
పెషావర్: పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో గురువారం జరిగిన రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో 8 మంది ఉపాధ్యాయులు చనిపోయారు. అప్పర్ కుర్రమ్ జిల్లా పరాచినార్‌లోని ప్రభుత్వం పాఠశాల ఉపాధ్యాయుడు మహ్మద్ షరీఫ్‌ను గుర్తు తెలియని సాయుధుడు కాల్చి చంపాడు.
ఆయన సున్నీ మెంగల్ తెగకు చెందిన వాడు. దీంతో మెంగల్ వర్గీయులు ఆగ్రహంతో ప్రభుత్వ తెరి మెంగల్ హైస్కూల్‌లోకి చొరబడి ప్రత్యర్థి తోరి షియా తెగకు చెందిన ఏడుగురు ఉపాధ్యాయులను చంపేశారు. ఈ ఘటన స్థానిక తెగల మధ్య ఉద్రిక్తతలు రాజేసే అవకాశముందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.
Comments
Please login to add a commentAdd a comment