సాక్షి, లక్నో : సరయూ నదితీరంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్మించ తలపెట్టిన 100 మీటర్ల రాముడి విగ్రహానికి ముస్లింలు మద్దతిచ్చారు. సరయూ నదీతీరంలో నిర్మించే ఈ రాముడి విగ్రహం.. ప్రపంచ వ్యాప్తంగా యూపీకి కొత్త గుర్తింపు తీసుకువస్తుంది షియా ముస్లింలు పేర్కొన్నారు. అంతేకాక రాముడి విగ్రహ నిర్మాణానికి పది వెండి బాణాలు బహూకరిస్తున్నట్లు యూపా షియా సెంట్రల్ బోర్డ్ ప్రకటించింది. విగ్రహ నిర్మాణం వేగంగా పూర్తికావాలన్న ఆకాంక్షను బోర్డు వ్యక్తం చేసింది.
రాముడి విగ్రహాన్ని చరిత్రలో నలిచిపోయేలా నిర్మించాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై షియా సెంట్రల్ బోర్డ్ ఛైర్మన్ వసీమ్ రిజ్వి హర్షం వ్యక్తం చేశారు. రాముడి విగ్రహ నిర్మాణం పూర్తయితే.. ప్రపంచ పటంలో యూపీకి అద్వితీయమైన గుర్తింపు వస్తుందన్నారు. ఈ ప్రాంతాన్ని పాలించిన నవాబులకు రాముడిపై అమితమైన గౌరవం ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం అయోధ్యలో ఉన్న హనుమాన్ గర్హి ప్రాంతాన్ని 1739లో నాటి నవాబ్ షాజా ఉద్దౌలా హనుమంతుడి విగ్రహ ప్రతిష్ట కోసం కేటాయించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఘిదిలా ఉండగా.. వివాదాస్పద అయోధ్య స్థలం విషయంలో షియా బోర్డు కూడా ఒక పార్టీగా ఉన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment