మిసెస్‌ వరల్డ్‌గా సర్గమ్‌ కౌశల్‌.. 21 ఏళ్ల తర్వాత భారత్‌కు కిరీటం.. | Jammu Sargam Kaushal Mrs World 2022 | Sakshi
Sakshi News home page

మిసెస్‌ వరల్డ్‌గా సర్గమ్‌ కౌశల్‌.. 21 ఏళ్ల తర్వాత భారత్‌కు కిరీటం..

Published Mon, Dec 19 2022 7:05 AM | Last Updated on Mon, Dec 19 2022 7:05 AM

Jammu Sargam Kaushal Mrs World 2022 - Sakshi

న్యూఢిల్లీ: ముంబైకి చెందిన సర్గమ్‌ కౌశల్‌ మిసెస్‌ వరల్డ్‌ 2022 కిరీటం దక్కించుకున్నారు. శనివారం అమెరికాలోని వెస్ట్‌గేట్‌ లాస్‌వెగాస్‌ రిసార్ట్‌ అండ్‌ క్యాసినోలో జరిగిన పోటీల్లో 63 దేశాలకు చెందిన సుందరీమణులు ఈ కిరీటం కోసం తలపడ్డారు. సర్గమ్‌ విజేతగా నిలవగా మొదటి రన్నరప్‌గా మిసెస్‌ పోలినేసియా, రెండో రన్నరప్‌గా మిసెస్‌ కెనడా నిలిచారు.

2001లో నటి, మోడల్‌ అదితి గోవిత్రికర్‌ మిసెస్‌ వరల్డ్‌ గెలుచుకోగా, 21 ఏళ్ల తర్వాత తిరిగి భారత్‌కు ఆ గౌరవం దక్కింది. సర్గమ్‌ కౌశల్‌ జమ్మూకశీ్మర్‌కు చెందిన వారు. మిసెస్‌ వరల్డ్‌ పోటీలను 1984 నుంచి నిర్వహిస్తున్నారు.
చదవండి: మోరల్‌ పోలీసింగ్‌ వద్దు: సుప్రీం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement