
శ్రీనగర్: దాదాపు మూడు దశాబ్దాల అనంతరం మొదటిసారిగా జమ్మూలో షియా ముస్లింలు మొహర్రం ఊరేగింపు నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం శ్రీనగర్ గుండా లాల్ చౌక్ ఏరియా మార్గంలో గురువారం భారీ మూడంచెల భద్రతా ఏర్పాట్ల మధ్య ఊరేగింపు సాగింది.
షియాలు పెద్ద సంఖ్యలో ఉదయం 6 నుంచి 8 గంటల వరకు గురుబజార్ నుంచి దాల్‌గేట్ మార్గంలో జెండాలు చేబూని శాంతియుతంగా ముందుకు సాగారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం ప్రబలిన తర్వాత..గత 30 ఏళ్లలో మొహర్రం ఊరేగింపు జరగడం ఇదే మొదటిసారని కశ్మీర్ అదనపు డీజీపీ విజయ్ కుమార్ తెలిపారు.