Kishanganga hydroelectricity project
-
ప్రపంచ బ్యాంకులో పాక్‌కు ఎదురుదెబ్బ!
వాషింగ్టన్ : ప్రపంచ బ్యాంక్‌లో పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన కిషన్ గంగ జలవిద్యుత్ ప్రాజెక్ట్ సింధు జలాల ఒప్పందం 1960కి విరుద్ధమని పాక్ ప్రపంచ బ్యాంక్‌ను ఆశ్రయించింది. పాక్ అభ్యంతరాలను తొసిపుచ్చిన వరల్డ్ బ్యాంక్, వివాద పరిష్కారానికి తటస్థ నిపుణుడిని ఏర్పాటు చేయాలన్న భారత్ వాదనలను ఆమోదించింది. ఈ విషయంలో వెనక్కి తగ్గాలని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్‌యాంగ్ కిమ్ పాక్ ప్రభుత్వానికి సూచించినట్లు డాన్ పత్రిక పేర్కొంది. గత గురవారమే అటార్నరీ జనరల్ ఆఫ్ పాకిస్తాన్‌కు (ఏజీపీ) ప్రపంచ బ్యాంకు నుంచి ఓ లేఖ అందిందని ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌ను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను పాక్ వదులుకుంటే భారత్ సూచించినట్లుగా ఈ వివాద పరిష్కారానికి తటస్థ నిపుణుడు నియమిస్తామని ఆ లేఖలో ప్రపంచ బ్యాంకు పేర్కొన్నట్లు ఆ పత్రిక ప్రచురించింది. గత నెల జమ్మూ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ జీలం ఉపనది అయిన కిషన్‌గంగ నదిపై 330 మెగావాట్ల జలవిద్యుత ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు డిజైన్‌తో తమకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని పాక్ తొలి నుంచి వాదిస్తూ వస్తోంది. ఈ వివాదం పరిష్కారానికి కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌ను ఏర్పాటు చేయాలంటూ గతంలోనే పాక్ ప్రపంచ బ్యాంకును కోరింది. నది గమనంలో మార్పులేకపోయినా, దిగువకు వచ్చే నీటి శాతం తగ్గిపోతుందని పాక్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 2007లో భారత్ ఈ ప్రాజెక్టును ప్రారంభించిన వెంటనే అంతర్జాతీయ న్యాయస్థానాన్ని పాక్ ఆశ్రయించింది. దీనిపై స్టే విధించడంతో నిర్మాణ పనులు మూడేళ్లపాటు నిలిచిపోయాయి. కానీ 2013లో భారత్‌కు అనుకూలంగా అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ‘ఇది సింధు జలాల ఒప్పందంలో భాగమే. జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మించుకునే హక్కు భారత్‌కు ఉంది. అలాగే వరల్డ్ బ్యాంక్ ఒప్పందం ప్రకారం కూడా భారత్ ఆ నదులపై డ్యామ్‌లను నిర్మించుకోవచ్చు’ అని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. మరోవైపు వరల్డ్ బ్యాంకు కూడా ఒప్పందానికి లోబడే భారత్ జీలం, చీనాబ్ ఉప నదులపై ప్రాజెక్టులను నిర్మిస్తోందంటూ చెబుతోంది. -
పాక్ ఝలక్.. భారత్‌పై ఫిర్యాదు
ఇస్లామాబాద్: భారత్‌కు పాక్ ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. కిషన్ గంగ జలవిద్యుత్ ప్రాజెక్టు విషయంలో ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైపోయింది. జమ్ము పర్యటన సందర్భంగా శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. అయితే కిషన్‌గంగ జలవిద్యుత ప్రాజెక్టు.. సింధు జలాల ఒప్పందం 1960కి విరుద్ధమని పాక్ వాదిస్తోంది. ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేసే విషయాన్ని రేడియో పాకిస్థాన్ సోమవారం ధృవీకరించింది. రానున్న మూడు రోజుల్లో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో తమ అధికారులు చర్చలు జరుపుతారని పాక్‌లో అమెరికా రాయబారి అయిజాజ్ చౌద్రి మీడియాకు వెల్లడించారు. ఈ వివాదం పరిష్కారానికి కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌ను ఏర్పాటు చేయాలంటూ గతంలోనే ప్రపంచ బ్యాంకును కోరింది కూడా. కాగా, ఈ ప్రాజెక్టు డిజైన్‌తో తమకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని పాక్ తొలి నుంచి వాదిస్తూ వస్తోంది. నదీ గమనంలో మార్పులేకపోయినా, దిగువకు వచ్చే నీటి శాతం తగ్గిపోతుందని పాక్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 2007లో భారత్ ఈ ప్రాజెక్టును ప్రారంభించిన వెంటనే అంతర్జాతీయ న్యాయస్థానాన్ని పాక్ ఆశ్రయించింది. దీనిపై స్టే విధించడంతో నిర్మాణ పనులు మూడేళ్లపాటు నిలిచిపోయాయి. కానీ 2013లో భారత్‌కు అనుకూలంగా అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ‘ఇది సింధు జలాల ఒప్పందంలో భాగమే. జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మించుకునే హక్కు భారత్‌కు ఉంది. అలాగే వరల్డ్ బ్యాంక్ ఒప్పందం ప్రకారం కూడా భారత్ ఆ నదులపై డ్యామ్‌లను నిర్మించుకోవచ్చు’ అని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. మరోవైపు వరల్డ్ బ్యాంకు కూడా ఒప్పందానికి లోబడే భారత్ జీలం, చీనాబ్ ఉప నదులపై ప్రాజెక్టులను నిర్మిస్తోందంటూ చెబుతోంది. -
విసిరే ప్రతీ రాయితో అస్థిరత
శ్రీనగర్: దారితప్పిన కశ్మీరీ యువత విసిరే ప్రతీ రాయి, వాడే ప్రతీ ఆయుధం కశ్మీర్ రాష్ట్రంతోపాటు దేశాన్ని కూడా అస్థిరపరుస్తాయని ప్రధాని మోదీ అన్నారు. ఈ అస్థిరత్వం నుంచి రాష్ట్రాన్ని బయటకు తెచ్చేందుకు అభివృద్ధి పథంలో నడవాలని పిలుపునిచ్చారు. మోదీ శనివారం కశ్మీర్లో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతోపాటు మరికొన్ని పూర్తయిన ప్రాజెక్టులను దేశానికి అంకితమిచ్చారు. ఈ ప్రాజెక్టుల మొత్తం విలువ 25 వేల కోట్ల రూపాయలు. పర్యటనలో భాగంగా బౌద్ధ సన్యాసి 19వ కుషోక్ బకులా రింపోచె శత జయంతి ఉత్సవాల ముగింపు సభలో మోదీ ప్రసంగించారు. రింపోచె రాష్ట్రంలో ఎమ్మెల్యేగా, మంగోలియాకు రాయబారిగా కూడా పనిచేశారు. యువత అభివృద్ధి పథంలో నడవాలి.. రాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా కొన్ని విదేశీ శక్తులు అడ్డుకుంటున్నాయని మోదీ అన్నారు. యువత తమ భవిష్యత్తు కోసం, రాబోయే తరాల భవిష్యత్తు కోసం అభివృద్ధిలో భాగం కావాలని కోరారు. కశ్మీర్‌లోని గురేజ్‌లో నిర్మించిన 330 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన కిషన్‌గంగ ప్రాజెక్టును మోదీ దేశానికి అంకితమిచ్చారు. 42 కి.మీ.ల పొడవుతో శ్రీనగర్ రింగురోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కశ్మీర్ అభివృద్ధిలో పర్యాటక రంగానిది కీలక పాత్ర అనీ, అందుకే పర్యాటకులను ఆకర్షించేందుకు వెడల్పైన రోడ్లు, నిత్యం విద్యుత్తు సరఫరా, విమాన సేవలు తదితర సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. ఆసియాలోనే అత్యంత పొడవైన సొరంగం కశ్మీర్ పర్యటనలో భాగంగా మోదీ జోజిలా సొరంగ మార్గం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిర్మాణం పూర్తయితే ఇది ఆసియాలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గంకానుంది. లేహ్ ప్రాంతాన్ని మిగతా దేశంతో కలిపేందుకు ఈ సొరంగం బాగా ఉపయోగపడుతుంది. కశ్మీర్‌లోని ఎత్తైన పర్వత కనుమల్లో ఒకటైన జోజిలా.. శ్రీనగర్–కార్గిల్–లేహ్ జాతీయ రహదారిపై, సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తులో ఉంది. శీతాకాలంలో భారీగా మంచు కురుస్తుంది కాబట్టి ఈ రహదారిని మూసేస్తారు. దీంతో లడఖ్ ప్రాంతానికి రాకపోకలు సాధ్యపడవు. ఈ ఆటంకాన్ని అధిగమించేందుకు 14.15 కిలోమీటర్ల పొడవుతో, రెండు వరసల రహదారితో ఈ సొరంగాన్ని నిర్మిస్తున్నారు. దీని నిర్మాణం కారణంగా జోజిలా పర్వత ప్రాంతంలో ప్రస్తుతం ప్రయాణానికి మూడున్నర గంటలు పడుతుండగా.. సొరంగం నిర్మాణం పూర్తయ్యాక అది 15 నిమిషాల్లోనే పూర్తవుతుంది. జమ్మూలోనూ పర్యటించిన మోదీ అక్కడి వైష్ణోదేవి ఆలయానికి చేరుకునేందుకు కొత్తగా తారాకోట మార్గాన్ని ప్రారంభించారు. ఓ విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. -
భారత్ ప్రాజెక్టుపై పాక్ అభ్యంతరం
ఇస్లామాబాద్: భారత్- పాకిస్తాన్ మధ్య వివాదాస్పద కిృష్ణగంగా హైడ్రాలిక్ ప్రాజెక్టుని శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. భారత్ ఈ హైడ్రాలిక్ ప్రాజెక్టుని ప్రారంభించడంపై పాక్ బహిరంగంగా విమర్శిస్తోంది. కశ్మీర్లో భారత్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుపై పాక్ ఎప్పటినుంచో అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇండస్ జలాల ఒప్పందంలోని వివాదాలను పరిష్కరించకుండా ప్రాజెక్టును ఏలా ప్రారంభిస్తారని పాక్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై పాక్ విదేశాంగ శాఖ శనివారం ఓ లేఖని విడుదల చేసింది. కశ్మీర్‌లోని బందీపూర్ జిల్లాలో కిృష్ణగంగా నదిపై 330 మెగావాట్ల సామర్థ్యంతో కిృష్ణగంగా హైడ్రాలిక్ పవర్ ప్రాజెక్టుకు 2007లో భారత్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పాక్ ఈ ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇండస్ జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోందని పాక్ చేస్తోన్న ఆరోపణలను భారత్ ఖండించింది. ఒప్పందంలోని అంశాలకు లోబడే ఈ ప్రాజెక్టుని నిర్మించినట్లు భారత్ తెలిపింది. -
పాకిస్థాన్ కుటిలత్వం
న్యూఢిల్లీ: భారత్ చేతిలో చావు దెబ్బలు తింటున్నా పాకిస్థాన్‌కు వంకర బుద్ధి మారడంలేదు. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను దోషిగా చూపాలని కుతంత్రాలు పన్నుతూనే ఉంది. జమ్మూ కశ్మీర్‌లోని జీలం నది బేసిన్లో భారత్ నిర్మిస్తున్న కిషన్‌గంగ జలవిద్యుత్ కేంద్రంపై అభ్యంతరాలు ఉన్నాయని, తమ అభ్యంతరాలు వినడానికి మధ్యవర్తిత్వ కోర్టును ఏర్పాటు చేయాలని ప్రాజెక్టు రుణదాత అయిన ప్రపంచ బ్యాంకును ఇటీవల కోరింది. సింధు జలాల ఒప్పందానికి వ్యతిరేకంగా భారత్ ఈ ప్రాజెక్టు నిర్మిస్తోందని ఫిర్యాదు చేసింది. దీనిపై భారత్ స్పందిస్తూ.. ఒప్పందం ప్రకారమే ఈ 360 మెగావాట్ల సామర్థ్యమున్న ప్రాజెక్టును నిర్మిస్తున్నామని, ప్రాజెక్టు నిర్మాణంలో సాంకేతిక విషయాలు ఉన్నందున వివాదాల పరిష్కారానికి తటస్థ నిపుణుడిని నియమించాలని ప్రపంచ బ్యాంకును కోరింది. ఇరు దేశాలు తమ తమ అభ్యంతరాలను, వివరాలను గతనెల 27న వాషింగ్టన్‌లోని ప్రపంచ బ్యాంకుకు సమర్పించాయని భారత అధికార వర్గాలు తెలిపాయి. న్యాయనిపుణుడి కన్నా ఇంజనీరింగ్ నిపుణుడైతే విషయాలు బాగా అర్థం చేసుకోగలడని ఆ వర్గాలు తెలిపాయి. నీటి ప్రవాహాన్ని అడ్డుకునేలా ప్రాజెక్టు డిజైన్ ఉందని పాకిస్తాన్ ఫిర్యాదు చేయగా.. భారత్ దానిని పూర్తిగా ఖండించింది. ఈ ప్రాజెక్టుపై 2010లో అంతర్జాతీయ న్యాయస్థానంలో కూడా పాక్ ఫిర్యాదు చేసింది. 2013లో భారత్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. ప్రస్తుతం యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కడానికి పాకిస్థాన్ ప్రపంచ బ్యాంకును ఆశ్రయించింది. పాక్ ఫిర్యాదు చేసినా పనులు ఆగవని భారత వర్గాలు తెలిపాయి.