
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాజ్‌బాగ్‌లోని ఒక వాణిజ్య భవనంలో గురువారం మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ఫైర్సెఫ్టీ అధికారులకు సమాచారం అందించారు. కాగా, ప్రమాద స్థలానికి చేరుకున్న అధికారులు ఫైరింజన్ సహయంతో మంటలను అదుపులోనికి తీసుకొని వచ్చారు.
ఒక సిలెండర్ పేలడం వలన మంటలు వ్యాపించినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనావేశారు. కాగా, మంటలను అదుపుచేసే క్రమంలో ఒక ఫైర్ అధికారి గాయపడినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ముందు జాగ్రత్తగా అధికారులు ఘటన స్థలం వద్ద అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment