న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లతో భేటీ సందర్భంగా ఓ పతకధారిని ఉద్దేశించి ప్రధాని మోదీ సరదా వ్యాఖ్యలు చేశారు. రెజ్లింగ్ ఫ్రీ స్టైల్ 57 కేజీల విభాగంలో రవి దహియా రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, రవి బౌట్‌లో ఎప్పుడూ గంభీరంగా ఉంటాడని, మెడల్ మ్యాచ్ అనంతరం పతకం అందుకున్న సమయంలోనూ నవ్వలేదని మోదీ సరదాగా వ్యాఖ్యానించారు.
సాధారణంగా హర్యానాకు చెందినవారు ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తుంటారు, దేశం గర్వించే గొప్ప విజయాన్ని సాధించిన సందర్భంగా కూడా నీ ముఖంలో చిరు నవ్వు కనిపించలేదేమంటూ రవి దహియాను మోదీ ప్రశ్నించారు.
ఇందుకు రవి దహియా బదులిస్తూ.. అప్పుడు తాను నెర్వస్‌గా ఉన్నానని, అందుకే తన ముఖంలో ఎటువంటి హావభావాలను పలకలేదని, ప్రస్తుతం తాను కుదుటపడ్డానని ప్రధానికి చెప్పుకొచ్చాడు. కాగా, హర్యానాకు చెందిన 23 ఏళ్ల రవి దాహియా టోక్యో ఒలింపిక్స్‌లో కొలంబియా, బల్గేరియా, కజకిస్తాన్ రెజ్లర్‌లను ఓడించి ఫైనల్స్‌కు చేరాడు. ఫైనల్లో రష్యా రెజ్లర్‌తో భీకరంగా పోరాడి రజత పతకంతో మెరిశాడు.
చదవండి: లివింగ్‌స్టోన్ ఊచకోత.. 10 సిక్సర్లు, 3 ఫోర్లతో 92 నాటౌట్
Comments
Please login to add a commentAdd a comment