శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో గడిచిన 24 గంటల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో ఎనిమిది మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చి చంపాయి. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచరం అందుకున్న భద్రతా దళాలు గురువారం ఉదయం నుంచి షోపియాన్, షాంపూర్ ప్రాంతాల్లో గాలింపుచర్యలు చేపట్టాయి. గాలింపు చర్యలు చేపడుతున్న భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.
వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు వారిపై కాల్పులు జరపగా.. పాంపోర్ ప్రాంతంలో ముగ్గురు, షోపియాన్‌లో ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు డీజీపీ దిల్బార్‌సింగ్ వెల్లడించారు. కాగా.. మీజ్ పాంపోర్ వద్ద ఆపరేషన్ నిర్వహిస్తున్నప్పుడు ఇద్దరు ఉగ్రవాదులు మసీదులోకి ప్రవేశించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు పకడ్బందీ వ్యూహంతో శుక్రవారం ఉదయం వారిని మట్టుబెట్టాయి. చదవండి: ప్రధాని దత్తత గ్రామంపై కథనం రాసినందుకు..
Comments
Please login to add a commentAdd a comment