న్యూఢిల్లీ: అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో భారత్ తరఫున లాంగ్ జంప్ ఈవెంట్‌లో 17 ఏళ్ల షైలీ సింగ్ రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఆనందంలో ఆమె మైమరిచి చిందేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో షైలీ చేసిన డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతూ, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన షైలీ.. నైరోబి ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో 6.59 మీటర్లు దూకి రజతం సాధించింది.
#WorldAthleticsU20 Silver Medalist #ShailiSingh celebrates her glorious return by dancing on the tune of a Punjabi song at SAI, Bangalore
— SAI Media (@Media_SAI) August 27, 2021
Take a look 😀@ianuragthakur @NisithPramanik @YASMinistry @IndiaSports @DGSAI @afiindia @Adille1 @NsscSai @ddsportschannel @AkashvaniAIR pic.twitter.com/hWzuezycEL
అనంతరం ఆమె భారత్‌కు తిరిగొచ్చాక బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) సెంటర్‌లో పతకం గెలిచిన ఆనందాన్ని వ్యక్త పరుస్తూ.. పాపులర్ పంజాబీ పాటకు బాంగ్రా నృత్యం చేసింది. ఈ డ్యాన్స్ వీడియోను సాయ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. కాగా, షెల్లీ సింగ్ కేవలం 1 సెంటీమీటర్ దూరంతో స్వర్ణాన్ని కోల్పోయింది. స్వీడన్‌కు చెందిన 18 ఏళ్ల మజా అస్కాగ్ 6.60 మీటర్లు దూకి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.
చదవండి: వినోద్ కూమార్‌కు కాంస్యం.. భారత్ ఖాతాలో మూడో పతకం
Comments
Please login to add a commentAdd a comment