బీజేపీ నాయకుడి వాహనాలకు నిప్పు | BJP leader Van Among Two Vehicles Set Ablaze By Terrorists In Kulgam | Sakshi
Sakshi News home page

బీజేపీ నాయకుడి వాహనాలకు నిప్పుపెట్టిన ఉగ్రవాదులు

Published Fri, Nov 1 2019 11:45 AM | Last Updated on Fri, Nov 1 2019 11:46 AM

BJP leader Van Among Two Vehicles Set Ablaze By Terrorists In Kulgam - Sakshi

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కుల్గాం జిల్లా బోనిగాం గ్రామంలో ఉగ్రవాదులు బీజేపీ నాయకుడికి చెందిన రెండు కార్లకు నిప్పు పెట్టారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన బీజేపీ నాయకుడు అదిల్‌ అహ్మద్‌ నివాసం బయట జరిగింది. ఆదిల్ నివాసం బయట పార్క్ చేసిన వాహనాలకు ముష్కరులు నిప్పు పెట్టిన సమయంలో ఆయన ఇంట్లో లేరని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement