అజహర్ అలీ డబుల్ సెంచరీ | Azhar Ali Double Century | Sakshi
Sakshi News home page

అజహర్ అలీ డబుల్ సెంచరీ

Published Fri, May 8 2015 1:46 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 AM

Azhar Ali Double Century

మిర్పూర్ : బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ పూర్తి ఆధిక్యత ప్రదర్శిస్తోంది. అజహర్ అలీ కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ (428 బంతుల్లో 226; 20 ఫోర్లు; 2 సిక్సర్లు)తో అదరగొట్టగా అసద్ షఫీఖ్ (167 బంతుల్లో 107; 9 ఫోర్లు; 1 సిక్స్) సెంచరీ చేయడంతో రెండో రోజు గురువారం పాక్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 152 ఓవర్లలో 8 వికెట్లకు 557 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.

అనంతరం తమ తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన బంగ్లాను పాక్ బౌలర్లు కట్టడి చేయడంతో ఆట ముగిసే సమయానికి 27.5 ఓవర్లలో 5 వికెట్లకు 107 పరుగులు చేసింది. ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే ఇంకా 251 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజు లో షకీబ్ (14 బ్యాటింగ్), ముష్ఫిఖర్ రహీమ్ (12 బ్యాటింగ్) ఉన్నారు. జునైద్, యాసిర్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement