పెషావర్: పాకిస్తాన్‌లో ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్ బన్ను జిల్లాలో గురువారం జరిగిన ఆత్మాహుతి దాడిలో తొమ్మిదిమంది సైనికులు మృతి చెందారు. నిషేధిత తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ)కి చెందిన ఉగ్రవాది బైక్‌పై వచ్చి భద్రతాబలగాలు ప్రయాణిస్తున్న వ్యాన్‌ను ఢీకొట్టాడు.
భారీ పేలుడు సంభవించడంతో వ్యానులోని 9 మంది మరణించగా మరో అయిదుగురు గాయపడ్డారని సైన్యం తెలిపింది. దాడికి తామే కారణమంటూ టీటీపీ ప్రకటించుకుంది. పలు ఉగ్ర సంస్థలు కలిసి 2017లో టీటీపీగా ఏర్పాటయ్యాయి. అల్ ఖాయిదాతో సంబంధాలున్నట్లు అనుమానాలున్న టీటీపీ ఇటీవల తరచూ దాడులకు తెగబడుతోంది. జనవరిలో పెషావర్‌లోని ఓ మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 101 మంది చనిపోగా మరో 200 మంది గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment