
గ్రెనేడ్ దాడిలో నిందితుడు యాసిర్ భట్‌ను విచారణకు తీసుకెళ్తున్న పోలీసులు
ఢిల్లీ: జమ్మూ బస్టాండ్‌లో ప్రయాణికులపై గ్రెనేడ్ విసిరి పలాయనం చిత్తగించిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాంకు చెందిన యాసిర్ భట్‌గా పోలీసులు గుర్తించారు. జమ్మూ నుంచి పారిపోతుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ రోజు(గురువారం) ఉదయం 11.45 గంటలకు జమ్మూ బస్టాండ్‌లో జరిగిన గ్రెనేడ్ దాడిలో ఒకరు మృతిచెందగా..30 మందికి తీవ్రగాయాలైన సంగతి తెల్సిందే. పట్టుబడిన అనంతరం నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని ప్రత్యక్ష సాక్షులతో పాటు సీసీటీవీ కెమెరాలను పరిశీలించడంతో నిందితుడిని త్వరగా పట్టుకోగలిగారు. దీనిపై లోతైన దర్యాప్తు చేస్తున్నామని జమ్మూ ఐజీ మనీష్ సిన్హా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment