
సాధారణంగా కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో రాష్ట్ర బడ్జెట్‌లను ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీల్లో ప్రవేశపెట్టడం ఆనవాయితీ. కానీ ఆనవాయితీకి భిన్నంగా ఈ రాష్ట్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి వస్తుంది. అందుకు బలమైన కారణాలే ఉన్నాయి.
కల్లోల ప్రాంతంగా పేరొందిన జమ్ము, కశ్మీర్‌ల బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022 మార్చి 14న పార్లమెంటులో జమ్ము, కశ్మీర్ బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకువస్తున్నారు. మేరకు ఆ ప్రాంతానికి సంబంధించిన బడ్జెట్ ప్రతులు ఈ రోజు పార్లమెంటు ఆవరణకు చేరుకోగానే మరోసారి భద్రపరమైన తనిఖీలు నిర్వహించారు. కేంద్ర బడ్జెట్‌ను డిజిటల్ పద్దతిలో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. కశ్మీర్ బడ్జెట్‌ను పాత పద్దతిలో పేపర్ బడ్జెట్‌గా పరిచయం చేస్తున్నారు.
2019 ఆగస్టు 5న జమ్ము కశ్మీర్ రాష్ట్రంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని తొగించడంతో పాటు రాష్ట్రపతి పాలన విధించింది కేంద్రం. జమ్ము, కశ్మీర్, లఢాక్‌లను వేర్వేరు ప్రాంతాలుగా గుర్తించింది. అప్పటి నుంచి జమ్ము, కశ్మీర్ రాష్ట్ర ఉనికి కోల్పోయింది. కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. అప్పటి నుంచి నేటి వరకు కేంద్ర పాలనే సాగుతోంది.
#WATCH | Delhi: Copies of the Budget of Jammu and Kashmir brought to the Parliament. Union Finance Minister Nirmala Sitharaman will present the Budget for J&K in Lok Sabha today. pic.twitter.com/6NwRwabnEL
— ANI (@ANI) March 14, 2022
గత మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వమే జమ్ము, కశ్మీర్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. రెండో విడత కేంద్ర బడ్జెట్ సమావేశాలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు జరగనున్నాయి. జమ్ము కశ్మీర్ బడ్జెట్‌తో పాటు పలు కీలక అంశాలు, చట్ట సవరణలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment