జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన | Presidents Rule imposed in Jammu and Kashmir | Sakshi
Sakshi News home page

జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన

Published Wed, Dec 19 2018 7:22 PM | Last Updated on Wed, Dec 19 2018 7:24 PM

Presidents Rule imposed in Jammu and Kashmir - Sakshi

శ్రీనగర్‌ : జమ్ముకశ్మీర్‌లో బుధవారం అర్థరాత్రి నుంచి రాష్ట్రపతి పాలన అమలులోకి రానుంది. ఆరు నెలల గవర్నర్ పాలన ముగియడంతో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రం నిర్ణయించింది. గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఇప్పటికే ఒక నివేదికను కేంద్రానికి పంపడం, కేంద్ర కేబినెట్‌తోపాటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఆమోద ముద్ర వేయడంతో బుధవారం అర్థరాత్రి నుంచి రాష్ట్రపతి పాలన అమలులోకి రానుంది.

ఈ ఏడాది జూన్ నెలలో సంకీర్ణ కూటమి నుంచి బీజేపీ వైదొలుగడంతో మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్ర ప్రత్యేక రాజ్యాంగం ప్రకారం, ప్రభుత్వం పడిపోతే ఆరు నెలల పాటు గవర్నర్ పాలన విధిస్తారు. గవర్నర్ ఈ ఆరు నెలల్లో వీలైతే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి లేదా అసెంబ్లీ రద్దు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఆరు నెలలపాటు రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది. ఈ కాలంలోనే రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికలు జరుగకపోతే మరో ఆరు నెలలు రాష్ట్రపతి పాలనను పొడిగించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement