భారత్‌ ప్రాజెక్టుపై పాక్‌ అభ్యంతరం | Pakistan Oppose Kishanganga Project | Sakshi
Sakshi News home page

భారత్‌ ప్రాజెక్టుపై పాక్‌ అభ్యంతరం

Published Sat, May 19 2018 4:14 PM | Last Updated on Sat, May 19 2018 5:56 PM

Pakistan Oppose Kishanganga Project - Sakshi

కిృష్ణగంగా ప్రాజెక్టు (ఫైల్‌ ఫొటో)

ఇస్లామాబాద్‌: భారత్‌- పాకిస్తాన్‌ మధ్య వివాదాస్పద కిృష్ణగంగా హైడ్రాలిక్‌ ప్రాజెక్టుని శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. భారత్‌ ఈ హైడ్రాలిక్‌ ప్రాజెక్టుని ప్రారంభించడంపై పాక్‌ బహిరంగంగా విమర్శిస్తోంది. కశ్మీర్‌లో భారత్‌ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుపై పాక్‌ ఎప్పటినుంచో అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇండస్‌ జలాల ఒప్పందంలోని వివాదాలను పరిష్కరించకుండా ప్రాజెక్టును ఏలా ప్రారంభిస్తారని పాక్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై పాక్‌ విదేశాంగ శాఖ శనివారం ఓ లేఖని విడుదల చేసింది.

కశ్మీర్‌లోని బందీపూర్ జిల్లాలో కిృష్ణగంగా నదిపై ‌330 మెగావాట్ల సామర్థ్యంతో కిృష్ణగంగా హైడ్రాలిక్‌ పవర్‌ ప్రాజెక్టుకు 2007లో భారత్‌ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పాక్‌ ఈ ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇండస్‌ జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత్‌ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోందని పాక్‌ చేస్తోన్న ఆరోపణలను భారత్‌ ఖండించింది. ఒప్పందంలోని అంశాలకు లోబడే ఈ ప్రాజెక్టుని నిర్మించినట్లు భారత్‌ తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement