
శ్రీనగర్ : ఉగ్రవాదులను భారత్‌లోకి పంపేందుకు ప్రయత్నిస్తోన్న పాకిస్తాన్‌కు కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ హెచ్చరించారు. తీరు మార్చుకోకపోతే ఆదివారం జరిగిన దాడుల వంటివి పునరావృతమవుతాయని స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడారు. కశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ గురించి అడుగగా.. ఇంటర్నెట్ సేవలను ప్రారంభిస్తే ఆ సౌలభ్యాన్ని ఉగ్రవాదులే ఎక్కువగా ఉపయోగించే అవకాశముందని వెల్లడించారు.
నవంబర్ 1 నుంచి కశ్మీర్‌లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని వెల్లడించారు. ‘ఇక్కడ ఉన్న యువకులను అడుగుతున్నా. ఇన్నాళ్లు మీరేం సాధించారు? మీ ఆశయాలు నెరవేరడానికి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకొని రాష్ట్రాభివృద్ధికి కలిసి రావాల’ని కోరారు. కాగా, ఆదివారం సాయంత్రం భారత ఆర్మీ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో చేసిన దాడుల్లో ఉగ్రవాదులతో పాటు పాక్ సైనికులు మృతి చెందిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment