![Iam Truly Broken Says Vinesh Phogat Unsure Of Returning To Wrestling - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/13/Vinesh.jpg.webp?itok=vVwbnTN7)
ఢిల్లీ: భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని సంతరించుకున్నాయి. ఇటీవలే టోక్యో ఒలింపిక్స్ నుంచి తిరిగి వచ్చిన ఆమెపై క్రమశిక్షణ చర్యల కింద రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్య్లూఎఫ్‌ఐ) తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన వినేశ్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు రాసిన కాలమ్‌లో..'ఇక రెజ్లింగ్‌కు తిరిగొస్తానో రానో' అంటూ కామెంట్ చేయడం ఆసక్తి కలిగించింది.
''భారత్‌లో ఎంత వేగంగా ఎదుగుతారో అంతే వేగంగా పతనమవుతారని నాకు తెలుసు. ఒక్క మెడల్ పోయిందంటే ఇక అంతే. పని ముగిసినట్లే. రెజ్లింగ్‌లోకి నేను ఎప్పుడు తిరిగి వస్తానో తెలియదు.. రాకపోవచ్చు కూడా. నా కాలు విరిగినప్పుడే బాగుంది. ఇప్పుడు నా శరీరం విరగలేదు కానీ.. మనసు మాత్రం కుంగిపోయింది.'' అని చెప్పుకొచ్చింది. ఒలింపిక్స్‌కు ముందు 2017లో కాంకషన్‌కు గురవడం, ఆ తర్వాత రెండుసార్లు కొవిడ్ బారిన పడి కోలుకున్న వినేశ్ తాజా వ్యాఖ్యలతో కెరీర్ ఇక ముగిసినట్టేనా అని కొంతమంది భావిస్తున్నారు. ఇక టోక్యో ఒలింపిక్స్ 53 కేజీల రెజ్లింగ్ కేటగిరిలో పోటీ పడిన ఆమె పతకం సాధిస్తుందని అంతా భావించారు. కానీ క్వార్టర్‌ఫైనల్లోనే ఓడిపోయి వినేశ్ ఇంటిదారి పట్టింది.
Comments
Please login to add a commentAdd a comment