దేశ రాజధాని న్యూఢిల్లీలో మంగళవారం ఓ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో మంగళవారం ఓ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రోశన్అరా రోడ్డులోని ఐదు అంతస్తుల భవనంలో భారీఎత్తునా మంటలు చెలరేగాయి. ఈ రోజు తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న 30 అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేసే పనిలో పడ్డారు.
అయితే మంటలు పూర్తిగా అదుపులోకి రావడానికి దాదాపు మూడు గంటల సమయం పట్టినట్టు అధికారులు తెలిపారు. కాగా, అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని అధికారులు వెల్లడించారు. షార్ట్ సర్య్కూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని అధికారులు అనుమానిస్తున్నారు.