ఆ రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు... తీవ్రమైన చలిగాలులు! | North India in the Grip of Dense Fog and Cold | Sakshi
Sakshi News home page

Weather Update: ఆ రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు..

Published Mon, Dec 25 2023 6:54 AM | Last Updated on Mon, Dec 25 2023 7:58 AM

North India in the Grip of Dense Fog and Cold - Sakshi

జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, బీహార్..  ఈ రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు, తీవ్రమైన చలిగాలులు అలముకున్నాయి. గత కొద్ది రోజులుగా ఎత్తయిన ప్రాంతాల్లో మంచు కురుస్తుండటంతో మైదాన ప్రాంతాల్లోనూ చలిగాలులు తీవ్రమయ్యాయి. మరో రెండు మూడు రోజుల వరకు  ఈ వాతావరణం నుంచి ఎలాంటి ఉపశమనం ఉండదని వాతావరణ శాఖ తెలిపింది.

గత రెండు రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి దట్టమైన పొగమంచు కురుస్తోంది. దీంతో ఢిల్లీలోని పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. దృశ్యమానత తక్కువగా ఉండటంతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం పంజాబ్‌లోని అమృత్‌సర్, రాజస్థాన్‌లోని చురులో పొగమంచు కారణంగా విజిబులిటీ కనిష్టంగా ఉంది.

జమ్మూ కశ్మీర్‌లో దట్టమైన పొగమంచు కొత్త సంవత్సరానికి స్వాగతం పలకనుంది. శ్రీనగర్‌లోని వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం 2024 జనవరి ఒకటి నుండి  మూడు వరకు రాష్ట్రం మేఘావృతమై ఉంటుంది. కొన్ని చోట్ల వర్షం, మంచు కురుస్తుంది. ప్రస్తుతం కశ్మీర్‌లో చలిగాలులు వీస్తుండటంతో చాలా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రత సున్నా కంటే తక్కువగా నమోదైంది. శ్రీనగర్‌లో ఉష్ణోగ్రత మైనస్ 2.1 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. పహల్గామ్‌లో మైనస్ 3.9 డిగ్రీల సెల్సియస్, గుల్‌మార్గ్‌లో మైనస్ 3.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. లేహ్‌లో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 7.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వాయు కాలుష్యం పరిస్థితి తీవ్రంగానే ఉంది. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) ఆదివారం సాయంత్రం 4 గంటలకు 411గా నమోదైంది. ఇది తీవ్రమైన విభాగంలోకి వస్తుంది. శనివారం ఏక్యూఐ 450గా నమోదయ్యింది. 
ఇది కూడా చదవండి: ఇక్కడి ఆస్తులకు జియో ట్యాగింగ్‌ తప్పనిసరి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement