నోయిడాలో అగ్ని ప్రమాదం | Fire at commercial complex in Noida | Sakshi
Sakshi News home page

నోయిడాలో అగ్ని ప్రమాదం

Published Fri, Apr 18 2014 11:55 PM | Last Updated on Thu, Sep 13 2018 5:11 PM

నోయిడాలో అగ్ని ప్రమాదం - Sakshi

నోయిడాలో అగ్ని ప్రమాదం

నోయిడా: పట్టణంలోని ఓ వాణిజ్య భవనంలో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. సెక్టార్ 18లోగల భవనంలో ఉదయం 9 గంటల ప్రాంతంలో మంటలంటుకున్న విషయాన్ని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించాడు. అప్పటికే రెండు అంతస్తులకు మంటలు వ్యాపించాయి.

 

వైశాలీ ఫైర్ స్టేషన్ నుంచి అక్కడకు చేరుకున్న సిబ్బంది రెండుగంటలపాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. రెండంతస్తుల్లోని జె అండ్ ఏఎంపీ, కె బ్యాంక్, వీఎల్‌సీసీ ఫిట్‌నెస్ సెంటర్ కార్యాలయాల్లోని ఫర్నిచర్ అగ్నికి ఆహుతైంది. ప్రమాదానికిగల కారణాలు ఇంకా తెలియరాలేదని సంబంధిత అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement