేపీ నుంచి ఆశించడం మూర్ఖత్వం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ప్రజల ప్రత్యేక హక్కులను లాక్కున్న బీజేపీ నుంచి ఆర్టికల్ 370 పునరుద్ధరణను ఆశించడం మూర్ఖత్వమని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా అన్నారు. అయితే బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ అంశంపై తమ పార్టీ వైఖరి మారబోదన్నారు. ఆర్టికల్ 370పై మాట్లాడబోమని కానీ, అదిప్పుడు సమస్య కాదని తామెప్పుడూ చెప్పలేదని అబ్దుల్లా స్పష్టం చేశారు. భవిష్యత్‌లో దేశంలో ప్రభుత్వం మారుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఒమర్... అప్పుడు జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పించే కొత్త వ్యవస్థ ఏర్పడుతుందని ఆశిస్తున్నామన్నారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని కోరుతూ ఎన్సీ–కాంగ్రెస్ ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశంలో తీర్మానం చేస్తుందని తెలిపారు. ఢిల్లీ తరహాలో కాకుండా జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం సజావుగా నడుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీకి జమ్మూకశ్మీర్‌కు చాలా తేడా ఉందని, 2019కు ముందు జమ్మూకశ్మీర్ ఒక రాష్ట్రమని గుర్తు చేశారు. జమ్మూకశ్మీర్‌లో మూడు చర్యలు తీసుకుంటామని చెప్పిన ప్రధాని, హోంమంత్రి, సీనియర్ మంత్రులు చెప్పారని, డీలిమిటేషన్, ఎన్నికలు జరిగాయని, రాష్ట్ర హోదా మాత్రమే మిగిలి ఉందని, దానిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కేంద్రంతో ఘర్షణ పడటం వల్ల సమస్యలను పరిష్కరించలేమన్నారు. ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించడానికి ఎన్సీ గురువారం శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తుందని అబ్దుల్లా చెప్పారు. ఆ తర్వాత కూటమి సమావేశంలో నాయకుడిని ఎన్నుకుంటారని, ఆ తర్వాత రాజ్‌భవన్‌కు వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకు హక్కును కోరుతామని తెలిపారు. మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో పీడీపీ భాగస్వామ్యం అవుతుందా అన్న ప్రశ్నకు ఎన్సీ నేత సమాధానమిస్తూ ప్రస్తుతానికి దానిపై ఎలాంటి చర్చలు జరగలేదని చెప్పారు.హిందువుల్లో విశ్వాసాన్నిపెంచుతాం: ఫరూక్జమ్మూకశ్మీర్ మధ్య బీజేపీ సృష్టించిన విభేదాలను తగ్గించి, హిందువుల్లో విశ్వాసాన్ని పెంపొందించడమే ఎన్సీ–కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. రెండు ప్రాంతాల మధ్య భేదం చూపబోమని తెలిపారు. కొత్త ప్రభుత్వం ముందు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం అతిపెద్ద సవాళ్లున్నాయన్నారు. యువతకు అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అయితే ముఖ్యమంత్రి ఎవరనేది కూటమి నిర్ణయిస్తుందని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించడంపై ఫరూక్ స్పందిస్తూ.. తాను నిర్ణయించిందే జరుగుతుందని స్పష్టం చేశారు. ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అభ్యర్థని ఫరూక్ అబ్దుల్లా మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. -
J&K: కాంగ్రెస్ కూటమి గెలుపు
Haryana And Jammu And Kashmir Assembly Election Results Updates : 5.50 PMజమ్ము కశ్మీర్లో కౌంటింగ్ పూర్తి..నేషనల్ కాన్ఫరెన్స్ - 42 సీట్లుబీజేపీ - 29కాంగ్రెస్ - 06పీడీపీ - 03సీపీఎం - 01ఆప్ - 01జేపీసీ - 01స్వతంత్రులు - 07మొత్తం స్థానాలు: 905.30 PMహర్యానాలోబీజేపీ: గెలుపు-48కాంగ్రెస్: ఆధిక్యం-2 గెలుపు- 35ఐఎన్ఎల్డీ+: గెలుపు-2జేజేపీ: 0ఇతరులు:గెలుపు-34.30 PMజమ్ము కశ్మీర్దోడా స్థానంలో ఆప్ అభ్యర్థి మెహ్రాజ్ మాలిక్ గెలుపుశుభాకాంక్షలు తెలిపిన ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్#WATCH | Former Delhi CM and AAP National Convenor Arvind Kejriwal spoke and congratulated the newly elected AAP MLA from Doda, Mehraj Malik.(Source: AAP) pic.twitter.com/VsI1YJxuqd— ANI (@ANI) October 8, 2024 4.30 PMహర్యానాలోబీజేపీ: ఆధిక్యం-4, గెలుపు-45కాంగ్రెస్: ఆధిక్యం-2 గెలుపు- 34ఐఎన్ఎల్డీ+: ఆధిక్యం-1,గెలుపు-1జేజేపీ: 0ఇతరులు: ఆధిక్యం-0, గెలుపు-3జమ్ముకశ్మీర్లోకాంగ్రెస్ కూటమి: గెలుపు-49బీజేపీ:గెలుపు-29పీడీపీ: గెలుపు-3ఏఐపీ+:గెలుపు-1ఇతరులు:గెలుపు-8 4.28 PMహర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ గెలుపులాడ్వా అసెంబ్లీ స్థానం నుంచి 16,054 ఓట్ల మెజార్టీతో విజయంHaryana CM Nayab Singh Saini wins from Ladwa Assembly seat by a margin of 16,054 votes#HaryanaElection pic.twitter.com/ocxcrT7m3v— ANI (@ANI) October 8, 2024 4.25 PMహర్యానాలో మాజీ సీఎం భూపీందర్ సింగ్ హడా విజయంగర్హి సంప్లా-కిలోయ్ స్థానం నుంచి విజయం సాధించిన మాజీ సీఎం, కాంగ్రెస్ అభ్యర్థి భూపీందర్ సింగ్ హుడా70,626 వేలకుపైగా మెజార్టీతో గెలుపు4.20 PMగందేర్బల్లోనూ ఒమర్ అబ్దుల్లా గెలుపుజమ్ము కశ్మీర్‌లోని గందేర్బల్ నియోజకవర్గంలోనూ నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి ఒమర్ అబ్దుల్లా విజయంఇప్పటికే బుడ్గాం స్థానంలో ఒమర్ అబ్దుల్లా గెలుపు4.10 PMజమ్ము కశ్మీర్లో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన కాంగ్రెస్ కూటమిఎన్నికల సంఘం అధికారిక ఫలితాల ప్రకారం..ఇప్పటివరకు 41 స్థానాల్లో జేకేఎన్సీ విజయంకాంగ్రెస్: ఆరు సీట్లలో గెలుపుజమ్ము కశ్మీర్లో మొత్తం స్థానాలు 90.. మ్యాజిక్ ఫిగర్ 46 స్థానాలు4.00 PMహర్యానాలోబీజేపీ: ఆధిక్యం-17, గెలుపు-32కాంగ్రెస్: ఆధిక్యం-9 గెలుపు- 27ఐఎన్ఎల్డీ+: ఆధిక్యం-1,గెలుపు-1జేజేపీ: 0ఇతరులు: ఆధిక్యం-0, గెలుపు-3జమ్ముకశ్మీర్లోకాంగ్రెస్ కూటమి: ఆధిక్యం-1,గెలుపు-48బీజేపీ:ఆధిక్యం-0, గెలుపు-29పీడీపీ: ఆధిక్యం-0, గెలుపు-3ఏఐపీ+: ఆధిక్యం-0, గెలుపు-1ఇతరులు: ఆధిక్యం-0, గెలుపు-8 3.40PMజమ్ము కశ్మీర్లోకాంగ్రెస్ కూటమి: ఆధిక్యం-2, గెలుపు-47బీజేపీ: ఆధిక్యం-1, గెలుపు-28పీడీపీ: ఆధిక్యం-0, గెలుపు-3ఏఐపీ+: ఆధిక్యం-0, గెలుపు-1ఇతరులు: ఆధిక్యం-1 గెలుపు-7హర్యానాలోబీజేపీ: ఆధిక్యం-27, గెలుపు-22కాంగ్రెస్: ఆధిక్యం-12 గెలుపు- 24ఐఎన్ఎల్డీ+:ఆధిక్యం-1,గెలుపు-1జేజేపీ: 0ఇతరులు: ఆధిక్యం-0, గెలుపు-3 3.30PMభారత సంపన్న మహిళ సావిత్రి జిందాల్ గెలుపుహర్యానా హిసార్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సావిత్రి విజయం 3.20PMజమ్ముకశ్మీర్లోకాంగ్రెస్ కూటమి: ఆధిక్యం-8,గెలుపు-40బీజేపీ:ఆధిక్యం-2, గెలుపు-27పీడీపీ: ఆధిక్యం-2, గెలుపు-2ఏఐపీ+: ఆధిక్యం-1ఇతరులు: ఆధిక్యం-3 గెలుపు-5హర్యానాలోబీజేపీ: ఆధిక్యం-35, గెలుపు-14కాంగ్రెస్: ఆధిక్యం-14 గెలుపు- 21ఐఎన్ఎల్డీ+: ఆధిక్యం-3,గెలుపు-0జేజేపీ: 0ఇతరులు: ఆధిక్యం-0, గెలుపు-3 3.10PMఆదిత్య సూర్జేవాలా గెలుపుహర్యానాలోని కైథల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, పార్టీ సీనియర్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా కుమారడు విజయంస్థానికంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన ఆదిత్య సూర్జేవాలా#WATCH | #HaryanaAssemblyElection2024 | Congress leader Aditya Surjewala holds roadshow in Kaithal after being declared winner from the Assembly constituency pic.twitter.com/SkNERVB2j1— ANI (@ANI) October 8, 2024 3.00PMజమ్ముకశ్మీర్లోబీజేపీ:ఆధిక్యం-10, గెలుపు-19కాంగ్రెస్ కూటమి: ఆధిక్యం-16, గెలుపు-33పీడీపీ: ఆధిక్యం-1, గెలుపు-2ఏఐపీ+: ఆధిక్యం-1ఇతరులు: ఆధిక్యం-5 గెలుపు-3 హర్యానాలోబీజేపీ: ఆధిక్యం-39, గెలుపు-8కాంగ్రెస్: ఆధిక్యం-24 గెలుపు- 13ఐఎన్ఎల్డీ+:ఆధిక్యం-3,గెలుపు-0జేజేపీ: 0ఇతరులు: ఆధిక్యం-2, గెలుపు-1 2:50 pm జమ్ము కశ్మీర్:ఎన్సీకి 23.3 శాతం ఓట్లుకాంగ్రెస్ పార్టీకి 11. 8 శాతం ఓట్లు వచ్చాయి.బీజేపీకి 26 శాతం ఓట్లుపీడీపీకి 8.6 శాతం ఓట్లు వచ్చాయి. 2:40 pm జమ్ముకశ్మీర్లోబీజేపీ:ఆధిక్యం-14,గెలుపు-14కాంగ్రెస్ కూటమి: ఆధిక్యం-35,గెలుపు-15పీడీపీ: ఆధిక్యం-2, గెలుపు-1ఏఐపీ+: ఆధిక్యం-1ఇతరులు: ఆధిక్యం-5 గెలుపు-3హర్యానాలోబీజేపీ: ఆధిక్యం-43, గెలుపు-6కాంగ్రెస్: ఆధిక్యం-25 గెలుపు- 11ఐఎన్ఎల్డీ+:ఆధిక్యం-2,గెలుపు-0జేజేపీ: 0ఇతరులు: ఆధిక్యం-2, గెలుపు-1 2:25 pm హర్యానాలోబీజేపీ: ఆధిక్యం-44, గెలుపు-6 కాంగ్రెస్: ఆధిక్యం-25 గెలుపు- 10 ఐఎన్ఎల్డీ+:ఆధిక్యం-2,గెలుపు-0జేజేపీ: 0 ఇతరులు: ఆధిక్యం-3 2:10 pm జమ్ము కశ్మీర్లోబీజేపీ:ఆధిక్యం-15,గెలుపు-12కాంగ్రెస్ కూటమి: ఆధిక్యం-45,గెలుపు-7పీడీపీ: ఆధిక్యం-1, గెలుపు-1ఏఐపీ+: ఆధిక్యం-1ఇతరులు: ఆధిక్యం-5 గెలుపు-32:00pm హర్యానాలోబీజేపీ-ఆధిక్యం-45,గెలుపు-5కాంగ్రెస్- ఆధిక్యం-29 గెలుపు-6ఐఎన్ఎల్డీ-ఆధిక్యం-2,గెలుపు-0జేజేపీ-0ఇతరులు -ఆధిక్యం-3జమ్ముకశ్మీర్లోబీజేపీ-ఆధిక్యం-15,గెలుపు-12కాంగ్రెస్ కూటమి-ఆధిక్యం-47,గెలుపు-5పీడీపీ-ఆధిక్యం-1 ఇతరులు-ఆధిక్యం-6 గెలుపు-2 1:30pmహర్యానాలోబీజేపీ-ఆధిక్యం-45,గెలుపు-3కాంగ్రెస్- ఆధిక్యం-33 గెలుపు-3ఐఎన్ఎల్డీ-ఆధిక్యం-2,గెలుపు-0జేజేపీ-0ఇతరులు -ఆధిక్యం-4జమ్ముకశ్మీర్లోబీజేపీ-ఆధిక్యం-18,గెలుపు-9కాంగ్రెస్ కూటమి-ఆధిక్యం-49,గెలుపు-3పీడీపీ-ఆధిక్యం-2 ఇతరులు-ఆధిక్యం-8 గెలుపు-0 హర్యానాలో బీజేపీ తొలి విజయంజింద్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన డాక్టర్ క్రిషన్‌లాల్ మిద్ధా12:53pmహర్యానాహర్యానాలో రెజ్లర్ వినేష్ ఫొగాట్ విజయం12: 45pmహర్యానా బీజేపీ-ఆధిక్యం-46,గెలుపు-2కాంగ్రెస్- ఆధిక్యం-32 గెలుపు-3ఐఎన్ఎల్డీ-ఆధిక్యం-2 గెలుపు-0 జేజేపీ-0ఇతరులు -ఆధిక్యం-4జమ్ముకశ్మీర్బీజేపీ-ఆధిక్యం-22,గెలుపు-5కాంగ్రెస్ కూటమి-ఆధిక్యం-50,గెలుపు-2 పీడీపీ-ఆధిక్యం-2ఇతరులు-ఆధిక్యం-8 గెలుపు-012:30pmహర్యానా ఎన్నికల ఫలితాల అప్డేట్పై కాంగ్రెస్ అసహనంఈసీ వెబ్సైట్లో డేటా అప్డేట్ చేయడం లేదంటూ ఆగ్రహంప్రజలు కాంగ్రెస్ పక్షాన ఉన్న బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుందంటూ ఫైర్12:10PMజమ్ముకశ్మీర్ -బీజేపీ-29,ఎన్సీ+కాంగ్రెస్-50,పీడీపీ-2,ఇతరులు-09హర్యానా - బీజేపీ-49,కాంగ్రెస్-35,జేజేపీ-00,ఇతరులు-00 12:00PMఅసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బహర్యానా,జమ్ముకశ్మీర్‌లో ఖాతాతెరవని ఆప్రెండు రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీ చేసిన ఆప్ 11:50AMనేను ఓటమిని అంగీకరిస్తున్నా: పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తీజా ముఫ్తీబషీర్ అహ్మద్ చేతిలో ఇల్తీజా ఓటమి11:32AMకాశ్మీర్లో మహబూబాముఫ్తీ కుమార్తె ఓటమి 11:22AMజమ్ముకశ్మీర్జమ్ముకశ్మీర్లో బోణీ కొట్టిన బీజేపీకథువాలో బీజేపీ అభ్యర్థి దర్శన్‌కుమార్ ఘన విజయంనౌషెరాలో బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా వెనుకంజ 11:10AMహర్యానా - బీజేపీ-48,కాంగ్రెస్-36,జేజేపీ-00,ఇతరులు-06జమ్ముకశ్మీర్- బీజేపీ-27,ఐఎన్‌సీ+బీజేపీ-49, పీడీపీ-05, ఇతరులు-1011:10AMహర్యానా :హర్యానాలో మ్యాజిక్ ఫిగర్ చేరిన బీజేపీ ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టే దిశగా బీజేపీ10:50AMహర్యానా :హర్యానాలో తారుమారైన ఎగ్జిట్ పోల్స్కాంగ్రెస్కే పట్టం కట్టిన ఎగ్జిట్‌పోల్స్,మారిన తీర్పుహర్యానాలో అన్యూహంగా బీజేపీ ముందంజ48 స్థానాల్లో బీజేపీ ముందంజబీజేపీ-48,కాంగ్రెస్-36,జేజేపీ-0,ఇతరులు-07జమ్ముకశ్మీర్ :జమ్ముకశ్మీర్‌లో మ్యాజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్ కూటమిబీజేపీ-28,ఐఎన్‌సీ+బీజేపీ-48, పీడీపీ-4, ఇతరులు-1010:30AMహర్యానా :జులానాలో మాజీ రెజ్లన్ వినేశ్ ఫొగాట్ వెనుకంజకౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన వినేశ్ ఫొగాట్9:50AMఆధిక్యంలో బీజేపీహర్యానాలో బీజేపీ-కాంగ్రెస్‌ల మధ్య పోరు హోరాహోరీ తలపిస్తోంది. హర్యానాలో బీజేపీ తిరిగి ఆధిక్యంలోకి వచ్చింది. తొలుత కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగగా, ఆపై బీజేపీ ఆధిక్యం సాధించింది. హర్యానాలో 90 అసెంబ్లీ సీట్లకు గాను ప్రస్తుతం బీజేపీ 46 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుండగా, కాంగ్రెస్ 38 సీట్ల ఆధిక్యంలో ఉంది. 9:00AMహర్యానా, జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. రెండు రాష్ట్రాలా అసెంబ్లీ పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతుంది. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. హర్యానా పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ -56,బీజేపీ-28,జేపీపీ-1,ఇతరులు-5 ఆదిక్యంలో ఉన్నాయి.జమ్ముకశ్మీర్ పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ-31, కాంగ్రెస్ కూటమి-46, పీడీపీ-4, ఇతరులు -7 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.ముందుగా హర్యానాలో అక్టోబర్ 5న 90 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో మొత్తం 1,031 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అందులో 464 మంది స్వతంత్రులు.101 మంది మహిళలు.జమ్మూ కశ్మీర్‌లోనూ మంగళవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ కొనసాగుతుంది. ఇక్కడి 90 నియోజకవర్గాల్లో సెప్టెంబర్ 18,25, అక్టోబర్ 1న మూడు విడతల్లో పోలింగ్ జరిగింది. 90 నియోజకవర్గాల్లో మొత్తం 873 మంది అభ్యర్థులు బరిలోకి నిలిచారు. 👉హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ -63,బీజేపీ-23,జేపీపీ-1,ఇతరులు-1 ఆదిక్యంలో ఉన్నాయికైతాలలో ఆదిత్య సూర్జేవాలా ముందంజజేజేపీ ఉచనకలన్లో దుష్యంత్ చౌతాలాలడ్వా నియోజకవర్గం సీఎం నాయబ్సైనీ ముందంజఅంబాలా కంటోన్మెంట్లో అనిల్ విజ్ ఆధిక్యంజులనా అసెంబ్లీ స్థానం నుంచి స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ముందంజలో ఉన్నారుహర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభమైందితొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ -17,బీజేపీ-5 ఆదిక్యంలో ఉన్నాయి.93 కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటుహర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 468.30గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు9గంటలకు తుది ఫలితం విడుదల 👉జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ జమ్ముకశ్మీర్ పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ-27, కాంగ్రెస్ కూటమి-46, పీడీపీ-5, ఇతరులు -3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. జమ్ముకశ్మీర్‌లో సైతం కాంగ్రెస్ కూటమి పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో సత్తా చాటుతోందిగందర్బల్,బుద్గాం రెండు స్థానాల్లో ఓమర్ అబ్దుల్లా ముందంజగరిసంప్లా-కిలోయ్‌లో భూపేందర్ సింగ్ హుడా ముందంజ బీజేపీ చీఫ్ రవీంద్ర నైనా ముందంజ జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభమైంది జమ్ముకశ్మీర్ ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 48పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ -4, బీజేపీ -3,ఇతరులు -3 ఆధిక్యంలో ఉన్నాయి -
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఒక పోలీసు వీరమరణం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలోని మారుమూల గ్రామీణ ప్రాంతంలో భద్రతా బలగాలు- ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఒక పోలీసు వీరమరణం పొందగా, మరొక పోలీసు గాయపడ్డారు.వార్తా సంస్థ పీటీఐ అందించిన వివరాల ప్రకారం బిల్వార్ తహసీల్‌లోని కోగ్-మండలి గ్రామంలో శనివారం సాయంత్రం 5.30 గంటలకు ఎన్కౌంటర్ ప్రారంభమైంది. ఓ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా బలగాలు సంయుక్తంగా కార్డన్, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. అనంతరం ఎన్ కౌంటర్ మొదలైంది.ఇరువర్గాల మధ్య భారీగా కాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో కశ్మీర్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ వీరమరణం పొందగా, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గాయపడ్డాడు. ఒక పోలీసు అధికారి ఈ ఎన్కౌంటర్ గురించి మాట్లాడుతూ ఉగ్రవాదుల ఉనికిపై నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా, భద్రతా దళాలు కోగ్ గ్రామంలో ఆపరేషన్ ప్రారంభించాయన్నారు. ప్రస్తుతం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు తెలిపారు.ఇది కూడా చదవండి: యూపీ, బీహార్లలో భారీ వర్షాలు.. ఉప్పొంగుతున్న నదులు -
జమ్ములో కాల్పులు జరిపే ధైర్యం ఎవరికీ లేదు: అమిత్ షా
శ్రీనగర్: ఉగ్రవాదాన్ని అంతం చేసేవరకు పాకిస్థాన్‌తో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారంలో భాగంగా నౌషేరాలో జరిగిన ర్యాలీని అమిత్ షా పాల్గొని మాట్లాడారు.‘‘నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన విధంగా జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్టికల్ 370ని తిరిగి తీసుకువస్తామని మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా అంటున్నారు. ఆర్టికల్ 370ని ఎవరూ తిరిగి తీసుకురాలేరు. ప్రస్తుతం బంకర్లు అవసరం లేదు ఎందుకంటే ఎవరూ బుల్లెట్లు కాల్చడానికి ధైర్యం చేయలేరు. జమ్ము కశ్మీర్లో 30 ఏళ్లుగా కొనసాగిన ఉగ్రవాదం 40వేల మందిని బలి తీసుకుంది.కశ్మీర్ ఉగ్రవాదంతో కాలిపోతున్నప్పుడు.. ఫరూఖ్ అబ్దుల్లా లండన్‌లో హాలిడే గడిపారు.#WATCH | Rajouri, J&K: Addressing a public meeting in Nowshera, Union Home Minister Amit Shah says, "... Farooq Abdullah says that they will bring back Article 370. Farooq Sahab, nobody can bring back Article 370... Now, bunkers are not needed because no one can dare to fire… pic.twitter.com/cciMG6psOb— ANI (@ANI) September 22, 2024..పాకిస్థాన్‌తో మనం చర్చలు జరపాలని వారు కోరుకుంటున్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించే వరకు పాకిస్థాన్‌తో చర్చలు జరపబోం. ఉగ్రవాదులను జైళ్ల నుంచి విముక్తి చేయాలనుకుంటున్నారు. ప్రధాని మోదీ హయాంలో ఉగ్రవాదులను ఒక్కొక్కరిగా అంతం చేశాం. ఉగ్రవాది, రాళ్లదాడికి పాల్పడివారు జైలు నుంచి విడుదల కాలేరు. జమ్ము కశ్మీర్లో ఏ ఉగ్రవాది కూడా స్వేచ్ఛగా పరిస్థితి ఇకమీదట ఉండదని మీకు బీజేపీ హామి ఇస్తుంది’ అని అన్నారు.మరోవైపు..జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికలు (సెప్టెంబరు 18న తొలి విడత, సెప్టెంబరు 25న రెండో విడత, అక్టోబరు 1న మూడో విడత)జరుగుతున్నాయి.అక్టోబరు 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. -
‘వాళ్లు రాళ్లు ఇస్తే.. మేం పెన్ను, పుస్తకాలు ఇచ్చాం’
శ్రీనగర్: మూడు కుటుంబాలు జమ్ము కశ్మీర్‌ను దోచుకున్నాయని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం శ్రీనగర్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొని మాట్లాడారు.‘‘జమ్ము కశ్మీర్‌ను దోచుకోవటం తమ జన్మ హక్కు అన్నట్లు ఆ మూడు కుటుంబాలు ప్రవర్తిచాయి. మూడు పార్టీలు జమ్ము కశ్మీర్ యువత భవిష్యత్తు నాశనం చేశాయి. ఆ మూడు పార్టీలు కశ్మీర్ యువత చేతికి రాళ్లు ఇచ్చి విధ్వంసాలు సృష్టించేవి.. బీజేపీ మాత్రం పుస్తకాలు, పెన్స్ ఇస్తోంది.#WATCH | Srinagar, J&K: Prime Minister Narendra Modi says "...The three families think that it is their birthright to capture power by any means and then loot you all. Their political agenda has been to deprive the people of Jammu and Kashmir of their legitimate rights. They have… pic.twitter.com/lsTADRKFv1— ANI (@ANI) September 19, 2024 ..స్కూల్స్‌ను కూడా ఉగ్రవాదులు టార్గెట్ చేశారంటే.. వారు ఎంత ద్వేషంతో ఉన్నారో అర్థం అవుతుంది. ఇప్పుడు జమ్ము కశ్మీర్ యువత చేతిలో రాళ్లు కాదు.. బుక్స్, పెన్నులు కనిపిస్తున్నాయి. ఎయిమ్స్, ఐఐటీ ఏర్పాటు వార్తలు ఇప్పుడు జమ్ములో వినిపిస్తున్నాయి. కశ్మీర్లో ఉపాధి అవశాలు లభించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ..50 వేల మంది డ్రాపవుట్ విద్యార్థులను తిరిగి స్కూల్స్‌కు రప్పించాం. గతంలో లాల్‌చౌక్ దగ్గర ఉగ్ర దాడుల జరిగేవి. ఇప్పడు కశ్మీర్లో ఇంటర్నేషనల్ యోగా డే లాంటి కార్యక్రమాలు జరగుతున్నాయి. రైల్ కనెక్టివిటీ కూడా పెరగటం వల్ల టూరిజం, ఇతర రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. తొలివిడత ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. తొడి విడతలో ప్రజలు ఉత్సాహంగా ఓటు వేశారు’ అని మోదీ అన్నారు.#WATCH | Srinagar: Prime Minister Narendra Modi says "Today the world is seeing how the people of Jammu and Kashmir are strengthening the democracy of India and I congratulate the people of Jammu and Kashmir for this. A few days ago, when I came to Jammu and Kashmir, I had said… pic.twitter.com/gOfNsixo9L— ANI (@ANI) September 19, 2024 -
జమ్ము కశ్మీర్: మధ్యాహ్నం 3 గంటలకు 50.65 శాతం పోలింగ్
Updatesజమ్ము కశ్మీర్ పోలింగ్.. మధ్యాహ్నం 3 గంటల వరకు 50.65 శాతం ఓటింగ్ నమోదుఅనంతనాగ్-37.90%దోడా- 50.81%కిష్త్వార్-56.86%కుల్గాం-39.91%పుల్వామా-29.84%రాంబన్-49.68%షోపియాన్-38.72%కొనసాగుతున్న తొలి విడత పోలింగ్ Jammu and Kashmir 1st phase Assembly elections: 41.17% voter turnout recorded till 1 pm in Jammu and Kashmir, as per the Election Commission of India Anantnag-37.90% Doda- 50.81%Kishtwar-70.03% Kulgam-39.91% Pulwama-29.84% Ramban-49.68% Shopian-38.72% pic.twitter.com/urAeZzuhXt— ANI (@ANI) September 18, 2024 రాంబన్ నియోజకవర్గ అభ్యర్థి రాకేశ్ ఠాకూర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్లో చాలా అభివృద్ధి జరిగింది. అదే విషయాన్ని ప్రజల తెలియజేశాం.జమ్ము కశ్మీర్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం#WATCH | Ramban, J&K: After casting his vote, BJP candidate from Ramban assembly constituency, Rakesh Thakur says, "...After the abrogation of Article 370, a lot of development has taken place in Jammu and Kashmir and we went among the people with those development works in the… pic.twitter.com/Srd0rKavy0— ANI (@ANI) September 18, 2024 జమ్ము కశ్మీర్లో పోలింగ్ కొనసాగుతోంది.రాజ్‌పోరా నియోజకవర్గ జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి గులాం మోహి ఉద్దీన్ మీర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.పుల్వావాలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Pulwama, J&K: JKNC candidate from Rajpora assembly constituency, Ghulam Mohi Uddin Mir cast his vote at a polling station in Pulwama pic.twitter.com/7cG8uUcYwM— ANI (@ANI) September 18, 2024 జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది ఉదయం 11 గంటలకు వరకు 26.72 శాతం ఓటింగ్ నమోదుఅనంతనాగ్-25.55%దోడా- 32.30%కిష్త్వార్-32.69%కుల్గామ్-25.95%పుల్వామా-20.37%రాంబన్-31.25%షోపియాన్-25.96%జమ్ము కశ్మీర్లో తొలివిడత పోలింగ్ కొనసాగుతోంది.Jammu and Kashmir 1st phase Assembly elections: 26.72% voter turnout recorded till 11 am in Jammu and Kashmir, as per the Election Commission of IndiaAnantnag-25.55%Doda- 32.30%Kishtwar-32.69%Kulgam-25.95%Pulwama-20.37%Ramban-31.25%Shopian-25.96% pic.twitter.com/VRFWB182rp— ANI (@ANI) September 18, 2024 రికార్డు స్థాయిలో ఓటు వేయండి: ఎల్జీ మనోజ్ సిన్హాజమ్ము కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈరోజు మొదటి దశలో తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లందరూ రికార్డు సంఖ్యలో పాల్గొని ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకోవాలి. ముఖ్యంగా యువత, మహిళలు మొదటిసారి ఓటువేసేవారు పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనాలి Jammu and Kashmir LG Manoj Sinha says, "J&K Assembly elections commence today. I call upon all the voters whose assembly constituencies are voting in the first phase today to turn out in record numbers & exercise their democratic rights. I especially urge youth, women and… pic.twitter.com/26d5XMqXLv— ANI (@ANI) September 18, 2024 అనంత్‌నాగ్‌లోని బిజ్బెహరాలోని పోలింగ్ బూత్‌లో పోలింగ్ కొనసాగుతోంది. భారీగా ఓటర్లు క్యూలైన్లో నిల్చొన్నారు.అనంత్‌నాగ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున పీర్జాదా మహ్మద్ సయీద్, బీజేపీ తరఫున సయ్యద్ పీర్జాదా వజాహత్ హుస్సేన్, పీడీపీ తరఫున మెహబూబ్ బేగ్ బరిలో ఉన్నారు.#WATCH | J&K: Voters queue up at a polling booth in Bijbehara, Anantnag as they await their turn to cast their vote.Congress has fielded Peerzada Mohammad Sayeed, BJP has fielded Syed Peerzada Wajahat Hussain and PDP has fielded Mehboob Beg, from the Anantnag seat. pic.twitter.com/XURsAbSm2p— ANI (@ANI) September 18, 2024 భారీ భద్రత, పర్యవేక్షణలో కొనసాగుతున్న జమ్ము కశ్మీర్ పోలింగ్పదేళ్ల తర్వాత జమ్ముకశ్మీర్ శాసనసభకు ఎన్నికలుసాయంత్రం 6 గంటల వరకు కొనసాగునున్న పోలింగ్24 అసెంబ్లీ స్థానాల్లో పోటీలో 219 మంది అభ్యర్థులు#WATCH | Jammu: Kashmiri migrant voters cast their votes under high security.(Visuals ITI College Campus) pic.twitter.com/nMMDUauXQi— ANI (@ANI) September 18, 2024 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం: ఒమర్ అబ్దుల్లాజమ్ము కశ్మీర్‌కు ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రజలు నేషనల్ కాన్ఫరెన్స్‌కు ఓటు వేయాలని కోరుకుంటున్నాం. నేను కొంతమందితో మాట్లాడాను. నేషనల్ కాన్ఫరెన్స్‌కు అన్ని వర్గాల నుంచి చాలా ఓట్లు వస్తున్నాయి. మేం 10 ఏళ్లుగా ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాం. అక్టోబర్ 8వ తేదీ వరకు వేచి చూస్తాం.#WATCH | Srinagar, J&K: JKNC candidate, Omar Abdullah says "It is a very good thing, we want the people to vote for National Conference as it will benefit J&K. I spoke to some people, National Conference is getting a lot of votes from all sections. We are hopeful that we will… pic.twitter.com/wEKpiunT4Z— ANI (@ANI) September 18, 2024 జమ్ము కశ్మీర్లో తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. తమ ఓటు హక్కు వినియోగించుకోవటం కోసం ఓటర్ల పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు.కీలకమైన జమ్ము కశ్మీర్ ఎన్నికల పోలింగ్‌లో ఓటర్లు పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. జమ్ము కశ్మీర్లో మార్పుకు భాగస్వాములు కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.J-K polls: Congress chief Kharge appeals to people to participate in "crucial election," become "catalysts for change"Read @ANI Story | https://t.co/BDpnfHln5H#MallikarjunKharge #Congress #JammuKashmirelection #AssemblyElections pic.twitter.com/Wu2peKQssW— ANI Digital (@ani_digital) September 18, 2024 జమ్ము కశ్మీర్లో తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది.ఉదయం 9 గంటల వరకు 11.11 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.Jammu and Kashmir 1st phase Assembly elections: 11.11% voter turnout recorded in Jammu and Kashmir till 9 am, as per the Election Commission of India pic.twitter.com/ouCB0af95W— ANI (@ANI) September 18, 2024 జమ్ము కశ్మీర్లో పోలింగ్ కొనసాగుతోంది.కుల్గాం జిల్లాలోని ఎన్నికల కంట్రోల్ రూమ్‌లో జిల్లా యంత్రాంగం ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.#WATCH | J&K: District Administration Kulgam has set up an election control room to monitor the election process in the district.#JammuKashmirAssemblyElections pic.twitter.com/Xsze6iY1RQ— ANI (@ANI) September 18, 2024 పుల్వామా ప్రతిష్ట తిరిగి పొందుతాం: పుల్వామా పీడీపీ అభ్యర్థి వహీద్ పారాపుల్వామా అప్రతిష్టపాలైంది. ఈ ఎన్నికల ద్వారా యువత ప్రజలు పుల్వామా ప్రతిష్టను తిరిగి పొందేందుకు ఆశాజనకంగా ఉన్నారు. ఈ ఎన్నికలలో ప్రజలు బయటకు వచ్చి జమ్ము కశ్మీర్ శాంతి, అభివృద్ధి , గౌరవం కోసం ఓటు వేయండి. ఓటింగ్ ద్వారా గత 6-7 సంవత్సరాలలో మనం నష్టపోయింది తిరిగి పొందాలని కోరుకుంటున్నా.#WATCH | Jammu and Kashmir: PDP candidate from Pulwama, Waheed Para says "Pulwama has been stigmatized...This is an election for us to reclaim the image of Pulwama, the youth of Pulwama, and the people of Pulwama and we are optimistic. We want people to come out in this election… pic.twitter.com/VC4XVoofl0— ANI (@ANI) September 18, 2024 మొదటిసారి ఓటేశా.. మంచి ప్రభుత్వం కావాలిఅనంత్నాగ్లో ఓటు వేసిన యువకుడు మహ్మద్ సుల్తాన్ ఖాన్ మీడియాతో మాట్లాడారు.‘ నేను ఈ రోజు మొదటిసారి ఓటు వేశాను. ఇక్కడ నిరుద్యోగం ఉంది, కాశ్మీర్లో ఆర్థిక వ్యవస్థ క్షీణించింది. ఓటు వేయాలని నేను యువతకు విజ్ఞప్తి చేస్తున్నాను. మాకు మంచి ప్రభుత్వం కావాలి’ అని అన్నారు.#WATCH | Anantnag, J&K: After casting his vote, a voter named Mohammad Sultan Khan says, "I have voted for the first time today. There is unemployment, economy of Kashmir is down, I appeal to the youth to vote. We want a good government here..." pic.twitter.com/Nif05AKAtJ— ANI (@ANI) September 18, 2024 కిష్త్వార్ సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థి షాగున్ పరిహార్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. #WATCH | Jammu and Kashmir: BJP candidate from Kishtwar, Shagun Parihar cast her vote. pic.twitter.com/1LUC90ryvC— ANI (@ANI) September 18, 2024 జమ్ము కశ్మీర్లో పోలింగ్ కొనసాగుతోంది. ఓటు వేయడానికి ఓటర్లు పోలింగ్ కేం ద్రాలకు భారీగా తరలి వస్తు న్నారు.బనిహాల్ సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వికార్ రసూల్ వానీ.. బనిహాల్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.ఈ స్థానంలో నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి సాజాద్ షాహీన్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) ఇంతియాజ్ అహ్మద్ షాన్, బీజేపీ తరపున మహ్మద్ సలీమ్ భట్ పోటీలో ఉన్నారు.#WATCH | Jammu and Kashmir: Congress candidate from the Banihal Assembly seat, Vikar Rasool Wani cast his vote at a polling station in Banihal National Conference has fielded Sajad Shaheen from here, Peoples Democratic Party (PDP) has fielded Imtiaz Ahmed Shan and BJP has… pic.twitter.com/kjY2X0cYoh— ANI (@ANI) September 18, 2024 జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్(జేకేఎన్సీ) అభ్యర్థి సజ్జాద్ అహ్మద్ కిచ్లూ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.కిష్త్వార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున షాగున్ పరిహార్, పీడీపీ తరపున ఫిర్దూస్ అహ్మద్ తక్ బరిలో ఉన్నారు.#WATCH | Jammu and Kashmir: JKNC candidate from Kishtwar Sajjad Ahmed Kichloo cast his vote at polling station no. 92 at Town Hall, KishtwarBJP has fielded Shagun Parihar and PDP has fielded Firdoos Ahmed Tak from the Kishtwar assembly constituency. pic.twitter.com/McDkX6tUsO— ANI (@ANI) September 18, 2024 జమ్ము కశ్మీర్లో తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది.డోడా జిల్లాలోని ఓ పోలింగ్ బూత్ వద్ద తమ ఓటు వేయడానికి భారీ క్యూలైన్ నిల్చొన్న ఓటర్లు.దోడా సెగ్మెంట్లో నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఖలీద్ నజీబ్, బీజేపీ నుంచి గజయ్సింగ్ రాణా, కాంగ్రెస్ తరఫున షేక్ రియాజ్, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ)నుంచి అబ్దుల్ మజీద్ వనీ బరిలో ఉన్నారు.#WATCH | J&K: A long queue of voters witnessed at a polling booth in Doda, as they await their turn to cast a vote.National Conference has fielded Khalid Najib from the Doda seat, BJP has fielded Gajay Singh Rana, Congress fielded Sheikh Riaz and Democratic Progressive Azad… pic.twitter.com/khrt14aYRm— ANI (@ANI) September 18, 2024 ఓటు వేసిన బనిహాల్ అసెంబ్లీ గ్మెంట్ బీజేపీ అభ్యర్థి మొహమ్మద్ సలీమ్ భట్ #WATCH | Banihal, Jammu and Kashmir: After casting his vote, BJP's candidate from Banihal Assembly seat, Mohd Saleem Bhat says, "I am happy. I congratulate Prime Minister Narendra Modi and the Election Commission for conducting the elections here. People here want change and want… pic.twitter.com/Kj5x1pBOlp— ANI (@ANI) September 18, 2024 ఓటు హక్కు వినియోగించుకున్న స్వతంత్ర అభ్యర్థి మహ్మద్ అల్తాఫ్#WATCH | Jammu and Kashmir: Mohd Altaf Bhat, an Independent candidate from the Rajpora Assembly constituency backed by Engineer Rashid's Awami Ittehad Party cast his vote at a polling station in Zadoora, Pulwama pic.twitter.com/Op5kwMfLVQ— ANI (@ANI) September 18, 2024 జమ్ము కశ్మీర్లో కొనసాగుతున్న తొలి విడత పోలింగ్పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లుప్రజలు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ప్రజాస్వామ్య హక్కు , మంచి అభ్యర్థిని ఎన్నుకోండి. 10 సంవత్సరాల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలు సంతోషంగా ఉన్నారు, ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు: రాజ్‌పోరా అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థి మహ్మద్ అల్తాఫ్ఇంజనీర్ రషీద్ అవామీ ఇత్తెహాద్ పార్టీ మద్దతుతో రాజ్‌పోరా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి బరిలో ఉన్న మహ్మద్ అల్తాఫ్#WATCH | Jammu and Kashmir: "I appeal to the people to come out and vote as it is our democratic right and choose a good candidate. Assembly elections are being held after 10 years and people are happy and are coming out to vote," says Mohd Altaf Bhat, an Independent candidate… pic.twitter.com/ohD4eF1fvi— ANI (@ANI) September 18, 2024 కుల్గామ్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ వద్ద ఓటర్లు తమ ఓటు వేసేందుకు క్యూలైన్లలో ఎదురు చూస్తున్నారు.కుల్గాంలో సీపీఎం నుంచి మహ్మద్ యూసుఫ్ తరిగామిని, నేషనల్ కాన్ఫరెన్స్ తరపున నజీర్ అహ్మద్ లావే, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) నుంచి మహమ్మద్ అమీన్ దార్ బరిలో దిగారు.#WATCH | J&K: Voters queue up at a polling booth set up in Kulgam as they await their turn to cast their vote.CPIM has fielded Muhammad Yousuf Tarigami from the Kulgam seat, National Conference has fielded Nazir Ahmad Laway and Peoples Democratic Party (PDP) has fielded… pic.twitter.com/aB0DGkEZ3Q— ANI (@ANI) September 18, 2024 జమ్ము కశ్మీర్లో తొలివిడత పోలింగ్ కొనసాగుతోంది. పుల్వామాలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ వద్ద ఓటర్లు తమ ఓటు వేయడానికి క్యూలైన్లలో నిల్చొన్నారు. ఇక్కడ..నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి మహ్మద్ ఖలీల్ బ్యాండ్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) నుంచి అబ్దుల్ వహీద్ ఉర్ రెహ్మాన్ పారా బరిలో ఉన్నారు. #WATCH | J&K: Voters queue up at a polling booth set up in Pulwama as they await their turn to cast their vote.National Conference has fielded Mohammad Khalil Band from the Pulwama seat, Peoples Democratic Party (PDP) has fielded Abdul Waheed Ur Rehman Para pic.twitter.com/gnr58rQ9q4— ANI (@ANI) September 18, 2024 పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు వేసేందుకు క్యూలైన్లలో నిల్చొని ఉన్నారు. #WATCH | J&K: A long queue of voters witnessed at a polling booth in Pulwama, as they await their turn to cast a vote.Polling for 24 Assembly constituencies across Jammu & Kashmir (16 in Kashmir and 8 in Jammu), begins. pic.twitter.com/HcGIS0gtoA— ANI (@ANI) September 18, 2024 జమ్ము కశ్మీర్లో తొలి వితడ పోలింగ్ కొనసాగుతోంది.#WATCH | J&K: Voters enter a polling station in Pulawama as polling for 24 Assembly constituencies across Jammu & Kashmir (16 in Kashmir and 8 in Jammu), begins pic.twitter.com/1z4JZVKtym— ANI (@ANI) September 18, 2024పలు నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.Polling underway for 24 Assembly constituencies across Jammu & Kashmir (16 in Kashmir and 8 in Jammu). Visuals from a polling centre in Kishtwar pic.twitter.com/HUomrVUIun— ANI (@ANI) September 18, 2024 పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనండి: ప్రధాని మోదీజమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ప్రారంభమైనందున, ఈ రోజు పోలింగ్‌కు వెళ్లే నియోజకవర్గాల్లోని వారందరూ పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని కోరుతున్నా. నేను ముఖ్యంగా యువకులు తమ ఓటు హక్కు వినియోగించుకునే సమయమని తెలియజేస్తున్నాPrime Minister Narendra Modi tweets "As the first phase of the Jammu and Kashmir Assembly elections begins, I urge all those in constituencies going to the polls today to vote in large numbers and strengthen the festival of democracy. I particularly call upon young and first-time… pic.twitter.com/nXfY78F1dH— ANI (@ANI) September 18, 2024 ఓటు వేయడానికి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. జమ్మూ కశ్మీర్లో పదేళ్ల అనంతరం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటం విశేషం.పైగా జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను, ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేశాక జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలివి.జమ్ము కశ్మీర్లో ప్రారంభమైన తొలి విడత పోలింగ్#WATCH | Polling for 24 Assembly constituencies across Jammu & Kashmir (16 in Kashmir and 8 in Jammu), begins.Visuals from a polling centre in Kishtwar pic.twitter.com/OTbDKM07hy— ANI (@ANI) September 18, 2024 జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలల్లో భాగంగా 7 జిల్లాల పరిధిలో 24 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ( బుధవారం) తొలి విడతలో పోలింగ్ జరగనుంది. వీటిలో 8 స్థానాలు జమ్మూలో, 16 కశ్మీర్ ప్రాంతంలో ఉన్నాయి. 90 మంది స్వతంత్రులతో కలిపి మొత్తం 219 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారి భవితవ్యాన్ని 23 లక్షల పై చిలుకు ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేయనున్నారు. #WATCH | J&K: Preparations, mock polls underway at a polling booth in Kishtwar24 Assembly constituencies across the J&K (16 in Kashmir and 8 in Jammu) are going to polls in the first phase, scheduled for today. This marks the first Assembly elections in the region since the… pic.twitter.com/Pp0G9kHqJq— ANI (@ANI) September 18, 2024 తొలి విడత పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు జరగనుంది. బరిలో ప్రముఖులు: మొహమ్మద్ యూసుఫ్ తరిగమీ (సీపీఎం) కుల్గాం నుంచి వరుసగా ఐదో విజయంపై కన్నేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ మీర్దూరు నుంచి మూడోసారి గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత సకీనా (దమ్హాల్ హాజిపురా), పీడీపీ నేతలు సర్తాజ్ మద్నీ (దేవ్సర్), అబ్దుల్ రెహా్మన్ వీరి (షంగుస్–అనంత్‌నాగ్), మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తిజా (శ్రీగుఫ్వారా–బిజ్బెహరా), వహీద్ పరా (పుల్వామా) తదితర ప్రముఖులు తొలి విడతలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. #WATCH | J&K: Visuals from outside a polling booth in Kulgam; people line up to cast their votes; polling to begin shortly24 Assembly constituencies across the J&K (16 in Kashmir and 8 in Jammu) are going to polls in the first phase, scheduled for today. This marks the first… pic.twitter.com/97v3yNrNJz— ANI (@ANI) September 18, 2024ఉగ్ర ముప్పు నేపథ్యంలో సీఏపీఎఫ్, స్థానిక పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ బూత్‌లకు, సిబ్బందికి అదనపు భద్రత కల్పిస్తున్నారు.సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న రెండు, మూడో విడతతో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది.ఫలితాలు అక్టోబర్ 8న వెల్లడవుతాయి.చదవండి: ఆతిశి డమ్మీ సీఎంగా ఉంటారు! -
J&k: జమ్ముకశ్మీర్ లో ప్రధాని మోదీ పర్యటన
-
ఉరి సెక్టార్ లో సైనికులకు రాఖీలు కట్టిన స్థానిక మహిళలు
-
శ్రీనగర్‌లో భారీ వర్షం.. పలు ప్రాంతాలు జలమయం
జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని కెల్లర్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ఒక వంతెన కూలిపోయింది. శ్రీనగర్‌లోని అనేక రహదారులు జలమయమ్యాయి. వరదల కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.శ్రీనగర్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనాన్ని పలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో జమ్మూ-పూంచ్ హైవేను మూసివేశారు. ఆగస్టు 18, 19 తేదీల్లో రాజోరి, రియాసి, రాంబన్, జమ్ము, ఉధంపూర్, సాంబా, కథువా జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో 64 నుంచి 115 మి.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.శ్రీనగర్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. గందర్బల్ జిల్లాలోని హస్నాబాద్ కంగన్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. జమ్మూలోని విక్రమ్ చౌక్, ఓల్డ్ సిటీ, భగవతి నగర్, కెనాల్ రోడ్, తలాబ్ టిల్లో, జానీపూర్, రిహారి తదితర ప్రాంతాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. కథువా, రియాసీలో తేలికపాటి వర్షం కురిసింది. -
జేకేలో ఎన్కౌంటర్.. అమరులైన ఐదుగురు జవాన్లు
జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లా అడవుల్లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. ఉగ్రవాదుల ఉనికిపై అందిన ఆధారాల దరిమిలా దోడాలోని ఉత్తర ప్రాంతంలో భారత సైన్యం, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులతో ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.రాష్ట్రీయ రైఫిల్స్, జమ్ముకశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సైనికులు సోమవారం రాత్రి 7.45కి దేశా అటవీ ప్రాంతంలో జాయింట్ కార్డన్, సెర్చ్ ఆపరేషన్ చేపట్టినప్పుడు ఎన్కౌంటర్ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఓ అధికారి, నలుగురు ఆర్మీ సిబ్బంది అమరులయ్యారని అధికారులు తెలిపారు. 20 నిమిషాలకు పైగా కాల్పులు జరిగాయి. ఆ ప్రాంతానికి అదనపు బలగాలను పంపామని, చివరి నివేదిక వచ్చే వరకు ఆపరేషన్ కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. -
జమ్ము కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు మృతి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బుధవారం దోడా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఇవాళ ఉదయం దోడా జిల్లాలోని బజాద్ గ్రామంలో భద్రతా బలగాలు, పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతోందని పోలీసలు పేర్కొన్నారు.ఇక.. ఇటీవల జూన్ 11, 12 తేదీల్లో ఎన్కౌంటర్లు జరిగాయి. జూన్ 11నాడు జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటనల నేపథ్యంలో ఉగ్రవాదుల సమాచారం అందించినవారి రూ.5 లక్షల క్యాష్ రివార్డు అందజేస్తామని పోలీసులు ప్రకటించారు. -
వైష్ణోదేవికి కట్టుదిట్టమైన భద్రత
జమ్మూ డివిజన్లో ఇటీవల నాలుగు ఉగ్రదాడులు జరిగినప్పటికీ వైష్ణో దేవిని సందర్శించే భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. ఉగ్రదాడులను ఖండిస్తూ భక్తులు వైష్ణోదేవి యాత్రలో పాల్గొంటున్నారు. అమ్మవారి దర్శనం కోసం దేశవ్యాప్తంగా వేలాది మంది భక్తులు ప్రతిరోజూ బేస్ క్యాంప్ కాట్రాకు తరలివస్తున్నారు.మరోవైపు యాత్ర రిజిస్ట్రేషన్ కోసం భక్తులు కాట్రాలో చాలా సేపు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా వైష్ణో దేవి దర్శనం కోసం కిలోమీటరు పొడవున భక్తులు బారులు తీరుతున్నారు. శుక్రవారం రాత్రి 8 గంటల సమయానికి 33,900 మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకుని వైష్ణో దేవి ఆలయం దిశగా ముందుకు కదిలారు.ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న ఉగ్రదాడుల నేపధ్యంలో వైష్ణో దేవి ఆలయంతో పాటు అక్కడికి సమీపంలో అన్నిప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. తాజాగా వైష్ణో దేవి ఆలయ భద్రతకు సంబంధించి పోలీసు డైరెక్టర్ జనరల్ ఆర్ఆర్ స్వైన్ పోలీసు, భద్రతా బలగాల అధికారులతో సమావేశం నిర్వహించారు.అనంతరం మాతా వైష్ణో దేవి భవన్ ప్రాంగణంలో అదనపు సంఖ్యలో పోలీసులు, భద్రతా దళాల సిబ్బందిని మోహరించారు. ప్రసుతం వైష్ణో దేవి పవిత్ర గుహల చుట్టూ భారీ సంఖ్యలో సీఆర్పీఎఫ్ సిబ్బందితో పాటు సాధారణ దుస్తులలో కమాండోలు పహారా కాస్తున్నారు. గురువారం 38 వేల మంది భక్తులు వైష్ణోదేవిని దర్శించుకున్నారు. -
‘మోదీజీ వారి ఆర్తనాదాలు వినపడడం లేదా’.. రాహుల్ ఆగ్రహం
ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల విజయోత్సవాలతో బిజీగా ఉన్న మోదీ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన భక్తుల కుటుంబాల ఆర్తనాదాలు వినడం లేదని మండిపడ్డారు. గత మూడు రోజుల్లో జమ్మూకశ్మీర్‌లోని రియాసి, కతువా, దోడాలో మూడు వేర్వేరు ఉగ్రవాద దాడులు జరిగాయి. అయినప్పటికీ మోదీ ఎన్డీయే ఎన్నికల విజయోత్సవాలతో బిజీగా ఉన్నారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.ఇటీవలి ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్ (కేరళ)తో పాటు తమ కుటుంబ కంచుకోట రాయ్‌బరేలీ (యూపీ)లోనూ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో తనను మరో సారి ఎన్నుకున్నందుకు ఓటర్లకు ధన్యవాదాలు తెలిపేందుకు కేరళలోని వాయనాడ్‌లో పర్యటించారు.ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వ హయాంలో ఉగ్రదాడులకు కుట్ర పన్నుతున్న వారిని ఎందుకు పట్టుకోవడం లేదో సమాధానం చెప్పాలని దేశం డిమాండ్ చేస్తోందని రాహుల్ గాంధీ అన్నారు.మేనిఫెస్టోకి అనుగుణంగా పేదలకు, రైతులకు కాంగ్రెస్ పనిచేస్తోందన్న రాహుల్ మా పని ఇప్పుడే ప్రారంభమైంది. ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని సూచించారు. ప్రేమ ద్వేషాన్ని ఓడించింది..వినయం అహంకారాన్ని ఓడించిందిప్రేమ ద్వేషాన్ని ఓడించింది..వినయం అహంకారాన్ని ఓడించింది. అదానీ,అంబానీలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేలా మార్గనిర్దేశం చేసే విచిత్రమైన పరమాత్మ మోదీ. నా దేవుళ్లు పేద ప్రజలే, నా దేవుళ్లు వాయనాడ్ ప్రజలే మీరు నాకు ఏమి చెబితే అది చేస్తాను అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. -
ఉగ్రవాదుల దాడి : బస్సు డ్రైవర్, కండక్టర్లను అమరవీరులుగా గుర్తించాలి
జమ్మూ కశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో టూరిస్ట్ బస్సుపై ఉగ్రవాదులు జరిపిన కాల్పల్లో మరణించిన బస్సు డ్రైవర్, కండక్టర్లను అమరవీరులుగా ప్రకటించాలని బస్సు యజమాని సుజన్ సింగ్ విజ్ఞప్తి చేశారు.ఆదివారం జమ్మూకశ్మీర్‌లోని శివఖోరి ఆలయం నుంచి కట్రాలోని మాతా వైష్ణోదేవీ ఆలయానికి వెళ్తోన్న బస్సుపై పాకిస్థాన్ లక్కరే తొయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.డ్రైవర్‌కు బుల్లెట్ తాకడంతో వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ విజయ్ కుమార్ (40), అతని 19 ఏళ్ల కండక్టర్ అరుణ్ కుమార్ మరణించారు. ఆ ఇద్దరి మరణంపై బస్సు యజమాని స్పందించారు. విజయ్ కుమార్, అరుణ్ కుమార్‌లను అమరవీరులుగా గుర్తించాలని కోరుతున్నారు. ‘విజయ్ నాకు ఒక కుటుంబం లాంటివాడు. నాతో సుమారు ఆరేళ్లుగా పని చేశాడు. బస్సులో ప్రయాణికులందరిని చంపకుండా ఉండేందుకు ఉద్దేశపూర్వకంగానే వాహనాన్ని రోడ్డుపై ఆపకుండా లోయలో పడేసి ఉంటారని నేను నమ్ముతున్నాను’ అని బస్సు యజమాని సుజన్ సింగ్ అన్నారు. విజయ్ తండ్రి రతన్ లాల్ ఆరు నెలల క్రితం చనిపోయాడు. అతనికి ఇద్దరు చిన్న పిల్లలు. వారి పెంపకం చూసేందుకు కుటుంబంలో మరెవరూ లేరని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా,జమ్మూ కశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ బాధితుల తదుపరి బంధువులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, గాయపడిన ప్రతి ఒక్కరికి రూ.50,000 ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. -
Silent Village of India: అక్కా చెల్లెళ్ల ‘నిశ్శబ్ద’ విప్లవం
గందోహ్(జమ్మూకశ్మీర్): ఆరోగ్యంగా ఉండి కూడా ఓటేయడానికి బద్ధకించే పౌరులున్న దేశం మనది. అలాంటిది పుట్టుకతోనే చెవుడు, మూగ సమస్యలతో ఇబ్బందులు పడుతూ కూడా ఓటేయడానికి ముందుకొచ్చి మొత్తంగా గ్రామానికే ప్రేరణగా నిలిచిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల స్ఫూర్తిదాయక గాథ ఇది. గ్రామంలో సగం కుటుంబాలకు సమస్యలు జమ్మూకశీ్మర్‌లోని డోడా జిల్లాలోని భద్రవాహ్ పట్టణానికి 105 కిలోమీటర్ల దూరంలోని కొండప్రాంతంలో దధ్‌కాయ్ గిరిజన గ్రామం ఉంది. గ్రామంలో కేవలం 105 కుటుంబాలే నివసిస్తున్నాయి. ఇందులో సగానికి పైగా అంటే 55 కుటుంబాలను దశాబ్దాలుగా ఆరోగ్యసమస్యలు చుట్టుముట్టాయి. ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరైనా మూగ, చెవిటివారిగా మిగిలిపోతున్నారు. ఇలా గ్రామంలో 84 మంది ఉన్నారు. వారిలో 43 మంది మహిళలు, పదేళ్లలోపు 14 మంది చిన్నారులు ఉన్నారు. ఎక్కువ మంది మాట్లాడలేని కారణంగా ఈ గ్రామానికి సైలెంట్ విలేజ్ ఆఫ్ ఇండియా అనే పేరు పడిపోయింది. రేహమ్ అలీ ముగ్గురు కూతుళ్లు రేష్మా బానో(24), పరీ్వన్ కౌసర్(22), సైరా ఖాటూన్(20)లకూ ఏమీ వినిపించదు. మాట్లాడలేరు కూడా. అయితే ఓటేసి తమ హక్కును వినియోగించుకోవాలనే కోరిన ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లలో బలంగా నాటుకుపోయింది. ఈసారి ఎలాగైనా ఓటేస్తామని ముగ్గురూ ఘంటాపథంగా చెబుతున్నారు. వీళ్లు ఓటేస్తుండటం ఇదే తొలిసారికావడం విశేషం. బీజేపీ నేత జితేంద్రసింగ్ పోటీచేస్తున్న ఉధమ్‌పూర్ ఎంపీ నియోజకవర్గం పరిధిలోనే ఈ గ్రామం ఉంది. శుక్రవారం జరగబోయే పోలింగ్‌లో ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నామని తమ ఊరికొచి్చన మీడియా వాళ్లకు ఈ అక్కాచెల్లెళ్లు తమ ఓటర్ ఐడీ కార్డులు చూపించిమరీ చెబుతున్నారు. ‘ మొదటిసారిగా ఓటేయనున్న మ్యూట్ మహిళల ఉత్సాహం ఊరి జనం మొత్తానికి స్ఫూర్తినిస్తోంది’ అని పొరుగింటి వ్యక్తి జమాత్ దానిష్ ఆనందం వ్యక్తంచేశారు. ‘‘ ఔత్సాహిత యువ మహిళా ఓటర్లను చూసి మొత్తం గ్రామమే గర్వపడుతోంది. ప్రతి ఇంట్లో ఇదే చర్చ. ఈ సారి ఇక్కడ 100 శాతం పోలింగ్ నమోదైనా ఆశ్చర్యపోనక్కర్లేదు ’’ అని గ్రామ మాజీ వార్డు సభ్యుడు మొహమ్మద్ రఫీఖ్ వ్యాఖ్యానించారు. -
లోయలో పడ్డ తవేరా..10 మంది మృతి
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృత్యువాతపడ్డారు. జమ్మూ–శ్రీనగర్ హైవేపై రంబన్ జిల్లాలో గురువారం అర్ధరాత్రి దాటాక ఘటన చోటుచేసుకుంది. తవేరా ట్యాక్సీ అదుపుతప్పి 300 అడుగుల లోయలో పడిపోయింది. డ్రైవర్‌తో పాటు అందరూ చనిపోయారు. ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
ఆర్టికల్ 370 రద్దుతో ప్రజలకు స్వేచ్ఛ
శ్రీనగర్: ఆర్టికల్ 370 రద్దు తర్వాత అభివృద్ధిలో జమ్మూకశ్మీర్ నూతన శిఖరాలకు చేరుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అబివృద్ధికి అడ్డుగోడగా మారిన ఈ ఆర్టికల్‌ను రద్దు చేశాక ప్రజలకు స్వేచ్ఛ లభించిందని, జమ్మూకశ్మీర్ హాయిగా ఊపిరి పీల్చుకుంటోందని చెప్పారు. గురువారం జమ్మూకశ్మీర్‌లో మోదీ పర్యటించారు. దాదాపు రూ.5,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. వాటిని జాతికి అంకితం చేశారు. జమ్మూకశ్మీర్‌లో కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన 1,000 మంది యువతకు నియామక పత్రాలు అందజేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో మాట్లాడారు. వివిధ రంగాల్లో విజయాలు సాధించిన మహిళలు, రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ‘చలో ఇండియా గ్లోబల్ డయాస్పోరా క్యాంపెయిన్’, ‘దేఖో ఆప్నా దేశ్ పీపుల్స్ చాయిస్ టూరిస్టు డెస్టినేషన్ పోల్’ అనే రెండు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం శ్రీనగర్‌లోని బక్షీ స్టేడియంలో ‘వికసిత్ భారత్–వికసిత్ జమ్మూకశ్మీర్’ బహిరంగ సభలో ప్రసంగించారు. ఆర్టికల్ 370పై కాంగ్రెస్ పార్టీ జమ్మూకశ్మీర్ ప్రజలనే కాకుండా మొత్తం దేశాన్ని తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు. ఈ ఆర్టికల్ రద్దయ్యాక జమ్మూకశ్మీర్ సంకెళ్లు తెగిపోయాయని అన్నారు. అద్భుతమైన శ్రీనగర్ ప్రజల్లో ఈరోజు తాను కూడా ఒకడినైనందుకు గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ రోజు తాను ప్రారంభించిన ప్రాజెక్టులు జమ్మూకశ్మీర్ ప్రగతిని మరింత వేగవంతం చేస్తాయని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన భారత్ అనే స్వప్నం సాకారం కావాలంటే జమ్మూకశ్మీర్ అభివృద్ధి చెందాలని స్పష్టం చేశారు. ఇక్కడి ప్రజలంతా తన కుటుంబ సభ్యులేనని చెప్పారు. మోదీతో కశ్మీర్ యువకుడి సెల్ఫీ జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాకు చెందిన యువకుడు నజీమ్ నజీర్ కల నెరవేరింది. సాక్షాత్తూ మోదీతో అతడు తన ఫోన్లో సెల్ఫీ తీసుకున్నాడు. అంతేకాదు నజీర్‌ను మోదీ తన స్నేహితుడిగా సంబోధించారు. గురువారం శ్రీనగర్‌లోని బక్షీ స్టేడియంలో ఈ సంఘటన జరిగింది. నజీర్ తేనెటీగల పెంపకం, తేనె వ్యాపారం చేస్తున్నాడు. మంచి లాభాలు ఆర్జిస్తున్నాడు. దీంతో ప్రధాని మోదీతో సమావేశమయ్యే అవకాశం లభించింది. నజీర్ గురించి తెలుసుకున్న మోదీ అతడిని అభినందించారు. మీతో సెల్ఫీ తీసుకోవాలని నజీర్ కోరగా మోదీ అంగీకరించారు. ఈ సెల్ఫీని మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. మిత్రుడు నజీర్‌తో సెల్ఫీ దిగడం మరిచిపోలేని జ్ఞాపకం అని పేర్కొన్నారు. తేనె వ్యాపారంతో నజీర్ తీపి విప్లవం తీసుకొచ్చాడని ప్రశంసించారు. మీ కుటుంబ సభ్యులను పంపించండి భారతదేశానికి కిరీటం లాంటి జమ్మూకశ్మీర్‌లో పర్యాటకం, వ్యవసాయ రంగాల్లో ప్రగతికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని మోదీ ఉద్ఘాటించారు. జమ్మూకశ్మీర్ కేవలం ఒక ప్రాంతం కాదని, ఇది మన దేశానికి శిరస్సు లాంటిదని చెప్పారు. తలెత్తుకొని నిలబడటం అభివృద్ధికి, గౌరవానికి గుర్తు అని పేర్కొన్నారు. ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. ‘చలో ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ప్రవాస భారతీయులు తమ కుటుంబాల నుంచి కనీసం ఐదుగురిని జమ్మూకశ్మీర్ పర్యటనకు పంపించాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజలకు మోదీ మహాశివరాత్రి, రంజాన్ శుభాకాంక్షలు ముందస్తుగా తెలియజేశారు. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేశాక ప్రధానమంత్రి కశ్మీర్లో పర్యటించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు. -
లక్షలమందికి స్ఫూర్తినువ్వు, సలాం అమీర్: సచిన్, గౌతం అదానీ ఫిదా
జమ్ము కశ్మీర్ బిజ్బెహరాలోని వాఘమా గ్రామానికి చెందిన 34 ఏళ్ల వికలాంగ క్రికెటర్ అమీర్ హుస్సేన్ లోన్ అందరికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఏ చిన్న కష్టం వచ్చినా ఇన్ని కష్టాలు నాకే అని తెగ ఫీల్ అయిపోతూ, నిరాశలో మునిగిపోయేవాళ్లకి నిజంగా అమీర్ ఇన్సిపిరేషన్. చేతులు లేకపోయినా ఆత్మవిశ్వాసంతో తన కిష్టమైన క్రీడలో రాణిస్తున్నాడు. దాన్నే చాలెంజింగఠ్గా తీసుకోని అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. అందుకే క్రికెట్ లెజెండ్ సచిన్ ప్రశంసలు దక్కించుకున్నాడు. ఎనిమిదేళ్ల వయసులో తండ్రి మిల్లులో జరిగిన ప్రమాదంలో అమర్ రెండు చేతులను కోల్పోయాడు. దీంతో క్రికెట్ అంటే ఎంతో ఇష్టమైన అమీర్ మొదట్లో చాలా బాధపడ్డాడు. ఎందుకంటే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, ఇలా ఏది వేయాలన్నా చేతులు తప్పనిసరి. అయినా ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు. ఎంతో కష్టపడి తనకిష్టమైన క్రికెట్‌ను సాధన చేశాడు. మెడ, భుజం సాయంతో బ్యాట్ పట్టుకుని బ్యాటింగ్ చేయడం అలవర్చుకున్నాడు. క్రమంగా అందులో ఆరితేరాడు. అంతేకాదు కుడి కాలి వేళ్ల మధ్య బంతి పెట్టుకుని, కాలిని తిప్పిఅలవోకగా బౌలింగ్ వేయడం నేర్చుకున్నాడు. తనదైన ప్రతిభతో అందరి దృష్టినీ తన పైపు తిప్పుకున్నాడు. ఈ ప్రతిభకు మెచ్చిన ఒక ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో అమీర్ పారా క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. आमिर की यह भावुक कर देने वाली कहानी अद्भुत है! हम आपकी हिम्मत, खेल के प्रति निष्ठा और विपरीत परिस्थिति में भी कभी ना हार मानने वाले जज्बे को प्रणाम करते हैं।@AdaniFoundation आपसे शीघ्र संपर्क कर इस बेमिसाल सफर में आपका हर संभव सहयोग करेगा। आपका संघर्ष, हम सबके लिए प्रेरणा है। https://t.co/LdOouyimyK — Gautam Adani (@gautam_adani) January 13, 2024 అలా 2013 నుంచి అమీర్ ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతూ వస్తున్నాడు. ప్రస్తుతం జమ్ముకశ్మీర్ పారా క్రికెట్ జట్టుకు సారధ్యం వహించే స్థాయికి చేరాడు 34 ఏళ్ల అమీర్. 2013, 2018లో జాతీయ టోర్నీలో ఆడాడు. బంగ్లాదేశ్‌పై అంతర్జాతీయ మ్యాచ్‌కి కూడా ప్రాతినిథ్యం వహించాడు. నేపాల్, షార్జా, దుబాయ్‌లోనూ అమీర్ హుస్సేన్ మ్యాచ్‌లాడాడు. క్రికెట్ దేవుళ్లు సచిన్, కోహ్లీలను కలవాలనేదే అమీర్ కల. స్పందించిన సచిన్ క్రీడపై మక్కువ ఉన్న లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చినందుకు చాలా బాగుందంటూ టెండూల్కర్ ఎక్స్‌లో రాశారు. తన పేరుతో ఉన్న జెర్సీ వేసుకుని క్రికెట్ ఆడుతున్న అమీర్‌పై సచిన్ ప్రశంసలు కురిపించాడు. క్రికెట్ పట్ల అతనికి ఉన్న ప్రేమ, అంకితభావం తనను ముగ్దుణ్ని చేసిందని సచిన్ ఫిదా అయిపోఆరు. అలాగే అమీర్‌ను కలిసి అతని పేరుతో ఉన్న జెర్సీని తీసుకుంటానని సచిన్ చెప్పడం విశేషంగా నిలిచింది. And Amir has made the impossible possible. I am so touched watching this! Shows how much love and dedication he has for the game. Hope I get to meet him one day and get a jersey with his name. Well done for inspiring millions who are passionate about playing the sport. https://t.co/s5avOPXwYT — Sachin Tendulkar (@sachin_rt) January 12, 2024 అవసరమైన సాయం చేస్తా: గౌతం అదానీ ప్రతికూల పరిస్థితులలో కూడా తన స్ఫూర్తిని కొనసాగించిన అమీర్ కృషిపై పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ కూడా స్పందించారు. అదానీ ఫౌండేషన్ ద్వారా సాధ్యమైన సాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. నాకు మాటలు రావడం లేదు: అమీర్ భార్య అమీర్‌కు మద్దతుగా నిలిచిన సచిన్ , అదానీ కృతజ్ఞతలు చెప్పింది అమీర్ భార్య షోక్టీ. సంతోషాన్ని చెప్పడానికి తన దగ్గర మాటల్లేవంటూ భావోద్వేగానికి లోనైంది. -
మరింతగా పెరిగిన చలి.. ఆ రాష్ట్రాల్లో పరిస్థితి ఇదే!
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో చలి మరింతగా పెరిగింది. దట్టమైన పొగమంచు కూడా కమ్ముకుంటోంది. జమ్మూ కాశ్మీర్ నుండి బీహార్, పంజాబ్ వరకు, హర్యానా నుండి తూర్పు ఉత్తరప్రదేశ్ వరకు చలి తీవ్రత మరింతగా పెరిగింది. హిమాచల్‌లోని కుకుమ్సేరిలో ఉష్ణోగ్రతలు మైనస్ 7.5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. పహల్గామ్లో మైనస్ 6.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పర్వతప్రాంతాల్లో కురుస్తున్న హిమపాతం కారణంగా, దేశ రాజధాని, దాని పరిసర ప్రాంతాలలో మంగళవారం రోజంతా చలిగాలులు కొనసాగాయి. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 8.3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఇది సాధారణం కంటే ఒక డిగ్రీ ఎక్కువ. ఉత్తర భారతదేశంలో పొగమంచు ట్రాఫిక్‌కు ఇబ్బందికరంగా మారింది. జనవరి 5 నుంచి 11వ తేదీ వరకూ రాత్రి ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ (ఐఎండీ) డాక్టర్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు. దీని ప్రభావంతో మధ్య భారతదేశంలో చలిగాలుల పరిస్థితి తీవ్రంగా మారవచ్చు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని ఉత్తర భాగం, ఉత్తరప్రదేశ్‌లోని దక్షిణ భాగంలో పగటి ఉష్ణోగ్రతలు కూడా దిగజారే అవకాశాలున్నాయి. ఎత్తయిన పర్వత శిఖరాలపై మంచు కురుస్తుండటంతో కాశ్మీర్ లోయ తీవ్రమైన చలిలో చిక్కుకుంది. జమ్మూ కాశ్మీర్లో పొగమంచు కారణంగా రైలు, విమాన సర్వీసులు దెబ్బతింటున్నాయి. శ్రీనగర్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం జనవరి 4, 5 తేదీలలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలతో పాటు మంచు కురిసే అవకాశం ఉంది. జనవరి 8న కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉండనున్నాయి. -
ఆ రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు... తీవ్రమైన చలిగాలులు!
జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, బీహార్.. ఈ రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు, తీవ్రమైన చలిగాలులు అలముకున్నాయి. గత కొద్ది రోజులుగా ఎత్తయిన ప్రాంతాల్లో మంచు కురుస్తుండటంతో మైదాన ప్రాంతాల్లోనూ చలిగాలులు తీవ్రమయ్యాయి. మరో రెండు మూడు రోజుల వరకు ఈ వాతావరణం నుంచి ఎలాంటి ఉపశమనం ఉండదని వాతావరణ శాఖ తెలిపింది. గత రెండు రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి దట్టమైన పొగమంచు కురుస్తోంది. దీంతో ఢిల్లీలోని పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. దృశ్యమానత తక్కువగా ఉండటంతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం పంజాబ్‌లోని అమృత్సర్, రాజస్థాన్‌లోని చురులో పొగమంచు కారణంగా విజిబులిటీ కనిష్టంగా ఉంది. జమ్మూ కశ్మీర్లో దట్టమైన పొగమంచు కొత్త సంవత్సరానికి స్వాగతం పలకనుంది. శ్రీనగర్‌లోని వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం 2024 జనవరి ఒకటి నుండి మూడు వరకు రాష్ట్రం మేఘావృతమై ఉంటుంది. కొన్ని చోట్ల వర్షం, మంచు కురుస్తుంది. ప్రస్తుతం కశ్మీర్లో చలిగాలులు వీస్తుండటంతో చాలా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రత సున్నా కంటే తక్కువగా నమోదైంది. శ్రీనగర్‌లో ఉష్ణోగ్రత మైనస్ 2.1 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. పహల్గామ్లో మైనస్ 3.9 డిగ్రీల సెల్సియస్, గుల్మార్గ్లో మైనస్ 3.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. లేహ్‌లో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 7.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఢిల్లీ-ఎన్సీఆర్లో వాయు కాలుష్యం పరిస్థితి తీవ్రంగానే ఉంది. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) ఆదివారం సాయంత్రం 4 గంటలకు 411గా నమోదైంది. ఇది తీవ్రమైన విభాగంలోకి వస్తుంది. శనివారం ఏక్యూఐ 450గా నమోదయ్యింది. ఇది కూడా చదవండి: ఇక్కడి ఆస్తులకు జియో ట్యాగింగ్ తప్పనిసరి! -
Jammu: ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న ఆర్మీ
జమ్మూ : అంతర్జాతీయ సరిహద్దు నుంచి దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని భారత సైన్యం అడ్డుకుంది. భారీగా ఆయుధాలు ధరించిన నలుగురు ఉగ్రవాదులు శుక్రవారం(డిసెంబర్ 22) అర్ధరాత్రి జమ్మూలోని అక్నూర్ సెక్టార్ వద్ద సరిహద్దు దాటడానికి యత్నించారు. వీరిని గుర్తించిన సైనికులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఒక ఉగ్రవాది అక్కడికక్కడే మరణించాడు. మిగతా వారు వెనక్కి వెళ్లిపోయారు. అయితే చనిపోయిన ఉగ్రవాది మృతదేహాన్ని మిగిలిన ముగ్గురు తమ వెంటే వెనక్కి లాక్కెళ్లిపోయారని ఆర్మీ అధికారులు తెలిపారు. ‘ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని అడ్డుకున్నాం. నలుగురిలో ఒకరిని కాల్చి చంపాం. మిగిలిన ముగ్గురు చనిపోయిన ఉగ్రవాది మృతదేహాన్ని లాక్కెళ్లడాన్ని గమనించాం’అని ఆర్మీకి చెందిన వైట్‌నైట్ కార్ప్స్ ఎక్స్(ట్విటర్)లో తెలిపింది. రాజౌరీ సెక్టార్లో గురువారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు ఆర్మీ జవాన్లు మృతి చెందారు. కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం ఒక పక్క సైన్యం పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపడుతుండగానే మరో నలుగురు సరిహద్దు దాటి దేశంలోకి చొరబాటుకు ప్రయత్నించడం గమనార్హం. ఇదీచదవండి..మగువలు మెచ్చిన చెప్పులు.. -
జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదాలివే..
జమ్మూ కశ్మీర్లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 39 మంది మరణించగా, 16 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. దోడా జిల్లాలోని అస్సార్ సమీపంలో కిష్త్వార్-జమ్మూ హైవేపై కిష్త్వార్ నుండి జమ్మూకు ప్రయాణికులతో వస్తున్న బస్సు.. ఓల్డ్ జమ్మూ-కిష్త్వార్ రహదారిపై 300 అడుగుల లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. జమ్ముకశ్మీర్‌లో ఇటీవలి కాలంలో జరిగిన అతి పెద్ద ప్రమాదం ఇదేనని స్థానికులు చెబుతున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు సాయం అందజేస్తామని ప్రధాని ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియాను అందజేస్తామని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు. కాగా జమ్ముకాశ్మీర్‌లో ఇటువంటి ప్రమాదాలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. జమ్ముకాశ్మీర్‌లో భారీ రోడ్డు ప్రమాదాలు 2019, జూలై 1: కిష్త్వార్లోని సాంగ్వారీ ప్రాంతంలో మినీ బస్సు లోయలో పడి 35 మంది మృతి, 17 మందికి గాయాలు. 2018, సెప్టెంబర్ 14: కిష్త్వార్లోని దండారన్ ప్రాంతంలో మినీ బస్సు లోయలో పడి 17 మంది మృతి, 16 మందికి గాయాలు. 2009, జూన్ 27: దోడా జిల్లాలోని పుల్ దోడాలో రోడ్డు ప్రమాదంలో 27 మంది దుర్మరణం. 2021, అక్టోబర్ 28: దోడా జిల్లాలోని థాత్రిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి. 2022, నవంబర్ 16: కిష్త్వార్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. 2023, మే 30: జమ్మూ-శ్రీనగర్ హైవేపై జమ్మూ జిల్లాలోని ఝజ్జర్ కోట్లిలో యాత్రికుల బస్సు వంతెనపై నుండి పడటంతో 10 మంది దుర్మరణం. 2019, మార్చి 15: రాంబన్‌లో కారు లోయలో పడిన ప్రమాదంలో 11 మంది మృతి, నలుగురికి గాయాలు. 2023, మే 24: కిష్త్వార్లోని దచాన్ ప్రాంతంలోని దంగ్దురు డ్యామ్ వద్ద ఒక కారు లోయలో పడటంతో ఏడుగురు మరణించారు, ముగ్గురు గాయపడ్డారు. 2023, ఆగస్టు 30: ఒక కారు 300 అడుగుల లోతైన లోయలో పడటంతో ఎనిమిది మంది మృతి, ముగ్గురికి గాయాలు. 2023, జూన్ 27: దోడాలోని భదర్వా-పఠాన్‌కోట్ రహదారిపై ఒక వాహనం లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. ఇది కూడా చదవండి: జమ్ము కశ్మీర్లో ఘోర ప్రమాదం.. 36 మంది మృతి -
ఆ లెక్చరర్ని ఎందుకు సస్పెండ్ చేశారు.. సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసిన లెక్చరర్ జరూర్ అహ్మద్ భట్‌ను ఆయన పనిచేసే కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఈ అంశాన్ని వెంటనే పరిశీలించాల్సిందిగా అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాలను కోరింది సుప్రీంకోర్టు. గత బుధవారం ఢిల్లీ వచ్చిన జరూర్ అహ్మద్ భట్ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురి సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు హాజరయ్యారు. అనంతరం తిరిగి వెళ్లిన ఆయనకు వారు పనిచేసే కాలేజీ యాజమాన్యం సస్పెన్షన్ ఆర్డర్లు జారే చేసినట్లు సుప్రీంకోర్టుకు తెలిపారు ఆయన తరపు న్యాయవాది కపిల్ సిబాల్. వెంటనే స్పందిస్తూ సుప్రీం ధర్మాసనం అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణిని ఇక్కడ కోర్టు ముందు హాజరైన ఉద్యోగిని విధుల నుంచి తొలగించారని చెబుతున్నారు.. ఈ అంశాన్ని ఒకసారి పరిశిలించండి.. వీలయితే లెఫ్టినెంట్ గవర్నర్‌తో మాట్లాడండని సూచించింది. ఇది ప్రతీకార చర్య కాదు కదా..? అని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించగా జస్టిస్ ఎస్కె కౌల్ దానిపై ఎలాంటి స్పష్టత లేదని న్యాయస్థానికి తెలిపారు. భట్ జమ్మూ కశ్మీర్ ఉద్యోగుల క్రమశిక్షణ నిబంధనలను ఉల్లంఘించారని, జమ్మూ కశ్మీర్ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళిని, సెలవు నిబంధనలను అతిక్రమించినందుకు ఆయనపై ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది జమ్మూ కశ్మీర్ విద్యా శాఖ. ఈ సస్పెన్షన్ సమయంలో భట్ జమ్ము పాఠశాల విద్య డైరెక్టరేట్‌కు జవాబుదారీగా ఉంటారని తెలిపారు. గురువారం సుప్రీం ధర్మాసనం ముందు హాజరై తన వాదనలను వినిపించిన భట్ ఆర్టికల్ 370 రద్దు తర్వాత పొలిటికల్ సైన్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్న తనకు మనం ఇంకా ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అని విద్యార్థులు అడిగితే సమాధానం చెప్పడం కష్టాంగా ఉందన్నారు. జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదాను కోల్పోయి రెండు కేంద్ర పాలిట ప్రాంతాలుగా విభజించబడిందని ఇది పూర్తిగా భారత రాజ్యాంగానికి విరుద్ధమని కోర్టులో వాదించారు. ఇది కూడా చదవండి: ‘ఆస్తులు పోగొట్టుకున్నా.. లోకేష్ నుంచి ప్రాణహాని ఉంది’ -
జమ్మూ కాశ్మీర్లో తీవ్ర భూకంపం.. రిక్టర్ స్కేలుపై..
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో ఈరోజు తెల్లవారు జామున తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ మీద దీని తీవ్రత 37 గా నమోదైంది. మంగళవారం తెల్లవారు జాము 12.04 గంటలకు ధోడా ప్రాంతానికి ఆగ్నేయంగా భూకంపం సంభవించినట్లు తెలిపింది నేషనల్ సెంటర్ ఫార్ సీస్మాలజీ. భూమి ఉపరితలానికి 5 కి.మీ లోతున భూకంపం సంభవించిందని వారు తెలిపారు. అక్కడక్కడా చిన్నగా భూమి అదిరినట్టుగా అనిపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఒకవేళ భూకంపం తీవ్రత కొంచెం ఎక్కువైనా భదేర్వా, కిష్త్వార్, ఉధంపూర్, ధోడా పరిసరాల్లో తీవ్ర నష్టం వాటిల్లేదని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లో భూకంపం సంభవించినప్పుడు 2-5 సెకన్ల వరకు భూమి కంపించినట్లు చెబుతున్నారు స్థానికులు. ఆ సమయానికి అందరూ గాఢనిద్రలో ఉంటారని అదృష్టవశాత్తు భూకంపం తీవ్రత పెద్దగా లేదని, ఎటువంటి నష్టం వాటిల్లలేదని వారు తెలిపారు. ఇది కూడా చదవండి: ఎంపీగా లోక్‌సభలోకి రాహుల్ -
కశ్మీర్ యువతిని పెళ్లాడిన ముంబై క్రికెటర్.. ఫోటోలు, వీడియోలు వైరల్!
ముంబై క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ ఓ ఇంటివాడయ్యాడు. జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాకు చెందిన యువతిని సర్ఫరాజ్ పెళ్లాడాడు. వీరి వివాహ వేడుక వధువు స్వస్థలం షోపియాన్‌లో ఆదివారం ఘనంగా జరిగింది. వీరి వివాహ వేడుకకు కొందరు క్రికెటర్లు కూడా హజరై ఈ జంటను ఆశ్వీరాదించారు. వీరి వివాహానికి సంబంధించి ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్ హర్షిత్ రాణా తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఇక తన విహహం అనంతరం స్ధానిక విలేకరులతో సర్ఫరాజ్ మాట్లాడాడు. టీమిండియా ఎంట్రీ ఎప్పుడు అని ప్రశ్నించగా.. "దేవుడు దయ వుంటే కచ్చితంగా ఎదో ఒక రోజు భారత్‌కు ఆడుతాను" అని సర్ఫరాజ్ పేర్కొన్నాడు. అదే విధంగా కాశ్మీర్ యువతిని పెళ్లిచేసుకోవడం విధి అని సర్ఫరాజ్ అన్నాడు. Wishing a happy married life for Sarfaraz Khan & his wife. Congratulations to both of them. pic.twitter.com/BqwXiGGWtd — Johns. (@CricCrazyJohns) August 6, 2023 అదరగొడుతున్నా కానీ.. కాగా దేశీవాళీ క్రికెట్లో దుమ్మురేపుతున్న సర్ఫరాజ్ భారత జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. విండీస్‌తో టెస్టు సిరీస్‌కు అతడికి భారత జట్టులో చోటు దక్కుతుందని అంతా భావించారు. కానీ సెలక్టర్లు మాత్రం అతడిని పరిగిణలోకి తీసుకోలేదు. అయితే అతడి ఫిట్నెస్ కారణంగానే జాతీయ జట్టుకు ఎంపిక చేయడం లేదని బీసీసీఐ వర్గాలు సృష్టం చేశాయి. కాగా సర్ఫరాజ్ ప్రస్తుతం అద్భుతమై ఫామ్‌లో ఉన్నాడు. గత మూడు రంజీ సీజన్లలో సర్ఫరాజ్ పరుగులు వరద పారించాడు. 2019-20 సీజన్లో 900 పరుగులు, 2020-21 సీజన్లోనూ 900 పరుగులు, 2022-23 సీజన్లో 600పైగా పరుగులు చేశాడు. మూడు సీజన్లలో అతడి సగటు కూడా 100కి పైగా ఉంది. ఓవరాల్‌గా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 34 మ్యాచ్‌లు ఆడిన సర్ఫారాజ్.. 3175 పరుగులు చేశాడు. చదవండి: అస్సలు ఊహించలేదు.. అతడే మా కొంపముంచాడు! కొంచెం బాధ్యతగా ఆడాలి: హార్దిక్ Indian cricketer sarfaraz khan got married in shopian pic.twitter.com/inEvFiWk6t — Mastaan🇵🇸 (@Sartaj_4u) August 6, 2023 -
కాశ్మీర్లో ఉగ్రవాదుల ఘాతుకం.. ముగ్గురు భారత సైనికులు మృతి
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులకు భారత సైన్యానికి మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు భారత సైనికులు మరణించారని అధికారులు తెలిపారు. దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లా హలాన్ అటవీ ప్రాంత పరిసరాల్లో ఉగ్రవాదులు ఉన్నారన్న కచ్చితమైన సమాచారం అందడంతో భారత మిలటరీ వర్గాలు ఆగస్టు 4న ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సైన్యం ఉగ్రవాదుల జాడను జల్లెడ పడుతుండగా ఒక్కసారిగా భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో సెర్చ్ ఆపరేషన్ కాస్తా ఎన్‌కౌంటర్‌గా మారిందన్నారు. ఉగ్రవాదులు చేసిన కాల్పులకు ప్రతిగా సైన్యం కూడా ఎదురుకాల్పులు జరిపిందని, ఈ కాల్పుల్లో ముగ్గురు భద్రతా దళాల సిబ్బంది గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించామని అక్కడ వారు చికిత్స పొందుతూ వారు మృతి చెందినట్లు ఆ అధికారి తెలిపారు. హాలాన్ అడవుల్లో ఎత్తైన ప్రాంతాల్లో ఉగ్రవాదుల ఉనికి ఇంకా ఉన్నట్టు మావద్ద పక్కా సమాచారముందని భారత భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయని అయన తెలిపారు. Operation Halan #Kulgam On specific inputs regarding presence of terrorists on higher reaches of Halan in Kulgam, operations launched by Security Forces on 04 Aug 23. In exchange of firing with terrorists, three personnel sustained injuries and later succumbed. Search operations… pic.twitter.com/NJ3DZa2OpK — Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) August 4, 2023 ఇది కూడా చదవండి: Defamation Case: రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరించండి -
30 ఏళ్లకు మొహర్రం
శ్రీనగర్: దాదాపు మూడు దశాబ్దాల అనంతరం మొదటిసారిగా జమ్మూలో షియా ముస్లింలు మొహర్రం ఊరేగింపు నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం శ్రీనగర్ గుండా లాల్ చౌక్ ఏరియా మార్గంలో గురువారం భారీ మూడంచెల భద్రతా ఏర్పాట్ల మధ్య ఊరేగింపు సాగింది. షియాలు పెద్ద సంఖ్యలో ఉదయం 6 నుంచి 8 గంటల వరకు గురుబజార్ నుంచి దాల్గేట్ మార్గంలో జెండాలు చేబూని శాంతియుతంగా ముందుకు సాగారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం ప్రబలిన తర్వాత..గత 30 ఏళ్లలో మొహర్రం ఊరేగింపు జరగడం ఇదే మొదటిసారని కశ్మీర్ అదనపు డీజీపీ విజయ్ కుమార్ తెలిపారు. -
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం
-
ప్రధాని కార్యాలయ అధికారిగా బురిడీ కొట్టించి..చివరికి పోలీసులకు చిక్కి..
ముగ్గురు వ్యక్తులు ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన అధికారనంటూ ఫోజులిస్తూ జమ్ముకాశ్మీర్ యంత్రాంగాన్ని మోసగించారు. ఈ మేరకు గుజరాత్‌కి చెందిన కిరణ్ భాయ్ పటేల్ నేతృత్వంలోని బృందంలో ముగ్గురు వ్యక్తులు పీఎంఓ అధికారులుగా నటిస్తూ.. జమ్మూకాశ్మీర్‌లో పర్యటించి, బుల్లెట్ ప్రూఫ్ మహింద్రా స్కార్పియో కార్లలో తిరుగుతూ ఫైవ్ స్టార్ హోటళ్లలో అతిధ్యం అందుకున్నారు. వారి చేతిలో మోసపోయిన జమ్ము కాశ్మీర్ అధికారులు వారికి సకల రాచమర్యాదలు అందించారు. గతేడాది నుంచి ఈ ప్రధానమంత్రి కార్యాలయానికి సంబంధించిన బృందం కశ్మీర్లో పర్యటిస్తుంది. అదికూడా రెండు వారాల వ్యవధిలోనే రెండోసారి పర్యటనకు రావడంతో అనుమానం తలెత్తి.. భద్రతా అధికారులు సీఐడీకి సమాచారం అందించారు. కిరణ్ భాయ్ పటేల్ తోపాటు ఉన్న మిగతా ముగ్గురు వ్యక్తులను గుజరాత్‌కు చెందిన అమిత్ హితేష్ పాండియా, జే సితాపరా, రాజస్థాన్‌కి చెందిన త్రిలోక్ సింగ్‌లుగా గుర్తించారు. వీరంతా పీంఎంఓ బృందంగా నటిస్తూ.. గతుడాది అక్టోబర్ నుంచి కాశ్మీర్లో నాలుగు సార్లు పర్యటించారు. అధికారిక వర్గాల ప్రకారం..దక్షిణ కాశ్మీర్లో జిల్లా మేజిస్ట్రేట్‌గా ఉన్న ఒక ఐఏఎస్ అధికారి సదరు సీనియర్ పీఎంఓ అధికారి సందర్శన గురించి పోలీసుల భద్రతా విభాగానికి సమాచారం అందించినట్లు అధికారికి వర్గాలు తెలిపాయి. దీంతో భద్రతా విభాగం నిందితుడు పటేల్‌కు జెడ్ ప్లస్ భద్రతలను అందించడమే గాక అక్టోబర్ నుంచి నాలుగు పర్యటనల్లో అతను ఎక్కడికి వెళ్లినా వీఐపీ హోదాగా వెంట స్థానిక పోలీసులు కూడా వచ్చారు. సదరు మోసగాడు కిరణ్ భాయ్ పటేల్ అక్కడ అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించి, నియంత్రణ రేఖ సమీపంలోని ఉరిలోని కమాన్ పోస్ట్ నుంచి శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌కు వరకు పర్యటించాడు. అందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో పంచుకున్నాడు. అంతేగాదు అక్కడ దూద్పత్రిని ప్రధాన పర్యాటక కేంద్రంగా మార్చడంపై చర్చించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. నిందితుడు పటేల్ తొలిసారిగా అక్టోబర్ 27న తన కుటుంబంతో సహా పర్యాటనకు వచ్చాడని ఆ తర్వాత పర్యటనలో ఈ ముగ్గురు వ్యక్తులు చేరినట్లు తెలిపారు. గట్టి నిఘాపెట్టిన సీఐడీ వర్గాలు అతడి గత చరిత్రను ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దీంతో ఆ వ్యక్తిని చాలా పకడ్బంధింగా అరెస్టు చేశారు. ఐతే పటేల్ అరెస్టు కావడానికి కొద్ది నిమిషాల ముందు మిగతా ముగ్గురు వ్యక్తులు తప్పించుకున్నట్లు అధికారులు తెలిపారు. వారికి సహకరించిన ఇద్దరు పోలీసులపై కూడా చర్యలు తీసుకున్నారు. కాగా, నిందితుడు పటేల్‌ని దర్యాప్తు చేసేందుకు గుజరాత్ పోలీసులు కూడా రంగంలోకి దిగినట్లు తెలిపారు. (చదవండి: పనిలోంచి తీసేశారని క్లీనర్ రివేంజ్..కార్లపై యాసిడ్ పోసి..) -
మహిళను చంపి, ముక్కలుగా నరికి..
శ్రీనగర్: ఢిల్లీలో అఫ్తాబ్ పూనావాలా అనే యువకుడు సహజీవనం చేస్తున్న శ్రద్ధా వాకర్ అనే యువతిని చంపి, 35 ముక్కలుగా నరికి వేర్వేరు ప్రాంతాల్లో పడేసిన దారుణాన్ని గుర్తుకు తెచ్చే ఘటన ఇది. జమ్మూకశ్మీర్‌లోని బుద్గా జిల్లాలో చోటుచేసుకుంది. పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో షబీర్ అహ్మద్ వనీ(45) అనే వ్యక్తి కార్పెంటర్ ఓ మహిళ(30)ను చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి వేర్వేరు చోట్ల పాతిపెట్టాడు. మార్చి 7వ తేదీన కోచింగ్ క్లాస్‌కని వెళ్లిన తన సోదరి కనిపించకుండా పోయిందంటూ షోయిబుగ్‌కు చెందిన తన్వీర్ అహ్మద్ ఖాన్ అనే వ్యక్తి 8న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సదరు మహిళ సెల్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు మొహన్‌పురా ఒంపొరాకు చెందిన వనీని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని అంగీకరించాడు. అతడిచ్చిన సమాచారంతో పాతిపెట్టిన మహిళ శరీర భాగాలను శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం పెళ్లి చేసుకుంటానంటూ వనీ చేసిన ప్రతిపాదనను తిరస్కరించడంతో ఆమెపై పగబట్టినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వాట్సాప్ కాల్ సాయంతో ప్రసవం
శ్రీనగర్: నొప్పులతో విలవిల్లాడుతున్న గర్భిణికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ) సిబ్బంది వాట్సాప్ కాల్ సాయంతో సురక్షితంగా ప్రసవం చేసిన సంఘటన జమ్మూకశ్మీర్‌లో జరిగింది. కుప్వారా జిల్లాలోని కెరాన్ పీహెచ్‌సీకి నెలలు నిండి, నొప్పులు మొదలైన గర్భిణిని కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి తీసుకొచ్చారు. ఎక్లామ్‌ప్సియా, ఎపిసియోటోమీతో బాధపడుతున్న ఆమెకు ప్రసవం జరగడం కష్టతరంగా మారింది. తీవ్రంగా మంచు కురుస్తుండడంతో హెలికాప్టర్లో జిల్లా ఆసుపత్రికి తరలించడం వీలు కాలేదు. దీంతో కెరాన్ పీహెచ్సీ డాక్టర్లు క్రాల్పొరాలోని జిల్లా ఉప ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. ఆఆసుపత్రి వైద్యుడు డాక్టర్ పర్వేజ్ వాట్సాప్ కాల్లో సూచనలు ఇస్తుండగా, కెరాన్ పీహెచ్సీ వైద్యులు మహిళకు విజయవంతంగా ప్రసవం చేశారు. ఆడ శిశువు జన్మించిందని, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. -
మిసెస్ వరల్డ్‌గా సర్గమ్ కౌశల్.. 21 ఏళ్ల తర్వాత భారత్‌కు కిరీటం..
న్యూఢిల్లీ: ముంబైకి చెందిన సర్గమ్ కౌశల్ మిసెస్ వరల్డ్ 2022 కిరీటం దక్కించుకున్నారు. శనివారం అమెరికాలోని వెస్ట్గేట్ లాస్‌వెగాస్ రిసార్ట్ అండ్ క్యాసినోలో జరిగిన పోటీల్లో 63 దేశాలకు చెందిన సుందరీమణులు ఈ కిరీటం కోసం తలపడ్డారు. సర్గమ్ విజేతగా నిలవగా మొదటి రన్నరప్‌గా మిసెస్ పోలినేసియా, రెండో రన్నరప్‌గా మిసెస్ కెనడా నిలిచారు. 2001లో నటి, మోడల్ అదితి గోవిత్రికర్ మిసెస్ వరల్డ్ గెలుచుకోగా, 21 ఏళ్ల తర్వాత తిరిగి భారత్‌కు ఆ గౌరవం దక్కింది. సర్గమ్ కౌశల్ జమ్మూకశీ్మర్‌కు చెందిన వారు. మిసెస్ వరల్డ్ పోటీలను 1984 నుంచి నిర్వహిస్తున్నారు. చదవండి: మోరల్ పోలీసింగ్ వద్దు: సుప్రీం -
మౌలిక సదుపాయాల లేమివల్లే కశ్మీర్లో ఉగ్రభూతం: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: స్వాతంత్య్రానంతరం జమ్మూకశ్మీర్‌లో దశాబ్దాలుగా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందలేదని, అందుకే ఉగ్రవాదం విస్తరించిందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. సరిహద్దులోని ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో రూ.2,180 కోట్లతో నిర్మించిన వంతెనలు, రహదారులు, హెలిప్యాడ్లు తదితర 75 నూతన ప్రాజెక్టులను ఆయన శుక్రవారం తూర్పు లద్దాఖ్‌లోని దార్బుక్–ష్యోక్–దౌలత్ బేగ్ ఓల్డీలో వర్చువల్‌గా ప్రారంభించారు. రాజ్‌నాథ్ ప్రారంభించిన వంతెనల్లో.. సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తున డీఎస్–డీబీఓ రోడ్డుపై నిర్మించిన 120 మీటర్ల పొడవైన ‘క్లాస్–70 ష్యోక్ సేతు’ ఉంది. వీటిని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్మించారు. వీటిలో 45 వంతెనలు, 27 రోడ్లు, రెండు హెలిప్యాడ్లు, ఒక ‘కార్బన్ న్యూట్రల్ హాబిటాట్’ ఉన్నాయి. కశ్మీర్లో 20 ప్రాజెక్టులు, లద్దాఖ్‌లో 18, అరుణాచల్ ప్రదేశ్‌లో 18, ఉత్తరాఖండ్‌లో 5, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్తాన్‌లో 14 ప్రాజెక్టులు నిర్మించారు. ‘కార్బన్ న్యూట్రల్ హాబిటాట్’లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ 57 మంది తల దాచుకోవచ్చు. -
కొత్త పార్టీపై ఆజాద్ కీలక ప్రకటన.. నా వెనుక వారున్నారు!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఇటీవలే హస్తం పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. కాగా, కాంగ్రెస్ పార్టీని వీడినప్పటి నుంచి ఆజాద్.. అధిష్టానంపై నిప్పులు చెరుగుతున్నారు. కాంగ్రెస్ తీరు, రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. కాగా, ఆజాద్ ఇప్పటికే.. కశ్మీర్లో కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, కొత్త పార్టీపై ఆజాద్ తాజాగా మరిన్ని విషయాలు వెల్లడించారు. జమ్మూలో ఆదివారం ఆజాద్ బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం ఆజాద్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొత్త పార్టీపై పది రోజుల్లో ప్రకటన చేస్తానని తెలిపారు. ఈ క్రమంలోనే తాను కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత.. తనకు మద్దతిచ్చే వారి సంఖ్య ఎన్నో రెట్లు పెరిగినట్టు స్పష్టం చేశారు. పార్టీలతో సంబంధం లేకుంగా తనకు సపోర్టు నిలిచారని అన్నారు. మరోవైపు.. తాను రాజీనామా చేసి కశ్మీర్‌కు వచ్చిన తర్వాత జమ్మూలో 30-35 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 400 మందిని కలుసుకున్నట్టు చెప్పారు. వారంతా తనకు మద్దతు తెలిపారని, ఏ పార్టీ అయినా తనతో నడుస్తానని చెప్పినట్టు వెల్లడించారు. అలాగే, కశ్మీర్ ప్రజల కోసం తన పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, ఆజాద్ రాజీనామా చేసిన అనంతరం.. కశ్మీర్లో దాదాపు 1500 మంది కార్యకర్తలు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. Former Congress leader Ghulam Nabi Azad said that he would announce a new political party within 10 days. https://t.co/6b2YLXcW4n — Financial Express (@FinancialXpress) September 11, 2022 -
తోటి సైనికులపై విచక్షణారహితంగా కాల్పులు.. ఆపై ఆత్మహత్య
శ్రీనగర్: ఇంటో టిబెటన్ బార్డర్ పోలీస్(ఐటీబీపీ)కి చెందిన కానిస్టేబుల్ తన తోటి సైనికులపై విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. జమ్ముకశ్మీర్‌లోని ఉధమ్‌పుర్‌లో శనివారం మధ్యాహ్నం ఈ సంఘటన వెలుగుచూసింది. ముగ్గురు సహచరులపై కాల్పులు జరిపిన అనంతరం తానూ కాల్పుకుని ఆత్మహత్య చేసుకున్నాడు కానిస్టేబుల్. ఉధంపుర్లోని దేవికా ఘాట్ కమ్యూనిటీ సెంటర్లో శనివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. కాల్పులు జరిపిన కానిస్టేబుల్ 8వ బెటాలియన్ భూపేంద్ర సింగ్‌గా గుర్తించారు. 'జమ్ముకశ్మీర్‌లోని ఉధమ్ఫుర్లో ముగ్గురు జవాన్లపై ఐటీబీపీ 8వ బెటాలియన్ కానిస్టేబుల్ కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఆ తర్వాత తనకు తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తూటాలు తగిలిన ముగ్గురు జవాన్లను ఆసుపత్రికి తరలించాం. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉంది.' అని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపింది ఐటీబీపీ. కాల్పులు జరిపేందుకు గల కారణాలు తెలియరాలేదని పేర్కొంది. మృతి చెందిన కానిస్టేబుల్ ఐటీబీపీలోని ఎఫ్ కంపెనీకి చెందినట్లు తెలిపింది. ఇదీ చూడండి: విషాదం.. మజాక్‌ల చేసిన పనితో దోస్త్ ప్రాణం పోయింది -
అమర్నాథ్ యాత్ర నిలిపివేత
సాక్షి, న్యూఢిల్లీ: అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పహల్గామ్ బేస్ క్యాంప్ నుంచి భక్తులెవరినీ మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు అనుమతించట్లేదని పేర్కొన్నారు. పరిస్థితులు మెరుగుపడిన తర్వాత యాత్ర తిరిగి ప్రారంభమవుతుందన్నారు. కరోనా కారణంగా రెండేళ్ల విరామం తర్వాత జూన్ 30న అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. జమ్ముకశ్మీర్‌లోని ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు దేశ నలుమూల నుంచి భక్తులు వెళ్తుంటారు. అనంత్ నాగ్ జిల్లా పహల్గామ్లోని నున్వాన్ క్యాంప్, గందర్బల్ జిల్లా బాల్టాల్ క్యాంప్ నుంచి ఈ ఏడాది అమర్నాథ్ యాత్రను ప్రారంభించారు. యాత్రను తాత్కాలికంగా నిలిపివేసేవరకు 72,000 మందికిపైగా భక్తులు పవిత్ర పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. ఆగస్టు 11న రాఖీ పౌర్ణమి రోజున అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది. -
పార్లమెంటులో జమ్ము కశ్మీర్ బడ్జెట్.. అసలు కారణమిదే !
సాధారణంగా కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో రాష్ట్ర బడ్జెట్లను ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీల్లో ప్రవేశపెట్టడం ఆనవాయితీ. కానీ ఆనవాయితీకి భిన్నంగా ఈ రాష్ట్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి వస్తుంది. అందుకు బలమైన కారణాలే ఉన్నాయి. కల్లోల ప్రాంతంగా పేరొందిన జమ్ము, కశ్మీర్‌ల బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022 మార్చి 14న పార్లమెంటులో జమ్ము, కశ్మీర్ బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకువస్తున్నారు. మేరకు ఆ ప్రాంతానికి సంబంధించిన బడ్జెట్ ప్రతులు ఈ రోజు పార్లమెంటు ఆవరణకు చేరుకోగానే మరోసారి భద్రపరమైన తనిఖీలు నిర్వహించారు. కేంద్ర బడ్జెట్‌ను డిజిటల్ పద్దతిలో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. కశ్మీర్ బడ్జెట్‌ను పాత పద్దతిలో పేపర్ బడ్జెట్‌గా పరిచయం చేస్తున్నారు. 2019 ఆగస్టు 5న జమ్ము కశ్మీర్ రాష్ట్రంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని తొగించడంతో పాటు రాష్ట్రపతి పాలన విధించింది కేంద్రం. జమ్ము, కశ్మీర్, లఢాక్‌లను వేర్వేరు ప్రాంతాలుగా గుర్తించింది. అప్పటి నుంచి జమ్ము, కశ్మీర్ రాష్ట్ర ఉనికి కోల్పోయింది. కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. అప్పటి నుంచి నేటి వరకు కేంద్ర పాలనే సాగుతోంది. #WATCH | Delhi: Copies of the Budget of Jammu and Kashmir brought to the Parliament. Union Finance Minister Nirmala Sitharaman will present the Budget for J&K in Lok Sabha today. pic.twitter.com/6NwRwabnEL — ANI (@ANI) March 14, 2022 గత మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వమే జమ్ము, కశ్మీర్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. రెండో విడత కేంద్ర బడ్జెట్ సమావేశాలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు జరగనున్నాయి. జమ్ము కశ్మీర్ బడ్జెట్‌తో పాటు పలు కీలక అంశాలు, చట్ట సవరణలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. -
కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఆజాద్ అన్న కొడుకు..
శ్రీనగర్: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ కీలక నేత గులాం నబీ ఆజాద్ సోదరుడి కుమారుడు ముబాశిర్ ఆజాద్ ఆదివారం బీజేపీలో చేరారు. జమ్మూ కాశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా, ఇతర బీజేపీ సీనియర్ నేతల సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీలో తాను చేరే విషయం గులాం నబీ ఆజాద్‌తో చర్చించలేదని వెల్లడించారు. కాంగ్రెస్ అధిష్టానం ఆజాద్‌ను అగౌరవపరచడం తనను చాలా బాధించిదన్నారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత పోరులో కూరుకుపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి సేవ చేసిన ఆజాద్‌ను పార్లమెంట్లో ప్రధాని మోదీ ప్రశంసిస్తే.. కాంగ్రెస్ పార్టీనే పక్కన పెట్టిందని మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. క్షేత్రస్థాయిలో ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తనను ప్రభావితం చేసిన కారణంగానే బీజేపీలో చేరుతున్నట్టు స్పష్టం చేశారు. మోదీ నాయకత్వంలో ప్రజల సంక్షేమం కోసం పనులు జరుగుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో బీజేపీ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. మరోవైపు గతేడాది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, సంస్థాగత నిర్మాణంలో మార్పులు చేయాలంటూ అధిష్టానానికి లేఖ రాసిన 23 మంది కాంగ్రెస్ సీనియర్ నేతల్లో ఆజాద్ కూడా ఉండటం విశేషం. -
కశ్మీర్ సరిహద్దుల్లో ఆయుధాలు జారవిడిచిన డ్రోన్
జమ్మూ: కశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంలో డ్రోన్ జారవిడిచిన ఆయుధాలను సకాలంలో భద్రతా బలగాలు గుర్తించడంతో లష్కరే తోయిబా కుట్ర భగ్నమైంది. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా, ది రెసిస్టాన్స్ ఫోర్స్(టీఆర్ఎఫ్)అనే ఉగ్రసంస్థలు పంపిన ఆయుధాలతో సరిహద్దులకు సమీపంలో డ్రోన్ సంచరిస్తోందన్న సమాచారం మేరకు బలగాలు గాలింపు చేపట్టాయి. జమ్మూ జిల్లా ఆర్‌ఎస్‌పురా–ఆర్నియా ప్రాంతంలోని ట్రెవా గ్రామం సమీపంలో భద్రతా బలగాలకు ఒక పిస్టల్, రెండు మ్యాగజీన్లు, మూడు ఐఈడీలు, మూడు బాటిళ్ల పేలుడు పదార్థాలు తదితరాలు లభ్యమయ్యాయి. సరిహద్దు అవతల నుంచి వచ్చిన డ్రోన్ వీటిని అక్కడ జారవిడిచి వెళ్లినట్లు గుర్తించామని అధికారులు వెల్లడించారు. చదవండి: ('ఇది వినాశనానికే.. రష్యాకు ఏ మాత్రమూ మేలు చేయదు') -
"త్వరలోనే భారత జట్టులోకి వస్తా.. నా విజయంలో అతడిదే కీలక పాత్ర"
సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ క్రిక్ ట్రాకర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయట పెట్టాడు. ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు ఉమ్రాన్ మాలిక్‌ను రూ.4 కోట్లకు ఎస్ఆర్హెచ్ రీటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. గంటకు 150 కి.మీ స్పీడ్, బ్యాటర్లను హడలెత్తించే యార్కర్లు మాలిక్ సొంతం. ప్రస్తుతం ఉమ్రాన్ రంజీ ట్రోఫీలో జమ్మూ కాశ్మీర్ జట్టు తరుపున ఆడుతున్నాడు. రంజీ ట్రోఫీలో అతడు అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇక ఐపీఎల్-2021 సెకెండ్ ఫేజ్‌లో నటరాజన్ స్ధానంలో జట్టులోకి వచ్చిన ఉమ్రాన్ తన బౌలింగ్‌తో అందరినీ అకట్టుకున్నాడు. గత ఏడాది సీజన్లో ఆర్సీబీపై 152.95 స్పీడ్‌తో బౌలింగ్ వేసిన ఉమ్రాన్.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంతమైన డెలివరీ వేసిన తొలి భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ప్రశ్న: మీ పేస్ బౌలింగ్ అభివృద్ధిపై ఇర్ఫాన్ పఠాన్ ప్రభావం ఎంతవరకు చూపింది? సమాధానం: ఇర్ఫాన్ భాయ్ జమ్మూ కాశ్మీర్ మెంటర్ కమ్ కోచ్‌గా తన జర్నీను ప్రారంభించినప్పడు.. అతను నేను నెట్స్‌లో బౌలింగ్ చేయడం చూసేవాడు. అప్పుడు నా స్కిల్స్‌ను మరింత మెరుగుపరచుకోవడానికి నాకు చాలా సహాయం చేశాడు. నేను అతనికి నా బౌలింగ్ వీడియోలను పంపేవాడిని. భాయ్ వీడియోలు చూసి నేను చేస్తున్నది సరైనది లేదా తప్పు అనే దానిపై తన అభిప్రాయాన్ని తెలియజేసేవాడు. కాబట్టి, నా కెరీర్ అభివృద్దిలో అతని పాత్ర చాలా పెద్దది. ప్రశ్న: దక్షిణాఫ్రికా టూర్లో ఇండియా-ఎ జట్టుకు ఆడిన అనుభవం ఎలా ఉంది? సమాధానం: అది నా మొదటి విదేశీ పర్యటన. ప్రోటిస్ గడ్డపై ఆడడం ద్వారా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ప్రశ్న: మీరు గత సీజన్లో ఐపీఎల్లో సన్‌రైజర్స తరుపున అరంగేట్రం చేయడం ఎలా ఫీల్ అవుతున్నారు? సమాధానం: జమ్మూ కాశ్మీర్ జట్టు తరుపున ఆడటానికి గత రెండేళ్లుగా నేను చాలా కష్టపడ్డాను. అటు వంటి సమయంలో ఐపీఎల్ వంటి మెగా టోర్నీలో ఆడే అవకాశం రావడం చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. భగవంతుని దయతో మరింత రాణించడానికి ప్రయత్నిస్తాను. అదే విధంగా వీలైనంత త్వరగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నాను. ప్రశ్న: ఐపీఎల్-2022 కోసం స్టార్ ఆటగాళ్లను కాకుండా మిమ్మల్ని ఎస్ఆర్హెచ్ రీటైన్ చేసుకుంది, అది మీకు ఎలా అనిపించింది? సమాధానం: చాలా మంది స్టార్ ఆటగాళ్లను కాకుండా ఎస్ఆర్హెచ్ నన్ను రీటైన్ చేసికున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నా తొలి ఐపీఎల్ సీజన్లో కేవలం మూడు మ్యాచ్‌లు ఆడినప్పటికీ, నన్ను రీటైన్ చుసుకోవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ విషయంలో నేను దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. -
19 ఫోర్లు..2 సిక్స్‌లు.. సెంచరీతో చెలరేగిన సన్‌రైజర్స్ ఆటగాడు!
రంజీ ట్రోఫీలో భాగంగా పాండిచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో జమ్మూ కాశ్మీర్ బ్యాటర్, ఎస్ఆర్హెచ్ ఆటగాడు అబ్దుల్ సమద్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. సమద్ 78 బంత్లుతో 19 ఫోర్లు, 2 సిక్సర్లతో 103 పరుగులు చేశాడు. సమద్ తుపాన్ ఇన్నింగ్స్‌తో తొలి ఇన్నింగ్స్‌లో జమ్మూ 426 పరుగులు సాధించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే..టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాండిచ్చేరి తొలి ఇన్నింగ్స్‌లో 343 పరుగులు చేసింది. పాండిచ్చేరి బ్యాటర్లలో పీకే డోగ్రా(108), కార్తీక్(63) పరుగులతో రాణించారు. జమ్మూ బౌలర్లలో పార్వేజ్ రసూల్ 4 వికెట్లు పడగొట్టగా, ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లు సాధించాడు. అదే విధంగా జమ్మూ తొలి ఇన్నింగ్స్‌లో 426 పరగులకు ఆలౌటైంది. జమ్మూ బ్యాటర్లలో కమ్రాన్ ఇక్భాల్(96),సమద్(103) పరుగులతో టాప్ స్కోరర్లగా నిలిచారు. ఇక ఐపీఎల్-2022 మెగా వేలం ముందు కేన్ విలియమ్సన్, ఉమ్రాన్ మాలిక్‌తో పాటు సమద్‌ను కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ రీటైన్ చేసుకుంది. చదవండి: Ranji Trophy 2022: తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్న పంజాబ్ కింగ్స్ హిట్టర్ -
Jammu Kashmir: శ్రీనగర్ లో భారీ అగ్ని ప్రమాదం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాజ్‌బాగ్‌లోని ఒక వాణిజ్య భవనంలో గురువారం మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ఫైర్సెఫ్టీ అధికారులకు సమాచారం అందించారు. కాగా, ప్రమాద స్థలానికి చేరుకున్న అధికారులు ఫైరింజన్ సహయంతో మంటలను అదుపులోనికి తీసుకొని వచ్చారు. ఒక సిలెండర్ పేలడం వలన మంటలు వ్యాపించినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనావేశారు. కాగా, మంటలను అదుపుచేసే క్రమంలో ఒక ఫైర్ అధికారి గాయపడినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ముందు జాగ్రత్తగా అధికారులు ఘటన స్థలం వద్ద అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: బీహార్‌లో ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ ఆందోళనలు -
ఈ కశ్మీర్ లెక్క కరెక్టేనా?
కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ–కశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) కమిషన్ ప్రతిపాదన అసంతృప్తి జ్వాలలను రగులుస్తున్నది. కేంద్రం నియమించిన డీలిమిటేషన్ కమిషన్ కొత్తగా జమ్మూలో ఆరు అసెంబ్లీ సీట్లు, కశ్మీర్లో ఒకటి ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు రూపొందించి, జనాభిప్రాయాన్ని కోరింది. ఈ ప్రతిపాదనలు బీజేపీకి రాజకీయ లబ్ధి చేకూర్చేవిగా ఉన్నాయనీ, జమ్మూ, కశ్మీర్‌ల మధ్య విభజన రేఖను గీసి వాటి మధ్య శత్రుత్వ భావం పెంచేలా ఉన్నాయనీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి 2011 జనాభా గణాంకాలను బట్టి చూస్తే... మొత్తం 90 సీట్లలో కశ్మీర్‌కు ప్రస్తుతం ఉన్న 46 స్థానాలను 51 స్థానాలకు, జమ్మూకు ప్రస్తుత 37 సీట్లను 39కి పెంచాల్సి ఉంది. జమ్మూ కశ్మీర్లో ఉన్న రాజకీయ కేంద్రీకరణ, ఆధిపత్యంౖపై ఈ ప్రతిపాదన ఒక దాడి లాంటిది. 2019 ఆగస్టు 5న బీజేపీ నాయకత్వం లోని ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ సాధికారతను తగ్గించడానికి ప్రారం భించిన చర్యల్లో ఇదొక భాగం అనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత జనాభా లెక్కల ప్రకారం, జమ్మూ జనాభా కన్నా కశ్మీర్ జనాభా 15 లక్షల మంది ఎక్కువగా ఉన్నప్పటికీ కశ్మీర్‌కు 1, జమ్మూకు 6 కొత్త నియోజక వర్గాలను ఏర్పాటు చేయాలనడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవు తోంది. జమ్మూ కశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) జరగాలనేది 1995 నుంచీ బీజేపీ ఎజెండాగా ఉంది. 2020 మార్చి 6న కేంద్ర ప్రభుత్వం జమ్మూ–కశ్మీర్లో నియోజక వర్గాల పునర్విభజన కోసం డీలిమిటేషన్ కమిషన్‌ను నియమించింది. ఆ కమిషన్ డిసెంబర్ 20న తన అసోసియేట్ సభ్యులైన ముగ్గురు నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీలు, ఇద్దరు బీజేపీ ఎంపీలకు మొత్తం మీద ఆరు కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనల గురించి చెప్పింది. తమ ప్రతి పాదనలపై డిసెంబర్ 31 లోపు ప్రతి స్పందించాలని కోరిందని ఎంపీలు పేర్కొన్నారు. కశ్మీర్‌కు మరిన్ని సీట్లు రావలసి ఉందనీ, ఈ ప్రతిపాదన తమకు ఏమాత్రం సమ్మతం కాదనీ ఎన్సీ ఎంపీ జస్టిస్ (రిటైర్డ్) హస్నెయిన్ మసూది అన్నారు. డీలిమిటేషన్ కమిషన్ ప్రతిపాదనతో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో జమ్మూ సీట్లు 37 నుంచి 43కు, కశ్మీర్ సీట్లు 46 నుంచి 47కు పెరుగు తాయి. జమ్మూలోని కథువా, సంబా, ఉధంపూర్, దోడ, కిష్త్వార్, రాజౌరీ జిల్లాల్లో ఒక్కో నియోజక వర్గాన్ని, కశ్మీర్ లోయలోని కుప్వారా జిల్లాలో ఒక నియోజకవర్గాన్ని అదనంగా ఏర్పాటు చేయాలని కమిషన్ ప్రతిపాదించింది. కథువా, సంబా, ఉధంపూర్ సెగ్మెంట్లలో హిందువులు అత్యధికంగా ఉన్నారు. జనాభా లెక్కల ప్రకారం కథువాలో 87.61 శాతం హిందూ జనాభా ఉంది. కాగా సంబాలో 86.33 శాతం, ఉధంపూర్‌లో 88.12 శాతం హిందువులు ఉన్నారు. కిష్త్వార్, దోరా, డజౌరీ జిల్లాల్లోనూ గణనీయంగా (37 శాతం నుంచి 45 శాతం) హిందువులు ఉన్నారు. పునర్విభజన కథ ఇదీ... అన్ని నియోజకవర్గాల్లో దాదాపు ఒకే పరిమాణంలో ఓటర్లు ఉండేలా చూసేందుకు డీలిమిటేషన్ చేపడతారు. చివరిసారి దేశంలో నియోజక వర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) 2002లో జరిగింది. జమ్మూ– కశ్మీర్లో మాత్రం 1995లో రాష్ట్రపతి పాలన ఉన్న కాలంలో జరిగింది. దానికి ముందు 1993లో తాత్కాలిక ప్రాతిపదికన జగ్మోహన్ డీలిమిటేషన్ ప్రక్రియ నిర్వహించారు. అప్పట్లో 87 అసెంబ్లీ సీట్లు ఉండాలని ప్రతిపాదిం చారు. అయితే 2002లో ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వం 2026 వరకు డీలిమిటేషన్‌ను నిర్వహించడానికి వీల్లేకుండా రాష్ట్ర రాజ్యాంగాన్ని సవరించింది. కానీ 2008 నుంచి బీజేపీ డీలిమిటేషన్ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వచ్చింది. జమ్మూ ప్రాంతానికి అసెంబ్లీ స్థానాల్లో తగిన వాటా వచ్చేందుకు డీలిమిటేషన్ అవసరం ఉందని ఆ పార్టీ వాదిస్తూ వచ్చింది. జమ్మూ కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేసిన అనంతరం 2020 మార్చి 6న నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టడానికి కేంద్రం డీలిమిటేషన్ కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ నిర్వహించిన ఓ సమావేశం (2021, ఫిబ్రవరి)లో బీజేపీ నాయకులు జమ్మూలో డీలిమిటేషన్‌కు కేవలం జనాభాను మాత్రమే ప్రాతిపదికగా తీసుకోకుండా అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులనూ పరిగణనలోకి తీసు కోవాలని కమిషన్‌ను కోరారు. దీంతో జూన్‌లో కమిషన్ జమ్మూ కాశ్మీర్లో ఉన్న మొత్తం 20 జిల్లాల్లో ఉన్న భౌగోళిక పరిస్థితులు, జనాభా విస్తరణ, జనసాంద్రత, ప్రజల రాజకీయకాంక్షలు లేదా నియోజకవర్గాలకు సంబంధించిన ఆకాంక్షల సమాచారాన్ని సమర్పించాలని ఆయా జిల్లా కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 20 నాడు ముసాయిదా డీలిమిటేషన్ ప్రతిపాదనలను... కమిషన్ అనుబంధ çసభ్యులైన జమ్మూ కాశ్మీర్ ఎంపీలు ఐదుగురికీ ఇచ్చి డిసెంబర్ 31 లోపు తమ అభిప్రాయాలు చెప్పాలని కోరింది. జమ్మూకు లభించాల్సినంత ప్రాతినిధ్యం లభించలేదనీ, అందు వల్ల నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలనీ ఎప్పటినుంచో బీజేపీ డిమాండ్ చేస్తూ వస్తోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జమ్మూలో 25 స్థానాలు గెలుచుకుని చరిత్రలో మొదటిసారిగా సంకీర్ణ ప్రభు త్వంలో భాగస్వామి అయింది. జమ్మూకు అసెంబ్లీలో తగిన ప్రాతి నిధ్యం లభించలేదంటున్న బీజేపీ వాదం సరికాదనే విమర్శా ఉంది. ఎందుకంటే గత డీలిమిటేషన్లో కూడా కశ్మీర్ లోయ కన్నా జమ్మూకే ఎక్కువ లాభం చేకూరింది. 1995లో జరిగిన నియోజక వర్గాల పునర్విభజనలో కశ్మీర్‌కు 46 సీట్లు కేటాయిస్తే, జమ్మూకు 37 స్థానాలు కేటాయించారు. అంటే మొత్తం రాష్ట్ర జనాభాలో 56.15 శాతం ఉన్న కశ్మీర్ జనాభాకు 55.42 శాతం ప్రాతినిధ్యం లభించిం దన్నమాట. అదే సమయంలో 43.84 శాతం ఉన్న జమ్మూ ప్రజలకు 44.57 శాతం ప్రాతినిధ్యం లభించింది. అంతేకాక, అంతకుముందు 1957లో జమ్మూ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీట్లకు రెట్టింపు స్థానాలు జమ్మూకు లభించాయి. కాగా, కశ్మీర్‌కు మొత్తం మీద 3 సీట్లు పెరగగా, జమ్మూ సీట్లు 7 పెరిగాయి. 1957లో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల నాటికి కశ్మీర్‌కు 43 స్థానాలు కేటాయించగా, జమ్మూకు 30 స్థానాలు కేటాయించారు. లద్దాఖ్‌కు 2 సీట్లు ఇచ్చారు. జమ్మూ–కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత లద్దాఖ్ ఇప్పుడు జమ్మూ–కశ్మీర్లో భాగం కాదన్న సంగతి తెలిసిందే. డీలిమిటేషన్ ప్రకియ అంతా ముస్లిం జనాభా అధికంగా ఉన్న రాష్ట్రంలో హిందూ ముఖ్యమంత్రిని ప్రతిష్ఠించాలన్న బీజేపీ ‘కలల ప్రాజెక్టు’ను సాకారం చేయడానికే అని కశ్మీర్ లోయలో అధిక జనాభా భావిస్తోంది. 1947 నుంచి జమ్మూ–కశ్మీర్లో ఎన్నికైన ప్రభుత్వానికి ఒక్క గులాం నబీ ఆజాద్ తప్ప అందరూ కశ్మీర్ లోయకు చెందినవారే ముఖ్యమంత్రిగా నాయకత్వం వహించారు. డీలిమిటేషన్ కమిషన్ ప్రతిపాదన కశ్మీర్‌లోయను, జమ్మూను విభజించే ధోరణిలో ఉందని కశ్మీర్ రాజకీయ నాయకులు మండి పడుతున్నారు. ‘‘జమ్మూ–కశ్మీర్ డీలిమిటేషన్ కమిషన్ ముసాయిదా ప్రతిపాదన మాకు సమ్మతం కాదు. 2011 జనాభా లెక్కల ప్రకారం జమ్మూకు 6 జీట్లు, కశ్మీర్‌కు 1 స్థానం ఇవ్వడం న్యాయం కాద’’ని మాజీ సీఎం, ఎన్సీ ఉపాధ్యక్షులు ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. మరో మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రా టిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ... ‘‘2019 ఆగస్ట్‌లో తీసుకున్న చట్టవిరుద్ధ, రాజ్యాంగ వ్యతిరేకమైన నిర్ణ యాన్ని చట్టబద్ధం చేసే ప్రభుత్వాన్ని జమ్మూ కశ్మీర్లో స్థాపించడమే అసలు గేమ్ ప్లాన్’’ అని వ్యాఖ్యానించారు. ఈ ప్రతిపాదన పూర్తిగా పక్షపాతంతో కూడుకుని ఉందని, కశ్మీర్లో ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నవారికి ఇది ఒక షాక్ అని పీపుల్స్ కాన్ఫరెన్స్ చైర్మన్ సజాద్ ఘనీ విమర్శించారు. జస్టిస్ (రిటైర్డ్) రంజనా దేశాయ్ అధ్యక్షునిగా ఉన్న డీలిమిటేషన్ కమిషన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో... మొత్తం 20 జిల్లాలను 30 కేటగిరీలుగా విభజించి, కష్టతరమైన భౌగోళిక పరిస్థితులు, ఇతర దేశాల సరిహద్దుల్లో జీవించడం వంటి విషయాలను దృష్టిలో ఉంచు కుని అదనపు నియోజకవర్గాలను కేటాయించామని తెలియజేసింది. అలాగే జనాభా ప్రాతిపదికన మొదటిసారిగా మొత్తం 90 సీట్లలో 9 సీట్లు ఎస్టీలకు, 7 సీట్లు ఎస్సీలకు కేటాయించాలని ప్రతిపాదించామని కమిషన్ తెలిపింది. వాస్తవానికి 2011 జనాభా గణాంకాలను చూస్తే మొత్తం 90 సీట్లలో కశ్మీర్‌కు ప్రస్తుతం ఉన్న 46 స్థానాలను 51 స్థానాలకు, జమ్మూకు ప్రస్తుత 37 సీట్లను 39కి పెంచాల్సి ఉంది. – ఉమర్ మఖ్బూల్,శ్రీనగర్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్ట్ (‘ది వైర్’ సౌజన్యంతో) -
గాంధీల దేశాన్ని గాడ్సే దేశంగా మారుస్తున్నారు: మెహబూబా ముఫ్తీ
న్యూఢిల్లీ: పీడీపీ చీఫ్, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పాలకులు గాంధీల దేశాన్ని గాడ్సే దేశంగా మారుస్తున్నారని మండిపడ్డారు. గాడ్సే కశ్మీర్‌ను కూడా తయారు చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆమె శనివారం అజెండా ఆజ్‌తక్ చర్చ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తన తండ్రి మెహబూబా ముఫ్తీ సయ్యద్ సీఎంగా ఉన్న సమయంలో కశ్మీరీ పండిట్లకు సౌకర్యాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించారని తెలిపారు. రాజ్యాంగ చట్టానికి వ్యతిరేకంగా 2019లో ఆర్టికల్ 370ని రద్దుచేసి, కొత్త కశ్మీర్‌ను నిర్మించామని బీజేపీ పాలకులు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ప్రతి కూతురు తన తండ్రి మృతదేహం ఎక్కడని అడుగుతోంది. ఓ చెల్లి తన అన్న మృతదేహం కోసం ఎందురు చూస్తోందని అన్నారు. ఈ పరిస్థతులను ప్రశ్నించినవారిపైనే నిందలువేస్తూ విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ఇన్ని జరుగుతున్నా.. పాలకులు మాత్రం ప్రతీసారీ కొత్త కశ్మీర్ అంటూ మాట్లాడుతారని.. కొత్త హిందూస్తాన్ గురించి ఎందుకు మాట్లాడరని సూటిగా ప్రశ్నించారు. ఆర్టికల్ 370 అంటే బయటి వ్యక్తులు భూమిని కొనుగోలు చేయలేరని తెలిపారు. ఉద్యోగాలు స్థానికులకే కేటాయిస్తారని, ఇటువంటి నిబంధనలు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నాయని చెప్పారు. ఆర్టికల్ 370 తాత్కాలిక నిబంధన కాదని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసిందని మెహబూబా ముఫ్తీ గుర్తుచేశారు. -
అభివృద్ధికి విఘాతం కలిగిస్తే సహించం
జమ్మూ: జమ్మూకశ్మీర్ నుంచి ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచి పెట్టేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని హోం మంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. సాధారణ పౌరులను ముష్కరులు హత్య చేస్తున్నారని, ఇలాంటి ఘోరాలకు చరమగీతం పాడుతామని చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో శాంతి, అభివృద్ధికి విఘాతం కలిగిస్తే సహించబోమని హెచ్చరించారు. ఈ ప్రాంతానికి ప్రధాని మోదీ హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. ఇప్పటికే 12,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 2022 నాటికి మరో రూ.51,000 కోట్ల పెట్టుబడులు రప్పిస్తామని, వీటితో జమ్మూకశ్మీర్‌లో 5 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం జమ్మూకశ్మీర్‌కు వచ్చిన అమిత్ షా ఆదివారం భగవతీ నగర్లో ర్యాలీలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత ఏడు దశాబ్దాల పాటు ఇక్కడ పరిపాలన సాగించిన మూడు కుటుంబాలు ప్రజలకు చేసిందేమీ లేదని పరోక్షంగా కాంగ్రెస్, నేషనల్, కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ)పై మండిపడ్డారు. ఈరోజు రూ.15,000 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశానని, ఆ మూడు కుటుంబాలు కలిసి వారి మొత్తం పాలనా కాలంలో ఇలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. అమిత్ షా ఆదివారం జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దును సందర్శించారు. విధి నిర్వహణలో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్లతో సంభాషించారు. మీ కుటుంబాల బాగోగులను నరేంద్ర మోదీ ప్రభుత్వం చక్కగా చూసుకుంటుందని, ఎలాంటి ఆందోళన చెందకుండా దేశ రక్షణ బాధ్యతలను నిర్వర్తించాలని కోరారు. సరిహద్దులోని చిట్టచివరి కుగ్రామం మక్వాల్‌లో అమిత్ షా పర్యటించారు. సరిహద్దు ప్రాంతాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు గ్రామస్తులతో చెప్పారు. ఐఐటీ కొత్త క్యాంపస్ ప్రారంభం రూ.210 కోట్లతో నిర్మించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)–జమ్మూ క్యాంపస్‌ను అమిత్ షా ప్రారంభించారు. -
అక్కడ మరణించినా మొక్కరూపంలో బతుకుతారు!
ఏపీ సెంట్రల్ డెస్క్: హిమాలయ పర్వత సానువుల్లో పచ్చ దనంతో విలసిల్లే ఓ చిన్న గ్రామం ఉంది. 572 హెక్టార్లలో విస్తరించిన ఆ గ్రామం పేరు కలిహంద్. జమ్ముకశ్మీర్‌లోని మారుమూల ప్రాంతమైన దోడా టౌన్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ గ్రామం. ఆ గ్రామం గురించి ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. అక్కడ చనిపోయినవారు మొక్కరూపంలో బతికే ఉంటారు. ఇదెలాగంటే.. అక్కడి వారు ఓ మంచి సంప్రదాయాన్ని పాటించడం వల్ల. ఆ గ్రామంలో ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన వారి కుటుంబ సభ్యులు గ్రామంలో పండ్లను ఇచ్చే ఓ మొక్కను నాటడమే ఆ మంచి సంప్రదాయం. ఆ మొక్క పెద్దది అయ్యే వరకు లేదంటే కాయలు కాసే వరకు దానిని సంరక్షించడం కూడా వారి బాధ్యతే. ఈ సంప్రదాయం గురించి గ్రామంలో ఎవరినడిగినా రెండు మాటలు చెబుతారు. ‘‘ఇదొక పుణ్య కార్యక్రమం’’ ‘‘శాస్త్రాల్లో ఉంది’’ అనేవి ఆ రెండు మాటలు. ఈ సంప్రదాయం తమ గ్రామంలో తరతరాల నుంచి కొనసాగుతోందని గ్రామస్తుడైన 75 ఏళ్ల నాథ్‌రామ్ చెప్పారు. గ్రామ జనాభాలో 75 శాతం ఉన్న హిందువులు ఈ సంప్రదాయం పాటిస్తారన్నారు. ఈ సంప్రదాయంతో ఆ గ్రామం ఓ చిన్న అడవిగా మారి పచ్చదనంతో విలసిల్లుతోంది. మరణాంతర జీవితంపై నమ్మకం సనాతన సంప్రదాయంలో మరణాంతర జీవితంపై నమ్మకాన్ని గ్రామ పురోహితుడు పండిత్ దయారామ్ వివరిస్తూ.. గరుడ పురాణం దీని గురించి స్పష్టంగా చెప్పిందన్నారు. ఓ వ్యక్తి జీవితంలో చేసిన పనులు, మరణాంతరం ఆ వ్యక్తి సంబంధీకులు చేసిన పనులను బట్టి సదరు వ్యక్తి ఆత్మ స్వర్గానికి వెళ్తుందా లేక నరకానికా అనే నిర్ణయం అవుతుందన్నారు. మరణించిన వారి కుటుంబసభ్యులు నాటిన మొక్క అలసినవారు సేదతీరడానికి ఆశ్రయం ఇచ్చినా.. ఆ చెట్టు పండు ఒకరి ఆకలి తీర్చినా అది పుణ్యకార్యక్రమమే అవుతుందని, ఆ పుణ్య కార్యక్రమం మరణానంతరం మోక్షాన్ని కలగజేస్తుందని దయారామ్ వివరించారు. ఆర్థికంగా వెనుకబడినవారి ఇంట్లో ఎవరైనా మరణిస్తే గ్రామంలో మిగతావారంతా ఆ కుటుంబానికి అండగా ఉంటామని మరో గ్రామస్తుడు బాబూరామ్ శర్మ చెప్పారు. అతను నాటిన యాపిల్, ఆప్రికాట్, పియర్ చెట్ల గురించి, వారి కుటుంబ సభ్యుల మరణాలను గురించి ఆయన వివరించారు. కాయలు ఎవరైనా కోసుకోవచ్చు.. చనిపోయిన వారి పేరిట మొక్కలను వారి సొంత స్థలంలోనో, ఒకవేళ స్థలం లేదంటే గ్రామానికి సంబంధించిన ఇతర స్థలంలోనో నాటవచ్చు. పెరట్లోనో, మరోచోటో నాటిన చెట్లను చూసినప్పుడల్లా చనిపోయిన వారి కుటుంబ సభ్యులు తరతరాల పాటు గుర్తుకువస్తారని గ్రామ సర్పంచ్ సునీల్ కుమార్ అన్నారు. చనిపోయిన వారి పేరిట నాటిన మొక్కలు పెద్దవై కాయలు కాస్తే కుటుంబ సభ్యులు వాటిని కోసుకుని తినరు. అవి ఇరుగుపొరుగుకి, ఇతర గ్రామస్తులకు ఉచితంగా పంచుతారు. ఆ చెట్టు నుంచి కుటుంబ సభ్యులు ఎలాంటి లాభాన్ని ఆశించరు. ఆ గ్రామం మీదుగా వెళ్లేవారు ఎవరైనా ఆ కాయలు కోసుకుని తినవచ్చు. దీనికి ఎవరి అభ్యంతరం ఉండదని సర్పంచ్ వివరించారు. కలిహంద్ గురించి తెలుసుకున్న పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఈ సంప్రదాయాన్ని పాటించడానికి మొగ్గు చూపుతున్నారు. ఇతరుల ఆకలి తీర్చడానికి ఉపయోగపడుతున్న ఈ మంచి సంప్రదాయం కొనసాగించడానికి మతాలకతీతంగా ముందుకొస్తున్నారు. -
Jammu Kashmir: జమ్మూలో కాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదుల మృతి
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో బుధవారం భద్రత సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో భద్రత సిబ్బంది ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిచంపారు. కాగా, జమ్మూలోని షోపియన్ జిల్లా డ్రాగడ్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో భద్రత సిబ్బంది కార్డన్ సెర్చ్ నిర్వహించారు. దీంతో ఒక్కసారిగా ఉగ్రవాదులకు, భద్రత సిబ్బందికి మధ్య కాల్పులు సంభవించాయి. గత కొన్ని రోజులుగా టెర్రరిస్ట్‌లు అమాయక వలసకూలీలను టార్గెట్‌గా చేసుకుని కాల్పులు జరుపుతున్నారు. ఈ కాల్పులలో ఇప్పటికే అమాయక కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో భయపడిపోయిన కూలీలు ఇప్పటికే జమ్మూ విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. చదవండి: చదువులో ఒత్తిడి తట్టుకోలేక ఎంత పనిచేసింది.. -
వేలాదిగా కశ్మీర్‌ను వీడుతున్న వలసకూలీలు
జమ్మూ: ఉగ్రమూకలు లక్ష్యంగా చేసుకోవడంతో కశ్మీర్‌లోని వలసకూలీలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని స్వస్థలాలకు పరుగులు తీస్తున్నారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో టిక్కెట్ కౌంటర్ల వద్ద పడిగాపులు పడుతున్నారు. ఉగ్రవాదులు మైనారిటీలను, వలస కూలీలను లక్ష్యంగా చేసుకొని వ్యూహాత్మకంగా దాడులు కొనసాగిస్తుండటంతో ఈనెలలో ఇప్పటిదాకా అమాయకులైన 11 మంది పౌరులు మృతి చెందారు. ఇది భయోత్పాత వాతావరణాన్ని సృష్టించింది. వలసకూలీలు మంగళవారం వేలాదిగా జమ్మూలోని రైల్వేస్టేషన్లకు తరలివచ్చారు. జమ్మూ, ఉదంపూర్‌లలో ముందు జాగ్రత్తగా రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల వద్ద భద్రతను పెంచారు. ప్రతియేటా మూడు నుంచి నాలుగు లక్షల మంది వలస కూలీలు పనిని వెతుక్కుంటూ కశ్మీర్ లోయకు వస్తారు. మార్చిలో వచ్చి నవంబర్‌లో శీతాకాలం ఆరంభంలో వెళ్లిపోతారు. రాతిపని, వడ్రంగి, వెల్డింగ్, వ్యవసాయ కూలీలుగా వీరు పనిచేస్తారు. ఆదివారం కూల్గామ్ జిల్లాలో వలస కూలీల శిబిరాల్లోకి వచ్చి ఉగ్రవాదులు ఇద్దరు కార్మికులను కాల్చి చంపడంతో... ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు భీతిల్లిపోయారు. ఇక్కడుంటే ఏ క్షణం ఎటువైపు నుంచి కాల్పులు జరుగుతాయో, ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తోందోననే భయంతో నిర్ణీత సమయానికి కంటే ముందే కశ్మీర్‌ను వదిలి స్వస్థలాలకు వెళ్లి పోతున్నారు. పరిస్థితిని ప్రధానికి వివరించిన అమిత్ షా న్యూఢిల్లీ: కశ్మీర్లో తాజా పరిస్థితులను వివరించడానికి హోంమంత్రి అమిత్ షా మంగళవారం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. భద్రతను మెరుగుపర్చడానికి కశ్మీర్ అధికార యంత్రాంగం, కేంద్ర హోంశాఖ తీసుకున్న చర్యలను వివరించారు. కశ్మీర్లో ఉగ్రమూకలు సృష్టిస్తున్న భయోత్పాత వాతావరణం, ఫలితంగా కూలీలు పెద్దసంఖ్యలో స్వస్థలాలకు వెళ్లిపోతుండటం వంటి అంశాలను ప్రధాని దృష్టికి తెచ్చారు. కాగా ఈనెల 23 నుంచి 25 వరకు అమిత్ షా జమ్మూ కశ్మీర్లో పర్యటించనున్నారు. భద్రతపై సమీక్షిస్తారు. చదవండి: ఉత్తరాఖండ్‌లో జలవిలయం -
కశ్మీర్‌పై తాలిబన్ల సంచలన వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు కశ్మీర్, భారత్ లేదా మరో ఇతర దేశంలో ముస్లింల హక్కులపై మాట్లాడి తీరుతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింల సమస్యలపై స్పందించే హక్కు తమ కుందన్నారు. తాలిబన్ల పాలనలో అఫ్గన్ భూభాగం దేశంలో వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగపడుతుందనే ఆందోళనల మధ్య తాజా వ్యాఖ్యలు మరింత కలవరం రేపుతున్నాయి. కశ్మీర్‌తోపాటు మరే ఇతర ప్రాంతంలో ఉన్న ముస్లింల స్వరాన్ని వినిపించే హక్కు సాటి ముస్లింలుగా తమకుందని బీబీసీ ఉర్దూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షహీన్ స్పష్టం చేశారు. ముస్లింలు మీ సొంత ప్రజలు, మీ స్వంత పౌరులని చెబుతాం, మీ చట్టాల ప్రకారం వారికీ సమాన హక్కులుంటాయని చెబుతామని వ్యాఖ్యానించారు. కాబూల్‌ను తమ నియంత్రణలోకి తీసుకున్న కొన్ని రోజుల తర్వాత, కాశ్మీర్ ఒక ద్వైపాక్షిక, అంతర్గత విషయమని చెప్పిన దానికి భిన్నంగా తాలిబన్ అధికార ప్రతినిధి తాజా ప్రకటన ఉంది. అయితే ఏ దేశానికీ వ్యతిరేకంగా ఆయుధాలను ప్రోత్సహించే విధానం తమకు లేదన్నారు. చదవండి: Taliban China Friendship: చైనా కీలక హామీ, మరింత మద్దతు మరోవైపు జమ్మూకశ్మీర్‌లో పెరుగుతున్న ఆందోళనల మధ్య, ఈ ప్రాంతంలో భారత ప్రభుత్వం ఇప్పటికే నిఘాను పెంచింది. కాగా అమెరికా ఆధీనంలోని అఫ్గాన్‌కు తాలిబన్ల వల్ల విముక్తి లభించిందని, తదుపరి లక్ష్యం కశ్మీరే అంటూ అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ ఇటీవల సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. -
డీఆర్డీఓ డీ-4 డ్రోన్ టెక్నాలజీతో డ్రోన్ల దాడికి చెక్
కొద్ది రోజుల క్రితం జమ్ము ఎయిర్‌బేస్‌పై డ్రోన్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే, భవిష్యత్ కాలంలో డ్రోన్ల ద్వారా దాడి ఎక్కువ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ దాడులను తిప్పికొట్టేందుకు ఇజ్రాయిల్ తరహా "ఐరన్ డోమ్" వ్యవస్థ రూపొందించాలని దేశంలోని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ డ్రోన్ల దాడులను నివారించేందుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) యాంటీ డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. డీ-4 యాంటీ డ్రోన్ వ్యవస్థ ద్వారా దేశంలోని కీలక రక్షణ కేంద్రాలను రక్షించుకోవచ్చు. డీఆర్డీఓలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్(ఈసీఎస్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ జిల్లెలమూడి మంజుల తెలిపిన వివరాల ప్రకారం.. "డీ-4 డ్రోన్ వ్యవస్థ ఆదివారం జమ్మూలో జరిగిన డ్రోన్ దాడులను ఇది గుర్తించగలదు. 4 కిలోమీటర్ల పరిధిలోని డ్రోన్లను గుర్తించి వాటిపై దాడి చేస్తుంది. అత్యంత దుర్బల ప్రదేశాలపై దాడి చేసే అవకాశం ఉన్న రోగ్ డ్రోన్లను గుర్తించి నాశనం చేయడమే ఈ వ్యవస్థ లక్ష్యం. రోగ్ డ్రోన్లను నాశనం చేయడానికి ఈ వ్యవస్థలో బహుళ సెన్సార్లు, రెండు వేర్వేరు విధ్వంసకర పరికరాలు ఉన్నట్లు" ఆమె తెలిపారు. డి-4 డ్రోన్ వ్యవస్థ ద్వారా శత్రు డ్రోన్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ జామ్ చేయడంతో పాటు, మైక్రో డ్రోన్ల హార్డ్ వేర్ నాశనం చేయగలదని డాక్టర్ మంజుల తెలిపారు. ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో ఈ ఏడాది జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్ సందర్భంగా భద్రత కోసం ఈ డి-4 డ్రోన్ వ్యవస్థను ఉపయోగించారు. డి-4 డ్రోన్ వ్యవస్థతో ప్రమాదకర డ్రోన్ల ఉనికిని త్వరగా గుర్తించి ధ్వంసం చేయడం ద్వారా వాటి దాడుల నుంచి ప్రముఖ ప్రాంతాలను రక్షించుకోవచ్చని ఆమె వివరించారు. చదవండి: ఆకట్టుకుంటున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్ -
ఏకంగా రక్షణ వ్యవస్థనే లక్ష్యం.. డ్రోన్ల దాడిపై ఎన్ఐఏ దర్యాప్తు
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూలో భారత వైమానిక దళం(ఐఏఎఫ్) స్థావరంపై డ్రోన్ల దాడి ఘటనను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తునకు ఆదేశిస్తూ హోం శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌పై ఉగ్రవాదులు డ్రోన్లతో దాడికి దిగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ దాడి దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఏకంగా రక్షణ వ్యవస్థనే లక్ష్యంగా చేసుకున్న ముష్కరులను పట్టుకుని చట్టం ముందు నిలబెట్టేందుకే దర్యాప్తు బాధ్యతలను ఎన్ఐఏకు అప్పగించినట్లు హోం శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. జమ్మూ విమానాశ్రయానికి సమీపంలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌పై పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు ఆదివారం అర్థరాత్రి డ్రోన్లతో దాడికి దిగిన విషయం తెలిసిందే. లష్కరే టాప్ కమాండర్ అబ్రార్ హతం ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా టాప్ కమాండర్ నదీమ్ అబ్రార్ మంగళవారం హతమయ్యాడు. సోమవారం భద్రతాబలగాలు అబ్రార్‌ను అదుపులోకి తీసుకున్నాయి. అతడిని తీసుకుని వెళ్లి మంగళవారం మలూరాలోని ఓ ఇంటిని చుట్టుముట్టగా ఆ ఇంట్లో నక్కి ఉన్న పాక్ ఉగ్రవాది కాల్పులకు దిగాడు. ఎదురు కాల్పుల్లో ముగ్గురు జవాన్లు గాయపడగా అబ్రార్ మృతి చెందాడు. చదవండి: డ్రోన్లను గుర్తించి పేల్చేసే సాంకేతికత! Agni-Prime: భారత దేశ సరికొత్త ఆయుధం ఇదే! -
ఉగ్రవాదుల కొత్త ఎత్తుగడ
ఉగ్రవాద మహమ్మారి ఎక్కడ, ఎప్పుడు విరుచుకుపడుతుందో ఎవరూ చెప్పలేరు. ఇన్నాళ్లూ నగరాల్లోని జనసమ్మర్థం వున్న ప్రాంతాల్లో పేలుళ్లకు పాల్పడటం, భద్రతా దళాలపై పొంచివుండి దాడులు చేయడం వంటి పనులకు పాల్పడుతున్న ఉగ్రవాదులు తొలిసారి డ్రోన్లు ఉపయోగించి బాంబు పేలుళ్లు జరిపారు. ఆదివారం జమ్మూ విమానాశ్రయం ఆవరణలో వున్న వైమానిక దళ స్థావరంపై వారు డ్రోన్లతో చేసిన బాంబు దాడి తీవ్రత పెద్దగా లేకపోవచ్చు. వైమానిక దళ సిబ్బందిలో ఇద్దరికి స్వల్ప గాయాలు కావటం, ఒక భవనం పైకప్పు ధ్వంసం కావడం మినహా పెనునష్టం జరిగి వుండకపోవచ్చు. కానీ కాటేయడానికి వారు కొత్త మార్గం ఎంచుకున్నారని, మన భద్రతా బలగాలు ఇకపై ఈ బెడదను కూడా ఎదుర్కొనక తప్పదని ఈ దాడి నిరూపించింది. వైమానిక స్థావరంపై దాడి జరిగిన మరికొన్ని గంటలకు జమ్మూలోనే మరో సైనిక ప్రాంతంపై ఇలాంటి దాడికే ఉగ్రవాదులు తెగబడ్డారు. అయితే వెంటనే క్విక్ రియాక్షన్ టీం సభ్యులు అప్రమత్తం కావటంతో ఆ రెండు డ్రోన్లూ తప్పించుకున్నాయి. వాస్తవానికి వైమానిక దళ స్థావరంపై జరిగిన దాడిలో ఉగ్రవాదుల లక్ష్యం నెరవేరినట్టయితే భారీ నష్టం వాటిల్లేది. ఎందుకంటే అక్కడి హ్యాంగర్‌లో యుద్ధ విమానాలు, ఎంఐ 17 హెలికాప్టర్లు, డోన్లు ఉన్నాయి. పైగా ఆ స్థావరానికి దగ్గరలో నివాస ప్రాంతా లున్నాయి. డ్రోన్ల ద్వారా ప్రయోగించిన పేలుడు పదార్థాలు అక్కడ జారవిడిచివుంటే జన నష్టం అధికంగా వుండేది. ఉగ్రవాదులు, ఇతర రాజ్యేతర శక్తులూ డ్రోన్ల ద్వారా దాడి చేసే ప్రమాదం వున్నదని కొంత కాలంగా నిపుణులు హెచ్చరిస్తూనే వున్నారు. తాజా దాడి వెనక ఏ సంస్థ హస్తం ఉందో, ఇందులో ఇంటి దొంగల ప్రమేయం ఏపాటో దర్యాప్తులో తేలుతుంది. సాధారణంగా సైనిక స్థావరాలు అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో వుంటాయి. చుట్టూ భారీ కుడ్యాలు, వాటిపై విద్యుత్ తీగలు, చాలా దూరం నుంచే శత్రువుల కదలికలు తెలిసేలా నిఘా వగైరాలుంటాయి. వైమానిక, హెలికాప్టర్ దాడులు జరగకుండా రాడార్ వ్యవస్థ ఉ#ంటుంది. కానీ మారిన పరిస్థితుల్లో ఇవి ఎంతమాత్రం సరిపోవని తాజా దాడి హెచ్చరించింది. గగనతలంలో ఎగిరే విమానాలనూ, హెలికాప్టర్లను పసిగట్టినంత తేలిగ్గా, తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్లను ఈ రాడార్లు పోల్చుకోలేవు. దరిదాపు రూ. 20,000 వ్యయంతో లభించే డ్రోన్లు పటిష్ఠమైన భద్రత వుండే ప్రాంతాల్లోకి సైతం ఎలా చొచ్చుకురాగలవో, అవి ఏ స్థాయిలో నష్టం కలగజేయగలవో జమ్మూ దాడి తేటతెల్లం చేసింది. 20 కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణించే డ్రోన్లు మొదలుకొని వేలాది కిలోమీటర్ల దూరం వెళ్లగలిగే సైనిక డ్రోన్లు ఇప్పుడు లభ్యమవుతున్నాయి. ఇవి రెండురోజులు ఏకబిగిన ప్రయాణించి రాకెట్లనూ, క్షిపణులనూ కూడా మోసుకెళ్లి జారవిడవగలవని చెబుతున్నారు. ఈమధ్యకాలంలో మారు మనసు తెచ్చుకున్నట్టు కనబడుతున్న పాకిస్తాన్ ప్రమేయం లేకుండా ఈ దాడులు జరిగి వుంటాయని భావించలేం. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) ఆంక్షల పరిధినుంచి తప్పించుకోవటానికో, అమెరికా ఒత్తిడి వల్లనో ఇటీవలకాలంలో అది తగ్గివున్నట్టు కనబడుతోంది. అధీన రేఖ వద్ద గతంలో మాదిరి మన సైన్యంపై, పౌర ప్రాంతాలపై అది కాల్పులు జరపడాన్ని విరమించుకుంది. సరిహద్దుల్లో చొరబాట్లు కూడా గణనీయంగా తగ్గి పోయాయి. అమెరికా ప్రమేయంతో భారత్, పాకిస్తాన్ల మధ్య లోపాయికారీగా జరిగిన చర్చల ఫలితంగానే ఈ మార్పు కనబడుతోందని విశ్లేషకులు అంటున్నారు. కానీ అంతమాత్రం చేత అది వెనకటి గుణం మానుకోదు. జమ్మూ–కశ్మీర్లో సాధారణ పరిస్థితి ఏర్పడటానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్న సూచనలు కనబడటం పాక్‌కు ససేమిరా ఇష్టం లేదు. తమ ప్రమేయం లేకుండానే అక్కడ దాడులు జరుగుతున్నాయని ప్రపంచ దేశాలకు అభిప్రాయం కలిగిం చటమే దాని లక్ష్యం. ఇప్పుడు దాడికి ఉపయోగించిన డ్రోన్ల వంటివి సరిహద్దుల్లో గత రెండేళ్లుగా పాకిస్తాన్ వినియోగించటం, వాటి ద్వారా ఆయుధాలను, పేలుడు పదార్థాలనూ జారవిడవటం మన సైన్యానికి కొత్తగాదు. అయితే ప్రస్తుత దాడిలో తన ప్రమేయం లేదని చెప్పుకోవటానికి పాకిస్తాన్‌కు అన్ని రకాల అవకాశాలూ వున్నాయి. దాడి జరిగిన ప్రాంతం సరిహద్దుకు 14 కిలోమీటర్ల దూరంలోవున్నా, డ్రోన్ల కదలికలను వైమానిక దళ స్థావరం సమీప ప్రాంతంనుంచి నియంత్రించి వుండొచ్చని అంచనా. కనుక స్థానికంగా వున్నవారే దాడికి పాల్పడివుంటారని చెప్పటానికి, అమా యకత్వం నటించటానికి పాకిస్తాన్‌కు వీలుంటుంది. పాకిస్తాన్లో పేరుకు ప్రజా ప్రభుత్వం సాగు తున్నా వెనకుండి నడిపించేదంతా సైన్యమూ, దాని ప్రధాన అంగమైన ఇంటర్ సర్వీస్ ఇంటెలి జెన్స్(ఐఎస్ఐ). యెమెన్‌లో తమపై తరచు దాడులు చేస్తున్న సౌదీ అరేబియాపై కక్ష తీర్చుకునేందుకు హౌతీ తిరుగుబాటుదార్లు సౌదీలోని కీలక చమురు కేంద్రాలపైనా, చమురు సరఫరా జరిగే పైప్లైన్లపైనా దాడులు చేస్తున్నారు. కొన్నిసార్లు భారీ నష్టం కలగజేస్తున్నారు. ఇలాంటి పరిణామాలు మన అప్రమత్తతను మరింత పెంచాలి. మన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) రూపొందించిన సాంకేతికతను అందుబాటులోకి తెచ్చుకోవటంతోపాటు సాధ్యమైనంత త్వరగా ఇజ్రాయెల్ సైనిక డ్రోన్లను కూడా రప్పించాలి. కొత్త సవాళ్లకు దీటైన వ్యవస్థ వేగిరం అందుబాటు లోకొస్తేనే ఉగ్రమూకల దాడులకు దీటుగా జవాబివ్వటం సాధ్యమవుతుంది. -
పుల్వామాలో ఉగ్రదాడి కలకలం
జమ్మూకశ్మీర్: పుల్వామా జిల్లాలో ఉగ్రదాడి కలకలం సృష్టించింది. ఎస్పీఓ ఫయాజ్ అహ్మద్ ఇట్లోకి చొరబడిన ఉగ్రవాదులు ఆయనపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఫయాజ్ భార్య, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురిని ఆసుపత్రికి తరలించగా.. ఫయాజ్ అహ్మద్, ఆయన భార్య మరణించారు. కుమార్తెను శ్రీనగర్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక దుండగుల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. కాగా, శ్రీనగర్‌లోని మెంగన్‌వాజీ నౌగాం ప్రాంతంలో ప్రార్థనలకు వెళ్లే సమయంలో మరో పోలీసు అధికారి పర్వైజ్ అహ్మద్ దార్‌పై ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులు మంగళవారం కాల్పులు జరిపారు. అలాగే గత నెలలో జావైద్ అహ్మద్ అనే పోలీసు అధికారిపై తన నివాసం సమీపంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగపడ్డారు. వీరిద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. చదవండి: రైతులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోండి అణచివేత శకం ముగియాలి -
కశ్మీర్‌పై అమిత్‌షా ప్రత్యేక భేటీ
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో అమలవుతున్న అభివృద్ధి ప్రాజెక్టులపై హోం మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ భేటీలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతోపాటు ఎన్ఎస్ఏ (జాతీయ భద్రతా సలహాదారు) అజిత్ దోవల్, హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఐబీ (ఇంటెలిజెన్స్ బ్యూరో) డైరెక్టర్ అర్వింద్ కుమార్, రా (రీసెర్చి అండ్ అనాలిసిస్ వింగ్) చీఫ్ సామంత్ కుమార్ గోయెల్, సీఆర్పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్, కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్ సమగ్రాభివృద్ధి, ప్రజల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తుందని అమిత్ షా ఈ సందర్భంగా అన్నారు. కశ్మీర్లో కోవిడ్ వ్యాక్సినేషన్ 76% వరకు పూర్తి చేసిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు ఆయన అభినందనలు తెలిపారు. కశ్మీర్‌లోని నాలుగు జిల్లాల్లో 100% వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. పీఎం కిసాన్ యోజన, కిసాన్ క్రెడిట్ కార్డులు తదితర పథకాల ప్రయోజనాలను కశ్మీర్ ప్రాంత రైతులకు అందేలా చూడాలని అమిత్ షా కోరారు. పారిశ్రామిక విధానం ప్రయోజనాలను చిన్న తరహా పరిశ్రమలు అందుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగా ఎన్నికైన పంచాయతీ సభ్యులకు శిక్షణ అందించాలనీ, దేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన పంచాయతీల్లో వారు పర్యటించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. -
యాచకురాలి వద్ద 2.58 లక్షలు నగదు
జమ్మూ: 65 ఏళ్ల యాచకురాలిని పునరావాస కేంద్రానికి తరలించిన తర్వాత ఆమె నివసించిన స్థలంలో ఏకంగా రూ. 2.58 లక్షల నగదు లభించిన ఘటన జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో చోటు చేసుకుంది. నగరంలోని వెటర్నరీ ఆస్పత్రి వద్ద తాత్కాలిక షెల్టర్ వద్ద ఓ వృద్ధురాలు గత 30 ఏళ్లుగా జీవిస్తోంది. ఆమెను మెరుగైన పునరావాస కేంద్రానికి తరలించాక ఆ షెల్టర్‌ను శుభ్రం చేస్తుండగా డబ్బు దొరికిందని అదనపు డిప్యూటీ కమిషనర్ సుఖ్‌దేశ్ సింగ్ సమ్యాల్ చెప్పారు. డబ్బు దాచుకున్న యాచకురాలు ఎవరో తెలియదని పేర్కొన్నారు. మున్సిపల్ కమిటీ మంగళవారం ఆ స్థలాన్ని ఖాళీ చేయిస్తుండగా.. సంచుల్లో నోట్లు, నాణేలు దొరికాయని అన్నారు. మొత్తం లెక్కించగా రూ.2,58,507 ఉన్నట్లు అధికారులు తేల్చారు. డబ్బును యాచకురాలికే చేరేలా చూస్తామని సుఖ్‌దేశ్ చెప్పారు. నిజాయతీతో వ్యవహరించిన మున్సిపల్ కమిటీని అభినందించారు -
కరోనా రోగుల కోసం బోట్ అంబులెన్స్ సేవలు
శ్రీనగర్: కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రముఖులు, సెలబ్రెటీలు, మల్టీనేషనల్ కంపెనీలు భారీ మొత్తంలో విరాళాలను ఇచ్చాయి. చాలామంది కరోనా బాధితులకు తమవంతు సహాయం చేస్తున్నారు. నిరుపేదలు కూడా సేవలో తామున్నామంటున్నారు. ఎంతో మంది మానవతా మూర్తులు పెద్ద మనస్సును చాటుకుంటున్నారు. కశ్మీర్లో తారిక్ అహ్మద్ పట్లూ అనే యువకుడు తన పడవను అంబులెన్స్‌గా మార్చి దాల్ సరస్సులో సేవలందిస్తున్నాడు. అతడి సేవకు జనాలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో నివసించే తారిక్ అహ్మద్ పట్లూ అనే యువకుడు ఈమధ్యే కరోనా మహమ్మారి బారిన పడ్డాడు. తారిక్కు కరోనా వచ్చినప్పుడు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు. కోలుకున్నాక కూడా ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లేందుకు ఎవరూ పడవలోకి ఎక్కనివ్వలేదు. కారణం కరోనా భయం. కరోనా సెకండ్ వేవ్‌లో ప్రజలు పడుతున్న కష్టాలేంటో స్వయంగా అనుభవించాడు. అప్పట్లో తారిక్ పట్లూ… 20 రోజులు ఇంట్లో క్వారంటైన్ అయ్యాడు. అప్పుడప్పుడూ ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చేది… అయితే ఎవరు కూడా తనను పడవ ఎక్కనిచ్చేవారు కాదు. పడవ నడిపే తన తోటి వారే పడవలోకి ఎక్కించుకోవడానికి భయపడటం చూసి… పట్లూ బాధపడేవాడు. కానీ వారికి ఓ కుటుంబం ఉంటుందని అర్థం చేసుకున్నాడు. దాంతో తనకున్న పడవను అంబులెన్సుగా మార్చేశాడు. దాల్ సరస్సులో పర్యాటకులను తిప్పి ఆ డబ్బులతో జీవించే తారిక్ తన పడవను అంబులెన్స్‌గా మార్చి సేవలందిస్తున్నాడు. కరోనా రోగులను తన పడవలో తీసుకెళ్తున్నాడు..అంతేకాకుండా వారికి ఏం కావాలో తెలుసుకుని మరీ సహాయం చేస్తున్నాడు. తన ఫోన్ నంబర్ ఇచ్చి ఏం సహాయం కావాలన్నా తన శక్తి మేరకు చేసి పెడతానని భరోసా కల్పిస్తున్నాడు. తారిక్ రూపాయి రూపాయి కూడబెట్టాడు. కొంత అప్పు చేశాడు. అలా ఆయన పడిన కష్టానికి ఏప్రిల్‌లో ఓ రూపం వచ్చింది. దాల్ సరస్సులో తేలియాడే పడవ కాస్తా అంబులెన్స్‌గా మారిపోయింది. వాటర్ అంబులెన్స్ సిద్ధం అయ్యింది. ఈ పడవ అంబులెన్స్ లో పీపీఈ కిట్స్, స్ట్రెచర్స్ ఉన్నాయి. వీల్ చైర్ కూడా ఉంది. దీంతో కరోనా రోగులను ఆస్పత్రులకు తీసుకెళ్లడం తేలికైంది. కాగా..శ్రీనగర్‌కి పర్యాటకులు పెద్ద సంఖ్యలో రావడంతో… అక్కడ కరోనా కేసులు పెరిగాయి. ఏప్రిల్ 25న శ్రీనగర్‌లోని తులిప్ గార్డెన్ తెరవడంతో కేసులు మరింత ఎక్కువయ్యాయి. ఆ రోజు 131 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటివరకు జమ్మూకశ్మీర్‌లో 2.29 లక్షల కరోనా కేసులు నమోదు కాగా.. 1.75 లక్షల మంది కోలుకున్నారు. 2,912 మంది మరణించారు. (చదవండి: ఆనంద్ మహీంద్ర: ‘‘చాలా మంది పాత రోజులనే ఇష్టపడుతున్నారు’’) -
Imran Khan: కశ్మీర్‌పై నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటేనే..
ఇస్లామాబాద్: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునే దాకా భారత్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ స్పష్టం చేశారు. ‘జమ్మూకశ్మీర్ ఐక్యరాజ్యసమితి ఎజెండాలో ఉంది. దీనిపై భద్రతా మండలి పలు తీర్మానాలు కూడా చేసింది. అందుకే కశ్మీర్ భారత్ అంతర్గత అంశం కాదు’అని ఆయన మీడియాకు తెలిపారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడంతో పాటు, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ భారత ప్రభుత్వం 2019లో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఈ రెండు పొరుగు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. (చదవండి: చైనా జనాభాలో స్వల్ప పెరుగుదల) -
అతని బుల్లెట్ గాయం..వికలాంగ విద్యార్థులకు వరం!
జీవితం అందరికీ పూలపాన్పులా ఉండదు. మనం వెళ్లే దారిలో ముళ్లు, రాళ్లు గుచ్చుకుంటాయి. వాటిని తీసేస్తూ..గాయాలు చిత్రవధ చేస్తున్నా ముందుకుసాగాల్సిన గడ్డు పరిస్థితులు ఎన్నో ఎదురవుతాయి. వీటన్నింటినీ దాటుకుని జీవితాన్ని నిలబెట్టుకునే వారు మన సమాజం లో ఎందరో ఉన్నారు. ఈ కోవకు చెందినవారే కశ్మీర్‌కు చెందిన జావేద్ అహ్మద్ తక్. ఉగ్రదాడి లో తన జీవితాన్నీ కోల్పోయినప్పటికీ నిరాశా నిస్పృహలలో కూరుకుపోకుండా తన జీవితాన్నీ నిలబెట్టుకుని.. తనలాగా అంగవైకల్యంతో బాధపడుతోన్న పిల్లలకు చదువు చెబుతూ ధైర్యాన్ని నూరిపోస్తున్నారు జావేద్. అది 1997 జావేద్ బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అనంతనాగ్‌లో తన అంకుల్ ఇంట్లో జావేద్ ఉండగా అర్ధరాత్రి ఆ ఇంటిపై ముష్కరులు దాడిచేశారు. ఆ సమయంలో తన కజిన్‌ను కాపాడేందుకు ప్రయత్నించిన జావేద్‌కు బుల్లెట్ తగిలింది. బుల్లెట్ వెన్నుపూసకు తగలడంతో మూత్రపిండాలు, క్లోమం, పేగులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో ఆసుపత్రిలో ఒక సంత్సరంపాటు చికిత్స తీసుకున్న తరువాత 1998లో జావేద్ డిశ్చార్జ్ అయ్యాడు. ఆ తరువాత కూడా కదలలేని పరిస్థితుల్లో మరో మూడేళ్లు మంచానికే పరిమితమయ్యాడు. అలా మంచం మీద ఉన్న జావేద్‌కు తన ఇంటిపక్కన పిల్లలు అరుస్తూ ఆడుకుంటున్న శబ్దాలు వినపడేవి. అలా వింటూ 2000 సంవత్సరంలో ఆ పిల్లలందరికి ఉచితంగా చదువు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అప్పటినుంచి తనను తాను మోటివేట్ చేసుకుంటూ..పిల్లలకు ఎలా చదువు చెప్పాలి వంటి అంశాలపై ఆలోచించి ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలనుకున్నాడు. జెబాఅపా.. 2006లో అంగవైకల్యంతో బాధపడే పిల్లల కోసం ఒక అద్దె భవనంలో ‘జెబాఅపా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌క్లూసివ్ ఎడ్యుకేషన్’ పేరిట స్కూలును ప్రారంభించాడు జావేద్. తన బంధువులు, స్నేహితులు చుట్టపక్కల ఊళ్లలోని అంగవైకల్యం కలిగిన పిల్లలను జెబాఅపాలో చేర్చేవారు. జావేద్ మరికొంతమంది టీచర్లను నియమించుకుని స్కూలును నడపడం ప్రారంభించాడు. స్కూల్‌తోపాటు తనూ.. మధ్యలో ఆపేసిన చదువును కొనసాగించాడు. ఈ క్రమంలోనే 2007లో కశ్మీర్ యూనివర్సిటీలో సోషల్ వర్క్‌లో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. మొదట్లో ప్రాథమిక తరగతులకే పరిమితమైన జెబా స్కూలు తరువాత ఎనిమిదో తరగతివరకు పొడిగించారు. 120 మంది వికలాంగ విద్యార్థులు 25 మంది టీచర్లతో స్కూలును విజయవంతంగా నడిపిస్తున్నారు. స్పెషల్లీ ఏబుల్డ్ (వికలాంగులు) విద్యార్థులు కావడం తో వారికి ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా చదువు చెప్పడంతోపాటు, స్పీచ్ థెరపిస్టులతో పాఠాలు నేర్పిస్తున్నారు. సిలబస్‌ను ప్రత్యేకంగా రూపొందించి, పిల్లలకే కాకుండా టీచర్లకు కూడా జావేద్ శిక్షణ ఇస్తున్నాడు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందకపోయినప్పటికీ దాతలు ఇచ్చిన విరాళాలు, ఎన్జీవోల సాయంతో స్కూల్‌ను నడుపుతున్నట్లు జావేద్ చెప్పాడు. జావేద్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు ఉన్నత చదువులు చదవడంతోపాటు, క్రీడల్లోనూ రాణిస్తూ పతకాలను సాధిస్తున్నారు. హ్యుమానిటీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ జావేద్ ఒక్క స్కూలేగాక హ్యుమానిటీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్‌ను కూడా సంస్థను స్థాపించి వైద్యం కొనుక్కోలేని నిరుపేద మహిళలకు ఉచితంగా వైద్యాన్నీ అందిస్తున్నారు. పుస్తకాలు, యూనిఫామ్, స్టేషనరీ వంటి వాటిని సేకరించి నిరుపేద విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నారు. కరోనా సమయంలోనూ ఈ ఆర్గనైజేషన్ ద్వారా అనేక సహాయ కార్యక్రమాలను చేపట్టారు. తన జీవితంలో జరిగిన ఒక అతిపెద్ద విషాద ఘటనను ఎంతో ధైర్యంగా ఎదుర్కొని.. సమాజానికి మేలు చేసేందుకు కృషి చేస్తోన్న జావేద్‌ను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. జావేద్ మాట్లాడుతూ...‘‘ప్రారంభంలో మా స్కూలుకు బాలికలను పంపేందుకు తల్లిదండ్రులు ఇష్టపడేవారు కాదు. తర్వాత వారితో నేను మాట్లాడి ఒప్పించడంతో ఎంతో ధైర్యంగా అమ్మాయిలను స్కూలుకు పంపిస్తున్నారు. ప్రస్తుతం స్కూల్లో 200 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. వీరికోసం రెండు బస్సులు కొనుగోలు చేశాం. అవి సరిపోవడం లేదు. అందువల్ల కొంతమంది పిల్లలకి స్కూల్ వద్ద వసతి కల్పిస్తున్నాం. అనేక అవరోధాలు ఎదుర్కొంటూ ఒక్కో వసతిని స్కూలుకు సమకూరుస్తున్నాం. హయ్యర్ సెకండరీ లెవల్‌కు స్కూలు ఎదుగుతుంది’’ అని ఆశిస్తున్నట్లు జావేద్ చెప్పాడు. ‘‘బుల్లెట్ గాయం వల్ల నేను జీవితాన్నే కోల్పోయాను. ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా కింద కేవలం 75 వేల రూపాయలను ఇచ్చింది. కానీ ఆ సమయంలో నా చికిత్సకు లక్షల్లో ఖర్చయింది. ఆ విషాదం జరగాలని రాసి ఉంటే ఏం చేయగలం. అది జరిగిపోయింది. అక్కడే ఆగిపోతే మిగతా జీవితం కూడా చీకటైపోతుంది. అందుకే నాలాగా ఇబ్బంది పడే వికలాంగులకు చేయూతనిస్తూ ముందుకు సాగుతున్నాను’’ అని జావేద్ చెప్పాడు. -
మీటింగ్‌పై ఉగ్రదాడి: కాల్పుల్లో ఇద్దరు మృతి
సోపోర్: ప్రజాప్రతినిధులు, అధికారులే టార్గెట్‌గా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేశారు. సమావేశం కొనసాగుతున్న సమయంలో కాల్పులు చేయడంతో అందరూ పప్రాణభయంతో పరుగులు ఎత్తారు. ఈ సమయంలో జరిగిన కాల్పుల్లో ఓ కౌన్సిలర్, మరో వ్యక్తి మృత్యువాత పడ్డారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే చైర్పర్సన్ మాత్రం త్రుటిలో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన జమ్మూకశ్మీర్‌లో జరిగింది. సోపోర్ ప్రాంతంలో బ్లాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (బీడీసీ) ప్రతినిధులు సోమవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చైర్పర్సన్ ఫరీదా ఖాన్ (బీజేపీ), ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. చర్చిస్తున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులు పప్రారంభించారు. కాల్పులు జరగడంతో ఆమె వెంటనే ఆస్పత్రిలోకి వెళ్లారు. కాల్పుల్లో గాయపడిన కౌన్సిలర్ రియాజ్ అహ్మద్, పోలీస్ అధికారి షవకాత్ అహ్మద్ మృతి చెందారు. ఈ దాడుల్లో ఒక పౌరుడు గాయపడ్డాడు. -
ఇంటర్నెట్ షట్‌డౌన్: నెంబర్ 1 గా నిలిచిన భారత్
సాక్షి, న్యూఢిల్లీ: ఇంటర్నెట్ లేకుండా రోజు గడవని పరిస్థితులు నెలకొన్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఫోన్లకు అతుక్కు పోతున్నారు. ఇంటర్నెట్తో సాంకేతికంగా ఎన్నో అద్భుతాలు చోటుచేసుకుంటున్నప్పటికీ అంతే స్థాయిలో మానవ సంబంధాలపై చెడు ప్రభావం పడుతోంది. ఇక కరోనా పుణ్యామాని గతేడాది అందరికీ కష్టంగా గడిచింది. అడుగు బయట పెట్టని పరిస్థితుల్లో అధిక స్థాయిలో ఇంటర్నెట్ వినియోగం జరిగింది. అయితే, 2020లో భారత్ అత్యధికంగా ఇంటర్నెట్ షట్డౌన్లను చూసినట్టు ఓ నివేదిక వెల్లడించింది. శాంతి భద్రతల పరిరక్షణ, ఇతర కారణాలతో భారత్‌లో ఇంటర్నెట్ను నిలిపివేసినట్టు తెలిపింది. పోయిన ఏడాది అత్యధికంగా ఇంటర్నెట్ షట్‌డౌన్ చేసిన 29 దేశాల జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఇంటర్నెట్ నిలుపుదల సంఘటనలు మన దేశంలో జరగగా, కొన్ని మధ్యప్రాచ్య దేశాలు, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 155 ఇంటర్నెట్ షట్డౌన్లు విధించగా, వీటిలో 109 ఇంటర్నెట్ షట్ డౌన్లు కేవలం భారత్‌లోనే ఉన్నాయి. యాక్సెస్ నౌ నివేదిక ప్రకారం, 2019లో కూడా అత్యధికంగా 121 సార్లు ఇంటర్నెట్ నిలిపివేయగా, వెనిజులాలో 12 , యెమెన్‌లో 11, ఇరాక్ లో 8, అల్జీరియాలో 6, ఇథియోపియాలో 4 సార్లు ఇంటర్నెట్ను నిలిపివేశారు. భారత ప్రభుత్వం 2020లో 109 సార్లు ఇంటర్నెట్ను నిలిపివేయగా, గత రెండేళ్ళలో పోల్చితే ఈ సంఖ్య తక్కువగా ఉంది. జమ్మూ కాశ్మీర్లో ఆగస్టు 2019 నుంచి శాశ్వతంగా ఇంటర్నెట్ను నిలిపివేయగా తిరిగి ఇంటర్నెట్ను 18 నెలల తరువాత పునరుద్ధరించారు. ముఖ్యంగా, పశ్చిమ బెంగాల్లో, పశ్చిమ బెంగాల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ రాష్ట్ర ప్రభుత్వ హోంశాఖ గతంలో మాధ్యమిక్ (మాధ్యమిక పాఠశాల) పరీక్షల సమయంలో కర్ఫ్యూ తరహా ఇంటర్నెట్ బ్లాక్అవుట్ను ప్రవేశపెట్టింది, ప్రతిరోజూ కొన్ని గంటలపాటు ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపారు. ఈ ఇంటర్నెట్ కర్ఫ్యూ తొమ్మిది రోజులకు పైగా కొనసాగిందని నివేదిక పేర్కొంది. భద్రతా పరంగా సున్నిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో దాదాపు రెండేళ్లుగా హైస్పీడ్ ఇంటర్నెట్ లేకుండా పోయింది. ఫిబ్రవరి 2021 లో జమ్మూ కాశ్మీర్లో 4 జి ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించే ముందు జమ్మూ కాశ్మీర్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఆ సమయంలో, కశ్మీర్ ప్రజలు 2 జి ఇంటర్నెట్ సేవలను మాత్రమే పొందగలిగారు. -
సైనికుల కోసం సోలార్ టెంట్లు
దేశ రక్షణ కోసం సైనికులు ఎండకు, వానకు, చలికి తట్టుకొని అత్యంత కఠిన పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తారు. జమ్ము కాశ్మీర్, శ్రీనగర్, లడక్ వంటి ప్రాంతాల్లో శీతాకాలంలో గడ్డ కట్టే చలిలో విధులు నిర్వహించాలంటే కత్తి మీద సాములాగా ఉంటుంది. ఏ కొంచెం అజాగ్రత్తగా ఉన్న ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ఒకొక్కసారి ఇక్కడ చలికి సైనికులు ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. అయితే ఇప్పటి వరకూ సైనికుల క్యాంపుల్లో వాడే టెంట్లు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ '3 ఇడియట్స్'సినిమాలోని 'ఫన్సుఖ్ వాంగ్డు' పాత్ర వెనుక ఉన్న వ్యక్తి సోనమ్ వాంగ్‌చుక్. ఈ సోనమ్ వాంగ్‌చుక్ లడఖ్ లాంటి ప్రాంతంలో ఉన్న ఆర్మీ జవాన్లకు వెచ్చదనం కోసం ఒక పరిష్కారం కనుగొన్నారు. అతను ఒకేసారి 10 మంది జవాన్లకు వసతి కల్పించే సౌరశక్తితో నడిచే పోర్టబుల్ సైనిక గుడారాన్ని నిర్మించాడు. గాల్వన్ వ్యాలీ వంటి ప్రాంతాలలో రాత్రి 10 గంటలకు గుడారం బయట మైనస్ 14 డిగ్రీలు ఉన్నప్పటికీ గుడారం లోపల సుమారు 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందని తెలిపారు. 10మంది జవాన్లకు వసతి కల్పించే విధంగా ఈ టెంట్ ను తయారు చేశారు. దీని బరువు 30 కిలోల కన్నా తక్కువ ఉంటుంది. ఈ సోలార్ టెంట్ పూర్తిగా పోర్టబుల్. కనుక సైనికులకు ఈ టెంట్ అత్యంత శీతల ప్రాంతాల్లో కూడా ఉపయోగపడుతుందని వారు సురక్షితంగా సోనమ్ ఉంటారని చెప్పారు. SOLAR HEATED MILITARY TENT for #indianarmy at #galwanvalley +15 C at 10pm now. Min outside last night was -14 C, Replaces tons of kerosesne, pollution #climatechange For 10 jawans, fully portable all parts weigh less than 30 Kgs. #MadeInIndia #MadeInLadakh #CarbonNeutral pic.twitter.com/iaGGIG5LG3 — Sonam Wangchuk (@Wangchuk66) February 19, 2021 చదవండి: వాహనదారులకు కేంద్రం తీపికబురు '5జీ'తో ఐటీ దిగ్గజాలకు కాసుల పంట -
ఎన్కౌంటర్: ముగ్గురు లష్కరే ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లా బుద్గాం ప్రాంతంలో గురువారం అర్దరాత్రి ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. అలాగే భారత్ జవాన్ మృతి చెందగా, మరో జవాన్‌కు గాయాలయ్యాయి. షోపియాన్ ప్రాంతంలోని బడిగాంలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు జమ్మూకశ్మీర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో జమ్మూకశ్మీర్ పోలీసులు సైనికులు, సీఆర్పీఎఫ్ బలగాలతో కలిసి గురువారం అర్దరాత్రి కార్డన్ సెర్చ్ ప్రారంభించారు. ఒక ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు వారిని గాలిస్తున్న భద్రతా బలగాలపై కాల్పులకు దిగారు. దీంతో జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు మరణించారని పోలీసులు చెప్పారు. యూరప్, ఇస్లామిక్ దేశాల ప్రతినిధులు, రాయబారుల బృందం జమ్మూకశ్మీర్ లో సందర్శిస్తున్న సమయంలో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్ స్థలంలో పోలీసులు ఉగ్రవాదుల కోసం శుక్రవారం ఉదయం కూడా గాలింపు కొనసాగిస్తున్నారు. చదవండి: ఏనుగులు దాడి: యువకుడి మృతి గల్వాన్ ఘటన: తొలిసారి వివరాలు వెల్లడించిన చైనా -
విషాదం: కుప్పకూలిన హెలికాప్టర్
శ్రీనగర్: దేశమంతా 72వ గణతంత్ర దినోత్సవ సంబరాల్లో మునిగితేలుతున్న తరుణంలో జమ్మూ కశ్మీర్లో జరిగిన దుర్ఘటన విషాదాన్ని నింపింది. కతువా జిల్లాలో హెలికాప్టర్ కూలిపోవడంతో ఆర్మీ పైలట్ దుర్మరణం చెందారు. సోమవారం సాయంత్రం ఈ విషాదం చోటు చేసుకుంది. అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ధ్రువ పంజాబ్‌లోని పఠాన్‌కోట్ నుంచి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ల్యాండ్‌పూర్ వద్ద హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ అయినట్లు సీనియర్ పోలీసు అధికారి శైలేంద్ర తెలిపారు. సంఘటనా స్థలంలోనే ఒక పైలట్ మృతిచెందగా, గాయపడిన మరో పైలట్‌ను మిలటరీ ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. అయితే వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. చదవండి: చైనాతో మళ్లీ ఘర్షణ; ఇరు దేశాల జవాన్ల బాహాబాహీ -
మంచు కురిసే వేళలో.. కశ్మీర్ అందాలు చూడ తరమా..
-
రెబల్స్ పై బీజేపీ సస్పెన్షన్ వేటు
శ్రీనగర్: ఉన్నత పదవుల్లో ఉండి పార్టీ అభివృద్ధికి తోడ్పడాల్సిన నేతలే ఇతరులకు అనుకూలంగా వ్యవహరించారంటూ బీజేపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారన్న ఆరోపణలతో 10 మందిపై వేటు వేసింది. ఒక పార్టీలో ఉంటూ వేరొకరికి కొమ్ముకాయడాన్ని తీవ్రంగా పరిగణించిన జమ్మూ కశ్మీర్ కార్యవర్గం గురువారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జిల్లా అభివృద్ధి మండలి(డిసిసి)తో పాటు పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినందుకు వారిపై వేటు వేసింది. ఈ విషయం గురించి స్థానిక బీజేపీ నేత ఒకరు మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి చర్యలు కార్యకర్తలపై చెడు ప్రభావం చూపిస్తాయి. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలకు పాల్పడిన వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని అధిష్టానం నిర్ణయించింది. పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేయడం జరిగింది. క్రమశిక్షణారాహిత్యం ప్రదర్శిస్తే సహించబోమన్న సంకేతాలు ఇచ్చేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు’’ అని పేర్కొన్నారు. సస్పెన్షన్‌కు గురైన నేతలు: పార్టీ జనరల్ సెక్రటరీ సంతోష్ కుమారీ, సతీష్ శర్మ, మకన్ లాల్ జమోరీయా, నీనా రకవాల్, గరిమల్ సింగ్, లోకేష్ సంబ్రియా, తీరత్ సింగ్, రన్బీర్ సింగ్ తదితర నేతలు సస్పెన్షన్‌కు గురైన జాబితాలో ఉన్నారు. మొత్తం పది మంది నేతల్లో 8 మంది పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసి పార్టీ ప్రకటించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో పార్టీకి నష్టం వాటిల్లిందని పార్టీ వీరిని సస్పెండ్ చేసింది. -
వికీపీడియాకు కేంద్రం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : భారత్ మ్యాప్‌ను తప్పుగా చూపించిన వికీపీడియాపై కేంద్ర ప్రభుత్వ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే తప్పును సరిదిద్దుకోకపోతే తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని భారత ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. లేహ్‌ను కేంద్రపాలిత ప్రాంత లద్దాఖ్‌లో కాకుండా జమ్మూ కశ్మీర్లో అంతర్భాగంగా గత నెలలో వికీపీడియా చూపించిన విషయం తెలిసిందే. దీనిని ట్విటర్ వేదికగా ఓ నెటిజన్ కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లారు. నెటిజన్ ట్వీట్‌పై స్పందించిన కేంద్రం.. వికీపీడియా యాజమాన్యానికి నోటీసులు జారీచేసింది. ఈ చర్య భారతదేశ ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించినట్లేనని ప్రభుత్వం వికీపీడియాకు తెలియజేసింది. భారత ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 69ఎ ప్రకారం ఉత్తర్వు జారీ చేసింది. వికీపీడియా తప్పును సరిదిద్దుకోవాలని, లేకుంటే సంస్థపై నిషేధం విధించడంతోపాటు ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని 2020 నవంబర్ 27న జారీచేసిన నోటీసుల్లో పేర్కొంది. దీనిపై వికీపీడియా ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. (చదవండి: జమ్మూ కశ్మీర్లో కాల్పులు.. నలుగురు హతం) -
కశ్మీర్ చలిలో ఎన్నికల పంజా
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి తొలగించి.. కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన తర్వాత మొదటిసారిగా అక్కడ ఎన్నికలు జరిగాయి. స్థానిక సంస్థల తొలిదశ ఎన్నికలు శనివారం జరిగాయి. ఈ రోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలై మధ్యాహ్నం 2 గంటలకు ముగిసింది. ఈ ఎన్నికలను అడ్డుకునేందుకు ఉగ్రవాదులు యత్నిస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో అప్రమత్తమైన భద్రతా దళాలు... ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తిస్థాయిలో పటిష్ఠమైన రక్షణ వలయాలు ఏర్పాటు చేశాయి. అనుమానాస్పద ప్రాంతాలలో బలగాలు గస్తీ నిర్వహించాయి. సురక్షితమైన ఎన్నికలు జరిగేలా అవసరమైన అన్ని కోవిడ్ ప్రోటోకాల్‌లను ఉంచామని, మొత్తం 51.76% పోలింగ్ నమోదైనట్లుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కెకె శర్మ తెలిపారు. ఈరోజు 43 డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్(డీడీసీ) స్థానాలకు పోలింగ్ జరిగింది. వీటిలో 25 కశ్మీర్లో ఉండగా జమ్మూ ప్రాంతంలో 18 స్థానాలు ఉన్నాయి. మొదటి దశ ఎన్నికల కోసం 7,03,620 మంది ఓటర్లకుగానూ మొత్తం 2,644 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మొదటి దశ డీడీసీ, సర్పంచ్, ఉప ఎన్నికల్లో మొత్తం 1427 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. మొత్తం 280 డీడీసీ, 12,153 పంచాయతీలకు 8 దశల్లో ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహించనున్నారు. పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్ (పిఎజిడి), బీజేపీ, మాజీ మంత్రి బుఖారీ స్థాపించిన అప్ని పార్టీల మధ్య త్రిముఖ పోరు జరగనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీతో సహా పలు రాజకీయ పార్టీల సమ్మేళనం అయిన పీఎజీడీ, జమ్మూకశ్మీర్ ప్రత్యేక హోదాను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తుంది. -
భారీ విధ్వంసానికి వ్యూహం: ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: భారీ విధ్వంసానికి వ్యూహ రచన చేసినట్లు అనుమానిస్తున్న నలుగురు ఉగ్రవాదుల్ని భారత జవాన్లు హతమార్చారు. ఈ ఘటన జమ్మూ -నాగ్రోటా టోల్ ప్లాజావద్ద జరిగింది. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం వచ్చిన తర్వాత భద్రతా దళాలు నిఘా పెట్టాయి. దీనిలో భాగంగా ఈ గురువారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులను హతమార్చారు. భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మద్య కాల్పులు గంటల తరబడి జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఒక సైనికుని మెడకు తీవ్రగాయాలయ్యాయి. అతని పరిస్థితి ఇప్పడు నిలకడగా ఉన్నట్లు తెలిసింది. బాన్ టోల్ ప్లాజా వద్ద ఉదయం 5 గంటల సమయంలో వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపగా భద్రతా దళాలు వాటిని తిప్పికొట్టింది. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు అటవీ ప్రాంతం వైపు పారిపోయారు. ఉగ్రవాదులు జమ్మూలోయ వైపు ప్రయాణిస్తున్న సమయంలో బాన్ టోల్ ప్లాజా వద్ద జరిగిన ఎదురు దాడిలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. భారీ ఆయుధాలు, పేలుడు పదార్ధాలు కల్గిన ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల వద్ద లభించిన భారీ పేలుడు పదార్థాలతో వారు విధ్వంసానికి వ్యూహ రచన చేసినట్లుగా అనుమానిస్తున్నారు. గత వారం జమ్మూ కాశ్మీర్ షోపియాన్‌లో భద్రతా దళాలు జరిపిన ఎన్కౌంటర్లో ఇద్దరు అల్-బదర్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల ఉనికిని తెలుసుకోవడానికి భద్రతా దళాలు జరిపిన సెర్చ్ ఆపరేషన్‌లో ఇద్దర్ని మట్టబెట్టారు. -
‘ఇస్లాం’ పరీక్షలో ముస్లిమేతరుడికి ఫస్ట్ ర్యాంక్
జైపూర్: కశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీలోని ఇస్లాం మత విద్యను నేర్చుకోవడానికి నిర్వహించిన అఖిల భారత ప్రవేశ పరీక్షలో ముస్లిమేతర విద్యార్థి నంబర్ వన్ ర్యాంకు సాధించాడు. రాజస్తాన్‌కు చెందిన హిందూ విద్యార్థి శుభమ్ యాదవ్ గత రికార్డుల్ని చెరిపేస్తూ టాప్ ర్యాంకు సాధించాడు. హిందూ ముస్లింలు పరస్పరం ఇతర మతాల గురించి తెలుసుకోవాలని శుభమ్ అన్నారు. ‘‘ఇస్లాం మతంపై అతివాద ముద్ర పడింది. ఆ మతం గురించి సమాజంలో ఎన్నో దురభిప్రాయాలు ఉన్నాయి. దీంతో సమాజంలో చీలికలు వచ్చాయి. అవన్నీ పోవాలంటే రెండు మతాల వారు పరస్పరం అవగాహన పెంచుకోవాలి’’అని శుభమ్ అభిప్రాయపడ్డారు. 2015లో ఏర్పాటైన కశ్మీర్ యూనివర్సిటీలో ఒక ముస్లిమేతరుడు టాప్ ర్యాంకు సాధించడం ఇదే తొలిసారి. అల్వార్ ప్రాంతానికి చెందిన యాదవ్ ఢిల్లీ యూనివర్సిటీలో ఫిలాసఫీలో బీఏ చేశాడు. రెండేళ్ల క్రితం తమ ప్రాంతంలో మైనార్టీలను కొట్టి చంపిన ఘటనలు వెలుగు చూడడంతో ఇస్లాం మతం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగిందని శుభమ్ యాదవ్ తెలిపారు. చదవండి: ఢిల్లీలో మళ్లీ లాక్డౌన్ ? -
అమిత్‌షాకు ముఫ్తీ కౌంటర్..
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో అధికరణ 370,35(ఎ) పునరుద్దరణ కోసం కొత్తగా ఏర్పాటైన పీపుల్స్ అలయెన్స్ గుప్కర్ డిక్లరేషన్ కోసం పోరాటాన్ని జాతి వ్యతిరేకంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా విమర్శించడంపై ఆ పార్టీ నేత మహబూబ ముఫ్తీ ట్విట్టర్లో స్పందించారు. దేశాన్ని రక్షించడంతో తామే(బీజేపీ) ముందున్నామని, తమ రాజకీయ ప్రత్యర్థులు దాంట్లో ఆమడ దూరంలో ఉంటారనే పాత ప్రచారాన్ని బీజేపీ ఇంకా కొనసాగిస్తుందన్నారు. లవ్ జిహాద్, తుక్డే తుక్డే గ్యాంగ్, గుప్కర్ డిక్లరేషన్లపై ప్రజల దృష్టిని మరల్చి నిరుద్యోగం, ద్రవ్యోల్భణం వంటి అంశాలను మరుగున పడేస్తున్నారని ట్వీట్ చేశారు. గత కొన్ని రోజులుగా కేంద్రానికి కశ్మీర్ పార్టీల నాయకులకి మాటల యుద్ధం తీవ్రంగా జరుగుతన్న విషయం తెలిసిందే. దాంట్లో భాగంగా జమ్మూ కశ్మీర్లో త్వరలో రెండో విడత జిల్లా అభివృద్ధి ఎన్నికలు జరగబోతున్న తరుణంలో బీజేపీ, పీపుల్స్ పార్టీపై నాయకులు ఇస్తున్న ప్రకటనలపై విమర్శలు ఎక్కు పెట్టింది. అయితే తమ పార్టీని ముఠాగా అభివర్ణించడాన్ని ఆమె తప్పు పట్టారు. పాత అలవాట్లను ఇంకా బీజేపీ కొనసాగిస్తోందని దుయ్యబట్టారు. (చదవండి: పాకిస్తాన్ వైపు భారీ నష్టం!) మొదట భారత సార్వ భౌమత్వానికి తుక్డే తుక్డే గ్యాంగులతో ప్రమాదమని ప్రచారం చేశారు. ఇప్పుడు గుప్కర్ డిక్లరేషన్ కోసం పోరాడే మాలాంటి వాళ్లను జాతి వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాసిన రోజు నుంచి ఇప్పటి వరకూ లక్షల మంది ప్రజలు మరణించారని ట్వీట్ చేశారు. అధికారం కోసం బీజేపీ అనేక కూటమిలతో జట్టు కడుతుందని, అదే ఎన్నికల కోసం తాము పోరాడితే మాత్రం జాతి ప్రయోజనాలకి విరుద్ధమెలా అవుతుందని ఆమె ప్రశ్నించారు. కశ్మీర్ నేతలు వరుసగా చేస్తున్న ప్రకటనలపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సోమవారం స్పందించారు. చైనా-పాక్ సాయంతో జమ్ముకాశ్మీర్‌లో అధికరణ 370 ని తిరగి పునరుద్ధరిస్తామని ఫరూక్ అబ్ధుల్లా వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటని నిలదీశారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ అయిన జట్టు కట్టవచ్చని వాటి జాతి వ్యతిరేకంగా కనిపించిన ఎజెండాపై మాత్రం బీజేపీ కచ్చితంగా ప్రశ్నిస్తుందన్నారు. గుప్కర్ డిక్లరేషన్: బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2019 ఆగస్ట్ 5న జమ్మూకాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని (ఆర్టికల్ 370) రద్దు చేయడాని కంటే ఒక రోజు ముందు ఆరు పార్టీలు (కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, సీపీఎం, జమ్మూ కశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్, అవామీ నేషనల్ కాన్ఫరెన్స్) కలిసి శ్రీనగర్‌లోని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా ఇంటిలో సమావేశమయ్యారు. ఆ ఇల్లు గుప్కర్ రోడ్డులో ఉండటంతో దానిని గుప్కర్ డిక్లరేషన్‌గా పిలుస్తున్నారు. వీరి ప్రధాన డిమాండ్ కశ్మీర్లో తిరిగి నిబంధన 370 ని పునరుద్ధరణ. -
నిజామాబాద్: జవాన్ వీర మరణం
-
మరోసారి బయటపడ్డ పాక్-చైనా దొంగబుద్ధి
శ్రీనగర్ : పాకిస్తాన్ మరోసారి తన దుర్భుద్ధిని ప్రదర్శించింది. చైనాతో కలిసి బాంబుల దాడికి ప్రయత్నించగా, భారత సైన్యం మట్టుబెట్టింది. జమ్ముకశ్మీర్‌లో కేరన్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్వోసీ )వద్ద పాకిస్తాన్ ఆర్మీకి చెందిన క్వాడ్‌కాప్టర్‌ను భారత సైన్యం మట్టుబెట్టింది. ఈ ఉదయం 8 గంటలకు జమ్ముకశ్మీర్ లక్ష్యంగా బాంబుల దాడికి కుట్ర పన్నింది. ఈ క్వాడ్‌కాప్టర్ చైనా కంపెనీకి చెందిన డిజెఐ మావిక్ 2 ప్రో మోడల్‌గా భారత సైన్యం గుర్తించింది. -
పోలీసుల చేతుల్లో పౌరుల మృతి.. కశ్మీర్ టాప్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో గత రెండేళ్లలో జరిగిన పోలీస్ ఆపరేషన్స్(కాల్పులు, ఎన్కౌంటర్లు, ప్రమాదవశాత్తూ మరణాలు)లో మొత్తం 183 మంది పౌరులు మృతిచెందారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో- ఎన్సీఆర్బి వెల్లడించింది. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం రాష్ట్రాలవారీగా చూస్తే జమ్మూకశ్మీర్లోనే అత్యధికమంది ప్రాణాలు కోల్పోయారు. 2019లో జరిగిన పోలీస్ కాల్పుల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 71 మంది మృతిచెందారు. జమ్మూకశ్మీర్‌లో 33 మంది, మహరాష్ట్రలో 15 మంది పౌరులు.. పోలీసుల కాల్పుల్లో మృతిచెందారు. (చదవండి: ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లకు గాయాలు) 2018లో మొత్తం 112 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా వీరిలో జమ్మూకశ్మీర్‌లో జరిగిన దుర్ఘటనల్లోనే 72 మంది మృతిచెందారు. తమిళనాడులో 14, తెలంగాణలో 11 మంది మరణించారు. ఈ రెండేళ్లలో మొత్తం 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారని ఎన్సీఆర్బి తెలిపింది. -
దాడి చేసి.. తప్పించుకోడానికి అంబులెన్స్
కశ్మీర్: పాండచ్ మిలిటెంట్ అటాక్ కేసును పరిష్కరించినట్లు జమ్మూ కశ్మీర్ పోలీసులు శుక్రవారం పేర్కొన్నారు. మే నెలలో నగర శివార్లలో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లను ఉగ్రవాదులు హతమార్చి వారి ఆయుధాలను దోచుకెళ్లారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి, రెండు అంబులెన్సులు, రెండు టూ వీలర్లను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులు ఈ వాహనాలను దాడి చేసే వారిని తీసుకెళ్లేందుకు ఉపయోగించారని పోలీసులు తెలిపారు. రవాణా, లాజిస్టిక్స్, ప్రణాళిక, దాడిని అమలు చేయడంలో సహకరించిన ఐదుగురు వర్గీకరించని గ్రూపులకు చెందిన ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు పోలీసు ప్రతినిధి తెలిపారు. ఈ సందర్భంగా ఓ అధికారి మాట్లాడుతూ.. ‘దర్యాప్తులో, నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నాము. ఇందులో రెండు ప్రైవేట్ అంబులెన్సులు, ఒక బైక్, స్కూటీ ఉన్నాయి’ అని ఆయన చెప్పారు. దాడికి ఉపయోగించిన వాహనాలను స్వాధీనం చేసుకోవడానికి డీజీపీ అనుమతించారని తెలిపారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలను తెలియజేస్తూ, ఉగ్రవాదులను బిజ్బెహారా నుంచి శ్రీనగర్‌లోని పాండచ్కు రవాణా చేయడానికి అంబులెన్స్ నంబర్ జేకే01ఏడీ 0915ను ఉపయోగించారు అన్నారు. అంతేకాక గాయపడిన జవాన్ల నుంచి ఆయుధాలను దోచుకున్న తరువాత.. వాటిని దాడి చేయడానికి, తప్పించుకోవడానికి బైక్ నంబర్ జేకే01ఏహెచ్ 2989, స్కూటీ నంబర్ జేకే01వీ 8288 ఉపయోగించారు. శ్రీనగర్ నుంచి ఉగ్రవాదులను తిరిగి బిజ్బెహారాకు రవాణా చేయడానికి అంబులెన్స్ జేకే01ఏఎఫ్ 9417ను ఉపయోగించారు అని తెలిపారు. -
ఎంఈఐఎల్కు జోజిల్లా పాస్ టన్నెల్ పనులు
న్యూఢిల్లీ: దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన హిమాలయాల్లోని జమ్మూకశ్మీర్- లడఖ్‌లోని జోజిల్లా పాస్ టన్నెల్ పనికి సంబంధించిన టెండర్లలో ఎంఈఐఎల్ ఎల్-1 గా నిలిచింది. శుక్రవారం (21-08-2020) జాతీయ రహదారులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్హెచ్ఐడీసీఎల్ (NHIDCL) ఫైనాన్స్ బిడ్లను తెరవగా ఎంఈఐఎల్ మిగిలిన సంస్థల కన్నా తక్కువ ధరకు కోట్ చేయడం ద్వారా తొలి స్థానంలో నిలిచింది. ఇంతవరకు దేశంలో ఎక్కడా నిర్మించని పద్ధతిలో అధునాతనమైన రీతిలో క్లిష్టమైన పరిస్థితిలో ఈ పనిని చేపట్టాల్సి ఉంటుంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ రోడ్ టన్నెల్‌కు సంబంధించిన పనులను ఎట్టకేలకు పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి టెండర్లను పిలిచింది. ఇందులో జోజిల్లా టన్నెల్ కు సంబంధించి 14.15 కిలోమీటర్ల రహదారి నిర్మాణం, ఇతర రోడ్ పనులకు గాను వేరే సంస్థలు అధిక ధరలకు కోట్ చేయగా ఎంఈఐఎల్ 4509.50 కోట్ల రూపాయలకు పనులు చేసేందుకు ముందుకు వచ్చింది. మిగిలిన రెండు కంపెనీలతో పోలిస్తే ఎంఈఐఎల్ తక్కువ ధరకు కోట్ చేయడం ద్వారా ఎల్-1 నిలిచింది. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ నుంచి లడఖ్ లేహ్ ప్రాంతానికి ఉన్న రహదారి ఏడాది పొడవునా వాహనాలు ప్రయాణించేందుకు అనుకూలంగా ఉండడం లేదు. హిమాలయాల్లో ముఖ్యంగా శీతాకాలంతో పాటు మొత్తం ఆరు నెల్లపాటు శ్రీనగర్- లడఖ్ రహదారిని పూర్తిగా మూసివేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మిలటరీ వాహనాలు కూడా ప్రయాణించలేకపోతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాల్లో సుదీర్ఘ దూరం ప్రయాణించడానికి అత్యధిక వ్యయ ప్రయాసాలతో పాటు సమయం కూడా వృధా అవుతోంది. ఈ పరిస్థితుల్లో సోనామార్గ్ నుంచి కార్గిల్ మీదుగా లేహ్, లడఖ్ కు రహదారి టన్నెల్ నిర్మించాలని ఎప్పుడో ప్రతిపాదించారు. అయితే ఆచరణలో మొదటి అధ్యాయం ఇప్పటికి సాధ్యం అయ్యింది. ఎంఈఐఎల్ ఎల్-1 గా నిలిచిన పనిని జాతీయ రహదారి-1లోని జడ్ -మోర్హ (Z-Morh) టన్నెల్ నుంచి జోజిల్లా టన్నెల్ వరకు కనెక్టింగ్ టన్నెల్‌ను జోజిల్లా పాస్ ప్రాంతంలో సోనామార్గ్- కార్గిల్ మధ్య నిర్మిస్తారు. ఈపీసీ పద్ధతిలో పిలిచిన ఈ పని అత్యంత క్లిష్టమైనది. ప్రపంచంలో ఇంతవరకు ఏ రహదారి టన్నెల్ నిర్మాణంలో ఎదురుకాని అవాంతరాలు ఈ టన్నెల్ నిర్మాణంలో ఎదురుకానున్నాయి. సరాసరిన భూ ఉపరితలం నుంచి 700 మీటర్ల దిగువన టన్నెల్‌ను నిర్మించాల్సి వస్తుంది. పూర్తిగా క్లిష్టమైన కొండ ప్రాంతంతో పాటు మంచు తుఫాన్లు తరచూ సంభవిస్తుంటాయి. దట్టమైన మంచు సంవత్సరంలో 8 నెలల పాటు ఉండడం వల్ల పనులు చేయడం అంత సులభం కాదు. అదే సమయంలో పక్కనే నది కూడా ప్రవహిస్తోంది. దీనివల్ల నిర్మాణ సమయంలో నీరు, మంచు ప్రవేశించి తీవ్ర సమస్యలు ఎదురవుతాయని భావిస్తున్నారు. అమరనాథ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు కూడా ఈ టన్నెల్ రహదారి వాడవచ్చు. ఈ యాత్రకు వెళ్లే వారికి కార్గిల్ సమీపంలోని బల్తల్ బేస్ క్యాంప్‌గా ఉంది. సింగిల్ ట్యూబ్ టన్నెల్ గా పిలిచే ఈ జోజిల్లా రహదారిలో రెండు వైపులా ప్రయాణించే (బై డైరెక్షనల్ ట్రాఫిక్) రెండు లైన్ల రహదారి నిర్మించాల్సి ఉంటుందని ఎంఈఐఎల్ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ సిహెచ్ సుబ్బయ్య తెలిపారు. రిటైనింగ్ గోడలు, బ్రిస్ట్ గోడలు, గేబియన్ నిర్మాణాలు, మట్టితో నిర్మించే గోడలు మొత్తం దాదాపు 10 కిలోమీటర్ల వరకు ఎంఈఐఎల్ నిర్మించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మంచు తుఫాన్లు తలెత్తితే ఎటువంటి ప్రమాదం లేకుండా క్యాచ్ డ్యామ్స్, ఎయిర్ బ్లాస్ట్, ప్రొటెక్షన్ గోడలు, డిఫ్లెక్టర్ డ్యామ్స్ దాదాపు 6 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు. -
జమ్మూకశ్మీర్‌లో ప్రయోగాత్మకంగా 4జీ
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవల పూర్తిస్థాయి పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం దశలవారీగా చర్యలు చేపడుతోందని, ఇందులో భాగంగా ఆగస్టు 15 తరువాత ప్రయోగాత్మకంగా కొన్ని చోట్ల 4జీ ఇంటర్నెట్ సేవలు అందించనున్నామని కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని బెంచ్ ముందు కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ జమ్మూకశ్మీర్‌లోని ఒక్కో జిల్లాలో ప్రయోగా త్మకంగా 4జీ ఇంటర్నెట్ సర్వీసులు అందించి, రెండు నెలల తరువాత సమీక్షించాలని కమిటీ నిర్ణయించిందని తెలిపారు. ఆ తరువాత దశలవారీగా విస్తరిస్తామని ఆయన తెలిపారు. జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి, జస్టిస్ బి.ఆర్.గవాయిలతో కూడిన బెంచ్ స్పందిస్తూ.. కేంద్రం నిర్ణయం సమంజసంగానే కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. -
కరోనా : డిశ్చార్జ్ అయ్యాక పాజిటివ్!
శ్రీనగర్ : కరోనా పరీక్షలో నెగిటివ్ తేలిన 12 మందికి మూడు రోజుల తర్వాత కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయిన ఉదంతం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటన జమ్మూకశ్మీర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. స్థానికంగా ఓ కూల్ డ్రింక్ ఫ్యాక్టరీలో పనిచేసే 12 మంది కార్మికులకు కరోనా లక్షణాలు కనిపించగానే ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆసుపత్రిలోనే చికిత్స పొందారు. పదిరోజుల అనంతరం నిర్వహించిన రెండుసార్లు కరోనా పరీక్షలు నిర్వహించగా మొదటిసారి ఫలితాల్లో నెగిటివ్ అని తేలడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఎవరికి వారు తమ ప్రాంతాలకు వెళ్లిపోయారు. రెండోసారి నిర్వహించిన పరీక్షలో కోవిడ్ ఉన్నట్లు తేలడంతో వెంటనే అప్రమత్తమైన వైద్య సిబ్బంది సమాచారం ఇవ్వడంతో వారు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి చేరుకొని చికిత్స పొందుతున్నారు. ఈ విషయంపై నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ భూపిందర్ కుమార్‌ని సంప్రదించగా.. తనకు ఈ సంఘటన గురించి తెలియదన్నారు. విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. (వినూత్న ప్రచారం.. ముందు పేజీలో మాస్క్ ) ప్రభుత్వ మార్గదర్శకాల అనుగుణంగానే తాము పరీక్షలు నిర్వహించామని అక్కడి వైద్యులు పేర్కొన్నారు. బాధితులు జూలై 1న వారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, ఆసుపత్రిలోనే చికిత్స అందించామని తెలిపారు. నిబంధనల ప్రకారం వైరస్ నిర్ధారణ అయిన 10 రోజుల అనంతరం రోగిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోతే, పరీక్షలోనూ నెగిటివ్ వస్తే డిశ్చార్జ్ చేయొచ్చని.. దానికనుగుణంగానే తాము చేసినట్లు పేర్కొన్నారు. నిజానికి కరోనా సోకిన వ్యక్తికి 10 రోజుల అనంతరం లక్షణాలు లేకపోతే రెండుసార్లు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తారు. రెండింటిలోనూ నెగిటివ్ వస్తే వైరస్ లేనట్లు. అంటే వారిని డిశ్చార్జ్ చేయొచ్చు. కశ్మీర్ ఆస్పత్రి సిబ్బంది మాత్రం రెండోసారి ఫలితాలు రాకముందే వారందరినీ ఇళ్లకు పంపించేశారు. దీంతో వారు ఇప్పుడు ఎవరెవరిని కలిసారన్న దానిపై అధికారులు వివరాలు ఆరా తీస్తున్నారు. (అమర్నాథ్ యాత్ర రద్దు ) -
హిజ్బుల్ కమాండర్ హతం
కశ్మీర్: హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ మసూద్ అహ్మద్ భట్‌ను భద్రతా దళాలు సోమవారం హతమార్చాయి. దక్షిణ కశ్మీర్ జిల్లాలోని కుల్‌చోరాలో జరిగిన ఎన్కౌంటర్లో అహ్మద్ భట్‌తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో దోడా ఇక ‘ఉగ్రవాదరహిత’ జిల్లాగా మారినట్లు అధికారులు ప్రకటించారు. ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయని తెలిపారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి ఓ ఏకే రైఫిల్, రెండు తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. With today’s operation at Khull Chohar by Anantnag Police along with 19 RR,CRPF in which 2 LET terrorists including one district commander & one HM commander Masood were neutralised, Doda district in Jammu Zone becomes totally militancy free once again.@Sandeep_IPS_JKP pic.twitter.com/sCvioo2f3X — J&K Police (@JmuKmrPolice) June 29, 2020 జమ్మూకశ్మీర్ పోలీసు చీఫ్ దిల్బాగ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. హిజ్బుల్ కమాండర్ అహ్మద్ భట్‌తో పాటు ఇద్దు లష్కరే తోయిబా ఉగ్రవాదులను హతమార్చినట్లు తెలిపారు. మసూద్ గతంలో ఓ అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్నాడు. దోడా పోలిస్ స్టేషన్లో అతనిపై కేసు నమోదయ్యింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న మసూద్ ఆ తర్వాత హిజ్బుల్ గ్రూపులో చేరాడు. కశ్మీర్ వేదికగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నాడు. దక్షిణ కశ్మీర్ నుంచి ఉగ్రవాదాన్ని తరిమివేయాలన్న లక్క్ష్యంతో భద్రతా దళాలు పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. త్రాల్ ప్రాంతంలో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను హతమార్చడంతో ఆ ప్రాంతం ఉగ్రవాదరహితంగా మారినట్లు పోలీసులు ప్రకటించారు. ఈ ఏడాది భద్రతా దళాలు కశ్మీర్లో దాడులను వేగవంతం చేశాయి. 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చాయి. అయితే ఈ ఎన్కౌంటర్ల పట్ల పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం తీవ్ర నిరసనలు తెలిపింది. ఎన్కౌంటర్లలో మరణించిన ఉగ్రవాదులను ‘అమాయకులు’ అని అభివర్ణించింది. ఉగ్రవాదుల చొరబాట్లను ఆపడానికి ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో మన సరిహద్దులో భద్రతా గ్రిడ్‌ను కఠినతరం చేసింది. భద్రతా దళాలు ఈ నెలలోనే దాదాపు నలభై మంది ఉగ్రవాదులను హతమార్చాయి. వీరిలో ఎక్కువ మంది ఉగ్రవాదానికి కేంద్రంగా పరిగణించే దక్షిణ కశ్మీర్‌లోనే హతమయ్యారు. ఈ నెలలో హతమయిన వారిలో జైష్-ఈ-మొహమ్మద్, లష్కర్-ఈ-తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్లు ఉన్నారు. -
జమ్మూకశ్మీర్‌లో ఎన్కౌంటర్..
జమ్మూకశ్మీర్: అనంత్‌నాగ్ జిల్లాలోని కుల్చోహర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతా దళాల కాల్పుల్లో సోమవారం ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని కశ్మీర్ పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదుల కదలికలు పెరగడంతో జమ్మూకశ్మీర్ పోలీసులు సైనిక బలగాలతో కలిసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఉగ్రవాదులపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. శనివారం ఉల్లార్ గ్రామంలో సైనికులు గాలింపు కొనసాగిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరపగా, జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది మరణించిన సంగతి తెలిసిందే. (పుల్వామాలో ఎన్కౌంటర్; ముగ్గురు ఉగ్రవాదులు హతం) -
24 గంటల్లో ఎనిమిది మంది హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో గడిచిన 24 గంటల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఎనిమిది మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చి చంపాయి. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచరం అందుకున్న భద్రతా దళాలు గురువారం ఉదయం నుంచి షోపియాన్, షాంపూర్ ప్రాంతాల్లో గాలింపుచర్యలు చేపట్టాయి. గాలింపు చర్యలు చేపడుతున్న భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు వారిపై కాల్పులు జరపగా.. పాంపోర్ ప్రాంతంలో ముగ్గురు, షోపియాన్‌లో ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు డీజీపీ దిల్బార్‌సింగ్ వెల్లడించారు. కాగా.. మీజ్ పాంపోర్ వద్ద ఆపరేషన్ నిర్వహిస్తున్నప్పుడు ఇద్దరు ఉగ్రవాదులు మసీదులోకి ప్రవేశించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు పకడ్బందీ వ్యూహంతో శుక్రవారం ఉదయం వారిని మట్టుబెట్టాయి. చదవండి: ప్రధాని దత్తత గ్రామంపై కథనం రాసినందుకు.. -
అవంతిపోరాలో ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: మంగళవారం దక్షిణ కశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన పుల్వామా జిల్లా అవంతిపోరా థ్రాల్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతులిద్దరూ కశ్మీర్‌కు చెందిన స్థానిక యువకులుగా పోలీసులు పేర్కొన్నారు. సంఘటనా స్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఆర్మీ భద్రతా సిబ్బంది, స్థానిక పోలీసులు సోమవారం రాత్రి నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. లొంగిపోవాల్సిందిగా సూచించినప్పటికీ ఉగ్రవాదులు వినిపించుకోపోగా కాల్పులకు తెగబడ్డారు. దాంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. -
నర హంతకుడిగా.. లెక్కల మాస్టారు
న్యూఢిల్లీ : కరడుగట్టిన ఉగ్రవాది, హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ రియాజ్ నైకూను హతమార్చడం చాలా కాలం తర్వాత భారత భద్రతా బలగాలు సాధించిన ఘన విజయంగా చెప్పుకోవచ్చు. ఎనిమిదేళ్లుగా భద్రతా బలగాల కన్నుగప్పి తిరుగుతున్న అతడ్ని కశ్మీర్‌లోని సొంత గ్రామంలోనే మట్టుబెట్టడం మరో విజయం. అయితే ఓ లెక్కల మాస్టారు జమ్మూ కశ్మీర్‌కు చెందిన టాప్ మిలిటెంట్ కమాండర్లలో ఒకడిగా మారిన వైనం ఆశ్చర్యకరం. మార్పు తెచ్చిన జైలు జీవితం .. రియాజ్ నైకూ.. పంజ్గామ్లోని నైకూ మొహల్లాలో 1985లో జన్మించాడు. నలుగురు సంతానంలో అతడు రెండో వాడు. ఇంటర్లో 600లకు గానూ 464 మార్కులు తెచ్చుకున్న నైకూ ఇంజనీర్ అవ్వాలని అనుకునేవాడు. కానీ, గ్రాడ్యూయేషన్ అయిపోగానే ఓ ప్రైవేట్ స్కూల్లో లెక్కల మాస్టారుగా చేరాడు. పేద విద్యార్థులకు ఉచితంగా తరగతలు కూడా చెప్పేవాడు. 2012లో ఓ కేసులో జైలుకు వెళ్లాడు. జైలు నుంచి తిరిగొచ్చిన తర్వాత అతడిలో మార్పు వచ్చింది. ఆ తర్వాత 2012 జూన్ 6న హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థలో చేరాడు. ఇప్పటివరకు అతనిపై 11 కేసులు ఉన్నాయి. ( హిజ్బుల్ కమాండర్ హతం ) భద్రతా బలగాల కన్నుగప్పి తిరుగుతున్న నైకూ తలపై ఇప్పటికే రూ. 12 లక్షల రివార్డు ఉంది. 2014 నుంచి అతడు యాక్టివ్‌గా ఉన్నాడు. 2016 జూలైలో ఉగ్రవాది బుర్హాన్ వని మరణించాక నైకూ డీ ఫాక్టో చీఫ్‌గా మారాడు. పలువురు యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా చేశాడు. టెక్నాలజీపై పట్టున్న నైకూ ఎక్కడా ఆధారాలు వదిలేవాడు కాదు. అయితే నైకూ తన సొంత గ్రామంలో ఉన్నాడన్న సమాచారం అందుకున్న పోలీసులు పక్కా ప్లానింగ్‌తో గత మంగళవారం రాత్రి అతన్ని హతమార్చారు. ( కశ్మీర్లో 64 మంది ఉగ్రవాదుల ఏరివేత) -
పాక్ కాల్పుల ఉల్లంఘన.. ఇద్దరు మృతి
శ్రీనగర్: పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు జమ్మూ కశ్మీర్ బారాముల్లాలోని నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది. ఈ అప్రకటిత కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన భారత భద్రతా దళనికి చెందిన ఇద్దరు సైనికులు శనివారం మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన మరో సైనికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం బారాములల్లా జిల్లా రాంపూర్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూ.. భారత భద్రతా సైనికులపై కాల్పులు జరిపిందని కల్నల్ రాజేష్ కలియా తెలిపారు. అంతకు ముందు ఏప్రీల్ 30న పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి ఆయుధాలతో అప్రకటిత కాల్పుల విరమణ ఉల్లంఘన ప్రారంభించిందని ఆయన వెల్లడించారు. -
సీఆర్పీఎఫ్ శిబిరంపై గ్రనేడ్ దాడి
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో సీఆర్పీఎఫ్ శిబిరంపై గుర్తుతెలియని ఉగ్రవాదులు శుక్రవారం గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. చదూర ప్రాంతంలో బైక్‌పై వచ్చిన ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ పోస్ట్‌పై గ్రనేడ్ విసిరారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం లేదని, ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు పేర్కొన్నారు. గ్రనేడ్ దాడితో అప్రమత్తమైన భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. గ్రనేడ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. దూనివారి చదూరలోని సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై ఉగ్రవాదులు గ్రనేడ్ విసిరారని దాడికి పాల్పడిన వారి కోసం గాలిస్తున్నామని బుద్గాం ఎస్పీ పేర్కొన్నారు. చదవండి : గ్రనేడ్ దాడిలో ఇద్దరు జవాన్ల మృతి -
జమ్మూ కశ్మీర్లో కాల్పులు.. ముగ్గురు హతం
ఢిల్లీ: జమ్మూ-కశ్మీర్లో కాల్పుల మోత మోగింది. శనివారం ఉదయం కుల్గం జిల్లాలో ఉగ్రవాదులకు భద్రత బలగాలకు మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం రావటంతో ఆర్మీ బలగాలు, స్థానిక కశ్మీర్ పోలీసులు కుల్గం జిల్లాలోని హార్డ్ మంగూరి బాటాపోరా ప్రాంతంలో కార్డన్ చెర్చ్ నిర్వహించారు. దీంతో ఉగ్రవాదులు కాల్పులు జరపటంతో ఆర్మీ బలగాలు ఎదురు కాల్పలు జరిపాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక ఆర్మీ జవాన్‌కు గాయాలయ్యాయి. మృతి చెందిన ఉగ్రవాదులను కుల్గంకి చెందిన ఫయాజ్, ఆదిల్, మొహద్ షాహిద్‌లుగా పోలీసులు గుర్తించారు. కాగా ఈ ముగ్గురు ఉగ్రవాదులు హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. -
కానిస్టేబుల్ ర్యాప్ సాంగ్.. నెటిజన్లు ఫిదా!
శ్రీనగర్ : కోరుకున్న లక్ష్యాలను సాధించాలనే తపన అందరికీ ఉంటుంది. అయితే అందులో కొంతమంది మాత్రమే వాటిని అందుకోగలరు. చాలామంది తాము అనుకున్నవి సాధించలేక అందివచ్చిన అవకాశాలతోనే సర్దిచెప్పుకుంటారు. తాజాగా జమ్మూ కశ్మీర్లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ కూడా ఈ జాబితాలో చేరాడు. ర్యాపర్ కావడమే లక్ష్యంగా పెట్టుకున్న అతడు... అనుకోని కారణాల వల్ల పోలీస్ ఉద్యోగం చేయాల్సివచ్చింది. అయితే ఉద్యోగంలో చేరినప్పటికీ తన ఆశను వదులుకోలేకపోయాడు. (వైరల్ వీడియో: నీకంటే నేనే బాగా పాడుతున్నా..) ఈ క్రమంలో... తన విధులను సక్రమంగా నిర్వహిస్తూనే తనకున్న టాలెంట్‌తో ఓ పాటను ర్యాప్ చేసి పాడాడు. 30 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో... ‘‘జనాలు నిద్రలో కలలు కంటారు. కానీ నేను కలలతోనే నిద్ర పోయేవాడిని. ఇంటి బాధ్యత అంతా భుజాన వేసుకున్నప్పటికీ ధైర్యం కోల్పోలేదు. ఒక సైనికుడి బాధ్యతను నేరవేరుస్తూనే.. ఇప్పటికీ ర్యాప్ చేస్తూనే ఉన్నాను’’ అంటూ తను కన్న కలల గురించి వివరిస్తూ పాటగా ఆలపించాడు. దీన్ని ముఖేష్ సింగ్ అనే పోలీస్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో తన ర్యాపింగ్ నైపుణ్యాలతో నెటిజన్ల మనసు దోచుకున్నాడు. ‘‘చాలా కష్టం.. మనలోని టాలెంట్‌ను దాచిపెట్టుకోలేం’’ అంటూ కానిస్టేబుల్‌ను ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. (వైరల్: కరోనాను పాటతో వెళ్లగొడుతున్న మహిళలు) -
పాకిస్తాన్‌కు మరోసారి భంగపాటు
ఐక్యరాజ్యసమితి : కశ్మీర్ విషయంలో అడుగడుగునా దెబ్బతిన్న పాకిస్తాన్‌కు మరోసారి భంగపాటు ఎదురైంది. జమ్మూ కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో తెవనెత్తేందుకు చేసిన విఫల ప్రయత్నం బెడిసికొట్టింది. కశ్మీర్ అంశం భారత్-పాక్‌ల ద్వైపాక్షిక అంశంమని ఐరాస స్పష్టం చేసింది. పాక్ కుయుక్తులపై భారత్ తీవ్ర స్థాయిలో మండిపడింది. కుట్రలను పక్కనబెట్టి.. ఇరు దేశాల మధ్య సంబంధాల మెరుగుపర్చే అంశంపై దృష్టి పెట్టాలని హితవు పలికింది. ఓ అఫ్రికన్ దేశానికి సంబంధించి ఐక్యరాజ్య భద్రతా మండలి బుధవారం రహస్య సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశానికి హాజరైనా చైనా.. కశ్మీర్ అంశాన్ని కూడా చర్చించాలని ప్రతిపాదించింది. దీనికి మిగతా సభ్య దేశాలు అంగీకరించలేదు. కశ్మీర్ అంశం భారత్-పాక్‌ల ద్వైపాక్షిక అంశమని తేల్చి చెప్పింది. పాక్‌కు మద్దతుగా చైనా తప్ప మరే ఇతర దేశాలు అండగా లేకపోవడం గమనార్హం. పాకిస్తాన్ కుయుక్తులు ఐక్యరాజ్య సమితిలో చెల్లవని ఐరాస భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్ధీన్ అన్నారు. పాక్ నిరాధార ఆరోపణలు చేస్తూ ఐరాసను తప్పదోవ పట్టిస్తుందన్న విషయం నేటితో తేలిపోయిందన్నారు. ఈ అనుభవంతో ఇప్పటికైనా ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడంపై పాక్ దృష్టి పెట్టాలని సూచించారు. -
ఉగ్ర ఖాకీ!
చుట్టూ ఉన్న వాస్తవాలను గమనిస్తూ, తమ ఊహాశక్తికి పదనుపెట్టి, ఆ వాస్తవాలకు కాల్పనికత జోడిస్తారు సృజనాత్మక రచయితలు. కానీ ఒక్కోసారి వాస్తవం కాల్పనికతను మించిపోతుంది. ఎవరి ఊహలకూ అందనంత దిగ్భ్రాంతికరంగా వుంటుంది. జమ్మూ–కశ్మీర్‌లోని శ్రీనగర్ విమానాశ్రయ భద్రతా వ్యవహారాలు పర్యవేక్షిస్తూ, గత ఆగస్టు 15న రాష్ట్రపతి పురస్కారాన్ని కూడా పొందిన డీఎస్పీ దేవిందర్ సింగ్ కరుడుగట్టిన హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది నవీద్ బాబా, అతని అనుచరుడితో కలిసి కారులో ప్రయాణిస్తూ శుక్రవారం పోలీసులకు చిక్కిన ఉదంతం ఇటువంటిదే. నవీద్ బాబా ఇటీవలికాలంలో ఎందరో అమాయకుల ప్రాణాలు బలిగొన్నాడు. అలాంటివారికి అత్యంత కట్టుదిట్టమైన భద్రత గల ప్రాంతంలోని తన ఇంట్లో ఆశ్రయమివ్వడం ఊహకందదు. పంజాబ్‌లో మిలిటెన్సీ తీవ్రంగా వున్నప్పుడు కూడా ఉగ్రవాదులకు కొందరు పోలీసు అధికారులు సహకరించిన వైనం బట్టబయలైంది. కానీ ఆ ఉదంతాలకు లేని ప్రాముఖ్యత ఇప్పుడు దీనికి రావడానికి ముఖ్యమైన కారణం వుంది. 2001లో పార్లమెంటుపై జరిగిన ఉగ్రవాద దాడిలో అరెస్టయిన నిందితుల్లో ఒకడైన అఫ్జల్ గురు అప్పట్లో తన న్యాయవాది సుశీల్‌కుమార్‌కు రాసిన లేఖలో తొలిసారి దేవిందర్ పేరు ప్రసావించాడు. తనను ఈ రొంపిలోకి లాగింది ఆయనేనని ఆ లేఖలో అఫ్జల్ గురు నేరుగా చెప్పాడు. కానీ అప్పట్లో అతని మొర ఆలకించినవారు లేరు. చివరకు సర్వోన్నత న్యాయస్థానం సైతం అఫ్జల్ గురును దోషిగా నిర్ధారించి ఉరిశిక్ష విధించింది. 2005 ఆగస్టులో అతని ఉరిశిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేయగా, 2013 ఫిబ్రవరి 9న అతన్ని ఉరితీశారు. పార్లమెంటుపై ఉగ్రవాద దాడి జరిగాక న్యాయ ప్రక్రియంతా ముగిసి ఉరిశిక్ష ఖరారు కావడానికి నాలుగేళ్ల సమయం పడితే, అతని క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడానికి మన రాజకీయ నాయకత్వానికి దాదాపు ఎనిమిదేళ్ల వ్యవధి కావలసివచ్చింది! దురదృష్టమేమంటే... ఏ దశలోనూ అతను ప్రస్తావించిన దేవిందర్పై వచ్చిన ఆరోపణల్లోని నిజానిజాలేమిటో ఎవరూ పట్టించు కోలేదు. అఫ్జల్ గురు అఫిడవిట్లో దేవిందర్ సింగ్ పేరు ప్రస్తావించినప్పుడు బాధ్యతగల ప్రభుత్వం లోతుగా ఎందుకు దర్యాప్తు చేయించలేదన్నది కీలకమైన ప్రశ్న. ఏ నేరంలోనైనా సంశయానికి తావులేని స్థాయిలో ప్రమేయం ఉన్నదని రుజువైనప్పుడే నిందితుడికి న్యాయస్థానాలు శిక్ష విధి స్తాయి. ఉరిశిక్ష విధించినప్పుడైతే ఈ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాయి. అఫ్జల్ విషయంలో అది జరగలేదని నిర్ద్వంద్వంగా చెప్పలేం. ఎందుకంటే పార్లమెంటుపై ఉగ్రవాద దాడికి పాల్పడి, భద్రతా దళాల కాల్పుల్లో మరణించిన మహమ్మద్‌ను కశ్మీర్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చిందీ, అతను పాత కారు కొనుక్కోవడానికి సాయపడిందీ అఫ్జలే. అతనితోపాటు తాను కూడా ఆ కారులో ప్రయాణించి ఢిల్లీలోనే వేర్వేరు వ్యక్తులను కలిశామని కూడా అఫ్జల్ అంగీకరించాడు. ఆ పాత కారులోనే ఉగ్రవాదులు పార్లమెంటుకొచ్చి దాడి చేశారు. అందులో పాల్గొన్న అయిదుగురు ఉగ్ర వాదులూ మరణించగా, కారు నంబర్ ఆధారంగా దాన్ని కొన్నదెవరో పోలీసులు తెలుసు కోగలిగారు. పోలీసులు ప్రశ్నించినప్పుడు అదనంగా అఫ్జల్ ఇంకేమి చెప్పాడన్నది అలావుంచితే, ఉరిశిక్ష పడ్డాక అతను దేవిందర్ పేరును ప్రస్తావించి, ఆయన తనను చిత్రహింసలకు గురిచేశాడని, చివరకు మహమ్మద్‌ను పరిచయం చేసి, అతన్ని ఢిల్లీకి తీసుకెళ్లమన్నాడని అఫ్జల్ గురు ఆరోపిం చాడు. అతను మరో ముఖ్య విషయం చెప్పాడు. మహమ్మద్‌ను కశ్మీర్ వాసిగా దేవిందర్ పరిచయం చేసినా, అతని ముఖకవళికలు అలా అనిపించలేదని, అతనికి కశ్మీరీ భాష కూడా రాదని, కానీ విధిలేక ఆ అధికారి చెప్పినట్టల్లా చేశానని తెలిపాడు. అప్పట్లో కశ్మీర్ పోలీసులు ఈ ఆరోపణను కొట్టిపారేశారు. కేసు నుంచి తప్పించుకోవడానికి అఫ్జల్ నాటకమాడుతున్నాడని చెప్పారు. అఫ్జల్ నేర ప్రమేయంపై వారికి నమ్మకం ఏర్పడటాన్ని తప్పుబట్టనవసరం లేదు. కానీ ఒక నిందితుడు అంత వివరంగా దేవిందర్ గురించి చెబుతున్నప్పుడు కాస్తయినా సంశయం కలగొద్దా? ఇది అఫ్జల్ కోసం కాదు...తమలో ఒకడిగా వున్న అధికారిపై తీవ్ర ఆరోపణలు వచ్చినప్పుడు వాటి నిజానిజాలు నిర్ధారించడం అత్యవసరమని అనిపించలేదా? పోనీ ఇలా ఒక అధికారిపై ఆరోపణలు రావడం కశ్మీర్లో మొదటి సారి కావచ్చునేమోగానీ, ఈశాన్య రాష్ట్రాలు, పంజాబ్ వంటిచోట్ల అంత క్రితం బయటపడలేదా? సైన్యంలో పనిచేస్తూ గూఢచర్యానికి పాల్పడినవారిని పట్టుకున్న ఉదం తాలు లేవా? ఏ ఉద్దేశంతో అప్పట్లో దేవిందర్‌సింగ్ పాత్రపై దర్యాప్తు చేయలేదన్నది ఇప్పుడు తేల వలసివుంది. అలా దర్యాప్తు చేసివుంటే, ఎన్నో దిగ్భ్రాంతికర అంశాలు బయటపడేవి. వందల మంది ప్రాణాలు కాపాడటం, ఆస్తుల విధ్వంసాన్ని నివారించడం సాధ్యమయ్యేది. అఫ్జల్ ప్రస్తావించడానికి చాలా ముందే దేవిందర్‌సింగ్ వివాదాస్పద అధికారిగా ముద్ర పడ్డాడు. మిలిటెన్సీని సమర్థవంతంగా అదుపు చేసినందుకు ఆరేళ్ల వ్యవధిలో ఎస్ఐ నుంచి డీఎస్పీ దాకా ఎదిగాడు. కానీ తన పరిధిలో లాకప్ మరణాలు జరగడంతో మళ్లీ వెనక్కు పంపారు. అనంతరకాలంలో చాలా త్వరగానే కోల్పోయినదాన్ని సాధించుకున్నాడు. అఫ్జల్‌ను ప్రశ్నించడం, చిత్రహింసలు పెట్టడం వాస్తవమేనని అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో దేవిందర్ అంగీకరించాడు. ఏ ఉగ్రవాద ఘటనైనా స్థానికంగా వుండేవారి తోడ్పాటులేనిదే సాధ్యం కాదు. ఇప్పుడు ఎటూ పార్లమెంటు దాడి కేసులో తిరిగి దర్యాప్తు జరుగుతుంది. ఇన్నేళ్లుగా దేవిందర్ సింగ్ ఎలాంటి ఘోరాలకు ఒడిగట్టాడో తేలుతుంది. కనీసం ఇకముందైనా నేరాల దర్యాప్తునకు, ముఖ్యంగా ఉగ్ర వాద నేరాల దర్యాప్తునకు అనుసరించాల్సిన శాస్త్రీయ విధానాలేమిటో, సూక్ష్మ స్థాయి అంశాలపై సైతం ఎంత తీక్షణమైన దృష్టి సారించాలో, ఎందుకు సారించాలో మన దర్యాప్తు విభాగాలు గ్రహిం చగలిగితే అది దేశ భద్రతకు ఎంతగానో మేలుచేస్తుంది. -
హక్కులకు ‘సుప్రీం’ ఛత్రం
అయిదు నెలలుపైగా ఆంక్షల చట్రంలో నలుగుతున్న జమ్మూ–కశ్మీర్‌కు సర్వోన్నత న్యాయస్థానంలో ఉపశమనం దొరికింది. వారం వ్యవధిలో ఈ ఆంక్షల విషయంలో నిర్ణయం తీసుకోవాలని జమ్మూ– కశ్మీర్ అధికారులను ఆదేశించడమే కాదు... తన తీర్పు ద్వారా భావప్రకటనా స్వేచ్ఛకు గ్యారెంటీ ఇస్తున్న రాజ్యాంగంలోని 19వ అధికరణ పరిధిని విస్తృతం చేస్తూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెలువరించిన ఈ తీర్పు ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణకు నిర్దిష్టమైన వ్యవధిని సూచించకపోయినా, నిరవధికంగా ఈ ఆంక్షలు కొనసాగించడం సరికాదని స్పష్టం చేసింది. పౌర స్వేచ్ఛకూ, వారి భద్రతకూ మధ్య ఉండాల్సిన సమతూకం ఏమిటన్నదే తమ ముందున్న అంశమని ధర్మాసనం చేసిన వ్యాఖ్య గమనించదగ్గది. ఈ తీర్పు వల్ల కశ్మీర్ పౌరులకు వెనువెంటనే చేకూరే ప్రయోజనం ఉండకపోవచ్చు. కానీ పౌరహక్కులకు ఎలాంటి ప్రతిబంధకాలూ ఉండరాదని కోరుకునేవారికి ఈ తీర్పు నైతికబలాన్నిస్తుంది. వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా వదంతులు ప్రచారం కావడం, అవి అమాయక పౌరుల ప్రాణాలు బలిగొనడం గత అయిదారేళ్లుగా ఈ దేశ ప్రజలకు అనుభవమవుతూనే ఉన్నది. కనుక ఆ మాధ్యమాలు దుర్వినియోగం కాకుండా, పౌరుల ప్రాణాలకు ముప్పు కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై వుంటుంది. అదే సమయంలో వారి ప్రాథమిక హక్కులకు భంగం కలగ కుండా చూడాలి. ఈ విషయంలో ప్రభుత్వాలు అత్యంత జాగరూకతతో వ్యవహరించినప్పుడే అవి ప్రజాస్వామిక ప్రభుత్వాలు అనిపించుకుంటాయి. జమ్మూ–కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న 370వ అధికరణాన్ని రద్దు చేసి, రాష్ట్ర ప్రతిపత్తిని మార్చి కేంద్రపాలిత ప్రాంతంగా చేసిన వెంటనే అక్కడ పెద్దయెత్తున అల్లర్లు జరగొచ్చునని, శాంతిభద్రతలకు భంగం కలిగించదల్చుకున్న శక్తులు సామాజిక మాధ్యమాల ద్వారా సమన్వయంతో భద్రతా బలగాలపై దాడులకు పాల్పడవచ్చునని, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించవచ్చునని కేంద్ర ప్రభుత్వం భావించింది. నిరంతరం కల్లోలంగా వుండేచోట ఆ తరహా ముప్పును అంచనా వేయడం సబబే కావచ్చు. కానీ ఆ సాకుతో నెలల తరబడి ఇంటర్నెట్, ఫోన్ సదుపాయాలను అడ్డుకోవడం ఏమాత్రం సమర్థనీయం కాదు. మొబైల్ సర్వీసుల పునరుద్ధరణ అక్టోబర్‌లో పాక్షికంగా పూర్తయింది. కానీ ఇంటర్నెట్ సదుపాయం ఇంతవరకూ లేదు. వేరే ప్రాంతాలకు చదువుకోసమో, కొలువుకోసమో వెళ్లివుంటున్న అనేకమంది జమ్మూ–కశ్మీర్లో వుంటున్న తమవారి యోగక్షేమాలు తెలియక ఎంతగా తల్లడిల్లారో చానెళ్లు చూస్తున్నవారికి తెలు స్తూనే వుంది. అలాగే జమ్మూ–కశ్మీర్ వాసులు సైతం బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి తమ సన్నిహితులతో సంభాషించలేక ఎన్నో అగచాట్లు ఎదుర్కొన్నారు. అయితే ఇలాంటి ఆంక్షల వల్ల జనంమధ్య సమాచార ప్రవాహం ఆగదు. కాస్త వెనకా ముందూ కావొచ్చుగానీ అది మనిషి నుంచి మనిషికి నిరంతరాయంగా ప్రవహిస్తూనేవుంటుంది. ఎమర్జెన్సీ చీకటిరోజులే ఇందుకు తార్కా ణం. నిరవధిక ఆంక్షల వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినడంతోపాటు వదంతులు రాజ్యమేలతాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు పర్యవసానంగా ఇంటర్నెట్ను నిలిపేసే ప్రభుత్వాల తీరు మారక తప్పదు. ఇన్నేళ్లుగా ప్రభుత్వాలు ఇంటర్నెట్ను అడపా దడపా ఆపుతున్నా న్యాయస్థానాలు జోక్యం చేసుకున్న సందర్భాలు లేవు. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2011లో గూగుల్, యాహూ, ఫేస్బుక్ ప్రతినిధులను పిలిచి వడబోత తర్వాతే ఏ సమాచారాన్నయినా, వ్యాఖ్యలనైనా తమ సైట్లలో ఉంచేవిధంగా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి హుకుం జారీ చేశారు. ఎక్కడ ఏ సమస్య తలెత్తినా, ఆ సాకుతో ఇంటర్నెట్ సేవలు నిలిపేయడం ఇటీవల రివాజుగా మారింది. ఇప్పుడు తాజా తీర్పు అలాంటి చర్యలను ప్రశ్నించడానికి పౌరులకు అవకాశం ఇచ్చింది. ఎంతకాలం ఆపుతారన్న స్పష్టత లేకుండా నిరవధికంగా ఈ సేవలను నిలిపేయడం టెలికాం నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. ఇదే కాదు... అవసరమా, అనవసరమా అనేదానితో నిమిత్తం లేకుండా 144వ సెక్షన్ విధించే తీరును కూడా ధర్మాసనం తప్పుబట్టింది. సహేతుకమైన నిరసనలను అణిచేందుకు ఈ సెక్షన్ సాధనంగా మారకూడదన్నది ధర్మాసనం ఉద్దేశం. మన దేశంలో బహుశా ఈ సెక్షన్ దుర్వినియోగం అవుతున్నంతగా మరేదీ అయివుండదు. 144 సెక్షన్‌కు సంబంధించిన ఉత్తర్వులను కూడా వారం రోజుల వ్యవధిలో సమీక్షించాలని జమ్మూ–కశ్మీర్ ప్రభుత్వాన్ని ఆదేశించటం గమనించ దగ్గది. భావప్రకటనా స్వేచ్ఛకు పరిమితులు విధించాలని, వీలైతే దాన్ని శాశ్వతంగా సమాధి చేయాలని ప్రయత్నించని దేశమంటూ ఉండదు. ఆంక్షల తీవ్రతలో తేడావుండొచ్చుగానీ చైనా, రష్యా మొదలుకొని అన్ని దేశాల తీరూ ఒకటే. తమది ‘అత్యంత ప్రజాస్వామిక దేశమ’ని చెప్పుకుంటూ, వివిధ దేశాల ప్రభుత్వాలు విధించే ఆంక్షల గురించి తరచు సుద్దులు చెప్పే అలవాటున్న అమెరికా తన వరకూ వచ్చేసరికి ఏం చేస్తుందో పదేళ్లక్రితమే వికీలీక్స్ అధినేత జూలియన్ అసాంజ్‌నూ, ఆయనకు సహకరించిన చెల్సియా మానింగ్‌నూ అది వెంటాడిన తీరు తెలియజెబుతుంది. అయితే ఇంటర్నెట్లో దుర్వా్యఖ్యలు, దుష్ప్రచారాలు, విద్వేషపూరిత రాతలు, అశ్లీలత వగైరా అంశాలుం టున్నాయన్న విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయం ఉండదు. కానీ సమస్యేమంటే వీటిని ఎలా అదుపు చేయాలన్న అంశంలో అందరిదీ అయోమయమే. ప్రభుత్వాలు మాత్రం ఈ సాకుతో సహేతుకమైన అసమ్మతి గొంతు నొక్కే ప్రమాదం ఎప్పుడూ పొంచివుంటుంది. ఇప్పుడు సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ విలువైన తీర్పు వెలుగులో జమ్మూ–కశ్మీర్ ప్రభుత్వం తన చర్యల్ని సమీక్షించుకుని సరిదిద్దుకోవాలి. ఏకకాలంలో అటు పౌరుల భద్రతకూ, ఇటు వారి హక్కుల పరిరక్షణకూ పూచీ పడటమెలాగో తెలుసుకోవాల్సి ఉంది. -
తదుపరి ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్
న్యూఢిల్లీ: ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే నియమితులు కానున్నారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఈ నెల 31న పదవీ విరమణ పొందనున్నారు. సంప్రదాయం ప్రకారం ఆయన తర్వాత అత్యంత సీనియర్ అయిన ముకుంద్ నరవానే ఆర్మీ చీఫ్‌గా నియమితులై 13 లక్షల మంది ఉన్న ఆర్మీని నడపనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఉన్నత స్థాయిలో పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆర్మీ వైస్ చీఫ్‌గా పనిచేస్తున్నారు. వైస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఆయన చైనాతో సరిహద్దు పంచుకుంటున్న ప్రాంతాల వద్ద పనిచేస్తున్న ఈస్ట్రన్ కమాండ్‌ను నడిపించారు. 37 ఏళ్ల తన సర్వీసులో సమస్యాత్మక ప్రాంతాలైన జమ్మూకశ్మీర్ వంటి చోట్ల పనిచేశారు. జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్‌కు నాయకత్వం వహించారు. మూడేళ్ల పాటు మయన్మార్‌లో ఉండి భారత ఎంబసీతో కలసి పని చేశారు. ఈయన నేషనల్ డిఫెన్స్ అకాడెమీ, ఇండియన్ మిలిటరీ అకాడెమీ పూర్వ విద్యార్థి. ఈయన గతంలో ‘విశిష్ట సేవా అవార్డ్’తో పాటు ‘అతి విశిష్ట సేవా మెడల్’ కూడా అందుకున్నారు. తన బెటాలియన్‌ను జమ్మూకశ్మీర్‌లో చక్కగా నడిపించినందుకు సేనా మెడల్ కూడా అందుకున్నారు. బిపిన్ రావత్ పదవీ విరమణ అనంతరం డిఫెన్స్ స్టాఫ్ మొట్టమొదటి చీఫ్‌గానూ పనిచేసే అవకాశం ఉంది. -
కశ్మీరీల వాట్సాప్ ఖాతాలు తొలగింపు
ఢిల్లీ : జమ్ము కశ్మీర్‌లోని పౌరుల వాట్సాప్ ఖాతాలను ఆ సంస్థ తొలగించింది. ఆ రాష్ట్రంలో భద్రతా కారణాల రీత్యా ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆంక్షలు విధించిన తర్వాత ఇప్పటి వరకు నాలుగు నెలలు పూర్తయ్యాయి. వాట్సాప్ కంపెనీ అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఏ ఖాతా అయినా 120 రోజుల వరకు యాక్టివ్‌గా లేకపోతే ఆ ఖాతాకు సంబంధించిన డాటా ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది. అప్పటి వరకు ఏదైనా గ్రూపులో సభ్యులుగా ఉంటే డియాక్టివేట్ అయిపోతుంది. ఈ నేపథ్యంలో దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉంటున్న కశ్మీరీలకు తమ తమ స్నేహితులు, బంధువులు ఆయా గ్రూపుల నుంచి నిష్క్రమించినట్టు మెసేజ్‌లు వచ్చాయి. నాలుగు నెలల గడువు బుధవారంతో అయిపోవడంతో ఈ మెసేజ్‌లు వచ్చాయి. ఈ విషయంపై వాట్సాప్ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘వాట్సాప్ అనేది గ్లోబల్ సంస్థ. ఒక ప్రాంతానికి సంబంధించినది కాదు. నాలుగు నెలల పరిమితి అనేది కంపెనీ నియమం. ఖాతాదారుల డేటా భద్రత కోసం పరిమితిని ఎక్కువ కాలం ఉంచవద్దని నియమంగా పెట్టుకున్నాం. ఇప్పుడు భౌగోళికత ఆధారంగా కశ్మీర్ ప్రాంత ప్రజల కోసం ప్రత్యేకంగా ఎలాంటి చర్యలు తీసుకోం. ఇంటర్నెట్ పునరుద్ధరించినప్పుడు వారు తిరిగి తమ ఖాతాలను యాక్టివేట్ చేసుకోవాలి. అయితే అంతకు ముందు వరకు ఉన్న డేటా మాత్రం వారికి అందుబాటులో ఉండద’ని స్పష్టం చేశారు. కాగా, భారత్‌లో వాట్సాప్ ఖాతాదారుల సంఖ్య దాదాపు 40 కోట్లు. ఇందులో జమ్ము కశ్మీరీల ఖాతాలు సుమారుగా 15 లక్షల వరకు ఉండవచ్చని ఒక అంచనా. -
350 మందిని రక్షించిన ఆర్మీ
శ్రీనగర్/జమ్మూ: విపరీతమైన మంచు కారణంగా 15,500 అడుగుల ఎత్తులో చిక్కుకున్న సుమారు 350 మందిని ఆర్మీ రక్షించింది. ఈ మేరకు శుక్రవారం రక్షణ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ రాజేశ్ కలియా వెల్లడించారు. శ్రీనగర్–లేహ్ జాతీయ రహదారిపై ఉన్న జోజిలా పాస్ వద్ద వీరంతా చిక్కుకున్నట్లు తెలిపారు. గురువారం నుంచి మంచు విపరీతంగా పడడంతో రోడ్లు మూసుకొని పోయి వాహనాల్లో ఇరుక్కుపోయారు. బయట ఉష్ణోగ్రతలు –7కు పడిపోయాయి. దాదాపు 250 ట్రక్కులు ఈ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయాయి. ఆర్మీ, పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం కలసికట్టుగా రాత్రంతా శ్రమించి వీరిని రక్షించారు. ప్రభుత్వం ద్వారా వారి జాడను తెలుసుకున్న ఆర్మీ వారిని రక్షించి, వేడి ఆహారాన్ని, దుప్పట్లను అందించింది. మరోవైపు పోలీసులు, జీఆర్ఈఎఫ్ సిబ్బంది రోడ్డుపై పేరుకున్న మంచు తొలగిస్తూ, ట్రాఫిక్ మళ్లించే ఏర్పాట్లు చేశారు. ఆర్మీ వెనువెంటనే తీసుకున్న నిర్ణయం వల్ల వీరు సురక్షితంగా బయటపడ్డారు. -
బీజేపీ నాయకుడి వాహనాలకు నిప్పు
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కుల్గాం జిల్లా బోనిగాం గ్రామంలో ఉగ్రవాదులు బీజేపీ నాయకుడికి చెందిన రెండు కార్లకు నిప్పు పెట్టారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన బీజేపీ నాయకుడు అదిల్ అహ్మద్ నివాసం బయట జరిగింది. ఆదిల్ నివాసం బయట పార్క్ చేసిన వాహనాలకు ముష్కరులు నిప్పు పెట్టిన సమయంలో ఆయన ఇంట్లో లేరని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. -
ఉగ్ర ప్రోత్సాహకులపై చర్యలు
న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిపై తక్షణ చర్యలు అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్(ఈయూ)కు చెందిన 28 మంది పార్లమెంట్ సభ్యులతో సోమవారం మోదీ మాట్లాడారు. ‘ఉగ్రవాదంపై పోరుకు సన్నిహిత అంతర్జాతీయ సహకారం కీలకం. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి, ప్రేరేపించడంతోపాటు దానిని ఒక దేశీయ విధానంగా మార్చుకున్న దేశాలపై తక్షణ చర్యలు అవసరం. దీనిని ఏమాత్రం ఉపేక్షించరాదు’అని పరోక్షంగా పాకిస్తాన్‌నుద్దేశించి పేర్కొన్నారు. కశ్మీర్లో పర్యటించడం ద్వారా జమ్మూ, కశ్మీర్, లదాఖ్ ప్రాంతాల సాంస్కృతిక, మతపరమైన వైవిధ్యంతోపాటు అక్కడ జరుగుతున్న అభివృద్ధి, పాలనపరమైన అంశాలపై అవగాహన ఏర్పడుతుందన్నారు. సాధ్యమైనంత త్వరగా ఈయూతో సముచిత, సమతుల్య వాణిజ్య, పెట్టుబడి ఒప్పందం కుదుర్చుకునేందుకు తమ ప్రభుత్వం ఆసక్తిగా ఉందన్నారు. సులభతర వాణిజ్యం ర్యాంకింగ్స్‌లో 2014తో పోలిస్తే భారత్ ఎంతో మెరుగైందని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్..జమ్మూకశ్మీర్‌లో సీమాంతర ఉగ్రవాదం ఫలితంగా ఉత్పన్నమైన పరిస్థితిని ఈయూ ప్రతినిధి బృందానికి వివరించారు. ఈయూ బృందం నేడు కశ్మీర్లో పర్యటించి, ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఏర్పడిన పరిస్థితులను ప్రజలను అడిగి తెలుసుకోనుంది. పార్లమెంట్‌కు అవమానకరం: కాంగ్రెస్ కశ్మీర్లో పర్యటించకుండా, అక్కడి ప్రజలతో మాట్లాడకుండా దేశంలోని రాజకీయ పార్టీల నేతలను నిర్బంధించిన ప్రభుత్వం..ఈయూ బృందానికి అనుమతి ఇవ్వడం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర అవమానకరమని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ ప్రభుత్వ నిర్ణయం భారత ఎంపీల హక్కులకు భంగకరమని తెలిపారు. కశ్మీర్ అంతర్గత విషయమని చెప్పే ప్రభుత్వం ఈయూకు స్వాగతం పలికి విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. జవాన్లతో మోదీ దీపావళి జమ్మూ: దీపావళి వేడుకలను ప్రధాని మోదీ ఆదివారం జమ్మూకశ్మీర్‌లోని దేశ సరిహద్దుల సమీపంలో జవాన్లతో కలిసి జరుపుకున్నారు. ఆదివారం ఉదయం ఎల్వోసీకి సమీపంలోని రాజౌరి ఆర్మీ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ఆయన అక్కడున్న వెయ్యిమంది సైనికులకు పండగ శుభాకాంక్షలు తెలిపి, స్వీట్లు పంచారు. సైనికుల మాదిరిగా ఆర్మీ జాకెట్ ధరించిన ఆయన జవాన్లతో రెండు గంటలపాటు గడిపారని అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఎంతో కఠిన తరమైన నిర్ణయాలను సైతం ధైర్యసాహసాలతోనే అమలు చేయగలిగామని ఈ సందర్భంగా అన్నారు. దీపావళి పండగను కుటుంబసభ్యులతో జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తారని, అందుకే, తన కుటుంబంలాంటి జవాన్లతో గడిపేందుకే ఇక్కడి వచ్చానన్నారు. అమర జవాన్లకు నివాళులర్పించారు. ప్రధాని వెంట ఆర్మీ చీఫ్ జనరల్ రావత్ ఉన్నారు. 2014లో ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచి మోదీ ఏటా సరిహద్దుల్లో జవాన్లతో గడుపుతున్నారు. -
చట్టం చలివేంద్రం
కశ్మీర్ సన్నివేశం టీవీలో చూసినప్పుడల్లా ఆశ్చర్యం గానూ, ఎబ్బెట్టుగా ఉండేది. తమ మూతులు కనిపించకుండా గుడ్డలు కట్టుకున్న పాతిక ముప్ఫై మంది యువకులు, పిల్లలు బహిరంగంగా రోడ్లమీద ఎదురుతిరిగి పోలీసులను కొట్టడం, వాళ్లు చేతుల్లో లాఠీలు, తుపాకులు ఉన్నా నిస్సహాయంగా ఆ రాళ్లను ఎదుర్కోవడం, దురదృష్టవశాత్తు వారిలో కొందరు గాయపడటం, ఒకరిద్దరు చనిపోవడం.. ఇది విడ్డూరంగా ఉండేది. కారణాలు ఏవైనా క్షణంలో పోలీసులు ఆ యువకులను తరిమికొట్టవచ్చు. ఒక పోలీసు గాయపడితే ఎవరూ పట్టించుకోరు. కానీ, ఒక యువకుడు గాయపడితే, పసివాడు గాయపడితే సరే సరి. నాయకులు రెచ్చిపోతారు. పసివారిని ప్రభుత్వం చంపేస్తోందని విరుచుకుపడతారు. ఇది విచిత్రమైన పరిస్థితి. ఇలా సాగాల్సిందేనా? అని అప్పుడప్పుడూ ఆవేశం కూడా వచ్చేది. ఈమధ్య ఉన్నట్టుండి రాళ్ల వర్షం ఆగిపోయింది. కాకపోతే ఈ వర్షంలో ఈ మధ్య ఒక లారీ డ్రైవర్ చనిపోయినట్టు వార్త కనిపించింది. ఏమిటీ రాజకీయ యుద్ధం. కారణం ఎవరు? ఇప్పుడు పూర్తిగా తేలిపోయింది. ఆ కుర్రాళ్లందరూ పాకిస్తాన్ భక్తులు కారు. రోజుకూలీ సంపాదించుకునే కూలీలు. రాళ్లు విసిరినందుకు ప్రతిరోజూ డబ్బు ముడుతుందట. ఎవరిస్తారు? ఇండియా వ్యతిరేకులు ఇస్తారు. వాళ్లని సంవత్సరాల తరబడి వచ్చిన ప్రభుత్వాలన్నీ ఆర్థికంగా మేపుతున్నాయి. సకల సౌభాగ్యాలూ ఇస్తున్నాయి. పోలీసులకు తుపాకీ పేల్చడం సులువు. కుర్రాళ్లు గాయపడటం గ్యారంటీ. పిల్లలకి ఏమైనా అయితే కశ్మీర్ వ్యతిరేక నాయకులు విజృంభిస్తారు. వీళ్లకు ఎవరో ఎలాగో డబ్బు చేరుస్తారు. రాళ్ల సంపాదన వారి సొత్తు. ఈమధ్య ఉన్నట్టుండి రాళ్ల వర్షం ఆగిపోయింది. కారణం మధ్యవర్తులుగా కశ్మీర్ వ్యతిరేక వాదులంతా జైళ్లలో ఉన్నారు. వారికి చేరవలసిన కశ్మీర్ పైకం చేరడం లేదు. రాళ్లు విరివిగా ఉన్నాయి. విసిరేవారు తగ్గిపోయారు.ఇది ఒకే వాక్యం–ప్రచ్ఛన్నయుద్ధం. తెలిసి తెలిసి ఈ యుద్ధాన్ని గమనిస్తున్న నాయకులు కూడా నిర్బంధంలో ఉన్నారు. ఫరూఖ్ అబ్దుల్లా ఈమధ్య తన స్వాతంత్య్రం గురించి వాపోయారు. పదిసార్లు ఈ దేశం నాది, ఈ జీవితం వివాదరహితంగా సాగాలని పదిసార్లు చెప్పి చెప్పి, ఒక్కసారి మాత్రమే రాళ్లేసే పిల్లల గురించి, దౌర్జన్యకారుల గురించి మాట్లాడతారు. అప్పుడు ఆయన పెదాలు ఆవేశంగా బిగుసుకుంటాయి. ఆర్టికల్ 370 గురించి మాట్లాడటం నా ఉద్దేశం కాదు. గవర్నమెంటు చర్యలను విమర్శించేవారు నిర్బంధంలో ఉన్నారు. ఇదొక విచిత్రమైన రాజకీయ పోరాటం. ఇందులో ముఖ్యమైన పాత్ర పత్రికలదే. ఇంకొన్ని నిశ్శబ్ద పాత్రల గురించి నిన్ననే దేశ సంరక్షణాధికారి అజిత్ దోవల్ చెప్పారు. వాటిలో ఒకటి న్యాయస్థానం. జరుగుతున్నది అరాచకమని తెలిసినా, చేసిన వ్యక్తి తప్పనిసరిగా చేశారన్నా–దౌర్జన్యకారుల పట్ల–తమ మెత్తని విచక్షణ ద్వారా పరోక్షంగా రక్షణ కల్పిస్తారు. ఇన్ని సంవత్సరాలలో ఎవరైనా దౌర్జన్యకారుల ఆచూకీ తెలిపారా? తెలిపి న్యాయస్థానం ముందో, లేకుంటే దౌర్జన్యకారులముందో నిలవగలిగారా? వీరంతా పరోక్షంగా అన్యాయాన్ని, అరాచకాన్ని సమర్థిస్తున్నట్లు జాతీయ రక్షణ సలహాదారు నిన్న కుండబద్దలు కొట్టారు. పిల్లల్ని శిక్షించడం సాధ్యం కాదు. దౌర్జన్యకారులు ఒకింతకుకానీ లొంగరు. చచ్చిపోయినవారు సాక్ష్యం చెప్పరు. దోవల్‌గానీ, నేనుగానీ 370 గురించి మాట్లాడింది లేదు. రాజకీయమయమైన ప్రారబ్ధానికి ‘పత్రిక’లు ఆజ్యం పోయరాదన్న ఆయన వ్యాఖ్యతో ఏకీభవిస్తున్నాను. గొల్లపూడి మారుతీరావు -
పాక్‌కు కశ్మీర్ గవర్నర్ హెచ్చరిక
శ్రీనగర్ : ఉగ్రవాదులను భారత్‌లోకి పంపేందుకు ప్రయత్నిస్తోన్న పాకిస్తాన్‌కు కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ హెచ్చరించారు. తీరు మార్చుకోకపోతే ఆదివారం జరిగిన దాడుల వంటివి పునరావృతమవుతాయని స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడారు. కశ్మీర్లో ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ గురించి అడుగగా.. ఇంటర్నెట్ సేవలను ప్రారంభిస్తే ఆ సౌలభ్యాన్ని ఉగ్రవాదులే ఎక్కువగా ఉపయోగించే అవకాశముందని వెల్లడించారు. నవంబర్ 1 నుంచి కశ్మీర్లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని వెల్లడించారు. ‘ఇక్కడ ఉన్న యువకులను అడుగుతున్నా. ఇన్నాళ్లు మీరేం సాధించారు? మీ ఆశయాలు నెరవేరడానికి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకొని రాష్ట్రాభివృద్ధికి కలిసి రావాల’ని కోరారు. కాగా, ఆదివారం సాయంత్రం భారత ఆర్మీ పాక్ ఆక్రమిత కశ్మీర్లో చేసిన దాడుల్లో ఉగ్రవాదులతో పాటు పాక్ సైనికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
కశ్మీర్లో అలజడికి ఉగ్రవాదుల కొత్త వ్యూహం!
సాక్షి, ఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కేంద్రం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఉగ్రవాదులు దేశంలోకి చొరబడకుండా నిఘాను పటిష్టం చేసింది. దీంతో ఉక్కిరిబిక్కిరికి గురవుతోన్న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎలాగైనా కశ్మీర్లో అశాంతిని రేపాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు సాధారణ పౌరులను టార్గెట్ చేస్తున్నారు. దీనికి ఉదాహరణగా సోమవారం షోపియాన్ జిల్లాలో రాజస్థాన్‌కు చెందిన ట్రక్ డ్రైవర్‌ను కాల్చి చంపడాన్ని చెప్పుకోవచ్చు. ఈ దాడిలో ఇద్దరు పాల్గొన్నారని, అందులో ఒకరు పాకిస్థాన్ జాతీయుడని నిఘావర్గాలు గట్టిగా అనుమానిస్తున్నాయి. తాజాగా పుల్వామా జిల్లాలోని కాక్పురా ప్రాంతంలో ఓ సాధారణ వ్యక్తిని ఉగ్రవాదులు బుధవారం కాల్చిచంపారు. ఈ విషయం తెలిసి రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. అయితే సాధారణ పౌరులే లక్ష్యంగా వరుస సంఘటనలు చోటుచేసుకోవడం వెనుక కశ్మీర్లో ప్రశాంత పరిస్థితులను భంగపరిచే ఉద్దేశ్యం ఉన్నట్టు భద్రతా నిపుణులు అంచనా వేస్తున్నారు. 370 రద్దు తర్వాత కశ్మీరీలను ఎంత రెచ్చగొట్టినా ఎలాంటి ప్రతిస్పందనా లేకపోవడంతో వారు ఈ వ్యూహానికి తెరలేపారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ వేదికల మీద పాకిస్థాన్ తేలిపోతుండడంతో సామాన్య పౌరులను హతమార్చడం ద్వారా వారిలో అభద్రత, భయాందోళనలు రేపి తద్వారా కశ్మీర్లో పరిస్థితులు క్షీణించాయని ప్రపంచ దేశాలకు చూపే ప్రయత్నం కూడా అయి ఉండవచ్చని వారు భావిస్తున్నారు. -
కశ్మీర్‌పై అంతా అబద్ధమేనా?
సాక్షి, న్యూఢిల్లీ : ‘మూతపడిన దుకాణాలు, స్తంభించిన ప్రజా రవాణాతో ఎవరికి లాభం?’. కశ్మీర్లో సాధారణ పరిస్థితులే కొనసాగుతున్నాయంటూ రెండు నెలలుగా కేంద్ర ప్రభుత్వం ఊదరగొడుతుండగా, అది పచ్చి అబద్ధమని తేల్చేలా స్థానిక ప్రభుత్వం యాడ్స్ రూపంలో ఈ వ్యాఖ్యలు చేసింది. శుక్రవారం పది స్థానిక పత్రికల్లో స్థానిక ప్రభుత్వం ఫుల్ పేజీ యాడ్స్‌ను ప్రచురించింది. అంటే ఇంతకాలం కేంద్రం చెబుతున్నదంతా అబద్ధమే గదా! (చదవండి : జమ్మూకశ్మీర్‌లో మరో కీలక పరిణామం) ‘గత 70 సంవత్సరాలుగా జమ్మూ కశ్మీర్ ప్రజలను తప్పు పట్టించారు. విష ప్రచారం వల్ల, దురుద్దేశపూరిత ప్రచారం వల్ల వారు ముగింపు లేని టెర్రరిజమ్‌లో, హింసాకాండలో, దారిద్య్రంలో చిక్కుకున్నారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న భారత రాజ్యాంగంలోని 370వ అధికరణను రద్దు చేశాక, ఆగస్టు ఐదవ తేదీ నుంచి కశ్మీర్లో సాధారణ శాంతియుత పరిస్థితులు కొనసాగేందుకు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు స్థానిక ప్రభుత్వం కృషి చేశాయి. రాళ్లు విసరాల్సిందిగా, హర్తాళ్లు చేయాల్సిందిగా ఇంతకాలం కశ్మీర్ వేర్పాటు వాదులు సామాన్య ప్రజలను రెచ్చగొడుతూ వచ్చారు. ఇదే టెర్రరిజమ్ బూచీతో వారి పిల్లలను మాత్రం ఇతర సురక్షిత ప్రాంతాల్లో, విదేశాల్లో చదివిస్తున్నారు. ఇప్పుడు మిలిటెంట్లు కూడా ఇదే ఎత్తుగడలకు దిగుతున్నారు’ ఆ వాణిజ్య ప్రకటనల్లో ఆరోపించారు. ఈ ప్రకటనల్లోని వాస్తవాస్తవాలపై వివరణ ఇచ్చేందుకు కశ్మీర్ నాయకులు ఎవరు అందుబాటులో లేరు. జమ్మూ కశ్మీర్ విముక్తి సంఘటన చైర్మన్ యాసిన్ మాలిక్ ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నారు. సీనియర్ హురియత్ కాన్ఫరెన్స్ నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ, అభ్యుదయ హురియత్ నాయకుడు మీర్వాయిజ్ ఉమర్ ఫారూక్‌లు గృహ నిర్బంధంలో ఉన్నారు. ఇప్పటి వరకు ఇంటర్నెట్ సౌకర్యాలను పునరుద్ధరించలేదు. ప్రిపెయిడ్ సెల్‌ఫోన్ సర్వీసులను పునరుద్ధరించిన టెలికామ్ సంస్థలు సోమవారం నుంచి పోస్ట్ పెయిడ్ మొబైల్ ఫోన్ సర్వీసులను పునరుద్ధరిస్తామని ప్రకటించారు. మరి ఆగస్టు 5వ తేదీ నుంచే కశ్మీర్లో సాధారణ పరిస్థితులు కొనసాగుతున్నాయనడం అబద్ధం కాదా? నిజంగా కశ్మీర్ అభివృద్ధి కోసమే 370ని రద్దు చేశారా ? అదే నిజమైతే ఇలాంటి వాణిజ్య ప్రకటనలు అవసరం లేదు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో అమలు చేస్తారో వివరించే వాణిజ్య ప్రకటనలు అవశ్యం. -
వారు సరిహద్దు దాటాలని చూస్తున్నారు : ఆర్మీ అధికారి
జమ్ము కశ్మీర్ : ఎల్వోసీ వెంబడి ఉన్న పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని వేర్వేరు శిబిరాల్లో దాదాపు 500 వందల మంది ఉగ్రవాదులు కశ్మీర్లోకి చొరబడేందుకు అవకాశం కోసం వేచి చూస్తున్నారని నార్తర్న్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రణ్‌బీర్ సింగ్ తెలిపారు. అంతేకాక, ఆంక్షలు సడలిస్తే అశాంతి రేపడానికి రెండు నుంచి మూడొందల మంది తీవ్రవాదులు కశ్మీర్‌లోనే ఉన్నారని వెల్లడించారు. శుక్రవారం మీడియాతోమాట్లాడుతూ ఆయన ఈ విషయాలు ధృవపరిచారు. సరిహద్దు అవతల ఉన్నవారికి పాక్ సైన్యమే ఆయుధాలను, నిధులను సమకూర్చుతూ లాంచ్పాడ్ శిక్షణను కూడా ఇస్తున్నట్టు తమకు గట్టి సమాచారం ఉందని రణబీర్ సింగ్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఇటీవల పాక్ నుంచి పంజాబ్‌లోకి డ్రోన్లు రావడంపైనా ఆయన స్పందించారు. ఎలాగైనా జమ్ము కశ్మీర్లో అలజడులు సృష్టించాలనే లక్ష్యంతో దాయాది దేశం వేస్తున్న కొత్త తరహా ఎత్తుగడలని ఆయన పేర్కొన్నారు. డ్రోన్లను ధ్వంసం చేసే శక్తితో పాటు ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనే సామర్ధ్యం మన సైన్యానికుందని వెల్లడించారు. పాకిస్తాన్ ఎలాంటి కుట్ర పన్నినా, ఎంతగా ప్రయత్నించినా వారి ఆటలు సాగనివ్వమని సింగ్ స్పష్టం చేశారు. -
కశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్లో శనివారం భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు పాక్ ఉగ్రవాదులు హతమయ్యారు. గండర్బాల్ జిల్లాలోని నారనాగ్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఆ ఊరిలో మొదట కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఆపరేషన్ నిర్వహణలో భాగంగా సోదాలు నిర్వహిస్తుండగా, ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో బలగాలు ధీటుగా ఎదుర్కొని వారిని అక్కడికక్కడే హతమార్చాయి. సంఘటనా స్థలం నుంచి భారీ స్థాయిలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. -
ఇమ్రాన్.. చైనా సంగతేంది? వాళ్లనెందుకు అడగవ్?
న్యూయార్క్ : కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని గగ్గోలు పెడుతున్న పాకిస్తాన్‌కు పశ్చిమ చైనాలోని వీగర్ ముస్లింల పరిస్థితి కనపడడం లేదా అని అమెరికా సూటిగా ప్రశ్నించింది. అక్కడ దాదాపు 10 లక్షల మంది ముస్లింలను చైనా ప్రభుత్వం నిర్భంధంలోకి తీసుకుంటే మీరెందుకు మౌనంగా ఉంటున్నారని నిలదీసింది. అమెరికా దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల అసిస్టెంట్ సెక్రటరీ అలైస్ వెల్స్ పాక్ ప్రభుత్వానికి ఈ ప్రశ్నలు సంధించారు. గత సోమవారం ఇమ్రాన్ ఖాన్‌తో నిర్వహించిన మీడియా సమావేశంలో చైనాలోని ముస్లింల పరిస్థితిపై స్పందించాలని కోరగా.. ‘చైనాతో మాకు ప్రత్యేక సంబంధాలున్నాయి. ఇలాంటి అంశాలు మేం ప్రైవేట్‌గా చర్చించుకుంటా’మని ఇమ్రాన్ బదులిచ్చిన విషయం తెలిసిందే. కశ్మీర్‌లోని ముస్లింల విషయంలో ఒకలా, చైనాలోని ముస్లింల విషయంలో మరోలా వ్యవహరించే పాక్ ద్వంద్వ ప్రమాణాలని వెల్స్ ప్రశ్నించారు. ‘కశ్మీర్ కంటే చైనాలోని ముస్లింలే ఇంకా ఎక్కువ నిర్భంధంలో ఉన్నారు. పాకిస్తాన్ వాళ్ల గురించి ఎక్కువ కేర్ తీసుకోవాల’ని వెల్స్ వ్యాఖ్యానించారు. పశ్చిమ చైనా జిన్జియాంగ్ ప్రాంతంలోని వీగర్ ముస్లింలను తీవ్రవాద భావజాలానికి దూరంగా ఉంచడానికి ఆ దేశ ప్రభుత్వం వెల్నెస్ సెంటర్లను తెరిచి పది లక్షల మందిని నిర్భంధించింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితిలోని 30 దేశాలు ఖండించాయి. అయితే ఈ ప్రచారాన్ని చైనా కొట్టిపారేస్తోంది. ఆయా క్యాంపుల్లో వారికి కొత్త నైపుణ్యాలు నేర్పించే ప్రక్రియ జరుగుతోందని డ్రాగాన్ చెప్తోంది. -
మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తాం : కాంగ్రెస్ సీఎం
రాయ్‌పూర్ : చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భఘేల బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశీ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దేశ హితం దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మద్దతునిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాల పట్ల ఎంతగా విభేదించినా అది దేశ అంతర్గత విషయమన్నారు. భఘేల ఢిల్లీ వెళ్తూ స్థానిక విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ‘విదేశీ వ్యవహార విషయాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వేసే ప్రతీ అడుగుకీ, రాజకీయాలతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఇందులో వేరే మాటకు తావులేద’ని స్పష్టం చేశారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370డి ఆర్టికల్‌ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పు పట్టింది. ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ సహా ఆ పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఐక్యరాజ్యసమితిలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు. ఈ పరిణామం అనంతరం జమ్ముకశ్మీర్ విషయంలో కాంగ్రెస్ తన వైఖరి వెల్లడించాలని బీజేపీ నిలదీయడంతో తర్వాత రాహుల్‌గాంధీ తేరుకొని పాక్‌ను లక్ష్యంగా చేసుకొని విమర్శించినా, కాంగ్రెస్ వైఖరిపై ప్రజలకు అనుమానం కలిగించడంలో అధికార పార్టీ సఫలీకృతమయిందనే భావన నెలకొంది. దీనిపై భఘేల స్పందిస్తూ.. ‘దేశం లోపల మేం కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలను గట్టిగా నిలదీస్తాం, ప్రశ్నలు సంధిస్తాం, సమాధానాలు రాబడ్తాం. అయితే అది దేశ అంతర్గతం. ఈ విషయాలు ఇమ్రాన్‌కు ఎందుకు? అతను తన దేశ పరిస్థితులపై దృష్టి సారిస్తే మంచిద’ని హితవు పలికారు. -
కశ్మీర్లో స్తంభించిపోయిన ‘న్యాయం’
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నప్పటికీ ‘ప్రజా భద్రతా చట్టం’ కింద అరెస్టయిన వేలాది మంది యువకులు గత నెల పదిహేను రోజులుగా జైళ్లలోనే మగ్గుతున్నారు. రాష్ట్రంలోని జైళ్లు సరిపోకపోవడంతో వేలాది మందిని ఇరుగు, పొరుగు రాష్ట్రాలకు కూడా తరలించిన విషయం తెల్సిందే. వారిలో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్ జైళ్లలో ఊచలు లెక్క పెడుతున్నారు. వారు తమ ఆరెస్టులను సవాల్ చేసేందుకు కోర్టులకు వెళ్లే ఆస్కారం కూడా లేకుండా పోయింది. కోర్టుల తలుపులు ఇప్పటికీ తెరచుకోవడం లేదు. ఇదేమిటిని ప్రశ్నించేందుకు న్యాయవాదులు కూడా అందుబాటులో లేకుండా పోయారు. వారిలో ఎక్కువ మంది కటకటాల వెనెక్కే వెళ్లారు. ఇప్పటికీ నిర్మానుష్యంగా ఉన్న హైకోర్టుకు వెళ్లే దారి కశ్మీర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మియాన్ అబ్దుల్ ఖయ్యూంను అరెస్ట్ చేసి ఆగ్రా జైల్లో నిర్బంధించగా, హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్ రోంగాను అరెస్ట్ చేసి మొరదాబా జైల్లో నిర్బంధించారు. ఆ తర్వాత బారముల్లా జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్దుల్ సలాం రాథర్‌ను అరెస్ట్ చేసి యూపీ జైల్లో నిర్బంధించారు. అందుబాటులో లేకుండా పోయిన అనంతనాగ్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఫయద్ సోదాగర్ జాడ కోసం స్థానిక పోలీసులు గాలిస్తున్నారు. ఇదిలావుండగా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, సీనియర్ న్యాయవాది మొహమ్మద్ యూసుఫ్ భట్, ఆయన కుమారుడు, న్యాయవాది జుబేర్ అహ్మద్ భట్లను కూడా పోలీసులు అరెస్ట్ చేసి జైళ్లకు తరలించారని సోఫియన్ జిల్లా కోర్టు న్యాయవాదులు తెలిపారు. హైకోర్టు ఆవరణలో అతికించిన నోటీసు వారందరిని రెండేళ్లపాటు ఎలాంటి విచారణ లేకుండా జైళ్లలో నిర్బంధించేందుకు అవకాశం ఉన్న కశ్మీర్‌కు మాత్రమే పరిమితమైన ‘ప్రజా భద్రతా చట్టం’ కింద పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంత మంది న్యాయవాదులను అరెస్ట్ చేయడమే కాకుండా వారు విధులు నిర్వర్తించడానికి వీల్లేకుండా కోర్టుల తలుపులకు తాళాలు వేసి ఉంచడం పట్ల కశ్మీర్ బార్ అసోసియేషన్‌కు చెందిన 1,050 మంది న్యాయవాదులు ఇటీవల సమావేశమై అరెస్టయిన న్యాయవాదులే తరఫునే కాకుండా అదశ్యమైన యువకుల తరఫున ‘హబియస్ కార్పస్’ పిటిషన్ దాఖలు చేసేందుకు ఏడుగురు న్యాయవాదులను నియమించారు. కశ్మీర్ ప్రజలకు సంఘీభావంగా ఢిల్లీలో విద్యార్థుల నిరసన శ్రీనగర్‌లోని కశ్మీర్ హైకోర్టు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందేనని, ఈ విషయంలో అవసరమైతే తానే స్వయంగా శ్రీనగర్‌కు వెళతానని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కోర్టులన్నీ యథావిధిగా పనిచేసేందుకు తమ అధికార యంత్రాంగం తప్పకుండా సహకరిస్తుందని, హైకోర్టుతోపాటు దిగువ కోర్టులు కూడా సజావుగానే పనిచేస్తున్నాయని కశ్మీర్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు గురువారం నాడు ప్రకటించారు. ఇప్పటికీ కశ్మీర్లో ఇంటర్నెట్ సర్వీసులను పునరుద్ధరించలేదని, ప్రభుత్వ రవాణా సర్వీసులేవీ నడవడం లేదని, కొన్ని చోట్ల కోర్టుల తలుపులు తెరస్తున్నప్పటికీ సిబ్బందిగానీ, జడ్జీలుగానీ, న్యాయవాదులుగానీ రావడం లేదని కశ్మీర్ బార్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. దాదాపు సగం న్యాయవాదులు జైళ్లలో మగ్గుతుంటే ఇంకా ఎవరు వచ్చి విధులు నిర్వర్తిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. కశ్మీరీలకు బంగారు భవిష్యత్తు ఇస్తానని ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్న నేపథ్యంలో ఈ నిర్బంధం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. -
‘తుఫాను’ ముందు ప్రశాంతత
సైనిక పదఘట్టనలు, బోసిపోయిన పాఠశాలలు, కొనుగోళ్లు లేక డీలాపడిపోయిన పండ్ల షాపులు కశ్మీరులో సాధారణ స్థితి నెలకొంటోందని చెప్పే రుజువులు కానేకావు. ఆరువారాల క్రితం ప్రపంచం ఊహించని తీవ్ర చర్య తీసుకున్నాక, నేటివరకు కేంద్రప్రభుత్వం కశ్మీరులో దెబ్బతిన్న ప్రజల మనోభావాలను చల్లబర్చడానికి ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. ఈ నేపథ్యంలో భారత్ నుంచి కశ్మీరీల పరాయీకరణ మరింత పెరగనుంది. వేర్పాటువాదులనుంచి ప్రధానస్రవంతి రాజకీయ పార్టీలను వేరు చేసి వారికి సముచిత గౌరవం కల్పించనంతవరకు కశ్మీర్లో ప్రశాంతత ఏర్పడదు. ముస్లిం కశ్మీర్‌పై ప్రస్తుతానికి విజయం సాధించానని కేంద్రం కలలు కంటున్నప్పటికీ ప్రస్తుత ‘ప్రశాంత వాతావరణం’ కశ్మీరీల ఆమోదానికి ఉదాహరణ అనుకుంటే మాత్రం అంతకుమించిన తప్పిదం మరొకటి ఉండదు. కశ్మీర్లో సాధారణ స్థితి నెలకొంటోందని భారత్ ప్రపంచానికి చూపించదల్చినట్లయితే, మూతపడిన షాపులు, బోసిపోయిన పాఠశాలలు, కొనుగోళ్లు లేక డీలాపడిపోయిన పండ్ల షాపులు.. మీకు మరొక కథను వినిపించవచ్చు. కశ్మీర్ గురించి తక్కిన భారతదేశంలో వినిపిస్తున్న ‘అంతా ప్రశాంతం’ తరహా వార్తలను దాటి చూస్తే శ్రీనగర్ నుంచి సోపియన్ వరకు దక్షిణ కశ్మీర్ మొత్తంగా ఆర్టికల్ 370 రద్దుకు నిరసనగా రోడ్లపై విసిరిన రాళ్లు.. సైనిక, పౌర వాహనాల కదలికను అడ్డుకునేందుకు రోడ్డుకు అడ్డంగా కూల్చివేసిన చెట్ల మొదళ్లు ఎక్కడ చూసినా కనబడుతున్నాయి. కొన్ని ప్రాంతాలను మినహాయిస్తే, కనుచూపుమేర సైని కులే కనబడుతున్నారు. షాపులు, వ్యాపార సంస్థలు మూతపడి ఉన్నాయి. శుక్రవారం పూట బాగా రద్దీతో, అశాంతితో, నిరసనలతో కనిపించే రోడ్లు ఎంత నిర్మానుష్యంగా కనబడుతున్నాయంటే కశ్మీరులో ఉద్రిక్తత ఊహిస్తున్న దానికంటే ఎక్కువగానే ఉన్నట్లు మన అనుభవంలోకి వస్తుంది. ఏదేమైనప్పటికీ 2019 ఆగస్టు 5 నుంచి కశ్మీరు హృదయాంతరాళాల్లో వైరుధ్యానికి సంబంధించిన నూతన అధ్యాయం ప్రారంభమైంది. కశ్మీరులో వివిధ భావజాలాలు, అభిప్రాయాలతో ఘర్షణ పడుతుండే ప్రజానీకాన్ని ఇప్పుడు ఒక సాధారణ భావోద్వేగం చుట్టుముట్టింది. అదేమిటంటే తాము విద్రోహానికి గురైన భావన. భారత రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తిని తోసిపారేస్తూ ఆర్టికల్ 370ని రద్దు చేయడంలో ఢిల్లీ ప్రదర్శించిన దూకుడు వైఖరి కశ్మీర్ ప్రధాన స్రవంతి రాజకీయ వర్గం ఉనికిని భంగపరుస్తూ తీవ్రంగా అవమానపర్చింది. మూడు దశాబ్దాల హింసాత్మక నేపథ్యంలో వీరు న్యూఢిల్లీకి, కశ్మీర్ వేర్పాటువాదులకు మధ్య తటస్థ శక్తిగా నిలిచి ఉండేవారు. స్వయం ప్రతిపత్తి లేక స్వయం పాలన అనే హామీపై తమ రాజకీయ భవిష్యత్తును నిర్మించుకుంటూ, ఆ ప్రాతిపదికనే పాకిస్తా¯Œ ను కాస్త దూరం పెడుతూ వచ్చిన ఈ ప్రాంతీయ పాలకవర్గం ఇప్పుడు పూర్తిగా మౌనం పాటిస్తోంది. రాజకీయ వేర్పాటువాదంతో వ్యవహరించడంలో ప్రధాన స్రవంతి వైఫల్యానికి చెందిన ఉదాహరణలు కోకొల్లలు. వాజ్‌పేయి నుంచి మన్మోహన్ సింగ్ హయాం దాకా ఇది కొట్టొచ్చినట్లు కనబడుతుంది. కానీ మోదీ ప్రభుత్వం ప్రస్తుతం వ్యవహరించిన వైఖరి నిరంకుశ స్వభావంతోనే కాకుండా ఒక్క రాయితో రెండు పిట్టల్ని చంపిన చందాన కనిపిస్తోంది. ఒకవైపు తమను ఢిల్లీ పూర్తిగా పక్కకు తోసిపారేయడం, మరోవైపున భారత్ ఉద్దేశాలను పసిగట్టడంలో అంధులుగా ఉండిపోయారంటూ తోటి కశ్మీరీ పౌరులు నిందిస్తూ ఉండటంతో కశ్మీర్ లోని భారత అనుకూల పాలకవర్గం పూర్తిగా అవమానకరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. సోపియన్ పట్టణంలో పన్నెండు మంది టాక్సీ డ్రైవర్ల ప్రతిస్పందనలు చూస్తే పెద్దగా తేడా కనిపించలేదు. వారిలో వయసు మళ్లినవారు కశ్మీర్ సెంటిమెంట్లను గౌరవించనందుకు, వేసవి సీజనులో పర్యాటక వ్యాపారాన్ని పూర్తిగా దెబ్బతీసినందుకు కేంద్రప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశారు. తన నిర్ణయంతో భారత్ తన కాలుమీద తానే కాల్చుకుంది అన్నది వీరి ఏకైక భావన. స్థానిక ఎమ్మల్యే తన అధినేత మెహబూబా ముఫ్తిలాగానే ముందస్తు నిర్బంధంలో ఉన్నారు. అలాగని తమ రాజకీయ నాయకత్వంపై ఇలాంటి సామాన్య జనానికి పెద్దగా ప్రేమ అంటూ లేదు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీతో గతంలో అంటకాగిన దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారని జనాభిప్రాయం. కశ్మీర్‌కు ప్రస్తుతం ఈ స్థితి తీసుకొచ్చినందుకు వీరే కారణమని అందరూ దూషిస్తున్నారు. అదేసమయంలో కేంద్రం తీసుకున్న దూకుడు చర్యతో కశ్మీరులో ప్రధానస్రవంతికి, వేర్పాటువాదులకు మధ్య అంతరం పూర్తిగా తొలిగిపోయింది. దీన్నే ఒక నిరసనకారుడు స్పష్టంగా చెప్పారు. ‘ఇది చివరి దెబ్బ. కశ్మీర్ కోసం పోరాటం అజాదీకోసం అంతిమ పోరాటంగా మారుతుంది. ఎలాంటి పరిణామాలు ఎదురైనా మాకు ఇక ఇదే శరణ్యం’. ఇక సంవత్సరాల తరబడి కశ్మీర్, దాని వెలుపలి జైళ్లలోనూ మగ్గిపోయిన వేర్పాటు వాదులు, వారి వారసులు, సోదరులు, పిల్లలు భారతీయ చట్టాలను తామెన్నటికీ అంగీకరించలేమని ప్రకటిస్తున్నారు. ‘మా మతం పాకిస్తాన్ వైపే మొగ్గు చూపుతోంది. అందుకే వారు మాకు మద్దతిస్తున్నారు’ అంటూ జమాత్ ఇ ఇస్లామి కార్యకర్త, వారణాసి జైలులో ఉంటున్న ఉమర్ బషీర్ నైకో బంధువు తేల్చి చెప్పాడు. బహుశా కశ్మీర్ ప్రజానీకంలో బలపడుతూ వస్తున్న ఇలాంటి అభిప్రాయాలే మోదీ ప్రభుత్వాన్ని ప్రస్తుత దూకుడు చర్యకు సిద్ధపడేలా చేశాయన్నది వీరు గమనించకపోవచ్చు. పైగా కశ్మీర్ పండిట్లు 1989లో తీవ్రవాదం ప్రారంభమయ్యాక లోయ విడిచి వెళ్లారన్న చరిత్ర ఆ తర్వాత పుట్టిన కశ్మీర్ వాసులకు ఎవరికీ తెలీదు. ఇక శ్రీనగర్‌లోని సౌరా ప్రాంతంలో ఇదే సెంటిమెట్ రిపీట్ అయింది. ఆగ్రహోదగ్రులైన యువత భద్రతా బలగాలు ప్రవేశించకుండా కందకాలు తవ్వారు. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం తర్వాత రాళ్లు, పెల్లెట్లు రువ్వుతుండటం కనిపిస్తుంది. సైనికులు పేలుస్తున్న పెల్లెట్లు తలకు తగిలి మంటపెడుతున్నా 22 ఏళ్ల యువకుడు ఆస్పత్రికి వెళ్లడానికి కూడా నిరాకరిస్తూ కనిపించాడు. తాను బయటకు వెళితే చాలు పోలీసులు లాక్కెళతారని. ప్రజా భద్రతా చట్టం కింద 2016లో తనను రెండుసార్లు అరెస్టు చేశారని తాను చెప్పాడు. అంతటా ఆవరించిన నిశ్శబ్ద వాతావరణంలో, నిర్మానుష్యమైన వీధుల్లో సౌరియా ప్రాంతంలో ప్రజాగ్రహం చిన్న తరహా సునామీని తలిపిస్తుంది. కాని అది తన హద్దులను దాటుకుని ముందుకు వెళుతుందా అన్నదే ప్రశ్న. ఇక సమీపంలోని అంకార్ మసీదు వద్ద 22 ఏళ్ల విద్యార్ది హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వని పోస్టర్ కింద నిల్చుని ఉన్నాడు. ఈ విద్యార్థి అభిప్రాయంలో ఆర్టికల్ 370 రద్దు అర్థరహితమైన చర్య. మోదీ నేతృత్వంలోని భారత్ ముస్లిం లంటే లెక్కచేయడం లేదని ఢిల్లీ చర్యలు మరోసారి నిరూపించాయని, అందుకే కశ్మీర్‌కు స్వాతంత్య్రం ఇప్పుడు మరింత అవసరమని అతనంటాడు. వేర్పాటువాదులలో లేదా భారత అనుకూల కశ్మీరీలలో ఇప్పుడు విస్తృతంగా చలామణిలో ఉన్న అనుభూతి ఇదే. ఆగస్టు 5న కేంద్రం తీసుకున్న అనూహ్య చర్య.. కశ్మీరులో ముస్లింల పాత్రను సామాజికంగా, రాజకీయంగా తగ్గించి హిందుత్వ ప్రాజెక్టును విస్తృతస్థాయిలో అమలు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందనడానికి ప్రత్యక్ష సాక్ష్యమని మెజారిటీ కశ్మీరీలు భావిస్తున్నారు. ఈ చర్య తమ ఆత్మగౌరవంపై పెనుదాడేనని, తమకు ఆర్థిక సాధికారత కల్పిస్తామనే సాకుతో రాజకీయంగా తమ సాధికారతను పెకిలించేస్తున్నారని వీరి ఆరోపణ. మరి దానివల్ల కలిగే ఫలితాలను అనుభవించడానికి భారత్ సిద్ధంగా ఉందా అనేది ప్రశ్న. వాస్తవం ఏదంటే, తర్వాతేం జరుగుతుందో ఎవరికీ తెలియటం లేదు. సెప్టెంబర్ 27న ప్రధాని నరేంద్రమోదీ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించేంతవరకు కశ్మీరులో హింసాత్మక ప్రదర్సనలు జరగకుండా, పౌరులకు గాయాలు తగలకుండా జాగ్రత్తపడాలని భద్రతా దళాలకు గట్టి ఆదేశాలు ఇచ్చారు. కశ్మీరులో కమ్యూనికేషన్లను పునరుద్ధరించాలని, రాజకీయనేతలను విడుదల చేయాలని, మానవహక్కులను కాపాడాలని అంతర్జాతీయంగా భారత్‌కు వ్యతిరేకంగా గళాలు విప్పుతున్న నేపథ్యంలో తనను తాను గొప్ప ప్రజాస్వామ్యవాదిగా భావిస్తూ అందరూ తనను గౌరవించాలని కోరుకుం టున్న ప్రధాని మోదీకి కశ్మీర్లో నెలకొనే ప్రతి హింసాత్మక ప్రదర్శనా.. ఎంతోకొంత చెడ్డ పేరును కొనితెస్తుదని తెలుసు. అందుకే సైన్యం అతి చర్యలకు పాల్పడకుండా నియంత్రిస్తూనే భద్రతా కారణాల రీత్యా మొబైల్ కమ్యూనికేషన్ల పునరుద్ధరణను కేంద్రం తిరస్కరిస్తోంది. అంతర్జాతీయ ఒత్తిడుల కారణంగా త్వరలోనే కమ్యూనికేషన్లను పునరుద్ధరించవచ్చు కానీ ప్రధాన స్రవంతి నేతలను విడుదల చేయడం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. ఆరువారాల క్రితం ప్రపంచం ఊహించని తీవ్ర చర్య తీసుకున్నాక, నేటివరకు కేంద్రప్రభుత్వం కశ్మీరులో దెబ్బతిన్న ప్రజల మనోభావాలను చల్లబర్చడానికి ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. ఈ నేపథ్యంలో భారత్ నుంచి కశ్మీరీల పరాయీకరణ మరింత పెరగనుంది. వేర్పాటువాదులనుంచి ప్రధానస్రవంతి రాజకీయ పార్టీలను వేరు చేసి వారికి సముచిత గౌరవం కల్పించనంతవరకు కశ్మీర్లో ప్రశాంతత ఏర్పడదు. ముస్లిం కశ్మీర్‌పై ప్రస్తుతానికి విజయం సాధిం చానని కేంద్రం కలలు కంటున్నప్పటికీ ప్రస్తుత ‘ప్రశాంత వాతావరణం’ కశ్మీరీల ఆమోదానికి ఉదాహరణ అనుకుంటే మాత్రం అంతకుమించిన తప్పిదం మరొకటి ఉండదు. మాయా మీర్చందాని వ్యాసకర్త అసిస్టెంట్ ప్రొఫెసర్, అశోకా యూనివర్సిటీ -
ఫరూక్‌ను చూస్తే కేంద్రానికి భయమా!?
సాక్షి, న్యూఢిల్లీ : గత నెల పదిహేను రోజులుగా గృహ నిర్బంధంలో ఉంచిన జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు ఫరూక్ అబ్దుల్లాపై కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా సోమవారం కశ్మీర్‌కే పరిమితమైన ప్రజా భద్రతా చట్టాన్ని ప్రయోగించింది. ఆయన్ని అరెస్ట్ చేసి, ఆయన ఇంటినే జైలుగా మార్చింది. ఆయన తరఫున దాఖలైన ‘హబియస్ కార్పస్’ పిటిషన్ విచారణకు రానున్న ఒక రోజు ముందు కేంద్రం ఈ చర్య తీసుకోవడం ప్రజాస్వామ్య వాదులకు ఆశ్చర్యం కల్గిస్తోంది. ఈ ప్రజా భద్రత చట్టం కింద ఎలాంటి విచారణ లేకుండా ఎవరినై రెండేళ్లపాటు జైల్లో ఉంచొచ్చు. ఫరూక్ అబ్దుల్లా తండ్రి షేక్ అబ్దుల్లా హయాంలో (1978లో) కలప స్మగ్లర్లను అణచివేయడం కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే రానురాను కశ్మీర్ వేర్పాటువాదులను అణచివేసేందుకు దీన్ని ఉపయోగిస్తూ వచ్చారు. ముఖ్యంగా 1990, 2008, 2010, 2016లలో కశ్మీర్లో జరిగిన ఆందోళనలను అణచివేసేందుకు కూడా ఈ చట్టాన్ని ప్రయోగించారు. ఆ సందర్భంగా దాదాపు ఆరువేల మందిని అరెస్ట్ చేసి వారిలో 327 మంది వేర్పాటువాదులపై చార్జిషీట్లను కూడా దాఖలు చేశారు. ఈ చట్టాన్ని సుప్రీం కోర్టు ‘లాలెస్ లా (చట్టరహిత చట్టం)’ అని వ్యాఖ్యానించింది. ఈ చట్టం కింద అదుపులోకి తీసుకున్న వారిని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో పది రోజుల వరకు కూడా పోలీసులు వెల్లడించాల్సిన అవసరం లేదు. 1989లో శ్రీనగర్‌లో జరిగిన అల్లర్ల దశ్యం ‘ప్రజా భద్రత’ పేరిట ఆ తర్వాత కూడా ఎలాంటి కారణం చూపకుండానే పొడిగించవచ్చు. అయితే నాలుగు వారల లోపల రాష్ట్ర ప్రభుత్వం నియమించిన బోర్డు ముందు నిర్బంధితులను హాజరు పరిచి కేసును సమీక్షించాలి. ఈ బోర్డులో అర్హత కలిగిన జడ్జీలను లేదా అర్హత లేని జడ్జీలను కూడా నియమించవచ్చు. బోర్డులోని జడ్జీలు లేదా సభ్యుల వివరాలను బయటకు వెల్లడించాల్సిన అవసరం లేదు. నిర్బంధితులకు తమ తరఫున న్యాయవాదులను నియమించుకునే అవకాశం కూడా లేదు. సాధారణంగా ‘జాతీయ భద్రత’ పేరిట ఎవరినైనా ఆరు నెలలపాటు నిర్బంధించవచ్చు. దీన్ని రెండేళ్లపాటు ఏకపక్షంగా పొడిగించవచ్చు. ఈ నిర్బంధాన్ని కోర్టు ఎన్నిసార్లు కొట్టివేసినా తాజా ఉత్తర్వుల ద్వారా నిర్బంధాన్ని ఎంతకాలమైనా పొడిగించవచ్చు. 20 ఏళ్లకుపైగా జైల్లో ఉన్న మసరత్ ఆలమ్ భట్ 1990 దశకంలో ముస్లిం లీగ్ నాయకుడు, వేర్పాటు వాది మసరత్ ఆలమ్ భట్‌పై 37 సార్లు ఈ ప్రజా భద్రతా చట్టాన్ని (పీఎస్ఏ)ను ప్రయోగించడంతో ఆయన ఏకంగా 20 ఏళ్లపాటు జైల్లోనే ఉండాల్సి వచ్చింది. కలప దొంగల అణచివేత కోసం తీసికొచ్చిన ఈ చట్టం కింద రాజకీయ నాయకులతోపాటు కశ్మీర్ బార్ అసోసియేషన్ చైర్మన్ సహా న్యాయవాదులను, కశ్మీర్ వాణిజ్య మండలి సభ్యులు సహా వ్యాపారవేత్తలను అరెస్ట్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. వీరిలో ఎవరు ప్రజాందోళనలు నిర్వహించిన వారు కాదు, ప్రజా భద్రతకు ముప్పు తెచ్చిన వాళ్లు కాదు. ముదుసలి వయస్సులో ఫారూక్ అబ్దుల్లాను అరెస్ట్ చేయడం అంటే మున్ముందు ఆయన ఏ ముప్పు తెస్తాడో ఏమోనని కేంద్రం భయపడుతుండడమేనని ప్రజాస్వామ్య వాదులు వ్యాఖ్యానిస్తున్నారు. -
బట్టలన్నీ విప్పేసి, కాళ్లు, చేతులు కట్టేసి..
సాక్షి, న్యూఢిల్లీ : ‘మమ్మల్ని రాత్రి పూట ఇళ్ల నుంచి బయటకు తీసుకెళ్లారు. తీవ్రంగా కొట్టారు. శరీరమంతటా ఎలక్ట్రిక్ షాక్‌లు ఇచ్చారు’ అని కొంత మంది గ్రామస్తులు ఆరోపించగా, ‘రాత్రిపూట సైనిక శిబిరాల నుంచి ప్రజలు అరుపులు, ఏడ్పులు రోజూ వినిపించేవి’ మరికొంత మంది తెలిపారు. ‘ఆగస్టు 14వ తేదీన రాత్రిపూట సైనికులు మా ఇళ్లు తలుపు తట్టారు. నేను తలుపులు తీశాను. పది మంది సైనికులు ఇంట్లో జొరబడ్డారు. నాకు, నా సోదరుడి కళ్లకు గంతలు గట్టి బయటకు తీసుకెళ్లారు. ముందుగా రోడ్డవతలికి నా సోదరుడిని తీసుకెళ్లారు. అక్కడ అతడిరి తీవ్రంగా కొడుతుండడంతో హృదయ విదారకమైన ఏడుపు వినిపించింది. నన్ను సమీపంలోని చౌగామ్ సైనిక శిబిరానికి తీసుకెళ్లారు. అక్కడ బట్టలన్నీ విప్పేశారు. చేతులను, కాళ్లను కట్టేసి ఇనుప రాడ్లతో కొట్టారు. చేతులు, కాళ్లు, వీపు, పిర్రలపై ఎలక్ట్రిక్ షాక్‌లు ఇచ్చారు’ 26 ఏళ్ల అబిద్ ఖాన్ ‘ఏపీ’ వార్తా సంస్థకు వివరించారు. సోఫియాన్ జిల్లా హిర్పోరా గ్రామంలో ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. ‘నీ పెళ్లికి హిజ్బుల్ ముజాహిదీన్’ మిలిటెంట్ సంస్థకు చెందిన రియాజ్ నైకూ మిలిటెంట్‌ను ఎందుకు ఆహ్వానించావు ? ఇప్పుడు అతనెక్కడున్నాడో చెప్పు ?’ అంటూ భారత సైనికులు తనను హింసించారని, అతను ఎవరో, అసలు ఎక్కడుంటారో కూడా తనకు తెలియదని ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదని అబిద్ ఖాన్ మీడియాకు వివరించారు. తన పురుషాంగం, వరి బీజాలపై కూడా ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చారని తెలిపాడు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370 అధికరణను రద్దు చేసిన నేపథ్యంలో మున్ముందు ఎలాంటి నిరసన ప్రదర్శనలు జరపరాదనే ఉద్దేశంతోనే వారు ఇలా తనను హింసిస్తున్నారని అర్ధం అయిందని ఆయన చెప్పారు. తన లాగే తన గ్రామానికి చెందిన మరికొంత మంది యువకులను ఇలాగే హింసించినట్లు తెల్సిందని చెప్పాడు. సైనిక శిబిరం నుంచి అబద్ ఖాన్ విడులయ్యాక పది రోజుల పాటు నిల్చోలేక పోయాడు, కూర్చోలేక పోయాడని, ఆ పది రోజులు వరుసగా వాంతులు చేసుకుంటూనే ఉన్నాడని, బ్రతుకుతాడని ఆశ లేకుండేనని కుటుంబ సభ్యులు తెలిపారు. 20 రోజుల తర్వాత తేరుకొని కాస్త అటు, ఇటు నడవ కలుగుతున్నాడని వారు చెప్పారు. పలు గ్రామాల్లో జరుగుతున్న ఇలాంటి మానవ హక్కుల ఉల్లంఘన సంఘటనలు ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. కశ్మీర్లో ఎప్పుడో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు చెబుతున్నప్పటికీ నేటికి సాధారణ పరిస్థితులు లేవని ఏపీ మీడియా వెల్లడించింది. ఇంకా పలు ప్రాంతాల్లో టెలిఫోన్ సౌకర్యాలను కూడా పునరుద్ధరించలేదు. -
కశ్మీర్‌పై పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్ : జమ్ము కశ్మీర్‌పై పాకిస్తాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌పై పాక్ వాదనను అంతర్జాతీయ సమాజం విశ్వసించడం లేదని దేశీయాంగ మంత్రి బ్రిగేడియర్ (రిటైర్డ్) ఇజాజ్ అహ్మద్ షా వ్యాఖ్యానించారు. కశ్మీర్‌పై భారత్ వాదననే అంతర్జాతీయ సమాజం విశ్వసిస్తోందని చెప్పారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సహా గత పాలకులందరూ దేశ ప్రతిష్టను నాశనం చేశారని షా దుయ్యబట్టారు. అంతర్జాతీయ సమాజంలో మనల్ని ఎవరూ నమ్మడం లేదు కశ్మీర్లో వారు (భారత్) కర్ఫ్యూ విధించారని, ప్రజలకు ఆహారం, మందులు లభించడం లేదని, ప్రజల్ని చితకబాదుతున్నారని మనం చెబుతున్నా ఎవరూ నమ్మకపోగా భారత్ వాదనను విశ్వసిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పాలకులు పాక్ ప్రతిష్టను దిగజార్చారని మండిపడ్డారు. ‘మనం కశ్మీర్‌ను కోల్పోయాం..మనది బాధ్యతాయుత దేశం కాద’ని ప్రజలు భావిస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అంతర్జాతీయ సమాజంలో జమ్ము కశ్మీర్ అంశాన్ని భూతద్దంలో చూపేందుకు పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్న నేపథ్యంలో పాక్ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆర్టికల్ 370 రద్దుపై పాక్ గగ్గోలు పెడుతున్నా అంతర్జాతీయ సమాజం భారత్ వాదనతో ఏకీభవిస్తుండటం కూడా పాక్‌కు మింగుడు పడటం లేదు. -
కశ్మీర్‌పై జోక్యాన్ని సహించం
జెనీవా/న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ స్వతంత్ర ప్రతి పత్తి రద్దు నిర్ణయం తమ సార్వభౌమాధికారానికి సంబంధించిందని భారత్ స్పష్టం చేసింది. ఈ విషయంలో మరో బయటి శక్తుల జోక్యాన్ని అంగీకరించబోమని పేర్కొంది. కశ్మీర్లో పరిస్థితులపై అంతర్జాతీయ దర్యాప్తు జరిపించాలంటూ జెనీవాలో మంగళవారం జరిగిన ఐరాస మానవ హక్కుల సంఘం(యూఎన్‌హెచ్చార్సీ) 42వ సమావేశంలో పాకిస్తాన్ కోరిన నేపథ్యంలో భారత్ ఈ విషయం స్పష్టం చేసింది. ఐరాస మానవ హక్కుల సంఘంలో కశ్మీర్ అంశంపై పాకిస్తాన్ చేస్తున్నదంతా దుష్ప్రచారమని కొట్టిపారేసింది. విదేశాంగ శాఖ కార్యదర్శి(తూర్పు) విజయ ఠాకూర్ సింగ్ జెనీవాలో మాట్లాడుతూ.. మానవహక్కుల ముసుగులో రాజకీయ దుష్ప్రచారానికి ఐరాసను దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఇతర దేశాల్లో మైనారిటీలకు మానవ హక్కులు లేవంటూ మాట్లాడుతున్న వారు సొంత దేశంలో మైనారిటీలను అణగదొక్కుతున్నారు’ అని అన్నారు. ‘కశ్మీర్‌కు సంబంధించి ఇటీవల చేపట్టిన మార్పులు భారత రాజ్యాంగానికి లోబడి జరిగాయి. భారత పార్లమెంట్ కూలంకషంగా చర్చించి తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా అంతరంగిక విషయం’అని పేర్కొన్నారు. ఇతర దేశాల జోక్యాన్ని భారత్ అంగీకరించబోదన్నారు. ఇదే విషయాన్ని ఆయన మానవహక్కుల సంఘం చీఫ్ మిఛెల్ బాచెలెట్‌కు వివరించారు. సీమాంతర ఉగ్రవాదం బెడద కారణంగానే ఆంక్షలు విధించినట్లు వివరించారు. 130 కోట్ల జనాభా కలిగిన తమ దేశంలో మానవ హక్కులకు అత్యుత్తమ రక్షణ ఉందన్నారు. చైనా–పాక్ ప్రకటనపై భారత్ మండిపాటు పాకిస్తాన్లో చైనా విదేశాంగ మంత్రి పర్యటన నేపథ్యంలో కశ్మీర్ అంశంపై రెండు దేశాల సంయుక్త ప్రకటనపై భారత్ మండిపడింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ మాట్లాడుతూ..‘కశ్మీర్‌కు సంబంధించి రెండు దేశాల సంయుక్త ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. జమ్మూకశ్మీర్ భారత్‌లో విడదీయరాని అంతర్భాగం’అని పేర్కొన్నారు. ‘పాక్ ఆక్రమిత కశ్మీర్లో చైనా–పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) పేరుతో తీసుకునే చర్యలను తీవ్రంగా పరిగణిస్తున్నాం. పాకిస్తాన్ ఆ ప్రాంతాన్ని 1947 నుంచి చట్ట విరుద్ధంగా ఆక్రమించుకుంది’అని పేర్కొన్నారు. ‘భారత్‌లోని కశ్మీర్ రాష్ట్రం’ పాక్ విదేశాంగ మంత్రి భారత్‌లోని కశ్మీర్ రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు లేవని పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి అన్నారు. అన్ని అంతర్జాతీయ వేదికలపైనా పాక్ నేతలు మామూలుగా కశ్మీర్ అంటూ ప్రస్తావిస్తుంటారు. కానీ, ఖురేషి మంగళవారం యూఎన్‌హెచ్చార్సీ సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘భారత్‌లోని కశ్మీర్ రాష్ట్రంలో సాధారణ పరిస్థితులున్నాయని అంటున్నారు. అలాంటప్పుడు అంతర్జాతీయ సంస్థలను అక్కడికి ఎందుకు అనుమతించడం లేదు? మీడియాపై ఆంక్షలెందుకు? స్వచ్ఛంద, పౌర సంస్థలను కశ్మీర్లోకి వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు?’ అని ప్రశ్నించారు. అనంతరం ఆయన యూఎన్‌హెచ్చార్సీ భేటీలో మాట్లాడుతూ.. ‘కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని భారత్ రద్దు చేసింది. కశ్మీర్ ప్రజలకు న్యాయం కోసమే ఇక్కడికి వచ్చాం. యూఎన్‌హెచ్చార్సీ మౌనంగా ఉండటం ఇబ్బందికర పరిణామం’ అని అన్నారు. -
సరిహద్దులో 230 మంది ఉగ్రవాదులు
న్యూఢిల్లీ: భారత జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాన్ కుట్ర పన్నుతోందని తెలిపారు. ఇందులోభాగంగా సరిహద్దులో 230 మంది ఉగ్రవాదులను పాక్ సిద్ధం చేసిందనీ, వీరిలో కొందరు ఇప్పటికే కశ్మీర్లోకి ప్రవేశించి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. కశ్మీర్లో పరిస్థితులు సాధారణ స్థితికి రావడం, లోయ నుంచి రోజుకు 750 ట్రక్కుల ఆపిల్స్ ఎగుమతి కావడంపై పాక్ లోని ఉగ్రమూకలు రగిలిపోతున్నారని దోవల్ వెల్లడించారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీరీ యువతకు గొప్ప భవిష్యత్, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. కశ్మీర్లో ఉగ్రవాదాన్ని ఎగదోయడమే పాక్ వద్దున్న ఏకైక అస్త్రమని విమర్శించారు. ఢిల్లీలో శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన దోవల్.. పాక్ వ్యవహారశైలిపై తీవ్రంగా మండిపడ్డారు. టవర్లు ఏర్పాటుచేసిన పాక్.. కశ్మీర్ వద్ద సరిహద్దులో 20 కి.మీ విస్తీర్ణంలో పాక్ ప్రత్యేకంగా కమ్యూనికేషన్ టవర్లను ఏర్పాటు చేసిందని ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ తెలిపారు. ‘‘ఈ టవర్ల సాయంతో కశ్మీర్‌లోని ఉగ్రవాదులతో పాక్‌లోని వారి హ్యాండ్లర్లు సంప్రదింపులు జరుపుతున్నారు. వీరి సంభాషణల్ని మన నిపుణులు గుర్తించారు. ఈ సందర్భంగా పాకిస్తానీ హ్యాండ్లర్ మండిపడుతూ..‘అసలు అన్ని ఆపిల్ ట్రక్కులు రాకపోకలు ఎలా సాగిస్తున్నాయ్? వాటిని మీరు ఆపలేరా? చేతకాకుంటే ఒప్పుకోండి. మీకు తుపాకులకు బదులుగా గాజులు పంపుతాం’ అని రెచ్చగొట్టేలా పంజాబీలో పాక్ యాసలో మాట్లాడాడు. ఇది జరిగిన తర్వాత ఇద్దరు ఉగ్రవాదులు గత శుక్రవారం సోపోర్‌లోని దంగపురా ప్రాంతంలో ప్రముఖ ఆపిల్ వ్యాపారి హమీదుల్లా రాథర్ ఇంటికెళ్లారు. హమీదుల్లా నమాజ్‌కు వెళ్లడంతో ఆగ్రహంతో ఆయన కుటుంబసభ్యులపై పిస్టళ్లతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో హమీదుల్లా కుమారుడు ఇర్షాద్(25), రెండున్నరేళ్ల మనవరాలు అస్మాలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో చిన్నారి అస్మా ఆరోగ్యం విషమంగా ఉండటంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించాం’’ అని దోవల్ వెల్లడించారు. ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దుచేయడాన్ని మెజారిటీ కశ్మీరీలు మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 ప్రత్యేక హక్కు ఎంతమాత్రం కాదనీ, అతి ప్రత్యేకమైన వివక్షని వ్యాఖ్యానించారు. కశ్మీర్లో ప్రస్తుతం 10 పోలీస్స్టేషన్ల పరిధిలోనే నిషేధాజ్ఞలు అమలవుతున్నాయనీ, ఉగ్రవాదులు సంప్రదింపులు జరపకుండా ఉండేందుకే ఇంటర్నెట్, ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థలను స్తంభింపజేశామన్నారు. -
పాక్ ఆర్మీ చీఫ్‌కు కేంద్రమంత్రి గట్టి కౌంటర్
సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 రద్దు తర్వాత దాయాది దేశాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జావేద్ బజ్వా శుక్రవారం మరోసారి రెచ్చగొట్టే ప్రకటన చేశాడు. కశ్మీర్ ప్రజలకు పాక్ ఎప్పుడూ తోడుగా ఉంటుందని, అవసరమైతే యుద్ధానికి సైతం వెనుకాడబోమని చెప్పారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి, మాజీ సైన్యాధిపతి వి.కె. సింగ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. భారత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి పాక్ ఆర్మీ పబ్బం గడుపుకోవాలని చూస్తోందని చురకలంటించారు. తినడానికి తిండి, కార్యాలయాలు నిర్వహించేందుకు స్తోమత లేనప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి డబ్బులు గుంజడానికి ఆ దేశ ఆర్మీ ఇలా ప్రేలాపనలు చేస్తుందని ఎద్దేవా చేశారు. కశ్మీర్ అంశాన్ని చూపెడుతూ పాక్ సైన్యం తరచూ అవినీతికి పాల్పడుతుందని విమర్శించారు. ఎల్వోసీ వెంబడి రెండు వేల మందిని పాకిస్తాన్ భారత్‌లోకి పంపించడానికి యత్నిస్తోందన్న వార్తలపై ఆయన స్పందిస్తూ.. ‘వారిని వారి (పాక్ ఆర్మీ) డ్యూటీ చేయనీయండి. వారిని పైకి పంపించే డ్యూటీ మన ఆర్మీ చేస్తుంది’అని వ్యాఖ్యానించారు. (చదవండి : కశ్మీర్ కోసం యుద్ధానికి సిద్ధం: పాక్ ఆర్మీ చీఫ్) -
‘600 ఏళ్లలో ఎన్నడూ ఇలా లేదు’
సాక్షి, న్యూఢిల్లీ : ‘గత 600 సంవత్సరాల్లో మొట్టమొదటి సారిగా ఈద్, శుక్రవారం సందర్భంగా ముస్లింల ప్రార్థనలు లేకుండా పోయాయి’ అని ఇస్లాం మత గురువు హజీ బిలాల్ అహద్ అమ్దాని వ్యాఖ్యానించారు. ఆయన శ్రీనగర్‌లోని జేలం నదీ ఒడ్డునగల 14వ శతాబ్దం నాటి ‘ఖాంక్ ఏ మౌలా’కు ఆయన డిప్యూటి ఇమామ్‌గా పనిచేస్తున్నారు. ‘ఎన్నో ఆందోళనల సందర్భంగా కూడా ఇలా ప్రార్థనలు జరగకుండా ఉన్న రోజు లేదు. అంతెందుకు, మిలిటెన్సీ ఎక్కువగా ఉన్న 1989లో నలువైపుల నుంచి తుపాకీ తూటాలు దూసుకొచ్చినప్పుడు కూడా ఈ మౌలాలో ప్రార్థనలు నిలిచిపోలేదు. రాజ్యాంగంలోని 370 అధికరణను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న ఆగస్టు 5వ తేదీ నుంచి నేటి వరకు కూడా ఈద్ రోజునగానీ, శుక్రవారం నాడుగానీ మౌలాలో సామూహిక ప్రార్థనలకు స్థానిక అధికారులు అనుమతించలేదు’ అని ఆయన గురువారం స్థానిక మీడియాతో వ్యాఖ్యానించారు. ‘హమ్ క్యా చాహ్తే హై, ఆజాదీ’ అంటూ 1989లో మిలిటెంట్లు జరిపిన ఆందోళనలో అనేక మంది మరణించారు. 1947లో కశ్మీర్లో జరిగిన మత కలహాల్లో కూడా వందలాది మంది మరణించారు. ఈ రెండు సందర్భాల్లోనే కాకుండా 1975లో కశ్మీర్లో ప్రధాన మంత్రి వ్యవస్థను రద్దు చేసి షేక్ అబ్దుల్లాను అరెస్ట్ చేసినప్పుడుగానీ, 1998 కశ్మీర్లో సైన్యం సద్భావన యాత్ర నిర్వహించినప్పుడుగానీ ప్రార్థనలు నిలిచిపోలేదన్నది అమ్దాని ఉద్దేశం. కశ్మీర్లో అప్రకటిత కర్ఫ్యూ అమల్లోకి వచ్చి సెప్టెంబర్ 5వ తేదీ నాటికి సరిగ్గా నెల రోజులు గడిచాయి. అయినప్పటికీ శ్రీనగర్‌తోపాటు పలు పట్టణ ప్రాంతాల్లో స్మశాన నిశబ్దం కొనసాగుతోంది. ల్యాండ్, మొబైల్ టెలిఫోన్ సర్వీసులను, ఇంటర్నెట్ సదుపాయాలను ఇంతవరకు పునరుద్ధరించలేదు. రాష్ట్రం నుంచి ఎవరు ఇతర రాష్ట్రాలకు వెళ్లాలన్నా, ఇతర రాష్ట్రాల నుంచి ఎవరు కశ్మీర్లోకి రావాలన్నా ముందస్తు అనుమతి తీసుకోవాలన్న అప్రకటిత ఆంక్ష కొనసాగుతోంది. ప్రార్థనలు నిర్వహించకుండా కొన్నిచోట్ల ఇమామ్‌లను అరెస్ట్ చేసినట్లు అమ్దాని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను శ్రీనగర్ పోలీసు ఉన్నతాధికారి ఖండించారు. ఇతర కేసుల విషయంలో కొందరు ఇమామ్‌లను అరెస్ట్ చేసిన మాట వాస్తవమేనని ఆయన చెప్పారు. అయితే తాజా పరిణామాలకు, వారి అరెస్ట్‌లకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే తనను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో ఇప్పటికీ అర్థం కావడం లేదని శ్రీనగర్‌లోని అగ సయ్యద్ హజీ హాసన్ మందిరం ఇస్లాం గురువు అగా సయ్యద్ ఐజాజ్ రిజ్వీ తనను కలిసిన మీడియా ప్రతినిధితో వ్యాఖ్యానించారు. ఆయన్ని ఆగస్టు 22వ తేదీన ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. జడిబాల్లోని మరో మసీదు ఇమామ్ ఇమ్రాన్ రెజా అన్సారీతోపాటు మరొ కొందరు ఇమామ్‌లను సీఆర్పీఎఫ్ జవాన్లతో కలిసి స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారట. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అరెస్ట్ చేస్తున్నామని మాత్రమే పోలీసులు వారికి చెప్పారట. శ్రీనగర్‌లోని పలు చారిత్రక మసీదుల్లో కూడా శుక్రవారం నాటి ప్రార్థనలు నిలిచిపోయాయి. ఇప్పుడు వాటిల్లో పావురాల రెక్కల చప్పుడు మినహా మరే ఇతర శబ్దాలు వినిపించడం లేదు. -
లండన్ ఘటన; బ్రిటన్ పార్లమెంటులో చర్చ
లండన్ : బ్రిటన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయంపై మంగళవారం పాక్ మద్దతుదారులు జరిపిన నిరసన ప్రదర్శనల్లో కార్యాలయ పరిసరాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు ఇలా జరగడం గమనార్హం. పాక్ మద్దతుదారుల ఆందోళన ఘటనలో కార్యాలయ కిటికీ అద్దాలు పగిలిన దృష్యాలను భారత హైకమిషన్ కార్యాలయం మంగళవారం ట్వీట్ చేసింది. ఈ ఘటనను లండన్ మేయర్, పాక్ సంతతికి చెందిన వ్యక్తి సాజిద్ ఖాన్ తీవ్రంగా ఖండించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కూడా. తాజాగా ఈ అంశం బ్రిటన్ పార్లమెంటులో చర్చకు వచ్చింది. మంగళవారం బ్రిటన్ పార్లమెంటులో ఈ విషయాన్ని నార్త్ వెస్ట్ కేంబ్రిడ్జిషైర్ ఎంపీ శైలేష్ వర లేవనెత్తారు. ఇలాంటి సంఘటనలతో బ్రిటన్‌లో నివసించే భారత సంతతి ప్రజలు కలత చెందుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ విదేశాంగ కార్యదర్శి డొమినిక్ రాబ్ స్పందిస్తూ ఇలాంటి చర్యలను తమ దేశం సహించబోదంటూ ఘటనను తీవ్రంగా ఖండించారు. మరోవైపు ఈ ఘటనకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశామని, మరి కొంతమందిని కస్టడీలోకి తీసుకున్నామని మెట్రోపాలిటన్ పోలీస్ అధికారి వెల్లడించారు. (చదవండి: మళ్లీ పేట్రేగిన పాక్ మద్దతుదారులు) -
ఇమ్రాన్..జాగ్రత్తగా మాట్లాడండి!
వాషింగ్టన్: భారత్‌పై చేసే వ్యాఖ్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పాక్ ప్రధాని ఇమ్రాన్‌కు సూచించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ ప్రాంతంలో పరిస్థితి జఠిలంగానే ఉందని, ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు కలిసి పనిచేయాలని భారత్, పాక్‌లను ఆయన కోరారు. కశ్మీర్ విషయంలో తలెత్తిన ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు భారత్‌తో కలిసి పనిచేయాలని, సంయమనంతో వ్యవహరించాలని, అదే సమయంలో భారత్‌పై చేసే వ్యాఖ్యల విషయంలో నిగ్రహంతో వ్యవహరించాలని అధ్యక్షుడు ట్రంప్ ఇమ్రాన్‌ను కోరారని అధ్యక్ష భవనం ఒక ప్రకటనలో పేర్కొంది. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేయడంతోపాటు ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై పాక్ తీవ్ర అభ్యంతరం తెలపడం, రెండు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరు దేశాల ప్రధానులతో సోమవారం ఫోన్లో సంభాషించారు. అనంతరం ఆయన ట్విట్టర్లో ‘వాణిజ్యం, వ్యూహాత్మక భాగస్వామ్యం పెంపుతో రెండు దేశాల ప్రధానులతో చర్చించా. ముఖ్యంగా కశ్మీర్ విషయంలో ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని భారత్, పాక్ ప్రధానులు నరేంద్ర మోదీ, ఇమ్రాన్‌ఖాన్‌లకు సూచించా. అక్కడ పరిస్థితి జఠిలంగానే ఉన్నప్పటికీ, మా మధ్య సంభాషణలు ఫలప్రదంగా సాగాయి’అని ట్రంప్ ట్విట్టర్లో తెలిపారు. భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని, ఆ ప్రాంతంలో శాంతి నెలకొనాల్సిన అవసరాన్ని అధ్యక్షుడు ట్రంప్ వారికి వివరించారు. ప్రాంతీయ పరిణామాలతోపాటు అమెరికా– భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యంపైనా భారత ప్రధాని మోదీతో చర్చించారని, త్వరలోనే మరోసారి సమావేశం కావాలని ఆకాంక్షించారని తెలిపింది. ఉగ్రవాదం, హింసకు తావులేని వాతావరణం నెలకొల్పాల్సిన అవసరాన్ని, సీమాంతర ఉగ్రవాదాన్ని పోషించడం పాక్ ఆపాలని ట్రంప్‌ను మోదీ కోరారని వెల్లడించింది. భారత ప్రభుత్వం జాత్యహంకార, ఫాసిస్టు ధోరణితో వ్యవహరిస్తోందని, దీని కారణంగా పాకిస్తాన్‌తోపాటు భారత్‌లోని మైనారిటీల సంక్షేమం ప్రమాదంలో పడిందని ఇమ్రాన్ ఖాన్ ఆదివారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ వద్ద ఉన్న అణ్వాయుధాల భద్రతపై అంతర్జాతీయ సమాజం దృష్టి పెట్టాలన్నారు. సోమవారం ట్రంప్‌తో దాదాపు అరగంటపాటు జరిగిన ఫోన్ సంభాషణల్లో ప్రధాని మోదీ ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించిన విషయం తెలిసిందే. అనంతరం ట్రంప్ పాక్ ప్రధానితో మాట్లాడారు. అయితే, కశ్మీర్లో ప్రస్తుత పరిస్థితులపై జోక్యం చేసుకోవాలని అధ్యక్షుడు ట్రంప్‌ను ప్రధాని ఇమ్రాన్ కోరారని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మూద్ ఖురేషి పేర్కొన్నారు. కశ్మీర్లో ఆంక్షలను ఎత్తివేయాలని, మానవహక్కుల సంఘాలను కశ్మీర్లో పరిస్థితులపై అంచనా వేసేందుకు పంపించాలని కూడా ఇమ్రాన్ కోరారన్నారు. ఇలా ఉండగా, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్æ మంగళవారం అమెరికా రక్షణ మంత్రి ఎస్పెర్‌తో ఫోన్లో సంభాషించారు. భారత్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న సీమాంతర ఉగ్రవాదాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఆర్టికల్ 370 రద్దు, సంబంధిత అంశాలు తమ అంతర్గత విషయమని కూడా పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌కు సంబంధించి జరుగుతున్న పరిణామాలు భారత్ అంతరంగిక వ్యవహారమని, భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఎస్పెర్ ప్రశంసించారని అధికారులు తెలిపారు. భారత్, పాక్‌కు ఈ అంశాన్ని ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని కూడా సూచించారన్నారు. -
‘అవును కశ్మీర్లో పరిస్థితి సాధారణమే.. కానీ’
చెన్నై: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో కశ్మీర్‌లోని తాజా పరిస్థితులపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం స్పందించారు. కశ్మీర్లో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందని ప్రభుత్వం చెపుతున్న విషయాలు అబద్ధమని ఆయన కొట్టిపారేశారు. ‘జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు సాధారణస్థితికి వచ్చాయి. పాఠశాలలూ తెరుచుకున్నాయి. కానీ, విద్యార్థులు లేరు. పరిస్థితులు సాధారణ స్థితిలోనే ఉన్నాయి. కానీ, ఇంటర్నేట్ సేవలు మరోసారి నిలిపేశారు. పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి. కానీ మెహబూబా ముఫ్తి ఇంకా నిర్భంధంలోనే ఉన్నారు. మీరు ఇక్కడ ఏం జరుగుతుందోనని ఆలోచిస్తుంటే.. అక్కడ ఇది కొత్త సాధారణ పరిస్థితి అని దయచేసి అర్థం చేసుకోండి’ అని చిదంబరం ట్విటర్లో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కశ్మీర్లో మరోసారి ఇంటర్నెట్ సేవలు నిలిపేయడం, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని ఇంకా నిర్బంధంలో ఉంచడంపై ఆమె కూతురు ఇల్తిజా కేంద్ర హోంమంత్రికి లేఖ రాసిన విషయాలను ప్రస్తావిస్తూ.. పరిస్థితులు ఇలా ఉన్నప్పటికీ కశ్మీర్ సాధారణంగా ఉందని కేంద్రం చెప్పడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఆంక్షలు సడలించడంతో కశ్మీర్లో సోమవారం పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. కానీ ఎక్కడా విద్యార్థులు కనిపించడం లేదు. శ్రీనగర్ పట్టణంలో 190 ప్రాథమిక పాఠశాలలను పునఃప్రారంభించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించినప్పటికీ గత రెండు రోజులుగా జరుగుతున్న హింసాత్మక నిరసనల దృష్ట్యా తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపడం లేదు. -
కశ్మీర్లో ఇళ్లు కొనాలంటే?
శ్రీనగర్ : సుందర కశ్మీర్లో ఇళ్లు కొనాలానేది చాలామంది కల. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో ఇప్పుడు కశ్మీర్లో ఇళ్లు కొనడానికి ఉన్న ప్రధాన ప్రతిబంధకం కూడా తొలగిపోయింది. దీంతో అందరి చూపు కశ్మీర్లో ఆస్తులు కొనాలనే దానిపైనే ఉంది. కశ్మీర్లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే శాంతిస్తాయా? ఆస్తులు కొందామా? అని ఆలోచిస్తున్నారు. దీనిపై ఎకనమిక్ టైమ్స్ ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం కశ్మీర్లో ఇళ్ల కొనుగోళ్లు జరుగుతున్నాయా? సోషల్ మీడియాలో వస్తోన్న అమ్మకాల ప్రకటనలు ఎంతవరకు నిజం? అక్కడ నిజంగా రియల్ ఎస్టేట్ అందుకు అనుగుణంగా ఉంటుందా? అంటూ కొన్ని సమాధానాలను వెతికే ప్రయత్నం చేసింది. కశ్మీర్లో ఇళ్లు కొనాలంటే జమ్మూకశ్మీర్‌ను జమూకశ్మీర్, లడాఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టారు. ఇక జమ్మూకశ్మీర్ భారత్‌లోని మిగతా రాష్ట్రాలతో సమానం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే అన్ని చట్టాలు, నియంత్రణలు కశ్మీర్‌కు కూడా మిగతా రాష్ట్రాలతో సమానంగా వర్తిస్తాయి. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి అపెక్స్‌లాంటి సంస్థ రెరా(రియల్ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) విధానం ఏవిధంగా రూపుదిద్దుకుంటుందనే దానిపైనే ఆ రాష్ట్రంలో ఇళ్ల కొనుగోళ్లు ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం ఆ విధానాల రూపకల్పనపై స్పష్టత రావాల్సింది ఉందని వెల్లడించింది. శ్రీనగర్‌లో ప్రస్తుతం చదరపు అడుగు రూ.2500 నుంచి రూ.3200 ఉంది. జమ్మూలో రూ.2400 నుంచి రూ.4000 ఉండగా బారాముల్లాలో రూ.2500 నుంచి రూ.3200 ఉంది. అయితే వీటి కొనుగోలుపై స్థానికేతరులకు ఇప్పుడే అనుమతి లేదని చెప్పింది. ఓ రియల్ఎస్టేట్ నిపుణుడు మాట్లాడుతూ.. మిగతా కొండ ప్రాంతపు రాష్ట్రాలతో సమానంగా ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌కు రెరా విధానాలని రూపొందిస్తుందా? లేక మరిన్ని నియంత్రణలు ఉంటాయా? అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఆస్తి లావాదేవీలు రెరా పరిమితికి లోబడి ఉంటాయని, సంస్థ ప్రకటన కోసం వేచి ఉండాలని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు అంతకాలం ఆగకపోతే కొనుగోలు లావాదేవీలలో న్యాయ నిపుణుడి సలహా తీసుకోవడం మంచిదని తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో ప్రధానంగా టైర్2, టైర్3 పట్టణాలు రియల్టీ గమ్యస్థానాలుగా మారుతాయి. జమ్మూకశ్మీర్‌కు రియల్ ఎస్టేట్‌లో భారీ సామర్థ్యం ఉన్నప్పటకీ ఇంకా ఆ దిశగా సరైన కృషి జరగలేదు. ఇప్పుడు అవకాశం వచ్చినా తక్షణ అభివృద్ధికి సమయం కావాలి. ఎందుకంటే నిబంధనల చుట్టూ చాలా అస్పష్టత ఉంది. పెట్టుబడిదారులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని సూచించారు. వినియోగదారుడు రక్షణ, భద్రతను దృష్టిలో పెట్టుకుంటారు కాబట్టి మరికొంత సమయం వేచి చూడాల్సిందేనని పేర్కొన్నారు. లడాఖ్ నుంచే రియల్ఎస్టేట్ ప్రారంభం కానుందని వెల్లడించారు. స్థానిక రాజకీయాల సహకారం, పట్టణ ప్రాంతాల అభివృద్ధికి అవకాశాలు ఎంతమేరకు ఉన్నాయనేది కూడా ముఖ్యమేనని తెలిపారు. ఇంకో నిపుణుడు మాట్లాడుతూ.. 370 రద్దుతో కశ్మీర్లో రియల్ ఎస్టేట్ అభివృద్ధి అమాంతం పెరుగుతుంది. ఈ ప్రాంతాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడి స్థానికులు వాళ్ల కళ్ల ముందరే ఉహించని మార్పును చూస్తారు. బాలీవుడ్ తదితర సినిమా ఇండస్ట్రీలు వస్తాయి. భారీ కంపెనీలు అక్కడి మార్కెట్ వృద్ధికి వ్యూహాత్మకంగా పనిచేస్తూ స్థానికులతో కలసి జాయింట్ వెంచర్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇక చివరాగా సోషల్ మీడియాలో కశ్మీర్లో విల్లాలు, బంగ్లాలను కొనండని వస్తున్న ప్రకటనలు అవాస్తవమని, కశ్మీర్లో ఆస్తిని సొంతం చేసుకోవాలనుకునే వారు అలాంటి అయాచిత సలహా లేదా ఆఫర్ల వలలో పడొద్దని సూచించారు. -
కశ్మీర్‌పై లండన్‌లో తీవ్ర నిరసనలు
లండన్ : వందలాది మంది కశ్మీరీ మద్దతుదారులు లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. జమ్మూకశ్మీర్ అంశంపై ఈ రోజు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో రహస్య సమావేశం జరుగుతున్న నేపథ్యంలో వారు భారత కార్యాలయాన్ని చుట్టుముట్టి నిరసన కార్యక్రమం చేపట్టారు. పాక్ జెండాలు, కశ్మీరీ జెండాలు పట్టుకుని బ్యానర్లు ప్రదర్శిస్తూ కశ్మీరీకి స్వేచ్ఛనివ్వండంటూ నినాదాలు చేశారు. భారత్ కశ్మీర్‌ను నిర్భందించి ఎటువంటి సమాచారం బయటకు రాకుండా కట్టడి చేస్తోందని ఫిర్యాదు చేశారు. జమ్మూకశ్మీర్ స్వయం ప్రతిపత్తిని పునరుద్ధరించడానికి ఐరాస భారతదేశంపై ఒత్తిడి తేవాలని అభ్యర్థించారు. నిరసనకారులకు నేతృత్వం వహిస్తోన్న సుమైయా షా అనే మహిళ మాట్లాడుతూ.. గత 12 రోజులుగా కశ్మీర్లో ఉంటున్న మా తల్లిదండ్రులతో మాట్లాడలేక పోతున్నానని చెప్పారు. భారతదేశం మొత్తం కశ్మీర్ జనాభాను నిర్భందించడమేగాక ఆ ప్రాంతాన్ని కర్ఫ్యూ నీడలో ఉంచిందని విమర్శించారు. ‘నా తల్లిదండ్రులకు సరైన ఆహారం, ఔషద మందులు లభిస్తున్నాయో.. లేదోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఆగస్టు 5న భారత ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి లండన్‌లో భారత వ్యతిరేక నిరసనలు ఎక్కువయ్యాయి. కాగా, జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను భారత్ రద్దు చేయడంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అరుదైన సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశాన్ని శుక్రవారం గోప్యంగా జరుపుతున్నట్లు దౌత్యవేత్తలు తెలిపారు. చైనా విజ్ఞప్తి మేరకు ఈ విధంగా రహస్య సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. -
ఆర్టికల్ 370 రద్దు : పిటిషనర్‌పై సుప్రీం ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ అత్యంత లోపభూయిష్టంగా ఉందని పిటిషనర్ ఎంఎల్ శర్మను సర్వోన్నత న్యాయస్ధానం తీవ్రంగా మందలించింది. ఆర్టికల్ 370 రద్దుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ అర్ధరహితంగా ఉందని పిటిషనర్, న్యాయవాది ఎంఎల్ శర్మను ఆక్షేపించింది. ఇదేం పిటిషన్ అంటూ ప్రశ్నించిన సుప్రీం కోర్టు ఈ పిల్‌ను కొట్టివేసేవారమని, కానీ ఈ అంశానికి సంబంధించి మరో ఐదు పిటిషన్లు రిజిస్టర్లో ఉన్నాయని పేర్కొంది. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన ఈ పిటిషన్‌ను పరిశీలించేందుకు తాను అరగంట సమయం వెచ్చించినా విషయం ఏమీ లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ పేర్కొన్నారు. మరోవైపు లోపభూయిష్ట పిటిషన్ దాఖలు చేసిన మరో కశ్మీరీ అడ్వకేట్ షబిర్ షకీల్‌పై సైతం ప్రధాన న్యాయమూర్తి మండిపడ్డారు. ఇక ఆర్టికల్ 370పై దాఖలైన ఆరు పిటిషన్లలో లోపాలను సరిచేయాలని ఆయా న్యాయవాదులను కోరిన కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. -
కశ్మీర్లో త్రివర్ణ పతాకం రెపరెపలు
శ్రీనగర్/లెహ్: జమ్మూకశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి రద్దు కారణంగా రాష్ట్ర ప్రజల ప్రత్యేక గుర్తింపుపై ఎలాంటి ప్రభావం ఉండబోదని గవర్నర్ సత్యపాల్ మాలిక్ స్పష్టం చేశారు. గురువారం షేర్–ఇ–కశ్మీర్ స్టేడియంలో నిర్వహించిన 73వ స్వాతంత్య్ర జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు జమ్మూకశ్మీర్ ప్రజల గుర్తింపుపై ఎలాంటి ప్రభావం చూపబోవని హామీ ఇస్తున్నాను. పైపెచ్చు, రాష్ట్రంలోని భిన్న ప్రాంతాల ప్రజల భాషా సాంస్కృతిక వికాసానికి అవి సాయపడతాయి. నవ కశ్మీర్ నిర్మాణంలో పాలుపంచుకోవాలని యువతను కోరుతున్నాను’అని పేర్కొన్నారు. కార్యక్రమానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా హాజరయ్యారు. ముందు జాగ్రత్తగా ముఖ్య నేతలందరినీ నిర్బంధంలోకి తీసుకున్నందున వారెవరూ రాలేకపోయారు. నగరంలో అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పాఠశాల విద్యార్థుల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా రద్దయ్యాయి. కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడనున్న లదాఖ్‌లో ప్రజలు మొట్టమొదటి స్వాతంత్య్ర వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. లదాఖ్‌లో జరిగిన వేడుకల్లో ప్రజలు తమ ఏకైక ఎంపీ జమ్యంగ్ త్సెరింగ్ నంగ్యా(24)తో కలిసి పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. -
కశ్మీర్ విషయంలో తప్పు చేశారు : చిదంబరం
-
జమ్మూకశ్మీర్ వెళ్లడం మానుకోండి!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, టెర్రర్ అలర్ట్ నడుమ ఆ రాష్ట్రంలో పర్యటించేవారు ‘అప్రమత్తంగా ఉండాలని’ జర్మనీ, బ్రిటన్‌తో సహా ఆస్ట్రేలియా ప్రభుత్వాలు తమ దేశ పౌరులకు సూచించాయి. ఉగ్ర మూకలు తెగబడే అవకాశం ఉందని నిఘా వర్గాలు జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ప్రత్యేకంగా అమర్నాథ్ యాత్రికులను, పర్యాటకులను వీలైనంత త్వరగా లోయ నుంచి బయలుదేరాలని శుక్రవారం కోరిన సంగతి తెలిసిందే. అంతేకాక అమరనాథ్ యాత్రను ఉన్నపళంగా నిలిపివేసింది. తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకొని.. జమ్మూకశ్మీర్‌లో ఉంటే అప్రమత్తంగా ఉండి, స్థానిక అధికారుల సలహాలను పాటించాలని తమ పౌరులకు పలు దేశాలు సూచనలు జారీ చేశాయి. ఢిల్లీలోని బ్రిటిష్ హైకమిషన్ కశ్మీర్‌లోని పరిస్థితిని పర్యవేక్షిస్తూ తమ దేశ పౌరులకు హెచ్చరిక జారీచేసింది. జనావాసంతో కూడిన ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాల్లో బాంబు, గ్రెనేడ్ దాడులు, కాల్పులు లేదా కిడ్నాప్లతో హింసాత్మక ఘటనలు జరిగే ప్రమాదం ఉందని, జాగ్రత్త వహించాలని కోరింది. ‘లద్దక్‌లోని పశ్చిమ ప్రాంతాలకు ప్రయాణించేటప్పుడు అతి జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రాంతాల్లో ఒంటరిగా లేదా గుర్తు తెలియని గైడ్‌తో అస్సలు ప్రయాణించొద్దు. పాకిస్తాన్, లద్దక్‌లోని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాతో తక్షణ సరిహద్దు ప్రాంతాలకు వెళ్లడం మానుకోండి’ అని జర్మనీ ప్రభుత్వం తమ పౌరులకు విజ్ఞప్తి చేసింది. యుకే, జర్మనీ తమ పౌరులకు ప్రయాణ సలహా ఇచ్చిన కొద్ది నిమిషాల తరువాత, ఆస్ట్రేలియా కూడా జమ్మూ కశ్మీర్‌కు వెళ్లవద్దని తన పౌరులకు సూచించింది. -
కిక్కిరిసిన శ్రీనగర్ విమానాశ్రయం
శ్రీనగర్: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అనూహ్యంగా జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న ప్రతిష్టాత్మక అమర్నాథ్ యాత్రను నిలిపేసి యాత్రికులు, పర్యాటకులు కశ్మీర్ లోయ నుంచి ఉన్నపళంగా వెనక్కు వెళ్లిపోవాలని కోరిన సంగతి తెలిసిందే. కశ్మీర్ లోయలో ఉగ్రమూకలు దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించిన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ హెచ్చరిక జారీ చేసింది. తీర్థయాత్రకు వచ్చిన వారు, పర్యాటకులు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లేందుకు ఒక్కసారిగా శ్రీనగర్ విమానాశ్రయానికి క్యూ కట్టడంతో వారికి టికెట్లు దొరకడం లేదు. భారీగా తరలి వచ్చిన యాత్రికులతో విమానాశ్రయం కిక్కిరిసింది. శ్రీనగర్ నుంచి అదనపు విమానాలను నడపడానికి విమానయాన సంస్థలు సిద్ధంగా ఉండాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశాలు జారీ చేసింది. రద్దీకి అనుగుణంగా జమ్మూకశ్మీర్ విమాన సర్వీసులను రీషెడ్యూల్ చేస్తున్నట్టు ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్టారా ప్రకటించాయి. కశ్మీర్ లోయలో ఎన్నడూ ఇటువంటి భయాందోళనక వాతావరణం చూడలేదని పలువురు యాత్రికులు పేర్కొన్నారు. దాల్ సరస్సు వద్ద షికారా ఎక్కుతున్న పర్యాటకులు కశ్మీర్ లోయలో శాంతి పెంపోందించేందుకు సహకరించాలని, పుకార్లను నమ్మవద్దని జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కోరారు. విద్యా సంస్థలను మూసివేయడానికి ఎలాంటి ఆదేశాలు జారీ కాకపోవడంతో యథాతథంగా కొనసాగుతున్నాయి. కశ్మీర్ రాష్ట్రంలో నెలకొన్న భయాందోళన పరిస్థితుల్లో స్థానికులు నిత్యావసరాలను నిల్వ చేయడానికి స్టోర్స్, ఏటీఎంలు, ఫార్మసీలకు క్యూ కడుతున్నారు. అంతేకాక పెట్రోల్ కోసం బంకుల వద్ద గంటల తరబడి వేచివుండాల్సి వస్తోంది. శ్రీనగర్‌లో పెట్రోల్ బంక్ వద్ద ప్రజలు -
‘ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేశాం’
జమ్మూ కశ్మీర్: ఉగ్రవాద కార్యకలాపాలకు విదేశాల నుంచి నిధులు సేకరించారన్న కేసులో నిందితులుగా ఉన్న.. ఆషియా, మసరత్ ఆలామ్, సబీర్ షాలు నేషన్ల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) విచారణలో కీలక అంశాలను వెల్లడించారు. నిషేధిక ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా (జేయూడీ)కు తాము నిధులను సమీకరించామని విచారణలో ఒప్పుకున్నారు. జేయూడీ కార్యకలాపాలకు నిధులు మళ్లిస్తున్నారన్న ఆరోపణలతో వారిని ఈనెల 4న ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. నిధుల మళ్లింపులో నిజాలు బయటకు రావడంతో అధికారులు వారిని అరెస్ట్ చేశారు. దీనికి నిరసనగా.. వారి మద్దతు దారులు కశ్మీర్ లోయలో నిరసనలు చేపట్టారు. కాగా కశ్మీర్లో భద్రతా బలగాలపైకి రాళ్లు విసురుతూ అల్లర్లు సృష్టిస్తున్న ఆరోపణలతో ఆషియాపై 2017లో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
రెండు మతాలు.. నాలుగు జీవితాలు
చండీగఢ్ : ‘మతం’ నువ్వు సంతోషంగా ఉంటూ.. తోటి వారికి మేలు చేయడానికి నిర్దేశించిన ఓ మార్గం. మనిషికి ప్రశాంతతను చేకూర్చడం.. హద్దు మీరకుండా.. సంఘానికి మేలు చేసే విధంగా జీవించడం ఎలానో వివరించేది మతం. కానీ నేటి సమాజంలో ఈ పరిస్థితులు పూర్తిగా మరిపోయాయి. ముఖ్యంగా ఓ మతం వారిని వేధిస్తూ.. దాడులకు పాల్పడటం.. హింసాకాండను సృష్టించడం నిత్యకృత్యమయ్యింది. ఒకప్పుడు హిందూ ముస్లిం భాయి భాయిగా విలసిల్లిన సంస్కృతి క్రమేపీ క్షీణిస్తుంది. ఇలాంటి రోజుల్లో.. ఇప్పుడు చెప్పబోయే సంఘటన గురించి తెలిస్తే.. మనసుకు సంతోషం కల్గుతుంది. పర్లేదు మన సమాజంలో మానవత్వం ఇంకా మిగిలే ఉందనిపిస్తుంది. ఓ ముస్లిం వ్యక్తికి హిందువు.. హిందూ స్త్రీకి ముస్లిం మహిళ కిడ్నీ దానమిచ్చి సాయానికి మతంతో సంబంధం లేదని నిరూపించారు. వివరాలు.. కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా కరేరి గ్రామానికి చెందిన అబ్దుల్ అజిజ్ నజర్(53) కార్పెంటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో కిడ్నీలో రాళ్లు రావడంతో అతని రెండు కిడ్నీలు పూర్తిగా పాడయ్యాయి. దాత కోసం వెతకడం ప్రారంభించాడు. ఫలితం లేకపోవడంతో ఓ ఆన్లైన్ యాప్‌లో తన బ్లడ్ గ్రూప్, సమస్య వివరాలను రిజిస్టర్ చేశాడు. దేవుడి మీద భారం వేసి.. దాత కోసం ఎదురు చూడసాగాడు. అటు బిహార్‌కు చెందిన సుజిత్ కుమార్ సింగ్ భార్య మంజులకు కూడ రెండు కిడ్నీలు చెడిపోయాయి. ఆమె కూడ దాత కోసం గాలిస్తూ.. ఫలితం లేక.. అబ్దుల్లానే యాప్‌లో తన వివరాలు పొందుపరిచింది. అదృష్టవశాత్తు అబ్దుల్ బ్లడ్ గ్రూప్, సుజిత్ బ్లడ్ గ్రూప్‌లు.. అలానే మంజుల, అబ్దుల్ భార్య షాజియా(50)ల బ్లడ్ గ్రూప్‌లు సరిపోయాయి. దాంతో వారు ఒకరికొకరు కిడ్నీ దానం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వీరి సొంత రాష్ట్రాల్లో ఈ కిడ్నీ మార్పిడి ఆపరేషన్లకు అనుమతి లభించలేదు. దాంతో పంజాబ్‌లో వీరికి సర్జరీ నిర్వహించారు. పంజాబ్ మొహాలి ఆస్పత్రి వీరికి వైద్య పరీక్షలు నిర్వహించి.. ఎటువంటి సమస్యలు లేవని నిర్థారించిన తర్వాత ఆపరేషన్ చేసి.. కిడ్నీ మార్పిడి చేశారు. డాక్టర్ ప్రియదర్శి రంజన్ ఒక్క రోజు వ్యవధిలోనే ఈ నాలుగు ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సదరు డాక్టర్ మాట్లాడుతూ.. ‘ఇది చాలా కష్టమైన ఆపరేషన్. ఇక్కడ సమస్య మతం కాదు.. అంతరాష్ట్ర అవయవ మార్పిడి నిబంధనలు చాలా ఇబ్బంది కల్గించాయి. రెండు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన దాతలు, గ్రహీతలకు మూడో రాష్ట్రంలో ఆపరేషన్ నిర్వహించడం చాలా కష్టమైన టాస్క్’ అన్నారు. ‘ఇక్కడ ప్రధానంగా నేను మూడు సమస్యలు ఎదుర్కొన్నాను. మొదటిది వైద్య సంబంధిత ఇబ్బందులు.. రెండు అంతరాష్ట్ర అవయవ మార్పిడి నిబంధనలు.. మూడు మతం. అయితే వైద్యశాస్త్రంలో మానవత్వానికే మొదటి ప్రాధాన్యత. అందుకే ఈ సమస్యల్ని అధిగమించగలిగాను’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నలుగురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. అబ్దుల్ మాట్లాడుతూ.. ‘నా దేహంలో ఒక కిడ్నీ.. హిందువుది అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఆపరేషన్‌కు గాను నాకు రూ. 7లక్షలు ఖర్చయ్యింది. అయితే ప్రభుత్వం నుంచి నాకు ఎలాంటి సాయం అందలేద’ని వాపోయాడు. సుజిత్ కుమార్, మంజుల కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నా దేహంలో ఓ ముస్లిం మహిళ అవయవం ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదన్నారు మంజుల. -
ఆరెస్సెస్ నేతపై ఉగ్రవాదుల కాల్పులు
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. కిష్ట్వార్ పట్టణంలో ఆరెస్సెస్ నేత చంద్రకాంత్‌పై దాడిచేసిన ఉగ్రవాదులు ఆయన వ్యక్తిగత భద్రతాధికారిని హత్య చేశారు. చంద్రకాంత్ వైద్య పరీక్ష కోసం స్ధానిక ఆస్పత్రికి వెళ్లగా అక్కడ ఉగ్రవాదులు దాడి చేయడంతో ఆరెస్సెస్ నేతకు గాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల కధనం ప్రకారం ఆస్పత్రిలోకి చొచ్చుకువచ్చిన ఉగ్రవాదులు చంద్రకాంత్ భద్రతా అధికారి నుంచి తుపాకీని లాక్కుని చంద్రకాంత్ సహా ఆయన భద్రతా అధికారిపై కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల ఘటనలో చంద్రకాంత్ వ్యక్తిగత భద్రతాధికారి మరణించారు. ఆరెస్సెస్ నేతకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా ఆరెస్సెస్ నేతపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పట్టణంలో కర్ఫ్యూ విధించారు. -
గ్రెనేడ్ దాడి కేసులో నిందితుడి పట్టివేత
ఢిల్లీ: జమ్మూ బస్టాండ్‌లో ప్రయాణికులపై గ్రెనేడ్ విసిరి పలాయనం చిత్తగించిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాంకు చెందిన యాసిర్ భట్‌గా పోలీసులు గుర్తించారు. జమ్మూ నుంచి పారిపోతుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ రోజు(గురువారం) ఉదయం 11.45 గంటలకు జమ్మూ బస్టాండ్‌లో జరిగిన గ్రెనేడ్ దాడిలో ఒకరు మృతిచెందగా..30 మందికి తీవ్రగాయాలైన సంగతి తెల్సిందే. పట్టుబడిన అనంతరం నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని ప్రత్యక్ష సాక్షులతో పాటు సీసీటీవీ కెమెరాలను పరిశీలించడంతో నిందితుడిని త్వరగా పట్టుకోగలిగారు. దీనిపై లోతైన దర్యాప్తు చేస్తున్నామని జమ్మూ ఐజీ మనీష్ సిన్హా తెలిపారు. జమ్మూ బస్టాండ్‌లో బాంబు పేలుడు -
తప్పుడు నిర్ణయాలతోనే తిప్పలు
తప్పుడు నిర్ణయాలతోనే తిప్పలు పుల్వామాలో మన కేంద్రీయ రిజర్వ్ పోలీసు దళం జవాన్లు 40 మందిని బలిగొన్న టెర్రరిజం భూతానికి మూలాలు కనుగొని దాన్ని కూకటివేళ్లతో సహా పెరికివేయడానికి మార్గాలు వెతకవలసిన రోజులివి. భయంకరమైన పేలుడు పదార్థాలను ఉపయోగించి విధ్వంసం సృష్టించే అవకాశాలున్నాయని జమ్మూకశ్మీర్ పోలీసులు ఫిబ్రవరి 8న హెచ్చరిక జారీ చేశారు. ‘మీరు వెళ్లే రోడ్డును పేలుడు పదార్థాలను పూర్తిగా ఏరిపారేసి శుధ్ధి చేయండి. ఎందుకంటే పేలుడు పదార్థాలు వాడే అవకాశాలున్నట్టు మాకు సమాచారం అందింది. చాలా అర్జంట్ విషయం’ అని జనరల్ పోల్ కశ్మీర్ జోన్ వారు పీసీఆర్ కశ్మీర్ ద్వారా సమాచారం పంపారు. ఈ సమాచారం ముందే అందినా ఈ దారుణాన్ని ఎందుకు నివారించలేకపోయారు? 2,500 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లను తరలించే మార్గంలోకి ఆ వ్యాన్ ఎలా రాగలిగింది? దాన్ని అడ్డుకోలేకపోయారా? అసలు చెక్‌పోస్ట్‌లే లేవా? పోనీ లేవనే అనుకుందాం. వేలాదిమంది జవాన్లను రోడ్ మార్గం ద్వారా తరలించే ముందు సెక్యూరిటీ కోసం అప్పుడైనా చెక్ చేయరా? జమ్మూ శ్రీనగర్ హైవేలో ఆర్డీఎక్స్ నింపిన వాహనాలను చెక్ చేయడానికి మూడు చోట్ల బారి యర్లు ఉండేవి. కానీ ఈ బారియర్లను మెహబూబా ముఫ్తీ నాయకత్వంలో నడిచిన సంకీర్ణ ప్రభుత్వం తొలగించిందని, అందుకే పుల్వామా జవాన్లమీద దాడిచేసిన వాహనాన్ని ఎవ్వరూ ఆపలేకపోయారని జేఎన్‌యూలో లా గవర్నెన్స్ అండ్ డిజాస్టర్ స్టడీస్ ప్రొఫెసర్ అమితా సింగ్ విమర్శిం చారు. ఆయనపై ముఫ్తీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. అంతకుముం దున్న బారియర్లను తొలగించారా లేదా అన్నది ప్రశ్న. తొలగిస్తే ఎందుకో చెప్పాలి. తొలగించకపోతే ఆ విషయం రూఢీగా చెప్పాలి. కానీ ప్రొఫెసర్‌ను దుర్భాషలాడి ఏం ప్రయోజనం? మేజర్ జనరల్ (రిటైర్డ్) జీడీ బక్షీ ఒక టీవీ చర్చలో పాల్గొంటూ ఆ రోడ్ మీద చెక్‌పోస్టులను, బారియర్లను ముఫ్తీ ఆదేశాలవల్ల తొలగించారని చేసిన వ్యాఖ్య సంచలనం కలిగించింది. అక్కడ బారియర్లను తొలగించడం వల్లనే ఉగ్రవాద దాడి జరిగిందని, దీనికి ఎవరు బాధ్యులని ఆయన తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. పాలనాపరమైన నిర్లక్ష్యాల వల్ల, తప్పుడు నిర్ణయాల వల్ల టెర్రరిస్టు ఘాతుకాలు ఆపగలిగి కూడా ఆపలేకపోతున్నారేమోనని ఈ రెండు వాదాలు విన్న తరువాత జనం అనుమానించవలసి వస్తుంది. ఫిబ్రవరి 16న సుబ్రమణ్య∙స్వామి ఒక ట్వీట్ చేశారు. ‘‘2014లో ఒక మారుతీ కార్ మూడు చెక్ పాయింట్లను దాటుకుని దూసుకు పోయిందని, ఆ కారుపైన కాల్పులు జరిపిన ఆర్మీ జవాన్లను ప్రాసిక్యూట్ చేయడానికి ఎవరు అనుమతించారు? ఆ ఉత్తర్వు ఇచ్చిన వ్యక్తి జవాన్ల మరణానికి బాధ్యత వహించాలి. ఆ ఆర్మీ జవాన్లు ఇంకా జైల్లో ఉన్నారు’’ అని ట్వీట్ చేశారు. ఇండియా టుడే వారి ఫేక్ న్యూస్ వ్యతిరేక వార్ రూం విభాగం వారు ఇందులో నిజానిజాలను పరిశోధించారు. బక్షీ చెప్పిన సంఘటన నవంబర్ 3, 2014 ఛట్టెర్గాం (బుద్గాం జిల్లా)లో జరిగింది. అయిదుగురు యువకులు ప్రయాణిస్తుండగా కాల్పులు జరిగాయనీ, 53వ రాష్ట్రీయ రైఫిల్ మెన్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారనీ, ఈ సంఘటనపై భిన్నవాదాలున్నాయని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనాన్ని ఉటంకిస్తూ ఇండియా టుడే వివరించింది. ఈ సంఘటన జరిగినప్పుడు ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ఉన్నారని పీడీపీ అధికారంలోకి ఇంకా రాలేదని వివరించారు. కాల్పులు జరిపిన వారిపై చడూరా పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నంబర్ 231 – 2014లో నమోదయింది. ఆర్మీ అధికారులు కూడా కాల్పులు జరపడం పొరబాటే అని అంగీకరించారు. 9 మంది సైనికులమీద కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీలో ప్రాసిక్యూషన్ ప్రారంభించారు. కానీ ఎవరినీ జైలుకు పంపలేదు. ఈ విషయాన్ని బక్షీకి తెలియజేస్తే, ఆయనకూడా పొరబాటు తెలుసుకున్నారని తేలింది. అయినా íపీడీపీ ప్రభుత్వం సెక్యూరిటీ చెకింగ్‌ను సడ లించడం వల్లనే కశ్మీర్ లోయలో కల్లోల సంఘటన జరిగిందని బక్షీ విమర్శించారు. తప్పుడు వార్తలను ఖండించి నిజానిజాలు తెలియజేయడం గొప్ప సేవ. టీవీ చర్చల్లో, ట్వీట్ వ్యాఖ్యల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించవలసి ఉంటుంది. సెక్యూరిటీ చెక్ నిబంధనలు సడలించడం, బారియర్లు తొలగించడం తప్పుడు నిర్ణయాలు కావా? పేలుడు పదార్థాలు నింపుకున్న వాహనం సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొనడం నిజం, అందాకా ఆ వాహనాన్ని ఎవరూ చెక్ చేయలేదనేది నిజం. వేలాది మంది జవాన్లను తరలించడానికి రోడ్డు దారి భద్రం కాదని, హెలికాప్టర్ల ద్వారా పంపాలని కోరినా నిరాకరించడం కూడా నిజం. నిజానిజాలను పరిశోధించాల్సిన బాధ్యత, నిజాలను జనం ముందుంచాల్సిన బాధ్యత లేదా? పాలనా వైఫల్యాలు, తప్పుడు నిర్ణయాలు ఎంతటి దారుణాని కైనా దారితీస్తాయి. తప్పుడు వార్తలు ఆ దారుణాలను ఇంకా మండిస్తాయి. వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
కశ్మీర్లో పెరిగిన రక్తపాతం
సాక్షి, న్యూఢిల్లీ : 2016లో భారత సైనికులు పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి టెర్రరిస్టు స్థావరాలను విధ్వంసం చేయడంతో కశ్మీర్ సమస్య పరిష్కారం కొత్త ఆశలు చిగురించాయి. నరేంద్ర మోదీ అనుసరిస్తున్న కఠిన వైఖరికి పాకిస్తాన్ ప్రభుత్వం దిగివచ్చి టెర్రరిస్టు సంస్థలకు మద్దతివ్వడం మానుకుంటుందని, ఫలితంగా కల్లోలిత కశ్మీర్లో ప్రశాంత పరిస్థితులు ఏర్పడతాయని ప్రభుత్వ వర్గాలతోపాటు రాజకీయ పరిశీలకులు భావించారు. ఆశలు నిరాశకాగా కశ్మీర్ పరిస్థితి మరింత అల్లకల్లోలంగా మారింది. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు టెర్రరిస్టు దాడులు పెరిగాయి, ఎన్కౌంటర్లు పెరిగాయి. దాడుల్లో సైనికుల మరణాలు, ఎన్కౌంటర్లలో టెర్రరిస్టుల మరణాలు, రెండింటిలో పౌరుల మరణాలు గణనీయంగా పెరిగాయి. ఈ విషయాన్ని ‘దక్షిణాసియా టెర్రరిజం పోర్టల్’ సేకరించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2014 నుంచి 2019 వరకు జమ్మూ కశ్మీర్లో జరిగిన టెర్రరిస్టు దాడుల గణాంకాలను పరిశీలిస్తే 2014 నుంచి వరుసగా పెరుగుతూ వచ్చాయి. ఈ ఏడాదిలో పుల్వామా ఉగ్రదాడిలో 44 మంది సైనికులు మరణించదనే అతి పెద్ద సంఘటన. ఇక టెర్రరిస్టులు, సెక్యూరిటీ సైనికులు జరిపిన దాడుల్లో మరణించిన పౌరుల సంఖ్య 2014 సంవత్సరంతో పోలిస్తే 2015, 2016 సంవత్సరాల్లో కాస్త తగ్గి ఆ తర్వాత వరుసగా రెండు సంవత్సరాల్లో పెరిగాయి. ఇక టెర్రరిస్టు దాడుల్లో సైనికులు మరణించడం కూడా 2014 సంవత్సరంతో పోలిస్తే ఒక్క 2015 సంవత్సరం మినహా అన్ని ఏళ్లు పెరుగుతూనే వచ్చాయి. ఇక సైనికులు జరిపిన ఎన్కౌంటర్లలో మరణించిన టెర్రరిస్టుల సంఖ్య 2014 సంవత్సరంతో పోలిస్తే ఒక్క 2015 సంవత్సరం మినహా మిగతా అన్ని సంవత్సరాలు పెరుగుతూ వచ్చాయి, టెర్రరిస్టులపై దాడులు పెరుగుతుంటే ఇరు వర్గాల మరణాల సంఖ్య పెరగడం సహజమని బీజేపీ ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక కశ్మీర్ ఎల్వోసీ వద్ద కాల్పుల విరమణ ఉల్లంఘన సంఘటనలు పెరగడం, టెర్రరిస్టుల నియామకాలు గణనీయంగా పెరగడం ఆందోళనకరం. -
రాష్ట్రపతి పాలనలోకి జమ్మూకశ్మీర్
న్యూఢిల్లీ: రాజకీయ సందిగ్ధత కారణంగా గత ఆరు నెలలుగా గవర్నర్ పాలనలో ఉన్న జమ్మూకశ్మీర్ తాజాగా రాష్ట్రపతి పాలనలోకి వెళ్లింది. బుధవారం అర్ధరాత్రి నుంచి కశ్మీర్‌ను రాష్ట్రపతిపాలనలోకి తెస్తూ రాష్ట్రపతి కోవింద్ అధికార ప్రకటన వెలువరించారు. రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించాలని సిఫార్సు చేస్తూ గవర్నర్ సత్యపాల్ మాలిక్ నివేదించిన నేపథ్యంలో సోమవారం మోదీ నేతృత్వంలోని మంత్రివర్గం రాష్ట్రపతిపాలనకు పచ్చజెండా ఊపింది. జూన్‌లో కశ్మీర్లో మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని అధికార పీడీపీ సర్కారుకు బీజేపీ మద్దతు ఉపసంహరించడంతో రాజకీయసంక్షోభం మొదలైంది. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల మద్దతు తమకుందని, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతినివ్వాలని ఆ తర్వాత గవర్నర్‌ను పీడీపీ కోరింది. అదే సమయంలో బీజేపీ, మరికొందరు ఇతర సభ్యుల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని సజ్జద్ లోన్ నేతృత్వంలోని పీపుల్స్ కాన్ఫరెన్స్ సైతం గవర్నర్‌ను కలిసింది. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుచేసే సామర్థ్యం రెండు కూటములకు లేవని భావిస్తూ గవర్నర్ అసెంబ్లీని రద్దుచేశారు. -
జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో బుధవారం అర్థరాత్రి నుంచి రాష్ట్రపతి పాలన అమలులోకి రానుంది. ఆరు నెలల గవర్నర్ పాలన ముగియడంతో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రం నిర్ణయించింది. గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఇప్పటికే ఒక నివేదికను కేంద్రానికి పంపడం, కేంద్ర కేబినెట్తోపాటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఆమోద ముద్ర వేయడంతో బుధవారం అర్థరాత్రి నుంచి రాష్ట్రపతి పాలన అమలులోకి రానుంది. ఈ ఏడాది జూన్ నెలలో సంకీర్ణ కూటమి నుంచి బీజేపీ వైదొలుగడంతో మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్ర ప్రత్యేక రాజ్యాంగం ప్రకారం, ప్రభుత్వం పడిపోతే ఆరు నెలల పాటు గవర్నర్ పాలన విధిస్తారు. గవర్నర్ ఈ ఆరు నెలల్లో వీలైతే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి లేదా అసెంబ్లీ రద్దు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఆరు నెలలపాటు రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది. ఈ కాలంలోనే రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికలు జరుగకపోతే మరో ఆరు నెలలు రాష్ట్రపతి పాలనను పొడిగించవచ్చు. -
ఎన్కౌంటర్లో మసూద్ అజర్ బంధువు హతం
శ్రీనగర్: కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజర్‌కు దగ్గరి బంధువు మహ్మద్ ఉస్మాన్ హతమయ్యాడు. త్రాల్ ప్రాంతంలో గత 10 రోజుల్లో భద్రతా దళాలపై జరిగిన దొంగచాటు దాడులకు ఉస్మాన్ నాయకత్వం వహించినట్లు సమాచారం. మంగళవారం నాటి ఎన్కౌంటర్ కూడా త్రాల్ ప్రాంతంలోనే జరగ్గా జైషే మహ్మద్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఘటనా స్థలం నుంచి ఒక ఎం–4 కార్బైన్ తుపాకీని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. భద్రతా బలగాలపై దొంగచాటుగా కాల్పులు జరిపేందుకు ఈ తుపాకులను వారు ఉపయోగించి ఉండొచ్చని అధికారులు చెప్పారు. మంగళవారం నాటి ఎన్‌కౌంటర్‌తో భద్రతా దళాలకు ఈ ఏడాదిలోనే గొప్ప విజయం లభించినట్లైందని ఓ అధికారి పేర్కొన్నారు. -
జమ్మూ పోలీసుకు ‘శౌర్య చక్ర’
న్యూఢిల్లీ: ఉగ్రవాదులను మట్టుబెట్టే క్రమంలో అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించి అశువులు బాసిన పోలీసు కానిస్టేబుల్ మన్జూర్ అహ్మద్ నాయక్‌కు మరణానంతరం శౌర్య చక్ర అవార్డు వరించింది. జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా ఉడీ ప్రాంతానికి చెందిన మన్జూర్ దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో 2017 మే 5న మిలిటెంట్లకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో మరణించాడు. అసాధారణ ధైర్య సాహసాలతో ఉగ్రవాదులను మట్టుబెట్టినందుకు మన్జూర్కు శౌర్య చక్ర అవార్డును అందిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. కాగా, జమ్మూ కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ దళాలు 2017లో సంయుక్తంగా చేపట్టిన సెర్చ్ ఆపరేషన్‌లో మన్జూర్ కూడా ఉన్నాడు. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఓ ఇంట్లో ఉన్నారని గుర్తించిన మన్జూర్ ఇంటి చుట్టూ పేలుడు పదార్థాలను అమర్చాడు. అప్రమత్తమైన ఉగ్రవాదులు కాల్పులు జరపగా మన్జూర్ తప్పించుకున్నాడు. అప్పటికే ఇంటి చుట్టూ దాదాపు సగం భాగం వరకు పేలుడు పదార్థాలు అమర్చిన మన్జూర్.. మిలిటెంట్లు కాల్పులు విరమించాక మిగతా భాగంలో కూడా అమర్చాడు. రెండోసారి బాంబులను అమర్చే క్రమంలో ఉగ్రవాదులు మన్జూర్పై మరోసారి కాల్పుల వర్షం కురిపించారు. తూటాలు దిగినా చివరి క్షణం వరకు తన వద్ద ఉన్న పేలుడు పదార్థాలను అమర్చాడు. ఈ క్రమంలో మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. -
జమ్మూకశ్మీర్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి..
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ హైకోర్టు చరిత్రలో మొట్టమొదటిసారి ప్రధాన న్యాయమూర్తిగా ఓ మహిళ బాధ్యతలు చేపట్టనున్నారు. ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక న్యాయమార్తిగా ఉన్న జస్టిస్ గీతా మిట్టల్‌ను జమ్మూకశ్మీర్ ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వురు జారీ అయ్యాయి. ఆమెతో పాటు మరో ఇద్దరు జడ్జీలు జమ్మూకశ్మీర్ హైకోర్టులో బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఢిల్లీ యూనివర్శిటీలో న్యాయవిద్యను పూర్తి చేసుకున్న గీత మిట్టల్ 1981 నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఆమె 2004 సంవత్సరంలో ఢిల్లీ హైకోర్టు అడిషనల్ జడ్జీగా నియమితులయ్యారు. గత సంవత్సరం ఢీల్లీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణి పదవీ విరమణ చేసిన తర్వాత గీత మిట్టల్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఢీల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కోర్టు పనితీరులో మార్పులు తీసుకువచ్చారు. ఆమె చేసిన న్యాయ సేవలకుగానూ ‘ నారీ శక్తి పురష్కార్’’ ను అందుకున్నారు. -
‘ఉగ్ర’ సమిధలుగా చిన్నారులు: ఐరాస
ఐరాస: పాకిస్తాన్‌కు చెందిన జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ తదితర ఉగ్రవాద సంస్థలు జమ్మూ కశ్మీర్లో భద్రతా దళాలపైకి రాళ్లు రువ్వేందుకు, అల్లర్లు సృష్టించేందుకు చిన్నారులను ఆయుధాలుగా వాడుకుంటున్నాయని ఐక్యరాజ్యసమితి (ఐరాస) నివేదికలో వెల్లడించింది. చిన్నారులు, సాయుధ దాడులు అనే అంశంపై ఐరాస వార్షిక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. 2017 జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రపంచవ్యాప్తంగా అల్లర్ల కారణంగా మరణించిన, గాయాలపాలైన చిన్నారుల సంఖ్య పదివేలకు పైగా ఉంది. అంతేకాకుండా ఉగ్ర సంస్థలు అల్లర్లు సృష్టించడానికి ఎనిమిది వేల మంది బాలలను నియమించుకున్నాయని నివేదిక స్పష్టం చేసింది. సిరియా, అఫ్గానిస్తాన్, యెమెన్, భారత్, ఫిలిప్పీన్స్, నైజీరియాలతో పాటు 20 దేశాలకు సంబంధించి ఈ నివేదికను తయారు చేశారు. భారత్‌లో ముఖ్యంగా జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులకు.. భద్రతా దళాలకు మధ్య జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో చిన్నారులు ఎక్కువగా బలైపోతున్నారని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లలో మావోయిస్టులు కూడా చిన్నారులనే ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు ప్రత్యేకంగా చిన్నారులను నియమించుకొని వారిచేత అల్లర్లు చేయిస్తున్నారని, అలాగే పిల్లలను ఇన్ఫార్మర్లు, గూఢచారులుగా ఉపయోగించుకుంటున్నారని వెల్లడించారు. పాకిస్తాన్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని నివేదిక వెల్లడించింది. -
ఇద్దరు లష్కరే ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో భద్రతా బలగాలు ఆదివారం లష్కరే తోయిబా కమాండర్ సహా ఇద్దరు ఉగ్రవాదుల్ని హతమార్చాయి. మరొకరిని ప్రాణాలతో పట్టుకున్నాయి. ఈ విషయమై ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(కశ్మీర్ రేంజ్) స్వయంప్రకాశ్ పానీ మాట్లాడుతూ.. కుల్గామ్ జిల్లాలోని చద్దర్బన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కిఉన్నారని నిఘావర్గాల నుంచి పక్కా సమాచారం అందిందన్నారు. దీంతో ఆర్మీ, సీఆర్పీఎఫ్, కశ్మీర్ పోలీసుల సంయుక్త బృందం అక్కడకు చేరుకుని ఉగ్రవాదులు దాక్కున్న ఇంటిని చుట్టుముట్టిందని వెల్లడించారు. భద్రతాబలగాల కదలికల్ని పసిగట్టిన ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారని పేర్కొన్నారు. దీంతో బలగాలు సైతం ఎదురుకాల్పులు జరిపాయన్నారు. ఈ ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన డివిజినల్ కమాండర్ షకూర్ అహ్మద్ దార్ సహా ఇద్దరు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఈ ఘటనలో మరో ఉగ్రవాది భద్రతాబలగాలకు లొంగిపోయినట్లు వెల్లడించారు. ఘటనాస్థలం నుంచి భారీఎత్తున ఆయుధాలు, మందుగుండును స్వాధీనం చేసుకున్నామన్నారు. చనిపోయిన షకూర్ అహ్మద్‌తో పాటు బలగాలకు లొంగిపోయిన ఉగ్రవాది స్థానికుడేనన్నారు. ఈ కాల్పుల్లో చనిపోయిన మరో ఉగ్రవాది హైదర్ పాకిస్తాన్‌కు చెందినవాడని పేర్కొన్నారు. మరోవైపు కుల్గామ్ జిల్లాలోని గోబల్ గ్రామంలో ఆర్మీ వాహనంపై అల్లరిమూకలు రాళ్లదాడికి పాల్పడ్డాయి. ఈ దాడి తీవ్రతరం కావడంతో ఆర్మీ జవాన్లు జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు(23) ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి పెల్లెట్ గాయాలయ్యాయి. జూన్ 20న త్రాల్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు జైషే మహమ్మద్ ఉగ్రవాదుల్ని, 22న ఐసిస్ కశ్మీర్ చీఫ్ సహా నలుగురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఈ నెల 28న అమర్నాథ్ యాత్ర ప్రారంభంకానున్న నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో వరుస ఎన్కౌంటర్లు జరుగుతుండటం గమనార్హం. -
రాం మాధవ్ (బీజేపీ ప్రధాన కార్యదర్శి) రాయని డైరీ
గవర్నర్ పాలన విధించాక ఈ మూడు రోజుల్లో కశ్మీర్‌కు కాస్త కళ వచ్చింది. జమ్మూ లోయలో పూలు చక్కగా వికసిస్తున్నాయి. సీజన్ కాదు కాబట్టి కశ్మీర్లో ఆపిల్స్ మాత్రం కనిపించడం లేదు. ఆగస్టు నాటికి అవీ వచ్చేస్తాయి. మూడు రోజుల గవర్నర్ పాలనకే కశ్మీర్ ఇంత కన్నుల పండుగగా ఉంటే బీజేపీ పవర్లోకి వస్తే ఇంకెంత మనోహరంగా ఉంటుందోనని.. ముఫ్తీ మెహబూబా, ఒమర్ అబ్దుల్లా తప్ప.. కశ్మీర్ ప్రజలందరూ ఇళ్లలో కూర్చుని, కిటికీల్లోంచి చేతులు బయటపెట్టి, వాన చినుకుల్ని ఎంజాయ్ చేస్తున్నారని తెలిసింది! సిగ్నిఫికెంట్ ఛేంజ్! ‘‘మీరూ ఇక్కడికే షిఫ్ట్ అయిపోండి రామ్‌జీ’’ అన్నారు కశ్మీర్‌లోని మా ఎమ్మెల్యేలు. నవ్వాను. ‘‘నేను కూడా కశ్మీర్‌కి సీజన్ లాంటి వాడినే. రావాలి, వెళ్లాలి. అంతే తప్ప, ఉండిపోకూడదు’’ అన్నాను. ‘‘మేమైతే గవర్నర్ రూల్‌ని భలే ఎంజాయ్ చేస్తున్నాం రామ్‌జీ. పవర్లో లేకపోయినా, పవర్లో ఉన్నట్లే ఉంది. మెహబూబా మాత్రం కోపంగా ఉన్నారు.. సపోర్ట్ లాగేసుకుంటున్నట్లు ఒక్కమాటైనా చెప్పలేదని!’’ అన్నారు. గవర్నర్‌కి ఫ్యాక్స్ పంపుతున్నప్పుడే మెహబూబాకూ ఫోన్ చేశాను. గవర్నర్‌కి ఫ్యాక్స్ వెళ్లింది. మెహబూబాకు ఫోన్ వెళ్లలేదు. కారుకు జామర్లు పెట్టుకుని తిరిగితే ప్రజలు ఎలా కనెక్ట్ అవుతారు? ‘‘ఒమర్ అబ్దుల్లా కూడా మిమ్మల్ని ఇష్టమొచ్చినట్లు తిడుతున్నాడు రామ్‌జీ’’ అన్నాడు కవీందర్ గుప్తా. తిడితే నన్ను గుప్తా తిట్టాలి. మెహబూబా సీఎం సీటుతో పాటు, అతడి డిప్యూటీ సీటూ పోయింది. ‘‘పోనీలే గుప్తాజీ.. మీరైతే తిట్టుకోవడం లేదు కదా నన్ను’’ అని నవ్వాను. అసెంబ్లీలో నాలుగు సీట్లున్న ప్రతివారికీ కోపమే! సీట్లో కూర్చునే అర్హత ఉండీ, రెండేళ్లుగా నిలబడే ఉన్నవాళ్లకు ఇంకెంత కోపం రావాలి?! ఎమ్మెల్యేల్ని కొనొచ్చన్న నమ్మకంతోనే బీజేపీ బయటికెళ్లిపోయిందని ఒమర్ ప్రచారం చేస్తున్నాడు! ఎవరి మీద వారికి నమ్మకం లేకుండా ఉంటుందా? ఒక సీటొచ్చిన సీపీఎంకీ ఉంటుంది. పన్నెండు సీట్లున్న కాంగ్రెస్కీ ఉంటుంది. ఏ పార్టీలోనూ లేని ఇండిపెండెంట్లకీ ఉంటుంది. ఒమర్‌కే లేనట్లుంది. ఆయన్ని ఎమ్మెల్యేలు నమ్ముతున్నారు కానీ, ఆయనే ఎమ్మెల్యేల్ని నమ్మడం లేదు. ఇలాంటి లీడర్లు పవర్లోకి వస్తే ప్రజల్ని కూడా నమ్మరు. గవర్నర్‌కి మళ్లీ ఒక ఫ్యాక్స్ కొట్టి రిలాక్స్ అవుతుంటే ఆర్ణబ్ గోస్వామి ఫోన్ చేశాడు. ‘‘నేషన్ వాంట్స్ టు నో’’ అన్నాడు. నేషన్‌కి ఇప్పుడు ఏం తెలియకుండా పోయింది ఆర్ణబ్?’’ అని పెద్దగా నవ్వాను. అతడు నవ్వలేదు. ‘‘సీరియస్లీ.. నేషన్ వాంట్స్ టు నో’’ అన్నాడు. నేషన్కైనా, మనిషికైనా ఎక్కువ తెలిస్తే ఇదే ప్రాబ్లమ్. ఏమీ లేనిదాని గురించి ఏదో తెలుసుకోవాలనిపిస్తుంది. -
గవర్నర్ పాలనపై స్పందించిన ఆర్మీ చీఫ్
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌లో గవర్నర్ పాలన అమలు చేయడం ఉగ్రవాద వ్యతిరేక కార్యకాలపాలపై ఎలాంటి ప్రభావం చూపదని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్‌సింగ్ రావత్ స్పష్టం చేశారు. తమ కార్యకలాపాల్లో రాజకీయ జోక్యం ఉండదని అన్నారు. రంజాన్ సందర్భంగానే తాము ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌ను నిలిపివేశామని, అయితే పాక్ నుంచి కవ్వింపు చర్యలు ఎదురవడంతో ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని ఆయన వ్యాఖ్యానించారు. కాగా కశ్మీర్లో తక్షణం అమలయ్యేలా ఆర్నెల్ల పాటు గవర్నర్ పాలన విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని బుధవారం ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. రాష్ట్రంలో బీజేపీ-పీడీపీ సంకీర్ణం ప్రభుత్వం కుప్పకూలిన మరుక్షణమే గవర్నర్ పాలన విధించారు. రంజాన్ సందర్భంగా నిలిపివేసిన ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను పునరుద్ధరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో పీడీపీ, బీజేపీల మధ్య తీవ్ర విభేదాలు పొడసూపిన విషయం తెలిసిందే. వేర్పాటువాదులకు మరికొంత సమయం ఇవ్వాలని మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీ కోరుతుండగా, వేర్పాటువాదులకు ఇప్పటికే పలు అవకాశాలు ఇచ్చామని, అయితే వారు సానుకూలంగా స్పందించడంలో విఫలమయ్యారని బీజేపీ వాదిస్తోంది. -
భారత్ ప్రాజెక్టుపై పాక్ అభ్యంతరం
ఇస్లామాబాద్: భారత్- పాకిస్తాన్ మధ్య వివాదాస్పద కిృష్ణగంగా హైడ్రాలిక్ ప్రాజెక్టుని శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. భారత్ ఈ హైడ్రాలిక్ ప్రాజెక్టుని ప్రారంభించడంపై పాక్ బహిరంగంగా విమర్శిస్తోంది. కశ్మీర్లో భారత్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుపై పాక్ ఎప్పటినుంచో అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇండస్ జలాల ఒప్పందంలోని వివాదాలను పరిష్కరించకుండా ప్రాజెక్టును ఏలా ప్రారంభిస్తారని పాక్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై పాక్ విదేశాంగ శాఖ శనివారం ఓ లేఖని విడుదల చేసింది. కశ్మీర్‌లోని బందీపూర్ జిల్లాలో కిృష్ణగంగా నదిపై 330 మెగావాట్ల సామర్థ్యంతో కిృష్ణగంగా హైడ్రాలిక్ పవర్ ప్రాజెక్టుకు 2007లో భారత్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పాక్ ఈ ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇండస్ జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోందని పాక్ చేస్తోన్న ఆరోపణలను భారత్ ఖండించింది. ఒప్పందంలోని అంశాలకు లోబడే ఈ ప్రాజెక్టుని నిర్మించినట్లు భారత్ తెలిపింది. -
అకృత్యంపై ఆగ్రహజ్వాల
ఆదోని అర్బన్/రూరల్ : అభం.. శుభం.. తెలియని ఎనిమిదేళ్ల చిన్నారి ఆసిఫాపై కశ్మీర్లో జరిగిన లైంగిక దాడి, హత్యాకాండపై జిల్లావ్యాప్తంగా నిరసన జ్వాలలు రగులుతున్నాయి. శనివారం ఆదోనిలో వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, ముస్లిం మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో వేలాది మంది పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. నాయకులు, కార్యకర్తలు, అన్ని వర్గాల జనం నల్లబ్యాడ్జీలతో పట్టణంలోని పాత పోస్టాఫీసు నుంచి షరాఫ్ జార్, పీఎన్రోడ్, ఎంఎం రోడ్, కోట్ల కూడలి మీదుగా ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయం చేరుకుని అక్కడ బైఠాయించారు. ఆసిఫాకు జరిగిన అన్యాయంపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్డీఓ కార్యాలయ పరిపాలనాధికారికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఆసిఫాపై లైంగిక దాడికి పాల్పడి హతమార్చడం దారుణమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ముస్లిం మత పెద్దలు అలీఆజ్మీ అల్తాఫ్, ఖాజా అల్తాఫ్ హుసేన్, నాయకులు సౌదీ రవూఫ్, షఫీ, అప్సర్‌బాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ అల్తాఫ్, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ నాయకులు చంద్రకాంత్ రెడ్డి, ఇక్బాల్, ఎజాజ్, సాయిరాం, నీలకంఠప్ప, దిలీప్దోఖా తదితరులు పాల్గొన్నారు. -
ఈ పెన్ పదాలను లెక్కిస్తుంది..
సాక్షి, శ్రీనగర్ : కంప్యూటర్లో, మొబైల్ ఫోన్లలో మనం ఎన్ని పదాలు టైప్ చేశామో తెలుస్తుంది.. కానీ పేపర్‌పై మాత్రం ఎన్ని పదాలు రాశామో తెలుసుకోవడం కష్టమే.. కానీ ఓ తొమ్మిదేళ్ల బాలుడు తయారుచేసిన కౌంటింగ్ పెన్ దీనికి పరిష్కారం చూపింది. రాసే పెన్నుతోనే ఎన్ని పదాలు రాస్తున్నామో తెలిసుకునేలా దీనిని రూపొందించాడు. ఈ పెన్నుని తయారుచేసిన జమ్మూకాశ్మీర్‌కు చెందిన ముజఫర్ అహ్మద్ ఖాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ పెన్ ద్వారా ఎన్ని పదాలు రాస్తున్నామో వాటి సంఖ్య పెన్ను పైభాగంలో గల చిన్న ఎల్సీడీ స్ర్కీన్‌పై కనిపించడంతో పాటు మొబైల్‌కు కూడా మెసేజ్ వస్తుంది. ‘పరీక్షలో తక్కువ పదాలు రాసినందుకు తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో ఎంతో కుంగిపోయాను. ఆ తర్వాత పరీక్షలో టైమ్ ఎలా సద్వినియోగం చేసుకోవాలనే దానిపై దృష్టి సాధించాను. ఆ ఆలోచనల్లో నుంచి తయారయిందే ఈ కౌంటింగ్ పెన్’ అని అహ్మద్ తెలిపాడు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన ఓ ఇన్నోవేషన్ కార్యక్రమంలో ఈ పెన్నుని ప్రదర్శించగా.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అహ్మద్‌ను ప్రశంసించడంతో పాటు రివార్డును అందజేశారు. నేషనల్ ఇన్నోవేషన్ పౌండేషన్ కౌంటింగ్ పెన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి నిర్ణయించుకుంది. మే నుంచి ఈ పెన్ను మార్కెట్లోకి రానుంది. -
కశ్మీర్లో ఐసిస్ మహిళా గ్రూప్ కదలికలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో తొలిసారిగా ఐసిస్ అనుకూల మహిళా గ్రూప్ దౌలతుల్ ఇస్లాం కదలికలు కలకలం రేపుతున్నాయి. జమ్మూ కశ్మీర్లో దౌలతుల్ ఇస్లాం కార్యకలాపాలు చురుగ్గా సాగుతున్నాయని హోంమంత్రిత్వ శాఖ హెచ్చరించింది. కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఉగ్ర సంస్థతో సంబంధాలు కలిగిన ఈ మహిళా గ్రూప్ ఐసిస్ సిద్ధాంతాలను బలపరుస్తూ ఉద్రేకపూరిత ప్రసంగాలు చేస్తున్నట్టు హోంమంత్రిత్వ శాఖ నివేదిక స్పష్టం చేసింది. అనంత్‌నాగ్‌లో ఓ ఉగ్రవాది హతమైన క్రమంలో తొలిసారిగా కాశ్మీర్లో దౌలతుల్ ఇస్లాం సభ్యుల కార్యకలాపాలు తొలిసారిగా వెలుగుచూసినట్టు నివేదిక పేర్కొంది. ఈ ఉగ్రవాది నివాసాన్ని సందర్శించిన మహిళా గ్రూపు సభ్యులు జీహాద్‌కు అనుకూలంగా ఉద్వేగపూరిత ప్రసంగం చేసినట్టు తెలిసింది. ఈ నివేదిక నేపథ్యంలో జమ్ము కశ్మీర్లో పెరుగుతున్న ఐసిస్ ప్రాబల్యం పట్ల హోంమంత్రిత్వ శాఖ అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. హకూరలో హతమైన ముగ్గురు ఉగ్రవాదులు ఐసిస్ సభ్యులుగా భావిస్తున్నారు. వీరి పేర్లను ఐసా ఫజ్లి, సయ్యద్ ఓవైస్‌షా, సుల్తాన్ అల్ హైదరాబాదీలుగా చెబుతున్నారు. -
కీలుబొమ్మగా మారిన మెహబూబా ముఫ్తీ
సాక్షి, న్యూఢిల్లీ : ‘మిమ్మల్ని ఇక్కడికి పిలిపించిందీ మాతో చేయి చేయి కలుపుతారని. కశ్మీర్లో ఏదో చిన్న సంఘటన జరుగుతుంది. ఎక్కడో మిలిటెంట్లకు, ప్రభుత్వ సైనికులకు మధ్య కాల్పులు జరుగుతాయి. అంతే, టీవీ ఛానళ్లలో కశ్మీర్ మొత్తం తగులబడి పోతున్నట్లు చూపిస్తారు. మనమున్న పరిస్థితిని దాచేందుకు ప్రయత్నించడం లేదు. ఒక్కసారి ప్రపంచం వైపు చూడండి! ప్రతి చోటా ఏదో సమస్య ఉంటోంది. ఇక్కడ మన సమస్య ఏమిటంటే మన దేశమే మనల్ని ఒంటరి వాళ్లను చేసింది. నేను పిలవగానే మీరు రావడం ముందుగానే వసంత గాలులు వీస్తున్నట్లు ఉంది. ఇది శుభసూచకం. ఇక్కడ మనం చేయాల్సిన పని క్లిష్టమైనదే. మా తండ్రి ఎప్పుడూ ఒక విషయం చెబుతుండేవాడు. కశ్మీర్‌కు ఓ పర్యాటకుడు రావడం అంటే ఇక్కడ శాంతి కోసం పెట్టుబడి పెట్టడమేనని. భారత సైనికులు సరిహద్దుల్లో పోరాడుతున్నట్లే ఇక్కడ కూడా సైనికులు మిలిటెంట్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. రాష్ట్రంలో శాంతియుత పరిస్థితుల పునరుద్ధరణకు మరోరకంగా మనమూ యుద్ధం చేయాల్సిందే. పర్యాటకరంగం పరిఢవిల్లేలా చేయడమే ఆ యుద్ధం. మనం దేశం నుంచి విడిపోయిన్లు భావించరాదు. అతి పెద్ద దేశంలో భాగంగానే బతుకుతున్నామన్న భావన కలగాలి’ అంటూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఇటీవల శ్రీనగరంలో జరిగిన భారత పర్యాటక ఏజెంట్ల సమ్మేళనంలో ప్రసంగించారు. రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివద్ధి చేయడం ద్వారా మిలిటెంట్ కార్యకలాపాలు తగ్గి రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు ఏర్పడతాయన్నది ఆమె అభిప్రాయంగా స్పష్టం అవుతోంది. ఆమె తన ఉపన్యాసాన్ని కాస్త గంభీర్యంగానే ప్రారంభించినా ఆమె మాటల్లో ఆర్ద్రత, ఆవేదనతోపాటు అశక్తత కూడా కనిపించింది. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆమె తండ్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ పర్యాటకులు రావడం అంటే రాష్ట్రంలో శాంతి స్థాపనకు అది పెట్టుబడే అని ఎప్పుడూ చెప్పేవారు. అయితే ఆయన శాంతికి భంగం కలిగిస్తున్న వారిని ఎప్పుడూ మిలిటెంట్లు అని అనలేదు. వారిని తిరుగుబాటుదారులుగానే వ్యవహరించారు. గతంలో మొహబూబా ముఫ్తీ కూడా తిరుగుబాటుదారుల సమస్య అనే మిలిటెన్సీని వ్యవహరించారు. రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీతో చేతులు కలిపి ఆమె సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆమె భాష మారినట్లు ఉంది. ఆమె పర్యాటక ఏజెంట్ల సమ్మేళనాన్ని నిర్వహించి ‘ఇయర్ ఆఫ్ విజిటింగ్ కశ్మీర్’గా నిర్ణయించిన రెండు రోజులకే ఎదురు కాల్పుల్లో పౌరులు సహా 20 మంది మిలిటెంట్లు, సైనికులు మరణించారు. 2016, జూలైలో జరిగిన అల్లర్లలో దాదాపు వంద మరణించినప్పటి నుంచి రాష్ట్రంలో పరిస్థితులు చేయిదాటి పోయాయి. మిలిటెంట్ కమాండర్ బుర్హాన్ వనీ హత్యతో ఆ అల్లర్లు చెలరేగాయి. అంతకుముందు మిలిటెంట్ కార్యకలాపాలకు అంతగా ప్రజల మద్దతు ఉండేది కాదని, 2016 నుంచి ప్రధాన రాజకీయ పార్టీల పట్ల ప్రజల్లో వ్యతిరేక భావం పెరగడంతోపాటు మిలిటెంట్ కార్యక్రమాలకు ప్రజల మద్దతు పెరిగిందని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని కశ్మీర్ యూనివర్శిటీలో పనిచేస్తున్న పొలిటికల్స్ సైన్స్ ప్రొఫెసర్ తెలిపారు. రోజుకో ఏదోచోట కాల్పులు జరిగి పౌరులు కూడా మరణిస్తున్న ప్రస్తుత పరిస్థితులకు ‘మోదీ నుంచి మెహబూబా వరకు అందరూ బాధ్యులే’ అని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీనగర్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కేవలం ఆరుశాతం ఓట్లు నమోదయ్యాయంటే ఎన్నికల పట్ల, రాజకీయ పార్టీల పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత పెరిగిందో తెలుస్తోంది. మెహబూబా తండ్రి మరణంతో ఖాళీ అయిన ఎంపీ సీటుకు రెండేళ్లుగా ఎన్నికలు నిర్వహించకపోవడం, గతేడాదే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించి నేటికి నిర్వహించక పోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా గతంలో నేషనల్ కాన్ఫరెన్స్, మెహబూబా నాయకత్వంలోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలు ప్రజలకు కనిపించేవి. ఇప్పుడు వాటి ఉనికిని కూడా ప్రజలు గుర్తించడం లేదు. అందుకని మిలెటెన్సీ పెరుగుతోంది. మెహబూబా బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో ఆమె పట్లప్రజలకు సగం నమ్మకం పోయింది. సరైన పాలన అందించడంలో విఫలమైనందున ఆమె పట్ల పూర్తి విశ్వాసం పోయింది. కతువా ప్రాంతంలో ఎనిమిదేళ్ల ముస్లిం బాలికను సైనికులు దారణంగా రేప్‌చేసి హత్య చేసిన కేసులో నిందితులకు మద్దతుగా జరిగిన ప్రదర్శనలో తన కేబినెట్లోని ఇద్దరు బీజేపీ మంత్రులు పాల్గొనడం పట్ల మెహబూబా మౌనం వహిచండం ఆమె మద్దతుదారులు కూడా సహించలేకపోతున్నారు. ఇక ఆఖరి కశ్మీర్ నిరంకుశ రాజు హరీ సింగ్ విగ్రహాన్ని ఆమె ఇటీవల ఆవిష్కరించడాన్ని వారు అంతకన్నా జీర్ణించుకోలేకపోతున్నారు. బీజేపీ ప్రోద్బలంతో విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆమె నేడు సీఎం కుర్చీలో కూర్చున్న కీలుబొమ్మ మాత్రమేనని వారు వ్యాఖ్యానిస్తున్నారు. -
లాయర్ దీపిక సంచలన వ్యాఖ్యలు
శ్రీనగర్ : బాధితుల తరపున న్యాయం కోసం పోరాడుతుంటే తోటి న్యాయవాదుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని లాయర్ దీపికా సింగ్ రాజవత్ తెలిపారు. దేశవ్యాప్తంగా సంచలనం చేసిన కతువా గ్యాంగ్ రేప్, హత్య కేసులో బాధితుల తరపున ఆమె వాదిస్తున్నారు. జమ్మూకశ్మీర్ కతువా జిల్లాలో నోమాడియక్ బకెర్వాల్ తెగకు చెందిన 8 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో 60 ఏళ్ల సాంజి రామ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో బాలిక తల్లిదండ్రుల పక్షాన జమ్మూ హైకోర్టులో వాదనలు వినిపిస్తున్న దీపిక సంచలన వాఖ్యలు చేశారు. ‘ఈ కేసులో బాధితుల తరపున నిలబడ్డ క్షణం నుంచి అనేక రకాల బెదిరింపులు ఎదురవుతున్నాయి. ఎన్ని హెచ్చరికలు వచ్చినా న్యాయం కోసం వాటిని పట్టించుకోను. హైకోర్టులో తోటి న్యాయవాదులే నన్ను దూషిస్తున్నారు. 8 ఏళ్ల బాలికపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చంపేస్తే అక్కడ స్థానిక లాయర్లు కేసు నమోదు కాకుండా నిందింతులకు సహాయం చేశారు. దీని వెనుక వారి ఉద్దేశం అర్థవవుతుంది. జమ్మూ బార్ అసోషియేషన్ అధ్యక్షుడు బీఎస్ సలాథియా నన్ను ఈ కేసు వాదించవద్దన్నారు. ఒకవేళ నువ్వు వాదిస్తే నిన్ను ఎలా అడ్డుకోవాలో తెలుసని ఆయన బెదిరించారు. భయంతో నేను భద్రత కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆశ్రయించానని.. వారు తనకు రక్షణ కల్పించాలని పోలీసు శాఖను ఆదేశించార’ని దీపిక వివరించారు. ప్రస్తుతం జరుగుతున్న విచారణ పట్ల బాలిక తల్లిదండ్రులు సంతృప్తిగా ఉన్నారని, అలాంటప్పుడు సీబీఐ దర్యాప్తు అవసరం ఏముందని ఆమె అభిప్రాయపడ్డారు. -
జమ్మూ కశ్మీర్లో భూకంపం
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. ఈ భూకంపం ద్వారా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదు. రిక్టర్ స్కేలు భూకంప తీవ్రత 4.0 గా నమోదైనట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణా శాఖ అధికారంగా వెల్లడించింది. సోమవారం ఉదయం 6.06 గంటలకు భూకంపం సంభవించినట్లు వెల్లడించింది. అలాగే భూకంప కేంద్రం పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ జిల్లా కేంద్రంగా గుర్తించారు. ఈ ఘటనకు సంభవించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కశ్మీర్లో భారీ ఎన్కౌంటర్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో బుధవారం ఐదుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. జమ్మూకశ్మీర్ పోలీస్ విభాగంలో స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్‌వోజీ)కు చెందిన మొహమ్మద్ యూసుఫ్, దీపక్ పండిట్లతో పాటు ఆర్మీలోని 160వ బెటాలియన్‌కు చెందిన మొహమ్మద్ అష్రఫ్, నాయక్ రంజిత్ సింగ్, మరో జవాన్ ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయినట్లు ఆ రాష్ట్ర డీజీపీ ఎస్పీ వైద్ తెలిపారు. ఈ కాల్పుల్లో మరో ఇద్దరు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. ఉగ్రవాదుల ఏరివేతలో భద్రతా బలగాలతో పాటు పారా కమెండోలు కూడా పాల్గొన్నారన్నారు. బుధవారం రాత్రివరకూ సాగిన ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదుల్ని హతమార్చామనీ, వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. మృతులంతా విదేశీయులేనని ఆయన స్పష్టం చేశారు. ఘటనాస్థలం నుంచి ఏకే–47 తుపాకులతో పాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నియంత్రణ రేఖ(ఎల్వోసీ) దాటి కుప్వారాలోని హల్మత్పొరా ప్రాంతానికి మంగళవారం చేరుకున్న ఉగ్రవాదులు అక్కడ మద్దతుదారులతో కలసి విందులో పాల్గొన్నారన్నారు. అనంతరం వీరు కుప్వారా పట్టణానికి బయలుదేరుతుండగా పోలీస్ గస్తీ బృందం ఎదురుపడిందన్నారు. దీంతో ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు యత్నించారని వెల్లడించారు. అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరుపుతూ ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారన్నారు. -
బీజేపీ నేతపై మిలిటెంట్ల దాడి
శ్రీనగర్ : కల్లోల ప్రాంతం కాశ్మీర్లో గురువారం బీజేపీ నాయకుడు అన్వర్ ఖాన్‌పై మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారు. అయితే అదృష్టవశాత్తు దాడి నుంచి ఆయన తప్పించుకోగలిగారు. కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఈ దాడి జరిగింది. అన్వర్ ఖాన్ వ్యక్తిగత అంగరక్షకుడు బిలాల్ అహ్మద్‌కు మాత్రం గాయలైయ్యాయి. బాల్‌హమా ప్రాంతంలో మిలిటెంట్లు ఒక్క సారిగా అన్వర్ ఖాన్‌పై కాల్పులు జరిపారు. గాయపడ్డ ఆయన పర్సనల్ సెక్యురిటీ ఆఫీసర్‌ను ఆసుపత్రిలో చేర్చినట్టు అధికారులు తెలిపారు. -
హోలీ సంబరాల్లో బీఎస్ఎఫ్ జవాన్లు
సాక్షి, జమ్మూ : దేశ భద్రతను కాంక్షిస్తూ నిత్యం సరిహద్దుల్లో పహారా కాసే సరిహద్దు భద్రతా దళ జవాన్లు గురువారం హోలీ సంబరాల్లో మునిగితేలారు. దేశాన్నికాపాడేందుకు అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ దీటుగా సేవలందించే జవాన్లు కొద్దిసేపు సేదతీరారు. జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి బీఎస్ఎఫ్ జవాన్లు ఆటపాటలతో హోలీని సెలబ్రేట్ చేసుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సరిహద్దులో సందడి చేశారు. మిఠాయిలు పంచుకుని పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నా పెద్దా తేడాలేకుండా ఆనందంగా రంగుల పండుగను జరుపుకున్నారు.