yasir
-
ఆర్ఐఎల్ బోర్డులో అరామ్కో చైర్మన్
న్యూఢిల్లీ: కంపెనీ బోర్డులో సౌదీ ఇంధన దిగ్గజం అరామ్కో గ్రూప్ చైర్మన్ యాసిర్ అల్రుమయాన్ను నియమించే ప్రతిపాదనకు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) వాటాదారులు తాజాగా ఆమోదముద్ర వేశారు. మూడేళ్ల కాలానికి యాసిర్ నియామకాన్ని సమర్దిస్తూ 98.03 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఆర్ఐఎల్ తాజాగా వెల్లడించింది. ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా కేవలం 2 శాతానికిలోపే ఓట్ చేసినట్లు తెలియజేసింది. 1.96 శాతానికి సమానమైన 10.89 కోట్ల షేర్లు తీర్మానానికి వ్యతిరేకంగా నిలిచినట్లు వెల్లడించింది. కాగా.. యూఎస్ రీసెర్చ్ సలహా సంస్థ గ్లాస్ లెవీస్ సిఫారసు మేరకు ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటు చేసేందుకు గత నెలలో కాలిఫోర్నియా స్టేట్ టీచర్స్ రిటైర్మెంట్ సిస్టమ్(కాల్‌ఎస్‌టీఆర్‌ఎస్) నిర్ణయించిన విషయం విదితమే. యాసిర్.. సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(పీఐఎఫ్)కు గవర్నర్ కావడంతో ఆర్ఐఎల్ వాటాదారుగా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించింది. ఇప్పటికే పీఐఎఫ్.. రిలయన్స్ రిటైల్‌లో రూ. 9,555 కోట్లు, జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ. 11,367 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేసింది. కాగా.. ఆర్ఐఎల్కు చెందిన ఆయిల్ టు కెమికల్స్ బిజినెస్‌లో అరామ్కో 20 శాతం వాటాను కొనుగోలు చేసే ప్రణాళికల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ వార్తలకుతోడు, శుక్రవారం(నేడు) క్యూ2 ఫలితాల నేపథ్యంలో ఆర్ఐఎల్ షేరు 3 శాతం క్షీణించి రూ. 2,623 వద్ద ముగిసింది. -
గ్రెనేడ్ దాడి కేసులో నిందితుడి పట్టివేత
-
గ్రెనేడ్ దాడి కేసులో నిందితుడి పట్టివేత
ఢిల్లీ: జమ్మూ బస్టాండ్‌లో ప్రయాణికులపై గ్రెనేడ్ విసిరి పలాయనం చిత్తగించిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాంకు చెందిన యాసిర్ భట్‌గా పోలీసులు గుర్తించారు. జమ్మూ నుంచి పారిపోతుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ రోజు(గురువారం) ఉదయం 11.45 గంటలకు జమ్మూ బస్టాండ్‌లో జరిగిన గ్రెనేడ్ దాడిలో ఒకరు మృతిచెందగా..30 మందికి తీవ్రగాయాలైన సంగతి తెల్సిందే. పట్టుబడిన అనంతరం నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని ప్రత్యక్ష సాక్షులతో పాటు సీసీటీవీ కెమెరాలను పరిశీలించడంతో నిందితుడిని త్వరగా పట్టుకోగలిగారు. దీనిపై లోతైన దర్యాప్తు చేస్తున్నామని జమ్మూ ఐజీ మనీష్ సిన్హా తెలిపారు. జమ్మూ బస్టాండ్‌లో బాంబు పేలుడు -
హఠాత్తుగా ‘అమీర్’ను చేశారు..!
‘ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ (ఐసిస్) తరఫున పని చేయాలనే ఆసక్తి ఉంది. అందుకే ఇబ్రహీంతో కలిసి ముఠాలో చేరా. అయితే నేను చేసిందేమీ లేదు’ అంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారుల విచారణలో నైమతుల్లా హుస్సేనీ అలియాస్ యాసిర్ వెల్లడించాడు. కోర్టు అనుమతితో వారం క్రితం కస్టడీలోకి తీసుకున్న నలుగురు ఉగ్రవాదుల్నీ ఎన్ఐఏ మంగళవారం నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచింది. హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు కుట్రపన్నిన ఐసిస్ అనుబంధ సంస్థ ‘జుందుల్ ఖిలాఫత్ ఫీ బిలాద్ అల్ హింద్’ (జేకేబీహెచ్) మాడ్యుల్ కుట్రను ఎన్ఐఏ అధికారులు గత నెల 29న భగ్నం చేసి, రెండు దఫాల్లో ఏడుగురిని అరెస్టు చేసిన విషయం విదితమే. వీరిలో మహ్మద్ ఇబ్రహీం యజ్దానీ, మహ్మద్ ఇలియాస్ యజ్దానీలతో పాటు సయ్యద్ నైమతుల్లా హుస్సేనీ అలియాస్ యాసిర్, మహ్మద్ అథ ఉర్ రెహ్మాన్‌లను కస్టడీలోకి తీసుకుని విచారించింది. ఇబ్రహీం తన ఇంట్లో అథ ఉర్ రెహ్మాన్ ద్వారా నిర్వహించిన అరబిక్ క్లాసులకు హాజరయ్యాడు. ఈ నేపథ్యంలో ఇతడికి ఇబ్రహీంతో పరిచయం ఏర్పడింది. ఉగ్రవాద భావజాలం ఉండటంతో జేకేబీహెచ్ మాడ్యుల్లో చేరాడు. హ్యాండ్లర్ ఆదేశాల మేరకు హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ విధ్వంసాలకు కుట్రపన్నుతున్నామని ఇబ్రహీం చెప్పాడని, అప్పటికే ఆసక్తి ఉండటంతో కలిసి పని చేయడానికి అంగీకరించారని ఎన్ఐఏ ఎదుట చెప్పుకొచ్చాడు. తాము తరచుగా సమావేశమయ్యే వారమని, ఓ రోజు హఠాత్తుగా మాడ్యుల్ చీఫ్‌గా (అమీర్) ప్రకటించారని వివరించాడు. నాందేడ్, అజ్మీర్, అనంతపురం సహా ఇతర ప్రాంతాలకు వెళ్ళి వచ్చిన విషయాన్ని ఆ తర్వాతే తనకు చెప్పారని, నిధుల సమీకరణలో మాత్రం కీలకపాత్ర పోషించానని వెల్లడించాడు. అత్యంత వేగంగా విస్తరించింది: ఎన్ఐఏ ఐసిస్‌కు అనుబంధంగా ఏర్పడిన ఈ మాడ్యుల్ అత్యంత వేగంగా విస్తరించిందని ఎన్ఐఏ నిర్థారించింది. అంతా కలిసి ఓ ముఠాగా ఏర్పడిన ఆరు నెలల్లోనే హోదాలు ఇచ్చుకోవడం, పేలుడు పదర్థాలు, ఆయుధాల సమీకరణతో పాటు టార్గెట్ల ఎంపిక, రెక్కీల వరకు చకచకా చేసుకుపోయిందని ఆధారాలు సేకరించింది. దీని గుట్టు రట్టు చేయకపోయి ఉంటే భారీ విధ్వంసాలకు దిగేదని, మాడ్యుల్లోని సభ్యులందరూ అదే భావజాలం, మానసిక స్థితిలో ఉన్నారని అధికారులు చెప్తున్నారు. గత మంగళవారం కస్టడీలోకి తీసుకున్న మహ్మద్ ఇబ్రహీం యజ్దానీ, ఇతడి సోదరుడు మహ్మద్ ఇలియాస్ యజ్దానీ, రెహ్మాన్, యాసిర్‌ల కస్టడీకి గడువు ముగియడంతో వైద్య పరీక్షల అనంతరం మంగళవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వీరిలో రెహ్మాన్ నుంచి అదనపు సమాచారం రాబట్టాల్సి ఉండటంతో కస్టడీ పొడిగించాల్సిందిగా కోరారు. దీనికి అంగీకరించిన కోర్టు రెహ్మాన్‌ను మరో వారం ఎన్ఐఏ కస్టడీకి అప్పగిస్తూ, మిగిలిన ముగ్గురికీ జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెహ్మాన్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఎంఏ (ఇంగ్లీష్) పూర్తి చేశాడు. ఆ భాష పైనా పట్టు ఉండటంతో స్థానికంగా ఇంగ్లీషు ట్యూషన్లు చెప్పడంతో పాటు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలని భావించే వారికి నిర్వహించే ‘టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఫారెన్ లాంగ్వెజ్’ (టోఫెల్) పరీక్షలపై విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చేవాడు. గత ఏడాది ఇబ్రహీం ఇంట్లో అరబిక్ క్లాసులు చెప్పడానికి వచ్చిన నేపథ్యంలో అతడితో పరిచయమైంది. -
‘ఉగ్ర’కుట్రలో మరో ఇద్దరి అరెస్టు
- ముష్కర ముఠాకు చీఫ్‌గా వ్యవహరించిన యాసిర్ - ఉగ్రవాదులతో ‘ప్రతిజ్ఞ’ చేయించిన అథుల్లా రెహ్మాన్ - గత నెలలో వీరిని విచారించి వదిలిపెట్టిన ఎన్ఐఏ - పక్కా ఆధారాలు లభించడంతో ఇప్పుడు అరెస్ట్ - ఎనిమిది రోజుల ఎన్ఐఏ కస్టడీకి అప్పగించిన కోర్టు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌తోపాటు దేశవ్యాప్తంగా విధ్వంసాలకు కుట్ర పన్నిన ఐసిస్ అనుబంధ సంస్థ ‘జుందుల్ ఖిలాఫత్ ఫీ బిలాద్ అల్ హింద్’ (జేకేబీహెచ్) మాడ్యూల్లో మరో ఇద్దరు ఉగ్రవాదుల్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. గత నెల 29న అరెస్టు చేసిన ఐదుగురు నిందితులను ఎన్ఐఏ అధికారులు న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. వారి విచారణలో మహ్మద్ అథుల్లా రెహ్మాన్, యాసిర్‌లు ఈ మాడ్యూల్లో అత్యంత కీలకమని బయటపడింది. దీంతో వీరిద్దరినీ మంగళవారం అరెస్టు చేసిన అధికారులు నాంపల్లిలోని ఎన్ఐఏ కోర్టులో హాజరుపరిచారు. ఈ ఇద్దరు ఆ ఆరుగురిలోని వారే.. ఉగ్రవాదుల కుట్రకు సంబంధించి కేంద్ర నిఘా వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం అందుకున్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా గత నెల 20న ఎన్ఐఏకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైదరాబాద్ ఎన్ఐఏ యూనిట్ 29వ తేదీ తెల్లవారుజామున పాతబస్తీలోని ఎనిమిది ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో 11 మంది అనుమానిత ఉగ్రవాదుల్ని అదుపులోకి తీసుకుంది. ప్రాథమిక విచారణ తర్వాత మహ్మద్ ఇబ్రహీం యజ్దానీ, అతడి సోదరుడు మహ్మద్ ఇలియాస్ యజ్దానీ, హబీబ్ మహ్మద్, అబ్దుల్ బిన్ అహ్మద్ అల్‌మౌదీ అలియాస్ ఫహద్, ముజఫర్ హుస్సేన్ రిజ్వాన్‌లను అరెస్టు చేసింది. సరైన ఆధారాలు లేని కారణంగా మిగిలిన ఆరుగురినీ విడిచిపెట్టింది. అరెస్టు చేసిన ఐదుగురు ఉగ్రవాదులను ఎన్ఐఏ 12 రోజుల పాటు విచారించింది. అనంతపురం, మహారాష్ట్రలోని నాందే డ్ తదితర ప్రాంతాలకు వారిని తీసుకువెళ్లింది. మంగళవారం పాతబస్తీలోని వివిధ ప్రాంతా ల్లో దాడులు చేసి తూటాలతో పాటు ఇతర సామగ్రి స్వాధీనం చేసుకుంది. నిజాముద్దీన్ సహా కొందరు సాక్షుల్నీ విచారించి వాంగ్మూలాలు నమోదు చేసింది. గతంలో విడిచిపెట్టిన ఆరుగురిలో మహ్మద్ అథుల్లా రెహ్మాన్, నైమతుల్లా హుస్సేనీ అలియాస్ యాసిర్ మాడ్యూల్లో కీలకంగా వ్యవహరించారని వెలుగులోకి వచ్చింది. దీంతో మంగళవారం వారిని అరెస్టు చేశారు. ముఠా నాయకుడు.. యాసిర్! ఎన్ఐఏ అధికారులు ఇంత కుముందు ఇబ్రహీం యజ్దానీని మాడ్యూల్‌కు చీఫ్‌గా భావించారు. విచారణ తర్వాత సయ్యద్ నైమతుల్లా హుస్సేనీ అలియాస్ యాసిర్(42).. ‘అమీర్’ హోదాలో జేకేబీహెచ్ మాడ్యూల్‌కు చీఫ్‌గా ఉన్నట్లు వెల్లడైంది. మొఘల్‌పురా ప్రాంతానికి చెందిన ఇతడు అబు దర్బా పేరుతో చలామణి అయ్యాడు. ఖైరతాబాద్‌లో వస్త్ర దుకాణం నిర్వహిస్తున్న యాసిర్.. ఉగ్ర మాడ్యూల్‌కు నిధుల సమీకరణలో కీలకపాత్ర పోషించాడు. కస్టడీకి నలుగురు: తొలుత అరెస్టు చేసిన మహ్మద్ ఇబ్రహీం యజ్దానీ, మహ్మద్ ఇలి యాస్ యజ్దానీ, హబీబ్ మహ్మద్, అబ్దుల్ బిన్ అహ్మద్ అల్‌మౌదీ అలియాస్ ఫహద్, ముజ ఫర్ హుస్సేన్ రిజ్వాన్ కస్టడీ గడువు ముగియడంతో వారిని ఎన్ఐఏ అధికారులు మంగళవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. మరింత సమాచారం కోసం ఈ ఐదుగురిలో ఇబ్రహీం, ఇలియాస్ కస్టడీ గడువు పొడిగించడంతోపాటు తాజాగా అరెస్టు చేసిన రెహ్మాన్, యాసిర్లను కస్టడీకి అప్పగించాల్సిందిగా కోర్టును కోరింది. కోర్టు ఈ నలుగురిని 8 రోజుల ఎన్ఐఏ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మిగిలిన ముగ్గురికీ జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో వారిని జైలుకు తరలించారు. కస్టడీలోకి తీసుకున్న వీరిని రాజ స్తాన్‌లోని అజ్మీర్‌కు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎవరీ రెహ్మాన్? చాంద్రాయణగుట్టలోని బండ్లగూడ ప్రాంతానికి చెందిన రెహ్మాన్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. స్థానికంగా అరబిక్ బోధిస్తున్నాడు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఎంఏ (ఇంగ్లిష్) పూర్తి చేశాడు. స్థానికంగా ఇంగ్లిష్ ట్యూషన్లతోపాటు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లేవారికి టోఫెల్ పరీక్షకు శిక్షణ ఇచ్చేవాడు. ఈ ఉగ్రముఠాలోని వారంతా తమ కార్యకలాపాలకు భవానీనగర్‌లోని తలాబ్‌కట్టలో షాలిమార్ ఆన్లైన్ సేవ పేరుతో ఉన్న మీ సేవ కేంద్రాన్ని వినియోగించుకుంది. ఇక్కడే సమావేశమైన ముష్కరులు ఐసిస్ అధినేత అబూ బకర్ అల్ బగ్దాదీకి (ఖలీఫా) బద్ధులమై ఉంటామని, కాలిఫట్గా పిలిచే సైన్యంగా మారుతామని ప్రమాణం చేశారు. ఈ ప్రమాణం (బయాహ్) చేయించడంతో పాటు కుట్రల అమలుకు జరిగిన సమావేశాల్లో రెహ్మాన్ కీలకంగా వ్యవహరించాడు. -
అజహర్ అలీ డబుల్ సెంచరీ
మిర్పూర్ : బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ పూర్తి ఆధిక్యత ప్రదర్శిస్తోంది. అజహర్ అలీ కెరీర్లో తొలి డబుల్ సెంచరీ (428 బంతుల్లో 226; 20 ఫోర్లు; 2 సిక్సర్లు)తో అదరగొట్టగా అసద్ షఫీఖ్ (167 బంతుల్లో 107; 9 ఫోర్లు; 1 సిక్స్) సెంచరీ చేయడంతో రెండో రోజు గురువారం పాక్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 152 ఓవర్లలో 8 వికెట్లకు 557 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన బంగ్లాను పాక్ బౌలర్లు కట్టడి చేయడంతో ఆట ముగిసే సమయానికి 27.5 ఓవర్లలో 5 వికెట్లకు 107 పరుగులు చేసింది. ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే ఇంకా 251 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజు లో షకీబ్ (14 బ్యాటింగ్), ముష్ఫిఖర్ రహీమ్ (12 బ్యాటింగ్) ఉన్నారు. జునైద్, యాసిర్ రెండేసి వికెట్లు పడగొట్టారు.