
సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్‌లో శనివారం భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు పాక్ ఉగ్రవాదులు హతమయ్యారు. గండర్‌బాల్ జిల్లాలోని నారనాగ్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఆ ఊరిలో మొదట కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఆపరేషన్ నిర్వహణలో భాగంగా సోదాలు నిర్వహిస్తుండగా, ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో బలగాలు ధీటుగా ఎదుర్కొని వారిని అక్కడికక్కడే హతమార్చాయి. సంఘటనా స్థలం నుంచి భారీ స్థాయిలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.