కమర్షియల్ కాంప్లెక్స్పై కూలిన విమానం | Kenyan cargo plane crashes into building after takeoff | Sakshi
Sakshi News home page

కమర్షియల్ కాంప్లెక్స్పై కూలిన విమానం

Published Wed, Jul 2 2014 11:17 AM | Last Updated on Sat, Sep 2 2017 9:42 AM

కమర్షియల్ కాంప్లెక్స్పై  కూలిన విమానం

కమర్షియల్ కాంప్లెక్స్పై కూలిన విమానం

కార్గో విమానం బయలుదేరిన కొద్దిసేపటికే కమర్షియల్ కాంప్లెక్స్పై కుప్ప కూలింది. ఆ ఘటన బుధవారం తూర్పు ఆఫ్రికాలోని కెన్యా రాజధాని నైరోబిలో చోటు చేసుకుంది. నైరోబిలోని జొమో కెన్యట్టా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కార్గో విమానం బయలుదేరిన కొద్ది సేపటికే కూలిపోయిందని ఆ దేశ పౌర విమానయాన శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.

 

ప్రమాదం జరిగిన విమానంలో నలుగురు సిబ్బంది ఉన్నారని వారంతా మరణించారని భావిస్తున్నట్లు చెప్పారు. విమాన ప్రమాదం జరిగిన వెంటనే కమర్షియల్ కాంప్లెక్ పరిసర ప్రాంతాలలోని భవనాలను ఖాళీ చేయించినట్లు పౌర విమానయాన శాఖ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement