Khyber Pakhtunkhwa province
-
పాక్‌లో భారీ వర్షాలు.. 37 మంది మృతి
పెషావర్: పాకిస్తాన్‌లోని ఆక్రమిత కశ్మీర్‌తోపాటు బలోచిస్తాన్, ఖైబర్ ఫక్తున్వా ప్రావిన్స్‌ల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 48 గంటల వ్యవధిలో ఈ ప్రాంతాల్లో వర్షాలు, వరద సంబంధిత ఘటనల్లో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా ఖైబర్ ఫక్తున్వా ప్రావిన్స్‌లో ఇళ్లుకూలి, ఇళ్లలోకి వరద చేరిన ఘటనల్లో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులేనని అధికారులు తెలిపారు. అదేవిధంగా, బలోచిస్తాన్, పీవోకేలో అయిదుగురు చొప్పున చనిపోయారు. గ్వాదర్ రేవు పట్టణం జల దిగ్బంధంలో చిక్కుకుంది. చైనా–పాకిస్తాన్లను కలిపే కారకోరం హైవే మూతబడింది. -
Pakistan General Elections 2024: ఇంటర్నెట్ బంద్..ఉగ్ర దాడులు
ఇస్లామాబాద్: పొరుగుదేశం పాకిస్తాన్లో హింసాత్మక ఘటనల మధ్య సాధారణ ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. మొత్తం 12.8 కోట్ల మంది ఓటర్ల కోసం 6.50 లక్షల మంది భద్రతా సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించారు. పోలింగ్ నేపథ్యంలో గురువారం ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించింది. ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఆ వెంటనే అధికారులు ఓట్ల లెక్కింపు ప్రక్రియను మొదలు పెట్టారు. శుక్రవారం ఉదయాని కల్లా ఫలితాల సరళిపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఉగ్రదాడుల్లో ఆరుగురు మృతి ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్‌లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఆరుగురు భద్రతా సిబ్బంది చనిపోయారు. డేరా ఇస్మాయిల్ ఖాన్‌లోని కలాచి వద్ద భద్రతా సిబ్బంది వాహనాన్ని బాంబుతో పేలి్చన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఘటనలో నలుగురు జవాన్లు చనిపోయారు. మరో ఘటన..బలోచిస్తాన్‌లోని ఖరాన్‌లో మందుపాతర పేలి ఇద్దరు పోలీసులు చనిపోగా మరో ఏడుగురు గాయపడ్డారు. భద్రతా కారణాలు చూపుతూ అధికారులు ఇరాన్, అఫ్గానిస్తాన్ సరిహద్దులను గురువారం మూసివేశారు. సరుకు రవాణా వాహనాలతోపాటు పాదచారులను సైతం అనుమతించలేదు. పోలింగ్ ప్రారంభమైన వెంటనే మొబైల్, ఇంటర్నెట్ సరీ్వసులను దేశవ్యాప్తంగా నిలిపివేశారు. అయితే, రిగ్గింగ్‌ను యథేచ్ఛగా కొనసాగించేందుకే ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీనిపై ఎన్నికల కమిషనర్ సికందర్ సుల్తాన్ రజా స్పందిస్తూ ఉగ్రదాడులు జరిగితే బాధ్యతెవరిదని ప్రశ్నించారు. ఎన్నికలకు, ఇంటర్నెట్తో ఎటువంటి సంబంధం లేదన్నారు. మద్దతుదారుల మధ్య ఘర్షణ అటోక్ నియోజకవర్గంలో రెండు చోట్ల పీఎంఎల్–ఎన్, పీటీఐ పార్టీ మద్దతుదారుల మధ్య ఘర్షణతో పోలింగ్ 5 గంటలపాటు ఆగిపోయింది. కొన్ని ప్రాంతాల్లో సిబ్బంది విధులకు రాకపోవడం, బ్యాలెట్ పేపర్లు చాలినన్ని అందకపోవడం, బ్యాలెట్ పేపర్లలో తప్పులు వంటి కారణాలతో చాలా చోట్ల పోలింగ్ ఆలస్యమైంది. బలోచిస్తాన్, ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్‌ల్లో వర్షం, అతిశీతల వాతావరణ పరిస్థితుల మధ్య చాలా చోట్ల ఓటేసేందుకు జనం బయటకు రాలేదు. -
పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 9 మంది జవాన్లు మృతి
పెషావర్: పాకిస్తాన్లో ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్ బన్ను జిల్లాలో గురువారం జరిగిన ఆత్మాహుతి దాడిలో తొమ్మిదిమంది సైనికులు మృతి చెందారు. నిషేధిత తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ)కి చెందిన ఉగ్రవాది బైక్‌పై వచ్చి భద్రతాబలగాలు ప్రయాణిస్తున్న వ్యాన్‌ను ఢీకొట్టాడు. భారీ పేలుడు సంభవించడంతో వ్యానులోని 9 మంది మరణించగా మరో అయిదుగురు గాయపడ్డారని సైన్యం తెలిపింది. దాడికి తామే కారణమంటూ టీటీపీ ప్రకటించుకుంది. పలు ఉగ్ర సంస్థలు కలిసి 2017లో టీటీపీగా ఏర్పాటయ్యాయి. అల్ ఖాయిదాతో సంబంధాలున్నట్లు అనుమానాలున్న టీటీపీ ఇటీవల తరచూ దాడులకు తెగబడుతోంది. జనవరిలో పెషావర్‌లోని ఓ మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 101 మంది చనిపోగా మరో 200 మంది గాయపడ్డారు. -
పాక్‌లో కాల్పుల్లో 8 మంది టీచర్లు మృతి
పెషావర్: పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లో గురువారం జరిగిన రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో 8 మంది ఉపాధ్యాయులు చనిపోయారు. అప్పర్ కుర్రమ్ జిల్లా పరాచినార్‌లోని ప్రభుత్వం పాఠశాల ఉపాధ్యాయుడు మహ్మద్ షరీఫ్‌ను గుర్తు తెలియని సాయుధుడు కాల్చి చంపాడు. ఆయన సున్నీ మెంగల్ తెగకు చెందిన వాడు. దీంతో మెంగల్ వర్గీయులు ఆగ్రహంతో ప్రభుత్వ తెరి మెంగల్ హైస్కూల్లోకి చొరబడి ప్రత్యర్థి తోరి షియా తెగకు చెందిన ఏడుగురు ఉపాధ్యాయులను చంపేశారు. ఈ ఘటన స్థానిక తెగల మధ్య ఉద్రిక్తతలు రాజేసే అవకాశముందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. -
ఒకే వేదికపై ముఖ్యమంత్రి, ఉగ్రవాది
న్యూఢిల్లీ: ఉగ్రవాద గ్రూపులకు మద్దతునివ్వడంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా పాకిస్థాన్ రాజకీయ నాయకుల తీరు మారడం లేదు. బాహాటంగా పాక్ నాయకులు ఉగ్ర మూకలతో అంటకాగుతున్నారు. తాజాగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా ముఖ్యమంత్రి పర్వేజ్ ఖట్టక్ లష్కరే ఉగ్రవాది అబ్దుల్ రహమాన్ మక్కీతో వేదిక పంచుకోవడం గమనార్హం. ఒకప్పటి క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీకి చెందిన పర్వేజ్ ఖట్టక్ ఆదివారం పెషావర్‌లో జరిగిన దిఫా ఇ పాకిస్థాన్ కౌన్సిల్ భేటీలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో మక్కీ కూడా ఉన్నారు. మక్కీ బావ, ముంబై దాడుల సూత్రధారి అయిన హాఫీజ్ సయీద్. మక్కీ కూడా ఉగ్రవాద కేసులలో నిందితుడిగా ఉన్నాడు. ఈ సమావేశంలో సయీద్ పాల్గొనకుండా పాక్‌లోని పంజాబ్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కరుడుగట్టిన మతవాద గ్రూపులను మచ్చిక చేసుకునేందుకు సీఎం పర్వేజ్ ఖట్టక్ ఈ భేటీలో పాల్గొన్నట్టు స్థానిక డాన్ పత్రిక వ్యాఖ్యానించింది. దిఫా ఇ పాకిస్థాన్ కౌన్సిల్‌ను పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ బాహాటంగా విమర్శిస్తున్న నేపథ్యంలో ఈ భేటీలో ఖట్టక్ పాల్గొనడం పలువురిని ఆశ్చర్యపరిచింది. 40కిపైగా ఇస్లామిక్ అతివాద రాజకీయ పార్టీలతో కూడిన దిఫా ఇ పాకిస్థాన్ కౌన్సిల్ దేశంలో సంప్రదాయ విధానాలను పాటించాలని ప్రవచిస్తూ ఉంటుంది. ఈ గ్రూప్ తరచూగా భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది. -
శరణార్థులపై పాకిస్థాన్ పైశాచికం
-
పాకిస్థాన్ పైశాచికం
పెషావర్: ఎవరి పేరు మీద కోటానుకోట్ల డాలర్లు ఉపకారాన్ని పొందుతుందో.. ఎవరిని ఆదుకుంటున్నామని చెప్పుకుంటూ అంతర్జాతీయ సమాజం మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తుందో.. అలాంటి పాస్తున్(అఫ్ఘాన్) శరణార్థుల పట్ల పాకిస్థాన్ ఘోర పైశాచికాన్ని ప్రదర్శిస్తోంది. 'అఫ్ఘాన్ శరణార్థులకు మేము ఆశ్రయం కల్పిస్తున్నాం.. పాకిస్థాన్ శాంతికాముక దేశం అనడానికి ఇదే నిదర్శనం. వాళ్లను ఆదుకోవడానికి మరింత డబ్బు సాయం చేయండి' అని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కొద్ది రోజుల కిందట ఐక్యరాజ్యసమితిలో గొప్పలు చెప్పుకున్నదానికి భిన్నంగా.. 50 లక్షల మంది పాస్తున్ శరణార్థులపై పాక్ సైన్యం, వైమానిక దళాలు పెద్ద ఎత్తున దాడులు చేస్తూ దేశం విడిచి పోరాపోయేలా చేస్తున్నాయి. గడిచిన పాతికేళ్లుగా పాక్ నేలతో మమేకమైన పాస్తున్ లు గడిచిన వారం రోజులుగా కట్టుబట్టలతో అఫ్ఘాన్ లోని సొంత ప్రాంతం బటి కోట్ కు పారిపోతున్నారు. దీనికి సంబంధించిన వార్తలు శనివారం అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా చోటుచేసుకున్నాయి. అటు బటి కోట్ (తూర్పు అఫ్ఘాన్ లోని నంగార్హర్ ప్రావిన్స్)లోనూ పరిస్థితులు ప్రమాదకంగా ఉన్నాయి. అక్కడ ఐసిస్, అఫ్ఘాన్ సన్యాలకు పెద్ద యుద్ధమే నడుస్తోంది. అయినాసరే పాకిస్థాన్ వాళ్లను తరుముతూనేఉంది. శరణార్థులపై దాడులు కొత్త కానప్పటికీ భారత్-అఫ్ఘానిస్థాన్ ల మైత్రి బలపడుతుండటంతో ఇటీవల పాక్ వికృతాలు పరాకాష్టకు చేరాయి. ఈ వలసకు సంబంధించిన వార్తలు శనివారం అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా చోటుచేసుకున్నాయి. 2014, డిసెంబర్లో పెషావర్ సైనిక స్కూల్‌పై పాక్ తాలిబన్ల దాడి అనంతరం.. అఫ్ఘాన్ శరణార్థులపై దాడులు పెరిగిపోయాయి. వాళ్లను సొంతదేశానికి వెళ్లగొట్టడమేపనిగా పెట్టుకున్న పాక్ బలగాలు.. శరణార్థులపై తీవ్ర హింసను ప్రయోగిస్తున్నాయి. వాయువ్య పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్‌లో దాదాపు 50 లక్షల మంది అఫ్ఘన్ శరణార్థులు గడిచిన 25 సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నారు. 1980ల్లో అమెరికా- రష్యాల ఆధిపత్యపోరులో భాగంగా జరిగిన యుద్ధం సమయంలో, 9/11 సంఘటన తర్వాత అఫ్ఘాన్ పై అమెరికా దాడుల సమయంలో వీరంతా పాకిస్థాన్ కు వలవవచ్చారు. అఫ్ఘానిస్థాన్ నుంచి వచ్చి అక్రమంగా నివసిస్తున్నవారిపైనేకాక అధికారికంగా పేర్లు నమోదుచేయించుకున్న వారిని కూడా పాక్ సైన్యాలు వదలడం లేదు. పాస్తున్ లు నివసించే ఇళ్లు, చిన్న చిన్న దుకాణాలను ధ్వంసం చేయడం, మేకలు, గొర్రెల్లు, కోళ్లను ఎత్తుకెళ్లడంతోపాటు బలవంతంగా లంచాలు వసూలు చేయడం, మాట వినకుంటే జైళ్లలో పెట్టి హింసించడం పాక్ బలగాలకు అలవాటైనపని. పెషావర్ సైనిక స్కూల్ పై దాడి జరిగిన తర్వాతి మూడు నెలల్లో దాదాపు 60 వేల మంది శరణార్థులు సొంతదేశానికి వెళ్లిపోగా ఇప్పుడు ఆ సంఖ్య లక్షలకు పెరిగింది. -
ప్రయాణికులే లక్ష్యంగా పేలుడు : 15 మంది మృతి
ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లోని కైబర్ పక్తున్వ ప్రావిన్స్‌లో బుధవారం దారుణం చోటు చేసుకుంది. పెషావర్ సునేరి మసీదు సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు మీడియా బుధవారం వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత మంది పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. పేలుడు జరిగిన ప్రాంతమంతా రక్తసిక్తంగా మారిందని తెలిపింది. మర్దన్ నగరం నుంచి పెషావర్ వెళ్తున్న ఈ బస్సులోని ప్రయాణికులే లక్ష్యంగా ఈ పేలుడు సంభవించిందని మీడియా వెల్లడించింది. ఈ పేలుడుకి తామే బాధ్యులమంటూ ఇంత వరకు ఎవరూ సంస్థ ప్రకటించలేదని చెప్పింది. మృతులంతా సచివాలయంలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను మీడియా వివరించింది. -
శరణార్థులపై పోలీసుల దాడులు..
ఉగ్రవాదం- అగ్రవాదాల ఆధిపత్యపోరులో అమాయక పౌరులు సమిధలవుతున్నారు. నాటి అఫ్ఘాన్ యుద్ధం, నిన్నటి ఇరాక్ యుద్ధం నేటి సిరియా యుద్ధాల్లో సూత్రధారులు, పాత్రధారులు ఎంతమంది చచ్చారోగానీ సాధారణ పౌరులు మాత్రం లక్షల మంది హతమయ్యారు. అవుతూనే ఉన్నారు. సరే, ఎలాగోలా బతికేద్దామని పొరుగు దేశాలకు శరణార్థులుగా వెళితే అక్కడ కూడా వారిని పీక్కుతినే రాబందులు తయారయ్యాయి. ఇప్పటికైతే యూరప్ నుంచి సిరియా శరణార్థుల తిరుగు ప్రయాణాలు మొదలు కాలేదుగానీ పారిస్ దాడుల అనంతరం ఆ పరిణామం కచ్చితంగా తలెత్తుతుంది. అందుకు ఉదాహరణే పాకిస్థాన్‌లో అప్ఘనిస్థాన్ శరణార్థుల గోస. గత డిసెంబర్లో పెషావర్ సైనిక స్కూల్‌పై పాక్ తాలిబన్ల దాడి అనంతరం.. అఫ్ఘాన్ శరణార్థులపై దాడులు పెరిగిపోయాయి. అధికారికంగా వెల్లడించనప్పటికీ అఫ్ఘాన్లను తమ సొంతదేశానికి వెళ్లగొట్టడమేపనిగా పెట్టుకున్నారు పాకిస్థాన్ పోలీసులు. అంతర్జాతీయంగా ఖ్యాతి పొందిన హ్యూమన్ రైట్స్ వాచ్(హెచ్ఆర్డబ్ల్యూ) సంస్థ తాజాగా వెలువరించిన నివేదిక.. పాక్‌లో అఫ్ఘాన్ శరణార్థులపై సాగుతున్న హింసను మరోసారి ప్రపంచం ముందుంచింది. ప్రధానంగా ఈశాన్య పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్‌లో తలదాచుకున్న అఫ్ఘన్ శరణార్థులపై ఆ రాష్ట్ర పోలీసులు పాశవిక దాడులు చేస్తున్నారని హెచ్ ఆర్ డబ్ల్యూ పేర్కొంది. అఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లోని ఖైబర్ ప్రావిన్స్‌కు గడిచిన 30 ఏళ్ల నుంచీ శరణార్థుల రాక కొనసాగుతూనే ఉంది. అఫ్ఘానిస్థాన్ పై అమెరికా యుద్ధం తర్వాత ఆ సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటివరకు పాక్‌లో తలదాచుకునేందుకు వచ్చిన శరణార్థుల సంఖ్య 50 లక్షలకు తక్కువ ఉండదని అంచనా. నాటి రాజకీయ పరిస్థితుల కారణంగా.. శరణార్థులపై కనికరం చూపకున్నప్పటికీ వారిపై హింస జరిగేదికాదని, 2014, డిసెంబర్ 26 నాటి పెషావర్ సైనిక స్కూల్ దాడి తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని హక్కుల సంస్థ తెలిపింది. అఫ్ఘానిస్థాన్ నుంచి వచ్చి అక్రమంగా నివసిస్తున్నవారిపైనేకాక అధికారికంగా పేర్లు నమోదుచేయించుకున్న వారిని కూడా పోలీసులు వదలడం లేదని, వారు నివసించే ఇళ్లు, చిన్న చిన్న దుకాణాలను ధ్వంసం చేయడం, మేకలు, గొర్రెల్లు, కోళ్లను ఎత్తుకెళ్లడంతోపాటు బలవంతంగా లంచాలు వసూలు చేయడం, మాట వినకుంటే జైళ్లలో పెట్టి హింసించడం వంటి పాశవిక చర్యలు.. పెషావర్ దాడి తర్వాత స్వసాధారణమైపోయాయి. దీంతో పాక్ లో బతకలేక తిరిగి అఫ్థాన్ వెళ్లిపోతున్న శరణార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పెషావర్ దాడి జరిగిన తర్వాతి మూడు నెలల్లో దాదాపు 60 వేల మంది శరణార్థులు సొంతదేశానికి వెళ్లిపోయారు. ప్రస్తుతం కూడా ఆ పరంపర కొనసాగుతూనే ఉంది. ఇదే విషయంపై ఖైబర్ ప్రావిన్స్ పోలీస్ చీఫ్ మోయిన్ సయీద్ మాట్లాడుతూ 'అఫ్ఘాన్ శరణార్థుల నుంచి లంచాలు గుంజుతున్నారనే ఫిర్యాదులు నిజమే. వాటికి సంబంధించి కొందరు పోలీసుల్ని సస్పెండ్ చేశాం. మరికొందరిని డిస్మిస్ కూడా చేశాం' అని చెప్పుకొచ్చారు. శరణార్థులకు రక్షణ కల్పించడం తమ కనీస బాధ్యతని, లోపాలను సరిదిద్దుకుంటామని ఖైబర్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ముస్తాఖ్ ఘనీ మీడియాకు వివరించారు. ఖైబర్ ప్రావిన్స్ లో పోలీసులు ధ్వంసం చేసిన అఫ్ఘాన్ శరణార్థుల ఇళ్లు.. పాక్ లో బతకలేక అఫ్ఘాన్ పయనమైన శరణార్థి కుటుంబం.. మూటాముల్లె సర్దుకుని సొంతదేశానికి వెళ్లే ప్రయత్నంలో అఫ్ఘాన్ శరణార్థి మహిళలు -
పెషావర్‌లో ఆత్మాహుతి దాడి: ఏడుగురు మృతి
వాయవ్య పాకిస్థాన్ ఖైబర్ ఫఖ్తున్వా ప్రావెన్స్ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం ఆత్మహుతి జరిపిన దాడిలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. పెషావర్ శివారులోని సరబండ్లోని భట్టా తాల్ మార్కెట్ వద్ద ఆ దాడి జరిగింది. దీంతో మృత్యుల సంఖ్య పెరిగింది. మృతులలో ముగ్గురు పోలీసులతోపాటు మహిళ, ఓ చిన్నారి కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.క్షతగాత్రులను ఖైబర్ టీచింగ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఆత్మాహుతి దాడితో మార్కెట్ పరిసర ప్రాంతాలు రక్తసిక్తంగా మారాయని, ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అయితే ఆ దాడికి పాల్పడింది తామేనంటు ఇంత వరకు ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించలేదు. -
పాక్‌లో బాంబు పేలుడు: ముగ్గురు సైనికులు మృతి
ఖైబర్ ఫఖ్తున్వా ప్రావెన్స్లోని బన్ను జిల్లాలోని మిర్జాలీ చెక్‌పోస్ట్ సమీపంలో ఆదివారం బాంబు పేలుడు సంభవించి ముగ్గురు సైనికులు మరణించారు. మరో ఎనిమిది మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆర్మీ వైద్య శిబిరానికి తీసుకువెళ్లారు. అయితే మరింత మెరుగైన వైద్య చికిత్స కోసం బన్ను నగరంలోని మిలటరీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన సైనికుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. భద్రత దళాల కాన్వాయ్ చెక్‌పోస్ట్ సమీపంలోకి రాగానే బాంబును రిమోట్ కంట్రోల్‌తో పేల్చారు. అయితే ఆ పేలుడుకు తామే బాధ్యలమని ఇప్పటివరకు ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించ లేదు. ఈ మేరకు స్థానిక మీడియా వెల్లడించింది. -
బస్సులో బాంబు పేలుడు: 12 మంది ప్రభుత్వ ఉద్యోగులు మృతి
పాకిస్థాన్ వాయువ్య ప్రాంతంలోని కైబర్ పక్తున్వ ప్రావెన్స్ చరసద్దా రహదారిపై శుక్రవారం ఓ బస్సులో బాంబు పేలి 12 మంది మరణించారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. మరో 25 మంది గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని లేడి రిడీంగ్ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారని అన్నారు. ఆ ప్రావెన్స్లోని సివిల్ సెక్రటేరియట్లో విధులు ముగించిన అనంతరం ఉద్యోగులు బస్సులో ఇంటి వెళ్తుండగా ఆ ఘటన చోటు చేసుకుందని వివరించారు. ఆ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు.