Commercial building
-
Jammu Kashmir: శ్రీనగర్ లో భారీ అగ్ని ప్రమాదం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాజ్‌బాగ్‌లోని ఒక వాణిజ్య భవనంలో గురువారం మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ఫైర్సెఫ్టీ అధికారులకు సమాచారం అందించారు. కాగా, ప్రమాద స్థలానికి చేరుకున్న అధికారులు ఫైరింజన్ సహయంతో మంటలను అదుపులోనికి తీసుకొని వచ్చారు. ఒక సిలెండర్ పేలడం వలన మంటలు వ్యాపించినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనావేశారు. కాగా, మంటలను అదుపుచేసే క్రమంలో ఒక ఫైర్ అధికారి గాయపడినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ముందు జాగ్రత్తగా అధికారులు ఘటన స్థలం వద్ద అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: బీహార్‌లో ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ ఆందోళనలు -
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో మంగళవారం ఓ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రోశన్అరా రోడ్డులోని ఐదు అంతస్తుల భవనంలో భారీఎత్తునా మంటలు చెలరేగాయి. ఈ రోజు తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న 30 అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేసే పనిలో పడ్డారు. అయితే మంటలు పూర్తిగా అదుపులోకి రావడానికి దాదాపు మూడు గంటల సమయం పట్టినట్టు అధికారులు తెలిపారు. కాగా, అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని అధికారులు వెల్లడించారు. షార్ట్ సర్య్కూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని అధికారులు అనుమానిస్తున్నారు. -
కమర్షియల్ కాంప్లెక్స్‌పై కూలిన విమానం
కార్గో విమానం బయలుదేరిన కొద్దిసేపటికే కమర్షియల్ కాంప్లెక్స్‌పై కుప్ప కూలింది. ఆ ఘటన బుధవారం తూర్పు ఆఫ్రికాలోని కెన్యా రాజధాని నైరోబిలో చోటు చేసుకుంది. నైరోబిలోని జొమో కెన్యట్టా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కార్గో విమానం బయలుదేరిన కొద్ది సేపటికే కూలిపోయిందని ఆ దేశ పౌర విమానయాన శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన విమానంలో నలుగురు సిబ్బంది ఉన్నారని వారంతా మరణించారని భావిస్తున్నట్లు చెప్పారు. విమాన ప్రమాదం జరిగిన వెంటనే కమర్షియల్ కాంప్లెక్ పరిసర ప్రాంతాలలోని భవనాలను ఖాళీ చేయించినట్లు పౌర విమానయాన శాఖ అధికారులు తెలిపారు. -
నోయిడాలో అగ్ని ప్రమాదం
నోయిడా: పట్టణంలోని ఓ వాణిజ్య భవనంలో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. సెక్టార్ 18లోగల భవనంలో ఉదయం 9 గంటల ప్రాంతంలో మంటలంటుకున్న విషయాన్ని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించాడు. అప్పటికే రెండు అంతస్తులకు మంటలు వ్యాపించాయి. వైశాలీ ఫైర్ స్టేషన్ నుంచి అక్కడకు చేరుకున్న సిబ్బంది రెండుగంటలపాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. రెండంతస్తుల్లోని జె అండ్ ఏఎంపీ, కె బ్యాంక్, వీఎల్సీసీ ఫిట్నెస్ సెంటర్ కార్యాలయాల్లోని ఫర్నిచర్ అగ్నికి ఆహుతైంది. ప్రమాదానికిగల కారణాలు ఇంకా తెలియరాలేదని సంబంధిత అధికారులు తెలిపారు.