జమ్ము కశ్మీర్‌లో కొనసాగుతున్న తొలి విడత పోలింగ్‌ | jammu kashmir assembly first phase polling updates | Sakshi
Sakshi News home page

జమ్ము కశ్మీర్‌లో కొనసాగుతున్న తొలి విడత పోలింగ్‌

Published Wed, Sep 18 2024 6:53 AM | Last Updated on Wed, Sep 18 2024 8:41 AM

jammu kashmir assembly first phase polling updates

Updates

  • జమ్ము కశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌(జేకేఎన్సీ) అభ్యర్థి సజ్జాద్ అహ్మద్ కిచ్లూ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • కిష్త్వార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున షాగున్ పరిహార్, పీడీపీ తరపున ఫిర్దూస్ అహ్మద్ తక్ బరిలో​ ఉన్నారు.

 

 

  • జమ్ము కశ్మీర్‌లో తొలి విడత పోలింగ్‌ కొనసాగుతోంది.
  • డోడా జిల్లాలోని ఓ పోలింగ్ బూత్ వద్ద తమ ఓటు వేయడానికి భారీ క్యూలైన్‌ నిల్చొన్న ఓటర్లు.
  • దోడా సెగ్మెంట్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నుంచి ఖలీద్‌ నజీబ్‌, బీజేపీ నుంచి గజయ్‌సింగ్‌ రాణా, కాంగ్రెస్‌ తరఫున షేక్‌ రియాజ్‌, డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ ఆజాద్‌ పార్టీ (డీపీఏపీ)నుంచి అబ్దుల్‌ మజీద్‌ వనీ బరిలో ఉన్నారు.

 

  • ఓటు వేసిన బనిహాల్ అసెంబ్లీ  గ్మెంట్‌ బీజేపీ అభ్యర్థి మొహమ్మద్ సలీమ్ భట్ 

 

  • ఓటు హక్కు వినియోగించుకున్న స్వతంత్ర అభ్యర్థి మహ్మద్ అల్తాఫ్

 

  • జమ్ము కశ్మీర్‌లో కొనసాగుతున్న తొలి విడత పోలింగ్‌
  • పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు
  • ప్రజలు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ప్రజాస్వామ్య హక్కు , మంచి అభ్యర్థిని ఎన్నుకోండి. 10 సంవత్సరాల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలు సంతోషంగా ఉన్నారు, ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు: రాజ్‌పోరా అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థి మహ్మద్ అల్తాఫ్
  • ఇంజనీర్ రషీద్ అవామీ ఇత్తెహాద్ పార్టీ మద్దతుతో రాజ్‌పోరా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి బరిలో ఉన్న మహ్మద్ అల్తాఫ్

     
     

  • కుల్గామ్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ వద్ద ఓటర్లు తమ ఓటు వేసేందుకు క్యూలైన్లలో ఎదురు చూస్తున్నారు.
  • కుల్గాంలో సీపీఎం నుంచి మహ్మద్ యూసుఫ్ తరిగామిని, నేషనల్ కాన్ఫరెన్స్ తరపున నజీర్ అహ్మద్ లావే, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) నుంచి మహమ్మద్ అమీన్ దార్ బరిలో దిగారు.


     

 

  • జమ్ము కశ్మీర్‌లో తొలివిడత పోలింగ్‌ కొనసాగుతోంది.
     
  • పుల్వామాలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ వద్ద ఓటర్లు తమ ఓటు వేయడానికి క్యూలైన్లలో నిల్చొన్నారు. 
     
  • ఇక్కడ..నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి మహ్మద్ ఖలీల్ బ్యాండ్‌, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) నుంచి అబ్దుల్ వహీద్ ఉర్ రెహ్మాన్ పారా బరిలో ఉన్నారు. 

     

 

  • పలు పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు ఓటు వేసేందుకు క్యూలైన్లలో నిల్చొని ఉ‍న్నారు. 

     

  • జమ్ము కశ్మీర్‌లో తొలి వితడ పోలింగ్‌ కొనసాగుతోంది.

  • పలు నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

 

పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనండి: ప్రధాని మోదీ

  • జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ప్రారంభమైనందున, ఈ రోజు పోలింగ్‌కు వెళ్లే నియోజకవర్గాల్లోని వారందరూ పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని కోరుతున్నా. 
  • నేను ముఖ్యంగా యువకులు తమ ఓటు హక్కు వినియోగించుకునే సమయమని తెలియజేస్తున్నా

     

     

  • ఓటు వేయడానికి ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుంటున్నారు.  
  • జమ్మూ కశ్మీర్‌లో పదేళ్ల అనంతరం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటం విశేషం.
  • పైగా జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను, ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని రద్దు చేశాక జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలివి.
  • జమ్ము కశ్మీర్‌లో ప్రారంభమైన తొలి విడత పోలింగ్‌

     

     

  • జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలల్లో భాగంగా 7 జిల్లాల పరిధిలో 24 అసెంబ్లీ స్థానాలకు   ఇవాళ( బుధవారం) తొలి విడతలో పోలింగ్‌ జరగనుంది.
  •  వీటిలో 8 స్థానాలు జమ్మూలో, 16 కశ్మీర్‌ ప్రాంతంలో ఉన్నాయి. 
  • 90 మంది స్వతంత్రులతో కలిపి మొత్తం 219 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 
  • వారి భవితవ్యాన్ని 23 లక్షల పై చిలుకు ఓటర్లు బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తం చేయనున్నారు. 

     

  • తొలి విడత పోలింగ్‌ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు జరగనుంది. 

    బరిలో ప్రముఖులు:

  •  మొహమ్మద్‌ యూసుఫ్‌ తరిగమీ (సీపీఎం) కుల్గాం నుంచి వరుసగా ఐదో విజయంపై కన్నేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్‌ మీర్‌దూరు నుంచి మూడోసారి గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. 
  • నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత సకీనా (దమ్హాల్‌ హాజిపురా), పీడీపీ నేతలు సర్తాజ్‌ మద్నీ (దేవ్‌సర్‌), అబ్దుల్‌ రెహా్మన్‌ వీరి (షంగుస్‌–అనంత్‌నాగ్‌), మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తిజా (శ్రీగుఫ్వారా–బిజ్‌బెహరా), వహీద్‌ పరా (పుల్వామా) తదితర ప్రముఖులు తొలి విడతలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 

     

  • ఉగ్ర ముప్పు నేపథ్యంలో సీఏపీఎఫ్, స్థానిక పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్‌ బూత్‌లకు, సిబ్బందికి అదనపు భద్రత కల్పిస్తున్నారు.
  • సెప్టెంబర్‌ 25, అక్టోబర్‌ 1న రెండు, మూడో విడతతో పోలింగ్‌ ప్రక్రియ ముగుస్తుంది.
  • ఫలితాలు అక్టోబర్‌ 8న వెల్లడవుతాయి.

చదవండి: ఆతిశి డమ్మీ సీఎంగా ఉంటారు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement