Shia Muslims
-
30 ఏళ్లకు మొహర్రం
శ్రీనగర్: దాదాపు మూడు దశాబ్దాల అనంతరం మొదటిసారిగా జమ్మూలో షియా ముస్లింలు మొహర్రం ఊరేగింపు నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం శ్రీనగర్ గుండా లాల్ చౌక్ ఏరియా మార్గంలో గురువారం భారీ మూడంచెల భద్రతా ఏర్పాట్ల మధ్య ఊరేగింపు సాగింది. షియాలు పెద్ద సంఖ్యలో ఉదయం 6 నుంచి 8 గంటల వరకు గురుబజార్ నుంచి దాల్గేట్ మార్గంలో జెండాలు చేబూని శాంతియుతంగా ముందుకు సాగారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం ప్రబలిన తర్వాత..గత 30 ఏళ్లలో మొహర్రం ఊరేగింపు జరగడం ఇదే మొదటిసారని కశ్మీర్ అదనపు డీజీపీ విజయ్ కుమార్ తెలిపారు. -
పాక్‌లో కాల్పుల్లో 8 మంది టీచర్లు మృతి
పెషావర్: పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లో గురువారం జరిగిన రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో 8 మంది ఉపాధ్యాయులు చనిపోయారు. అప్పర్ కుర్రమ్ జిల్లా పరాచినార్‌లోని ప్రభుత్వం పాఠశాల ఉపాధ్యాయుడు మహ్మద్ షరీఫ్‌ను గుర్తు తెలియని సాయుధుడు కాల్చి చంపాడు. ఆయన సున్నీ మెంగల్ తెగకు చెందిన వాడు. దీంతో మెంగల్ వర్గీయులు ఆగ్రహంతో ప్రభుత్వ తెరి మెంగల్ హైస్కూల్లోకి చొరబడి ప్రత్యర్థి తోరి షియా తెగకు చెందిన ఏడుగురు ఉపాధ్యాయులను చంపేశారు. ఈ ఘటన స్థానిక తెగల మధ్య ఉద్రిక్తతలు రాజేసే అవకాశముందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. -
1485 ఎకరాల్లో అతి పేద్ద శ్మశానం.. ఇప్పటివరకు 50 లక్షల మృతదేహాలు..
World's largest cemetery where more than 5 million dead people are buried: ఈ సృష్టిలో నా అంతటి వాడులేడని విర్రవీగే మనిషి.. కట్టుబట్టలతో మాత్రమే తన చివరి మజిలీని చేరుకుంటాడనే విషయం అందరికీ తెలిసిందే.! ఐనా ఎత్తుకు పైఎత్తులు వేసి మరొకరిని చిత్తుచేయాలనే కుబుద్ధి ఎన్ని జన్మలెత్తినా మారదు. అంత పోరాటం చేసి చివరికి చేరేది అంతశయ్యకే..! జీవన్మరణాలు ఎంత విచిత్రమైనవో స్మశానాన్ని చూస్తే అర్ధమవుతుంది. తారతమ్య భేదాలు లేకుండా ఒకే చోట ఖననం అవుతారు. ప్రేతభూమి మహత్యమదే!! ఎంతటివారినైనా కాదనకుండా తనలో ఇముడ్చుకుంటుంది. ఐతే ప్రతి ఊరిలో ఒక శ్మశానవాటిక తప్పక ఉంటుంది. సాధారణంగా రెండు మూడు ఎకరాల్లో శ్మశానవాటికలు ఉంటాయి. ఆ దేశంలో వేల ఎకరాల్లో ఒక శ్మాశానవాటిక ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద శ్మశానవాటికది.. ఎక్కడుందో తెలుసా! వారికి చాలా ప్రత్యేక స్థలమిది! ఇరాక్ దాదాపు 1485 ఎకరాల్లో ఉంటుందీ శ్మశానం. ఇప్పటివరకూ 50 లక్షల మృతదేహాలను ఖననం చేసిన ఈ శ్మశాన వాటిక చూపరులకు ఓ మహానగరాన్ని తలపించేలా ఉంటుంది. ‘వాడీ ఉస్ సలామ్’ అని ఈ శ్మశానాన్ని పిలుస్తారు. దీనికి ‘వ్యాలీ ఆఫ్ పీస్’ అనే మరోపేరు కూడా ఉంది. రోజుకు కనీసం రెండు వందలకుపైగా మృతదేహాలను ఖననం చేస్తారిక్కడ. షియా ముస్లీంలకు ఈ శ్మశానం చాలా ప్రత్యేకమైనది. ప్రపంచంలో షియాలు ఎక్కడున్నా మరణించిన తర్వాత వారిని, వారి కుటుంబ సభ్యుల మృతదేహాలను ఇక్కడే ఖననం చేయాలని కోరుకుంటారట. ఆ యుద్ధకాలంలో అధిక సంఖ్యలో.. ఇది చాలా పురాతనమైన శ్మశానవాటిక. గత 1400 యేళ్ల నుంచి ఈ శ్మశానంలో ఖననాలు జరుగుతున్నాయి. 18వ శతాబ్ధంలో ఇరాన్ - ఇరాక్ మధ్య జరిగిన యుద్ధంలో మరణించిన వారిని ఇక్కడ ఖననం చేయడంలో ఒక్కసారిగా సమాధుల సంఖ్య పెరిగింది. ఇరాన్‌తో యుద్ధ సమయంలో రోజుకు 250 మృతాదేహాలను ఖననం చేసేవారట. 19వ శాతాబ్ధంలో జరిగిన గల్ఫ్ యుద్ధ సమయంలో ఈ శ్మశానవాటికలో ఉగ్రవాదులు దాగడం మూలంగా అనేక సమాధులను ఇరాక్ సైన్యం పడగొట్టారు. వందల వేల మృతదేహాలను ఈ యుద్ధ కాలంలో ఖననం చేశారిక్కడ. శ్మశానికి కూడా కథలుంటాయని, వాటికీ చరిత్ర ఉంటుందనడానికి వాడీ ఉస్ సలామ్ ఓ ఉదాహరణ. చదవండి: Viral Video: డ్యామిట్!! కథ అడ్డం తిరిగింది! మూడున్నర అడుగుల పామును అమాంతం మింగిన చేప.. -
రైట్ డిసిషన్ అయినా ‘రాంగ్ టైమ్’లో తప్పే!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని ప్రతి జిల్లాలో ఓ ‘షరియా కోర్టు’ను ఏర్పాటు చేయాలని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) నిర్ణయించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. పాలకపక్ష భారతీయ జనతా పార్టీ అయితే అగ్గిమీద గుగ్గిలం అయింది. ఈ కోర్టులు కేవలం షరియా చట్టాన్ని మాత్రమే విశ్లేషిస్తాయని, మధ్యవర్తిత్వం కోసం వచ్చే స్త్రీ, పురుషులకు, ముఖ్యంగా భార్య భర్తలకు షరియా చట్టం ప్రకారం రాజీ కుదుర్చుతాయని, ఇచ్చే తీర్పులను పాటించడం, పాటించక పోవడం పార్టీల చిత్తమేనని, ఎలాంటి బలవంతం ఉండదని ముస్లిం లా పర్సనల్ బోర్డు వివరణ ఇచ్చినా బీజేపీ వినిపించుకోలేదు. భారత్ ఇస్లామిక్ దేశం కాదని, దేశంలోని చట్టబద్ధమైన కోర్టులకు సమాంతరంగా ఓ మైనారిటీ సమాజం సమాంతర న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని బీజేపీ నాయకులు ఘాటుగా స్పందించారు. వాస్తవానికి ముస్లిం పర్సనల్ లా బోర్డు తీసుకున్న నిర్ణయం పట్ల పలు ముస్లిం సంఘాలే ధ్వజమెత్తాయి. దేశంలో ఎక్కువగా ఉన్న సున్నీ ముస్లింలే షరియా కోర్టులను కోరుకుంటారు. షియాలు వ్యతిరేకిస్తున్నారు. ఈ సారి సున్నీలు కూడా రెండు విధాలుగా బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఇప్పటికే దేశంలో అణచివేతకు గురవుతున్నారని, ఈ నిర్ణయం వల్ల మరింత అణచివేతకు గురికావాల్సి వస్తోందని ఓ వర్గం సున్నీలు అభిప్రాయపడగా, షరియా తీర్పులను అమలు చేసే వ్యవస్థ లేనప్పుడు షరియా కోర్టుల వల్ల లాభమేమని మరో వర్గం సున్నీలు ప్రశ్నించారు. షరియా రాజ్యాంగం అమల్లోలేని రాజ్యంలో షరియా చట్టాన్ని ఎలా అమలు చేస్తారని పలు షియా సంఘాలు ప్రశ్నించాయి. షరియా అంటే ఏమిటీ? షరియా కోర్టును దారుల్ ఖాజా అని కూడా వ్యవహరిస్తారు. షరియా అంటే అరబిక్ భాషలో న్యాయ వ్యవస్థ అని అర్థం ఇక దారుల్ ఖాజా అంటే ‘ఇంటి తీర్పు’ అని అర్థం. అఖిల భారత ఇస్లామిక్ పర్సనల్ లా బోర్డు ఇప్పటి వరకు దేశంలో 50 షరియా కోర్టులను ఏర్పాటు చేసింది. వాటికి తీర్పు చెప్పే ఖాజీలను కూడా అదే నియమిస్తోంది. ఇప్పుడు జిల్లాకు ఒకటి చొప్పున పెంచాలని నిర్ణయించడం వివాదాస్పదమైంది. షరియా కోర్టుల విషయంలో సుప్రీం కోర్టు తీర్పును ఓ సారి చదివి స్పందించాలని విమర్శలు చేస్తున్న బీజేపీ నాయకులకు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సూచించారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు కలిసి జీవించడం పట్ల ముస్లిం పర్సనల్ లా బోర్డుకు విశ్వాసం ఉందని, భార్యాభర్తల తగాదాలను, ఆస్తుల పంపకాల వివాదాలను అతి తక్కువ ఖర్చుతో, అతి తొందరగా షరియా కోర్టులు తీరుస్తున్నాయని అఖిల భారత ముస్లిం ఏ ఇత్తేహాదుల్ ముస్లిమెన్ అధ్యక్షుడైన ఓవైసీ వివరించారు. ఇలాంటి న్యాయం ముస్లిం కమ్యూనిటీకి మరింత చేరువ చేయడం కోసమే పర్సనల్ లా బోర్డు నిర్ణయం తీసుకున్నదని అందులో సభ్యుడు కూడా అయిన ఓవైసీ వివరించారు. సుప్రీం కోర్టు ఇంతకు ఏం చెప్పిందీ? దేశంలోని షరియా కోర్టులకు చట్టపరమైన అధికారాలేవీ లేవని, అవిచ్చే తీర్పులను కచ్చితంగా పాటించాలనే నిబంధనలూ లేవని బీజేపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో అంటే 2014, జూలై నెలలో స్పష్టం చేసింది. వాటిని నిషేధించాలనే డిమాండ్‌ను కూడా త్రోసిపుచ్చింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడనందున, ఓ కమ్యూనిటీ సంస్థగానే పనిస్తున్నందున వాటిని నిషేధించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. షరియత్ కోర్టుల అమలుకు ఎలాంటి వ్యవస్థ లేనందున వాటిని ఏర్పాటు చేయడం న్యాయ వ్యవస్థకు పోటీ అవుతుందని భావించడంలో అర్థం లేదని హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్శిటీ మాజీ ఛాన్సలర్ జాఫర్ సరేశ్‌వాలా వ్యాఖ్యానించారు. సత్వర న్యాయం కోసమే షరియత్ కోర్టులు అవసరమని ఆయన చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని సహ్రాన్‌పూర్‌కు చెందిన 30 ఏళ్ల రెహనుమా భర్త నుంచి విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టు చుట్టూ రెండేళ్లు తిరిగినా విడాకులు లభించలేదని, ఆమె అదే సహ్రాన్‌పూర్‌లోని దారుల్ ఖాజాకు వెళ్లగా రెండే రోజుల్లో విడాకులు లభించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. దేశంలో ఎప్పటి నుంచో షరియా కోర్టులు నడుస్తున్నాయని, వాటి పట్ల ఎప్పుడూ వ్యతిరేకత లేదని, ఇప్పుడు మరిన్ని వాటిని ఏర్పాటు చేయాలనుకోవడంతో వ్యతిరేకత వచ్చిందని, తీసుకున్న నిర్ణయం సరైనదైనా తీసుకున్న సమయం సరైనది కాదని ‘అఖిల భారత ఉలేమా మెహసాయిక్ బోర్డు’ అధికార ప్రతినిధి యూసుఫ్ మొహాని వ్యాఖ్యానించారు. సరైన సమయం కాదనడం అంటే బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు అనే అర్థం అని అందరికి అర్థం అవుతోంది. సార్వత్రిక ఎన్నికలు రానున్న దృష్ట్యా ఇలాంటి అంశాలు అనవసరంగా వివాదాస్పదమవుతాయి. -
మదర్సాలపై షియా బోర్డ్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : మదర్సాలలో ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్ అధికారులు తయారుకావడం లేదని.. కొన్ని మదర్సాలలో ఉగ్రవాద బీజాలే పడుతున్నాయని షియా బోర్డు చీఫ్ వాసిం రిజ్వి ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌లకు రాసిన లేఖలో పేర్కొన్నారు. మదర్సాలను ప్రధాన విద్యా స్రవంతిలోకి చేరేలా చర్యలు చేపట్టాలని కోరారు. మదర్సాలను విద్యా మండళ్ల పర్యవేక్షణ కిందకు తీసుకురావాలని, వీటిని సీబీఎస్ఈ, ఐసీఎస్ఈలకు అనుబంధంగా చేర్చాలని సూచించారు. మతపరమైన విద్యను ఐచ్ఛికం చేయాలని కోరారు. కొన్ని మదర్సాలు ఉగ్ర కార్యకలాపాలకు నిలయంగా మారాయని రిజ్వి ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు రిజ్వి ప్రకటనపై పలు ఇస్లామిక్ సంస్థలు మండిపడుతున్నాయి. షియా బోర్డ్ ఛైర్మన్‌ను బఫూన్‌గా ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అభివర్ణించారు. ‘వాసిం రిజ్వి పెద్ద జోకర్..అవకాశవాద వ్యక్తి..ఆయన తన ఆత్మను ఆర్ఎస్ఎస్కు అమ్ముకున్నార’ ని వ్యాఖ్యానించారు. మదర్సాలలో ఉగ్ర బోధనలు జరిగితే అందుకు తగిన ఆధారాలను ఆయన నేరుగా హోంమంత్రికి అందించవచ్చు కదా అని ప్రశ్నించారు. -
రాముడికి ముస్లింల బహుమతి
సాక్షి, లక్నో : సరయూ నదితీరంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్మించ తలపెట్టిన 100 మీటర్ల రాముడి విగ్రహానికి ముస్లింలు మద్దతిచ్చారు. సరయూ నదీతీరంలో నిర్మించే ఈ రాముడి విగ్రహం.. ప్రపంచ వ్యాప్తంగా యూపీకి కొత్త గుర్తింపు తీసుకువస్తుంది షియా ముస్లింలు పేర్కొన్నారు. అంతేకాక రాముడి విగ్రహ నిర్మాణానికి పది వెండి బాణాలు బహూకరిస్తున్నట్లు యూపా షియా సెంట్రల్ బోర్డ్ ప్రకటించింది. విగ్రహ నిర్మాణం వేగంగా పూర్తికావాలన్న ఆకాంక్షను బోర్డు వ్యక్తం చేసింది. రాముడి విగ్రహాన్ని చరిత్రలో నలిచిపోయేలా నిర్మించాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై షియా సెంట్రల్ బోర్డ్ ఛైర్మన్ వసీమ్ రిజ్వి హర్షం వ్యక్తం చేశారు. రాముడి విగ్రహ నిర్మాణం పూర్తయితే.. ప్రపంచ పటంలో యూపీకి అద్వితీయమైన గుర్తింపు వస్తుందన్నారు. ఈ ప్రాంతాన్ని పాలించిన నవాబులకు రాముడిపై అమితమైన గౌరవం ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం అయోధ్యలో ఉన్న హనుమాన్ గర్హి ప్రాంతాన్ని 1739లో నాటి నవాబ్ షాజా ఉద్దౌలా హనుమంతుడి విగ్రహ ప్రతిష్ట కోసం కేటాయించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఘిదిలా ఉండగా.. వివాదాస్పద అయోధ్య స్థలం విషయంలో షియా బోర్డు కూడా ఒక పార్టీగా ఉన్న విషయం తెలిసిందే. -
ఇరాక్ యాత్రికులు క్షేమం
సాక్షి, సిటీబ్యూరో: ఇరాక్‌లోని పుణ్యక్షేత్రాలకు వెళ్లిన యాత్రికులు నగరానికి ఆదివారం క్షేమంగా చేరుకున్నారు. ఏటా షియా ముస్లింలు నాల్గుసార్లు ఇరాక్‌లోని పుణ్యక్షేత్రమైనా కర్బాలా, నజఫ్ ప్రాంతాలను సందర్శించడం ఆనవాయితీ. ఈ నెల 8 నుంచి 10 వరకు హైదరాబాద్ (పాతబస్తీ, దారుషిఫా, నూర్‌ఖాన్‌బజార్) నుంచి 350 యాత్రికులు 12 బృందాల్లో పుణ్యక్షేత్రాలకు బయల్దేరి వెళ్లారు. షబేబరాత్ రాత్రి కర్బాలా మైదానంలో జరిగే పలు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని తమ పూర్వీకుల త్యాగాలను స్మరించుకున్నారు. వీరిలో 290 మంది కొన్ని రోజుల క్రితమే నగరానికి చేరుకోగా.. మిగిలిన 60 మంది ఆదివారం క్షేమంగా వచ్చారు. ప్రార్థనలు ఫలించాయి.. ఇరాక్‌లో జరుగుతున్న అంతర్యుద్ధం వల్ల అక్కడికి వెళ్లిన తమ కుటుంబసభ్యులకు ఎటువంటి ప్రమాదం సంభవిస్తుందోనని నగరవాసులు ఆందోళన చెందారు. ఎప్పటికప్పుడు అక్కడి జరుగుతున్న పరిస్థితులను, బంధువుల యోగ క్షేమాలను ట్రావెల్స్ సంస్థల ప్రతినిధులను అడిగి తెలుసుకునేవారు. తమ వారి కోసం పార్థనలు చేశారు. వెళ్లిన వారు క్షేమంగా రావడంతో యాత్రికుల బంధువు, దారుషిఫా నివాసి మీర్ ఫిరాసత్ హలీ బాకరీ ఆనందం వ్యక్తం చేశారు. ప్రార్థనలు ఫలించాయన్నారు. అరబ్బు దేశాలతో ప్రత్యేక అనుబంధం హైదరాబాద్ నగరానికి ఇరాక్ దేశానికి 6వ నిజాం మీర్ మహెబుబ్ అలీ కాలం నుంచే అనుబంధం ఉంది. 6వ నిజాం తన వ్యక్తిగత రక్ష, దేశ రక్షణ కోసం అరబ్బు దేశాల నుంచి పెద్ద ఎత్తున అరబ్బు దేశస్తులను సైన్యంలో నియమించారు. వారి కుటుంబాల కోసం ఇళ్లను కేటాయించారు. ఆ క్రమంలోనే నగరంలోని ఏ.సీ గార్డు, ఫస్టు లాన్సర్, సెకండ్ లాన్సర్, బార్కస్ తదితర ప్రాంతాల్లో అరబ్బు దేశస్థులు స్థిరపడ్డారు. నగరం నుంచి.. ముస్లింల అన్ని పుణ్యక్షేత్రాలు అరబ్బు దేశాల్లోనే ఉన్నాయి. ఏటా నగరం నుంచి వేల సంఖ్యలో హజ్, ఉమ్రా యాత్రకు వెళ్తుంటారు. టోలిచౌకి, షేక్‌పేట, మెహిదీపట్నం, మురాద్‌నగర్, ఆసిఫ్‌నగర్, మొగల్పురా, మలక్‌పేట, కిల్వత్, బార్కస్ తదితర ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో అరబ్బుదేశాలకు వెళ్లారు. కొందరు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మరికొందరు వ్యాపారాలు చేస్తున్నారు. ఈ విధంగా భాగ్యనగారానికి, అరబ్బుదేశాలకు సంబంధం ఏర్పడింది. ఆ దేశాల్లో ఏ ప్రమాదం జరిగిన ఇక్కడి వారు విలవిలలాడుతుంటారు. ప్రస్తుతం ఇరాక్ పరిణామాలతో నగర ప్రజలు అక్కడ నివసిస్తున్న తమ వారు పడుతున్న ఇబ్బందులను తలుచుకొని కన్నీరుమున్నీరు అవుతున్నారు. పుణ్యక్షేత్రాల్లో ప్రశాంతం... నేను ప్రతిసారి షాబాన్ మాసంలో పుణ్యయాత్ర కోసం భక్తులను ఇరాక్ గత ఐదేళ్ల నుంచి తీసుకెళ్లుతున్నాను. ఈసారి ఇరాక్‌లో అనుకోని పరిస్థితులు ఎదురయ్యాయి. మేం వెళ్లిన ప్రాంతాల్లో తీవ్రవాదుల ప్రభావం లేదు. కార్బలా, నజఫ్‌లో ప్రశాంత వాతావరణం ఉంది. అన్నపానీయాలకు, రవాణ సౌకర్యలకు కొద్దిగా ఇబ్బందిపడ్డాం. అందరం క్షేమంగా నగరానికి వచ్చాం. - అలీ హుస్సేన్ జైదీ, టూర్ ఆపరేటర్ -
నగరానికి క్షేమంగా యాత్రికులు
సాక్షి, హైదరాబాద్: ఇరాక్‌లోని పుణ్యక్షేత్రాలకు వెళ్లిన యాత్రికులు నగరానికి ఆదివారం క్షేమంగా చేరుకున్నారు. ఏటా షియా ముస్లింలు నాల్గుసార్లు ఇరాక్‌లోని పుణ్యక్షేత్రమైనా కర్బాలా, నజఫ్ ప్రాంతాలను సందర్శించడం ఆనవాయితీ. ఈ నెల 8 నుంచి 10 వరకు హైదరాబాద్ (పాతబస్తీ, దారుషిఫా, నూర్‌ఖాన్‌బజార్) నుంచి 350 యాత్రికులు 12 బృందాల్లో పుణ్యక్షేత్రాలకు బయల్దేరి వెళ్లారు. షబేబరాత్ రాత్రి కర్బాలా మైదానంలో జరిగే పలు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని తమ పూర్వీకుల త్యాగాలను స్మరించుకున్నారు. వీరిలో 290 మంది కొన్ని రోజుల క్రితమే నగరానికి చేరుకోగా.. మిగిలిన 60 మంది ఆదివారం క్షేమంగా వచ్చారు. ప్రార్థనలు ఫలించాయి.. ఇరాక్‌లో జరుగుతున్న అంతర్యుద్ధం వల్ల అక్కడికి వెళ్లిన తమ కుటుంబసభ్యులకు ఎటువంటి ప్రమాదం సంభవిస్తుందోనని నగరవాసులు ఆందోళన చెందారు. ఎప్పటికప్పుడు అక్కడి జరుగుతున్న పరిస్థితులను, బంధువుల యోగ క్షేమాలను ట్రావెల్స్ సంస్థల ప్రతినిధులను అడిగి తెలుసుకునేవారు. తమ వారి కోసం పార్థనలు చేశారు. వెళ్లిన వారు క్షేమంగా రావడంతో యాత్రికుల బంధువు, దారుషిఫా నివాసి మీర్ ఫిరాసత్ హలీ బాకరీ ఆనందం వ్యక్తం చేశారు. ప్రార్థనలు ఫలించాయన్నారు. అరబ్బు దేశాలతో ప్రత్యేక అనుబంధం హైదరాబాద్ నగరానికి ఇరాక్ దేశానికి 6వ నిజాం మీర్ మహెబుబ్ అలీ కాలం నుంచే అనుబంధం ఉంది. 6వ నిజాం తన వ్యక్తిగత రక్ష, దేశ రక్షణ కోసం అరబ్బు దేశాల నుంచి పెద్ద ఎత్తున అరబ్బు దేశస్తులను సైన్యంలో నియమించారు. వారి కుటుంబాల కోసం ఇళ్లను కేటాయించారు. ఆ క్రమంలోనే నగరంలోని ఏ.సీ గార్డు, ఫస్టు లాన్సర్, సెకండ్ లాన్సర్, బార్కస్ తదితర ప్రాంతాల్లో అరబ్బు దేశస్థులు స్థిరపడ్డారు. నగరం నుంచి.. ముస్లింల అన్ని పుణ్యక్షేత్రాలు అరబ్బు దేశాల్లోనే ఉన్నాయి. ఏటా నగరం నుంచి వేల సంఖ్యలో హజ్, ఉమ్రా యాత్రకు వెళ్తుంటారు. టోలిచౌకి, షేక్‌పేట, మెహిదీపట్నం, మురాద్‌నగర్, ఆసిఫ్‌నగర్, మొగల్పురా, మలక్‌పేట, కిల్వత్, బార్కస్ తదితర ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో అరబ్బుదేశాలకు వెళ్లారు. కొందరు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మరికొందరు వ్యాపారాలు చేస్తున్నారు. ఈ విధంగా భాగ్యనగారానికి, అరబ్బుదేశాలకు సంబంధం ఏర్పడింది. ఆ దేశాల్లో ఏ ప్రమాదం జరిగిన ఇక్కడి వారు విలవిలలాడుతుంటారు. ప్రస్తుతం ఇరాక్ పరిణామాలతో నగర ప్రజలు అక్కడ నివసిస్తున్న తమ వారు పడుతున్న ఇబ్బందులను తలుచుకొని కన్నీరుమున్నీరు అవుతున్నారు.