
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో గత రెండేళ్లలో జరిగిన పోలీస్ ఆపరేషన్స్(కాల్పులు, ఎన్‌కౌంటర్లు, ప్రమాదవశాత్తూ మరణాలు)లో మొత్తం 183 మంది పౌరులు మృతిచెందారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో- ఎన్‌సీఆర్‌బి వెల్లడించింది. ఎన్‌సీఆర్‌బీ డేటా ప్రకారం రాష్ట్రాలవారీగా చూస్తే జమ్మూకశ్మీర్లోనే అత్యధికమంది ప్రాణాలు కోల్పోయారు. 2019లో జరిగిన పోలీస్ కాల్పుల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 71 మంది మృతిచెందారు. జమ్మూకశ్మీర్‌లో 33 మంది, మహరాష్ట్రలో 15 మంది పౌరులు.. పోలీసుల కాల్పుల్లో మృతిచెందారు. (చదవండి: ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లకు గాయాలు)
2018లో మొత్తం 112 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా వీరిలో జమ్మూకశ్మీర్‌లో జరిగిన దుర్ఘటనల్లోనే 72 మంది మృతిచెందారు. తమిళనాడులో 14, తెలంగాణలో 11 మంది మరణించారు. ఈ రెండేళ్లలో మొత్తం 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారని ఎన్‌సీఆర్‌బి తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment