
శ్రీనగర్ : కోరుకున్న లక్ష్యాలను సాధించాలనే తపన అందరికీ ఉంటుంది. అయితే అందులో కొంతమంది మాత్రమే వాటిని అందుకోగలరు. చాలామంది తాము అనుకున్నవి సాధించలేక అందివచ్చిన అవకాశాలతోనే సర్దిచెప్పుకుంటారు. తాజాగా జమ్మూ కశ్మీర్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ కూడా ఈ జాబితాలో చేరాడు. ర్యాపర్ కావడమే లక్ష్యంగా పెట్టుకున్న అతడు... అనుకోని కారణాల వల్ల పోలీస్ ఉద్యోగం చేయాల్సివచ్చింది. అయితే ఉద్యోగంలో చేరినప్పటికీ తన ఆశను వదులుకోలేకపోయాడు. (వైరల్ వీడియో: నీకంటే నేనే బాగా పాడుతున్నా..)
ఈ క్రమంలో... తన విధులను సక్రమంగా నిర్వహిస్తూనే తనకున్న టాలెంట్‌తో ఓ పాటను ర్యాప్ చేసి పాడాడు. 30 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో... ‘‘జనాలు నిద్రలో కలలు కంటారు. కానీ నేను కలలతోనే నిద్ర పోయేవాడిని. ఇంటి బాధ్యత అంతా భుజాన వేసుకున్నప్పటికీ ధైర్యం కోల్పోలేదు. ఒక సైనికుడి బాధ్యతను నేరవేరుస్తూనే.. ఇప్పటికీ ర్యాప్ చేస్తూనే ఉన్నాను’’ అంటూ తను కన్న కలల గురించి వివరిస్తూ పాటగా ఆలపించాడు. దీన్ని ముఖేష్ సింగ్ అనే పోలీస్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో తన ర్యాపింగ్ నైపుణ్యాలతో నెటిజన్ల మనసు దోచుకున్నాడు. ‘‘చాలా కష్టం.. మనలోని టాలెంట్‌ను దాచిపెట్టుకోలేం’’ అంటూ కానిస్టేబుల్‌ను ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. (వైరల్: కరోనాను పాటతో వెళ్లగొడుతున్న మహిళలు)
Comments
Please login to add a commentAdd a comment