Silver medalist
-
ఆసియా పారా క్రీడల్లో ‘రవి’ ప్రభంజనం
కె.కోటపాడు (అనకాపల్లి జిల్లా): అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలానికి చెందిన తెలుగోడు చైనాలో జరుగుతున్న ఆసియా పారా క్రీడల్లో తన సత్తా చాటాడు. సిల్వర్ మెడల్ సొంతం చేసుకుని అందరి ప్రశంసలు పొందాడు. అనకాపల్లి జిల్లా, కె.కోటపాడు మండలం వారాడ శివారు చిరికివానిపాలెం గ్రామానికి చెందిన రొంగలి రవి ఆసియా పారా క్రీడల షాట్‌పుట్ విభాగంలో రజత పతకం సాధించాడు. చైనాలోని హాంగ్జౌలో ఆసియా పారా క్రీడా పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన పోటీల్లో ఎఫ్–40 షాట్‌పుట్ విభాగంలో పాల్గొన్న రవి 9.92 మీటర్ల దూరం విసిరి సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. ఈ పోటీల కోసం ఏడాదిన్నరగా బెంగళూరులోని సాయి అకాడమీలో శిక్షణ పొందినట్టు రవి ‘సాక్షి’కి తెలిపాడు. పతకం సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నాడు. ఈ పోటీలో ఇరాక్ దేశానికి చెందిన క్రీడాకారునికి గోల్డ్ మెడల్ దక్కిందని తెలిపాడు. స్వగ్రామంలో ఆనందం దేశం మెచ్చేలా రవి సిల్వర్ మెడల్ సాధించడంతో సొంత గ్రామం చిరికివానిపాలెంలో సందడి చోటుచేసుకుంది. అందరిలా ఎత్తుగా లేనన్న భావన మనసులోకి రానివ్వకుండా చిన్నప్పటి నుంచి డ్వార్్ఫ(దివ్యాంగుల క్రీడలు) క్రీడల్లో ఉత్తమ ప్రతిభను చాటేందుకు నిరంతరం శ్రమించేవాడని గ్రామస్థులు తెలిపారు. తల్లిదండ్రులు రొంగలి దేముడుబాబు, మంగ వ్యవసాయం చేసుకుంటూనే కుమారుడు క్రీడల్లో పాల్గొనేందుకు ప్రోత్సాహించారు. రవి చైనా నుంచి ఈనెల 28న దేశానికి రానున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రధాని అభినందన రవిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్(ట్విట్టర్) ద్వారా అభినందించారు. అతడిని స్ఫూర్తిగా తీసుకొని క్రీడల్లో రాణించాలని సూచించారు. కేంద్ర క్రీడా శాఖమంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా రవికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. -
కోచ్ లేకుండానే పతకం సాధించిన అభినవ ఏకలవ్యుడు
టోక్యో: పారాలింపిక్స్ డిస్కస్ త్రో ఈవెంట్లో 44.38 మీటర్లు డిస్కస్‌ను విసిరి రజత పతకం సాధించిన యోగేశ్ కతునియాపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లివిరుస్తున్నాయి. ఢిల్లీకి చెందిన ఈ 24 ఏళ్ల అథ్లెట్.. కోచ్ లేకుండానే పతకం సాధించి దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నాడు. ఈ విషయం తెలిసుకున్న క్రీడాభిమానలు యోగేశ్‌ను అభినవ ఏకలవ్యుడిగా అభివర్ణిస్తున్నారు. పతకం సాధించిన సందర్భంగా యోగేశ్ మాట్లాడుతూ.. చాలాకాలంగా కోచ్ లేకుండానే సాధన చేశానని, ఈసారి స్వర్ణం తృటిలో చేజారినా(మీటర్ తేడాతో) బాధలేదని, ప్యారిస్ పారాలింపిక్స్‌లో మాత్రం ఖచ్చితంగా స్వర్ణం గెలుస్తానని ధీమా వ్యక్తం చేశాడు. ఈ మాటలు భారతీయులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కాగా, కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో సాధన చేసేందుకు యోగేశ్ గత రెండేళ్లుగా అడ్డంకులను ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఈ మధ్యకాలంలో కఠోరంగా సాధన చేసిన అతను.. ఖాళీ స్టేడియాల్లో, మార్గనిర్దేశకుడు లేకుండానే ఒంటరిగా సాధన చేశాడు. ఇలా ఎవరి సహాయ సహకారాలు లేకుండా పారాలింపిక్స్‌లో పతకం సాధించి భవిష్యత్తు తరం క్రీడాకారులకు స్పూర్తిగా నిలిచాడు. ఇదిలా ఉంటే, ఎనిమిదేళ్ల వయసులోనే యోగేశ్‌కు పక్షవాతం వచ్చి శరీరంలో కొన్ని అవయవాలు పనిచేయకుండా పోయాయి. అప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న అతను.. ఎన్నో అడ్డంకులను అధిగమించి పారాలింపిక్స్‌కు సిద్ధమయ్యాడు. గురువు లేకుండానే పతకం గెలిచి క్రీడాభిమానల మనసుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించాడు. చదవండి: వినోద్ కుమార్‌కు భంగపాటు.. కాంస్య పతకాన్నిరద్దు చేసిన నిర్వాహకులు -
Viral Video: పతకం గెలిచిన ఆనందంలో చిందేసిన భారత అథ్లెట్..
న్యూఢిల్లీ: అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో భారత్ తరఫున లాంగ్ జంప్ ఈవెంట్లో 17 ఏళ్ల షైలీ సింగ్ రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఆనందంలో ఆమె మైమరిచి చిందేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో షైలీ చేసిన డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతూ, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన షైలీ.. నైరోబి ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో 6.59 మీటర్లు దూకి రజతం సాధించింది. #WorldAthleticsU20 Silver Medalist #ShailiSingh celebrates her glorious return by dancing on the tune of a Punjabi song at SAI, Bangalore Take a look 😀@ianuragthakur @NisithPramanik @YASMinistry @IndiaSports @DGSAI @afiindia @Adille1 @NsscSai @ddsportschannel @AkashvaniAIR pic.twitter.com/hWzuezycEL — SAI Media (@Media_SAI) August 27, 2021 అనంతరం ఆమె భారత్‌కు తిరిగొచ్చాక బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) సెంటర్లో పతకం గెలిచిన ఆనందాన్ని వ్యక్త పరుస్తూ.. పాపులర్ పంజాబీ పాటకు బాంగ్రా నృత్యం చేసింది. ఈ డ్యాన్స్ వీడియోను సాయ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. కాగా, షెల్లీ సింగ్ కేవలం 1 సెంటీమీటర్ దూరంతో స్వర్ణాన్ని కోల్పోయింది. స్వీడన్‌కు చెందిన 18 ఏళ్ల మజా అస్కాగ్ 6.60 మీటర్లు దూకి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. చదవండి: వినోద్ కూమార్‌కు కాంస్యం.. భారత్ ఖాతాలో మూడో పతకం -
‘అప్పుడు ఎందుకు నవ్వలేదు’.. రవిని ప్రశ్నించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లతో భేటీ సందర్భంగా ఓ పతకధారిని ఉద్దేశించి ప్రధాని మోదీ సరదా వ్యాఖ్యలు చేశారు. రెజ్లింగ్ ఫ్రీ స్టైల్ 57 కేజీల విభాగంలో రవి దహియా రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, రవి బౌట్లో ఎప్పుడూ గంభీరంగా ఉంటాడని, మెడల్ మ్యాచ్ అనంతరం పతకం అందుకున్న సమయంలోనూ నవ్వలేదని మోదీ సరదాగా వ్యాఖ్యానించారు. సాధారణంగా హర్యానాకు చెందినవారు ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తుంటారు, దేశం గర్వించే గొప్ప విజయాన్ని సాధించిన సందర్భంగా కూడా నీ ముఖంలో చిరు నవ్వు కనిపించలేదేమంటూ రవి దహియాను మోదీ ప్రశ్నించారు. ఇందుకు రవి దహియా బదులిస్తూ.. అప్పుడు తాను నెర్వస్‌గా ఉన్నానని, అందుకే తన ముఖంలో ఎటువంటి హావభావాలను పలకలేదని, ప్రస్తుతం తాను కుదుటపడ్డానని ప్రధానికి చెప్పుకొచ్చాడు. కాగా, హర్యానాకు చెందిన 23 ఏళ్ల రవి దాహియా టోక్యో ఒలింపిక్స్‌లో కొలంబియా, బల్గేరియా, కజకిస్తాన్ రెజ్లర్లను ఓడించి ఫైనల్స్‌కు చేరాడు. ఫైనల్లో రష్యా రెజ్లర్‌తో భీకరంగా పోరాడి రజత పతకంతో మెరిశాడు. చదవండి: లివింగ్‌స్టోన్ ఊచకోత.. 10 సిక్సర్లు, 3 ఫోర్లతో 92 నాటౌట్ -
ప్రదీప్... కొత్త రకం డోపీ
న్యూఢిల్లీ: భారత క్రీడా రంగంలో కుదుపు! 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో 105 కేజీల విభాగంలో రజత పతకం నెగ్గిన భారత వెయిట్‌లిఫ్టర్ ప్రదీప్ సింగ్ సరికొత్త డోపింగ్‌కు పాల్పడ్డాడు. హ్యూమన్ గ్రోత్ హార్మోన్ (హెచ్‌జీహెచ్) డోపింగ్‌లో ఈ పంజాబ్ లిఫ్టర్ దొరికిపోయాడు. ఈ హెచ్‌జీహెచ్ కేసు ప్రపంచానికి ముందే పరిచయమైనా... భారత్‌లో ఇదే తొలి కేసు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) పరీక్షల్లో లాక్‌డౌన్‌కు ముందే మార్చిలో పట్టుబడినప్పటికీ ‘బి’ శాంపిల్‌తో ధ్రువీకరించుకున్న తర్వాత ‘నాడా’ తాజాగా వెల్లడించింది. అథ్లెట్లు అత్యంత అరుదుగా ఈ తరహా మోసానికి పాల్పడతారు. ఇది మామూలు ఉత్ప్రేరకం కాదు. మెదడులోని గ్రంథి స్రావాల ద్వారా ఉత్తేజితమయ్యే ఉత్ప్రేరకం. రైల్వేస్‌కి చెందిన వెయిట్‌లిఫ్టర్ ప్రదీప్ హెచ్‌జీహెచ్‌కు పాల్పడినట్లు తేలడంతో భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య నాలుగేళ్ల నిషేధం విధించింది. దీనిపై ‘నాడా’ డైరెక్టర్ నవీన్ అగర్వాల్ మాట్లాడుతూ ‘ఇలాంటి డోపింగ్ కేసు మన దేశంలో మొదటిది. మార్చిలోనే సంబంధిత సమాఖ్యకు సమాచారమిచ్చాం. నిజానికి పోటీల్లేని సమయంలో డిసెంబర్లో అతని నుంచి నమూనాలు సేకరించాం. ‘వాడా’ గుర్తింపు పొందిన ‘దోహా’ ల్యాబ్‌కు పంపి పరీక్ష చేయగా దొరికిపోయాడు’ అని తెలిపాడు. ఫిబ్రవరిలో జరిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లో ప్రదీప్ 102 కేజీల కేటగిరీలో పాల్గొని స్వర్ణం గెలిచాడు. మార్చిలో డోపింగ్‌లో దొరికిన వెంటనే ‘నాడా’ ఇచ్చిన సమాచారం మేరకు భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య అతన్ని శిబిరం నుంచి తప్పించింది. హెచ్‌జీహెచ్ అంటే... కొన్ని రకాల మెడిసిన్ ద్వారా హెచ్‌జీహెచ్ శరీరంలోకి ఉత్పత్తి అవుతుంది. మానవ శరీరాన్ని అత్యంత చాకచక్యంగా ఉత్తేజితం చేస్తుంది. ఎముక, ఇతర దెబ్బతిన్న అవయ వం పెరుగుదలకు దోహదం చేస్తుంది. ఎముకశక్తిని పటిష్టపరుస్తుంది. కండరాల సామర్థ్యాన్ని పెంచుతుంది. అంతర్జాతీయ డోపిం గ్ నిరోధక సంస్థ (వాడా) ప్రకారం 2010 నుంచి ఈ తరహా డోపింగ్‌కు పాల్పడింది కేవలం 15 మందే. ఇందులో ఇద్దరు లండన్ ఒలింపిక్స్ సమయంలో దొరికిపోయారు. -
ద్యుతీకి మరో రజతం
భారత స్ప్రింటర్ ద్యుతీ చంద్ ఆసియా క్రీడల్లో రెండో పతకాన్ని సాధించింది. మహిళ 200 మీటర్ల పరుగులో ఆమె రెండో స్థానంలో నిలిచింది. ఈ రేసును ద్యుతీ 23.20 సెకన్లలో పూర్తి చేసింది. ఎడిడియాంగ్ ఒడియాంగ్ (బహ్రెయిన్– 22.96 సె.), వీ యోంగ్లీ (చైనా –23.27 సె.) స్వర్ణ, కాంస్యాలు గెలుచుకున్నారు. ఆదివారమే ద్యుతి 100 మీటర్ల స్ప్రింట్‌లో కూడా రజతం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒకే ఏషియాడ్‌లో ఒకటి కంటే ఎక్కువ పతకాలు గెలిచిన నాలుగో అథ్లెట్‌గా చరిత్రకెక్కింది. అంతకుముందు పీటీ ఉష 1986 సియోల్ ఏషియాడ్‌లో 200 మీ., 400 మీ. పరుగులు, 400 మీ. హర్డిల్స్, 4గీ400 మీటర్ల రిలేలో స్వర్ణాలు గెలిచింది. జ్మోతిర్మయి సిక్దర్ 1998లో 800 మీ., 1500 మీ. పరుగులో, సునీతా రాణి 2002లో 1500 మీ., 5 వేల మీ. పరుగులో పతకాలు గెల్చుకున్నారు. -
భారత్‌కు రజతం
హైదరాబాద్: ఆసియా నేషన్స్ కప్ చెస్ టోర్నమెంట్లో భారత మహిళల, పురుషుల జట్లు రాణించాయి. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక, పద్మిని రౌత్, ఇషా కరవాడే, వైశాలి, ఆకాంక్షలతో కూడిన భారత మహిళల జట్టు ర్యాపిడ్ విభాగంలో రజత పతకం సాధించింది. సూర్యశేఖర గంగూలీ, ఆధిబన్, కృష్ణన్ శశికిరణ్, అభిజిత్ గుప్తా, సేతురామన్‌లతో కూడిన భారత పురుషుల జట్టు ర్యాపిడ్ ఓపెన్ విభాగంలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఇరాన్‌లోని హమదాన్ పట్టణంలో జరుగుతోన్న ఈ టోర్నీలో భారత మహిళల జట్టు నిర్ణీత ఏడు రౌండ్ల తర్వాత 17 పాయింట్లు సంపాదించి రెండో స్థానంలో నిలిచింది. ఇరాన్ వైట్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్ రెడ్ జట్లపై నెగ్గిన భారత్... ఇరాన్ గ్రీన్, వియత్నాం జట్లతో ‘డ్రా’ చేసుకొని... చైనా చేతిలో ఓడిపోయింది. విజయానికి రెండు పాయింట్లు, ‘డ్రా’ అయితే ఒక పాయింట్ లభిస్తాయి. బోర్డు–1పై ఆడిన హారిక ఆరు పాయింట్లతో కాంస్య పతకం దక్కించుకోగా... బోర్డు–3పై ఇషా కరవాడే కాంస్యం, బోర్డు–4పై వైశాలి స్వర్ణం సొంతం చేసుకున్నారు. మరోవైపు భారత పురుషుల జట్టు నిర్ణీత ఏడు రౌండ్ల తర్వాత పది పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్, ఇరాన్ గ్రీన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్ వైట్, వియత్నాంలపై నెగ్గిన భారత జట్టు చైనా, కజకిస్తాన్ జట్ల చేతుల్లో ఓడింది. బోర్డు–2పై ఆధిబన్ రజతం, బోర్డు–3పై శశికిరణ్, బోర్డు–5పై సేతరామన్ కాంస్య పతకాలు గెల్చుకున్నారు. -
సురేఖ జోడీకి రజతం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ విశ్వ విద్యాలయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ రజత పతకం సొంతం చేసుకుంది. కొరియాలోని గ్వాంగ్జౌలో జరుగుతున్న ఈ పోటీల మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సురేఖ జోడీకి రెండో స్థానం దక్కింది. ఫైనల్లో భారత జంట సురేఖ-కన్వల్ ప్రీత్ సింగ్ 150-157 స్కోరుతో దక్షిణ కొరియా ద్వయం చేతిలో పరాజయం పాలైంది.