Satya Pal Malik
-
Satya Pal Malik: మాజీ గవర్నర్ ఇంట సీబీఐ సోదాలు
ఢిల్లీ: జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను దర్యాప్తు సంస్థలు వదలడం లేదు. తాజాగా గురవారం ఆయన ఇంటితో పాటు 30 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు జరిగాయి. ఆయన జమ్ము గవర్నర్‌గా ఉన్న సమయంలో.. కిరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు అవినీతి జరగడం.. దానిపై కేసు నమోదు కావడమే ఇందుకు కారణం. జమ్ములో రూ. 2,200 కోట్ల విలువైన కిరు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ (హెచ్ఇపి)లో పనులు కేటాయింపులో అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. దాంతో ఏప్రిల్ 2022లో మాలిక్‌తో సహా ఐదుగురు వ్యక్తులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ దర్యాప్తులో భాగంగా గురువారం ఉదయం 100 మంది అధికారులు పలు నగరాల్లో ఈ సోదాలు ప్రారంభించారని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ పరిణామాలపై సత్యపాల్ మాలిక్ ట్విటర్ ద్వారా స్పందిస్తున్నారు. ‘నేను అనారోగ్యంతో ఉన్నప్పటికీ.. నా నివాసంపై నిరంకుశ శక్తులు దాడి చేస్తున్నాయి. ఈ సోదాల ద్వారా నా డ్రైవర్, సహాయకుడిని వేధిస్తున్నాయి. ఇలాంటి వాటికి నేను భయపడను. నేను రైతులకు అండగా నిలుస్తాను’ అని వెల్లడించారు. మరో ట్వీట్లో.. అవినీతికి పాల్పడిన వారిపై నేను ఫిర్యాదు చేస్తే.. ఆ వ్యక్తుల్ని విచారించకుండా నా నివాసంపై సీబీఐ దాడులు చేస్తోంది. ఇంట్లో నాలుగైదు కుర్తాలు, పైజామాలు తప్ప మరేమీ వాళ్లకు దొరకలేదు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ఆ నియంత నన్ను భయపెట్టాలని చూస్తున్నాడు. నేను రైతు బిడ్డను. ఎవరికీ భయపడను.. తలవంచను అంటూ పోస్ట్ చేశారాయన. मैंने भ्रष्टाचार में शामिल जिन व्यक्तियों की शिकायत की थी की उन व्यक्तियों की जांच ना करके मेरे आवास पर CBI द्वारा छापेमारी की गई है। मेरे पास 4-5 कुर्ते पायजामे के सिवा कुछ नहीं मिलेगा। तानाशाह सरकारी एजेंसियों का ग़लत दुरुपयोग करके मुझे डराने की कोशिश कर रहा है। मैं किसान का… — Satyapal Malik 🇮🇳 (@SatyapalmalikG) February 22, 2024 మాలిక్.. 2018 ఆగస్టు నుంచి 2019 అక్టోబర్ వరకు జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో తన వద్దకు రెండు దస్త్రాలు వచ్చాయని, వాటిపై సంతకం చేస్తే రూ.300 కోట్లు వస్తాయని తన కార్యదర్శులు చెప్పినట్లు గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో ఒక దస్త్రం హైడ్రో ప్రాజెక్టుదని తెలిపారు. ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది ఏప్రిల్‌లో మాలిక్ చేసిన అవినీతి ఆరోపణలకు సంబంధించి రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది సీబీఐ. అందులో ఒకటి పైన చెప్పుకున్న కిరూ హైడ్రాలిక్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించింది కాగా.. , రెండోది ఇన్సూరెన్స్ స్కీమ్‌కు సంబంధించిన ఆరోపణలు. ఇన్సూరెన్స్ ఒప్పందం నేపథ్యం.. 2018లో సదరు కంపెనీ కాంట్రాక్ట్‌ను ఆ సమయంలో జమ్ము కశ్మీర్ గవర్నర్‌గా ఉన్న సత్యపాల్ మాలిక్ ఆ ఫైల్స్‌ను స్వయంగా పర్యవేక్షించానని చెబుతూ ఒప్పందాన్ని రద్దు చేశారు. జమ్ము కశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ల కుటుంబ సభ్యుల మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్‌కు సంబంధించి స్కాం ఇది. దాదాపు మూడున్నర లక్షల ఉద్యోగులు 2018 సెప్టెంబర్‌లో ఇందులో చేరారు. అయితే.. అవకతవకలు ఉన్నాయంటూ నెలకే ఈ కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తూ సంచలనానికి తెర తీశారు అప్పుడు గవర్నర్‌గా ఉన్న సత్యపాల్ మాలిక్. ఈ బీమా పథకం ఒప్పందానికి సంబంధించిన అవినీతి కేసులో మాలిక్‌ను సీబీఐ సాక్షిగా చేర్చింది. గతంలో ఐదు గంటలపాటు విచారించింది కూడా. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌తో పాటు ట్రినిటీ రీఇన్సూరెన్స్ బ్రోకర్స్‌ను నిందితులుగా చేర్చింది సీబీఐ. ఇందులో మోసం జరిగిందని మాలిక్ ఆరోపించడంతో.. ఆయన నుంచి అదనపు సమాచారం సేకరించేందుకే ఆయన్ని ప్రశ్నించినట్లు సీబీఐ ప్రకటించింది. సంచలనంగా సత్యపాల్ మాలిక్ చరణ్ సింగ్ భారతీయ క్రాంతి దళ్‌తో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సత్యపాల్ మాలిక్. ఆ తర్వాత భారతీయ లోక్‌దల్ పార్టీలో చేరి, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడిగా పని చేసిన మాలిక్.. 2012లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా పని చేశారు కూడా. ఆపై బీహార్, జమ్ము కశ్మీర్, గోవా, మేఘాలయాకు గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు. జమ్ము కశ్మీర్ ప్రత్యేక హోదాను కేంద్రం వెనక్కి తీసుకున్న సమయంలో ఈయనే గవర్నర్‌గా ఉన్నారు. రైతుల ఉద్యమ సమయంలో ఈయన రైతులకు మద్దతు ప్రకటించడం, కేంద్రానికి హెచ్చరికలు జారీ చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. పుల్వామా దాడి, నరేంద్ర మోదీ మీద తాజాగా (ఏప్రిల్ 14వ తేదీన) కరణ్ థాపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనానికి తెర తీసింది. అవినీతిపై మోదీ ఎలాంటి చర్యలు తీసుకోరని, ఎందుకంటే అందులో ఆరోపణలు ఎదుర్కొనేవాళ్లు ఆయనకు సన్నిహితులేనని వ్యాఖ్యానించారు. అంతేకాదు పుల్వామా దాడి సమయంలో మోదీ, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ గవర్నర్‌గా ఉన్న తనకు చేసిన సూచనలపైనా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం పుట్టించాయి. పుల్వామా దాడిలో ఇంటెలిజెన్స్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని, 300 కేజీల ఆర్డీఎక్స్ పాక్ నుంచి రావడం, జమ్ము కశ్మీర్లో పది నుంచి పదిహేను రోజులపాటు చక్కర్లు కొట్టడం, దానిని అధికారులు గుర్తించలేకపోవడం పైనా మాలిక్ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. -
సత్యపాల్ మాలిక్‌ను అరెస్ట్ చేయలేదు: ఢిల్లీ పోలీసులు
ఢిల్లీ: జమ్ము కశ్మీర్‌తో పాటు పలు రాష్ట్రాలకు గవర్నర్‌గా పని చేసిన సత్యపాల్ మాలిక్.. శనివారం ఢిల్లీలోని ఆర్కే పురం పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. తన ఇంట్లో జరగాల్సిన రైతు సంఘాల నేత భేటీని పోలీసులు అడ్డుకోవడంపై పీఎస్‌లో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారాయాన. ఈ క్రమంలో.. ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారంటూ ప్రచారం జరగ్గా ఢిల్లీ పోలీసులు దానిని ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను మేం అదుపులోకి తీసుకోలేదు. ఆయనంతట ఆయనగా పీఎస్‌కు వచ్చారు. తోడు మద్ధతుదారులు కూడా ఉన్నారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కూడా మేం ఆయన్ని కోరాం సీనియర్ అధికారి ఒకరు ప్రకటన విడుదల చేశారు. అసలు విషయం ఏంటంటే.. ఆర్కేపురంలో ఉన్న తన ఇంట్లో సత్యపాల్ మాలిక్ శనివారం రైతు సంఘాల నేలతో భేటీ కావాల్సి ఉంది. హర్యానా నుంచి రైతు సంఘాల నేతలు తమ పోరాటానికి మాలిక్ మద్దతు కోరే యత్నం చేశారు. ఈ క్రమంలో ఇంటి ఆవరణ సరిపోక.. భోజనాలను బయట ఉన్న పార్క్‌లో ఏర్పాటు చేశారు. అయితే అది పబ్లిక్ స్పేస్ అని, అక్కడ అనుమతి లేదని పోలీసులు అడ్డుకునే యత్నం చేశారు. దీంతో.. స్థానిక పీఎస్‌కు తన మద్దతుదారులతో చేరుకున్న సత్యపాల్ మాలిక్, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాసేపు అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈలోపు పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారంటూ ప్రచారం నడిచింది. దీంతో ఢిల్లీ పోలీసులు ట్విటర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఈయన గవర్నర్‌గా ఉన్న టైంలో జమ్ము కశ్మీర్లో జరిగిన ఓ భారీ అవినీతి స్కాంకు సంబంధించి సీబీఐ సాక్షిగా ప్రశ్నించేందుకు సమన్లు జారీ చేసింది. ఈ అంశం రాజకీయంగానూ హాట్ టాపిక్ అయ్యింది. విచారణలో స్పష్టత కోసమే తనను పిలిచారని, ఏప్రిల్27, 28, 29 తేదీల్లో సీబీఐకి అందుబాటులో ఉంటానని బదులు ఇచ్చినట్లు ఆయన మీడియాకు తెలిపారు. थाना आर.के. पुरम के सामने पूर्व राजयपाल चौ सत्यपाल मलिक के समर्थन में पहुंचे समर्थक ।@SatyapalMalik_1#SatyapalMalik #CBISummonedSatyapalMalik#सत्यपाल_मलिक #PulwamaAttack #देश_सत्यपाल_मलिक_के_साथ_है pic.twitter.com/qR1XLbFAXg — DU JAT STUDENTS UNION (@du_jat) April 22, 2023 సంచలనాల సత్యపాల్ మాలిక్ -
సత్యపాల్ మాలిక్‌కు సీబీఐ సమన్లు
Satya Pal Malik News: జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్(76)కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI) శుక్రవారం సమన్లు జారీ చేసింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌పై అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులో సత్యపాల్ మాలిక్‌ను ప్రశ్నించాలని సీబీఐ భావించింది. ఈ మేరకు ఏప్రిల్ 28వ తేదీన ఈ కేసులో సాక్షిగానే తమ ఎదుట హాజరు కావాలని సీబీఐ సమన్లలో కోరింది. 2018లో కంపెనీ కాంట్రాక్ట్‌ను ఆ సమయంలో జమ్ము కశ్మీర్ గవర్నర్‌గా ఉన్న సత్యపాల్ మాలిక్ ఆ ఫైల్స్‌ను స్వయంగా పర్యవేక్షించానని చెబుతూ ఒప్పందాన్ని రద్దు చేశారు. జమ్ము కశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ల కుటుంబ సభ్యుల మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్‌కు సంబంధించి స్కాం ఇది. దాదాపు మూడున్నర లక్షల ఉద్యోగులు 2018 సెప్టెంబర్‌లో ఇందులో చేరారు. అయితే.. అవకతవకలు ఉన్నాయంటూ నెలకే ఈ కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తూ సంచలనానికి తెర తీశారు అప్పుడు గవర్నర్‌గా ఉన్న సత్యపాల్ మాలిక్. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌తో పాటు ట్రినిటీ రీఇన్సూరెన్స్ బ్రోకర్స్‌ను నిందితులుగా చేర్చింది సీబీఐ. ఇందులో మోసం జరిగిందని మాలిక్ ఆరోపించడంతో.. ఆయన నుంచి అదనపు సమాచారం సేకరించేందుకే సీబీఐ ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. CBI has asked me to come to their Delhi office to give clarification regarding the alleged insurance scam in J&K on 27th or 28th April: Former J&K Governor Satyapal Malik on alleged insurance scam involving Reliance General Insurance (file photo) pic.twitter.com/t9kLr3Dvrp — ANI (@ANI) April 21, 2023 ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది ఏప్రిల్‌లో మాలిక్ చేసిన అవినీతి ఆరోపణలకు సంబంధించి రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది సీబీఐ. అందులో ఒకటి పైన చెప్పుకున్న ఇన్సూరెన్స్ స్కీమ్ది కాగా, రెండోది జమ్ము కశ్మీర్ దాదాపు రూ.2,200 కోట్ల వ్యయంతో చేపట్టిన కిరూ హైడ్రాలిక్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన ఆరోపణలు. రిలయెన్స్ ఇన్సూరెన్స్ ప్రతిపాదిత బీమా పథకాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ నేత రామ్ మాధవ్ అప్పట్లో అనుకున్నారని, పేపర్ వర్క్ కూడా పూర్తయిన ఆ స్కీమ్‌ను రద్దు చేయడం ఆయనకు అసంతృప్తిని కలిగించిందని సత్యపాల్ మాలిక్ ఏప్రిల్ 14న కరణ్ థాపర్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీనికి ముందు, డీబీ లైవ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ మాలిక్ ఈ ప్రస్తావన చేశారు. ఈ లైవ్ ప్రసారం కాగానే సత్యపాల్ మాలిక్‌కు రామ్ మాధవ్ పరువునష్టం నోటీసు పంపారు కూడా. సంచలనంగా సత్యపాల్ మాలిక్ చరణ్ సింగ్ భారతీయ క్రాంతి దళ్‌తో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సత్యపాల్ మాలిక్. ఆ తర్వాత భారతీయ లోక్‌దల్ పార్టీలో చేరి, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడిగా పని చేసిన మాలిక్.. 2012లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా పని చేశారు కూడా. ఆపై బీహార్, జమ్ము కశ్మీర్, గోవా, మేఘాలయాకు గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు. జమ్ము కశ్మీర్ ప్రత్యేక హోదాను కేంద్రం వెనక్కి తీసుకున్న సమయంలో ఈయనే గవర్నర్‌గా ఉన్నారు. రైతుల ఉద్యమ సమయంలో ఈయన రైతులకు మద్దతు ప్రకటించడం, కేంద్రానికి హెచ్చరికలు జారీ చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా.. పుల్వామా దాడి, నరేంద్ర మోదీ మీద తాజాగా (ఏప్రిల్ 14వ తేదీన) కరణ్ థాపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనానికి తెర తీసింది. అవినీతిపై మోదీ ఎలాంటి చర్యలు తీసుకోరని, ఎందుకంటే అందులో ఆరోపణలు ఎదుర్కొనేవాళ్లు ఆయనకు సన్నిహితులేనని వ్యాఖ్యానించారు. అంతేకాదు పుల్వామా దాడి సమయంలో మోదీ, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ గవర్నర్‌గా ఉన్న తనకు చేసిన సూచనలపైనా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం పుట్టించాయి. పుల్వామా దాడిలో ఇంటెలిజెన్స్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని, 300 కేజీల ఆర్డీఎక్స్ పాక్ నుంచి రావడం, జమ్ము కశ్మీర్లో పది నుంచి పదిహేను రోజులపాటు చక్కర్లు కొట్టడం, దానిని అధికారులు గుర్తించలేకపోవడం పైనా మాలిక్ వ్యాఖ్యలు చేశారు. -
ప్రధాని మోదీకి షాక్.. బీజేపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు
బీజేపీలో అసంతృప్తి నెలకొందా?. సీనియర్ నేతలు బీజేపీ అధిష్టానం వైఖరిని తప్పుబడుతున్నారా? ఇటీవలి కాలంలో వారు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. బీజేపీ నిర్ణయాలపై ఎప్పుడూ బాణం ఎక్కుపెట్టే వరుణ్ గాంధీ సరసన మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కూడా చేరిపోయినట్టు తెలుస్తోంది. ఉప రాష్ట్రపతి పదవి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అయితే, గవర్నర్ సత్యపాల్ మాలిక్ మీడియాతో మాట్లాడుతూ.. నేను జమ్మూ కశ్మీర్‌కు గవర్నర్‌గా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకపోయి ఉంటే ఉప రాష్ట్రపతిని అయ్యేవాడినని అన్నారు. ఉప రాష్ట్రపతి పదవి నాకే ఇస్తున్నారనే సూచనలు అంతకు ముందే నాకు తెలిశాయి అని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే తనకు నచ్చిన విషయంపై మాట్లాడకుండా ఉండలేనని చెప్పారు. కాగా, సత్యపాల్ మాలిక్ జమ్మూ కశ్మీర్ గవర్నర్‌గా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించారు. దీంతో బీజేపీ అధిష్టానం మాలిక్‌పై ఫోకస్ పెట్టింది. అనంతరం, మాలిక్‌ను మేఘాలయ గవర్నర్‌గా బదిలీ చేసింది. ఇక, తాజాగా కూడా సత్యపాల్ మాలిక్ కేంద్రంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో జరుగుతున్న ఈడీ రైడ్లపై స్పందించారు. ఈడీ రైడ్లు ఎక్కువగా ప్రతిపక్ష నేతలపైనే జరుగుతున్నాయి. నిజానికి బీజేపీ నేతలపైనా ఈ దాడులు జరగాలి. ఎందుకంటే.. ఈడీ రైడ్లు జరపాల్సిన స్థితిలో బీజేపీ నేతలు కూడా ఉన్నారని బాంబు పేల్చారు. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారత్ జోడో యాత్రను సత్యపాల్ మాలిక్ ప్రశంసించారు. ఈ సమయంలోనే యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించారు. రాహుల్ గాంధీ తన పార్టీ కోసం మంచి పని చేస్తున్నాడని పేర్కొన్నారు. అలాగే.. రైతుల సమస్యలపై కూడా మాలిక్ స్పందించారు. రైతులకే తన మద్దతు ప్రకటిస్తున్నట్టు స్పష్టం చేశారు. కనీస మద్దతు ధరను కేంద్రం అమలు చేయకపోతే.. తానే రైతులకు మద్దతుగా ఆందోళనలు చేపడతానని వ్యాఖ్యలు చేశారు. 'Will be made VP if...': Satya Pal Malik says people hinted at elevation; lauds Rahul Gandhi over Bharat Jodo Yatra. Too obvious, people are not foolish. https://t.co/6KitK8gDkW— Happy Musings (@sanjivesethi1) September 11, 2022 -
కుక్కలకు ఇచ్చే విలువ కూడా రైతులకు ఇవ్వడం లేదు: సత్యపాల్ మాలిక్
జైపూర్: ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనపై కేంద్రం తీరుని ఎండగడుతూ.. మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మరోసారి విరుచుకుపడ్డారు. జైపూర్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో మాలిక్ మాట్లాడుతూ.. దేశాన్ని ఏలే నాయకులు కుక్క చనిపోయినప్పుడు కూడా సంతాప సందేశాలు పంపుతారని, అయినప్పటికీ రైతుల మరణాల గురించి పట్టించుకోవడానికి మాత్రం సమయం దొరకడం లేదని ఘాటుగా విమర్శించారు. ‘ఇప్పటి వరకు ఇంత పెద్ద ఉద్యమం ఎన్నడూ జరగలేదు. రైతు ఉద్యమంలో ఇప్పటి వరకు 600 మంది అమరులయ్యారు. ఒక జంతువు చనిపోతే ‘పెద్ద’ల నుంచి సంతాప సందేశాలు వెల్లువెత్తుతాయి. రైతుల మరణాల విషయంలో మాత్రం కేంద్ర నాయకత్వం అనుసరిస్తున్న తీరు సరికాదు’ అని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రలోని ఆసుపత్రిలో అగ్నిప్రమాదంలో మరణించినవారికి నాయకులు సంతాప సందేశం పంపిన విషయాన్ని గుర్తు చేశారు. గవర్నర్ కుర్చీ నుంచి దిగిపోవడానికి భయపడేది లేదని మాలిక్ మరోసారి స్పష్టం చేశారు. కేంద్రం ప్రవేశ పెట్టిన మూడు వ్యవసాయ చట్టాలను సత్యపాల్ మాలిక్ విమర్శించడం ఇదే మొదటిసారి కాదు. కొత్త వ్యవసాయ చట్టాలు ఏవీ రైతులకు అనుకూలంగా లేవని సత్యపాల్ మాలిక్ ఈ ఏడాది మార్చిలో చెప్పారు. చట్టాలు ఏవీ రైతులకు అనుకూలంగా లేవని, రైతులు, సైనికులు సంతృప్తి చెందని దేశం ముందుకు సాగదు, ఆ దేశాన్ని రక్షించలేము, అందుకే సైన్యాన్ని, రైతులను సంతృప్తి పరచాలని మాలిక్ కోరారు. చదవండి: దారుణం: మంచినీళ్ల నెపంతో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై.. -
మేఘాలయగా గవర్నర్‌గా సత్యపాల్
సాక్షి, న్యూఢిల్లీ : గోవా గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను మేఘాలయ గవర్నర్‌గా నియమిస్తూ మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ గోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. మహారాష్ట్ర గవర్నరు భగత్ సింగ్ కోశ్యారికి గోవా బాధ్యతలను అదనంగా అప్పగించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే దాకా గోవా గవర్నర్‌గా కూడా కోష్యారీ అదనపు బాధ్యతలు నిర్వర్తించాలని రాష్ట్రపతి భవన్ ఆదేశించింది. మేఘాలయ గవర్నర్‌గా ఐదేళ్ల కాలపరిమితి పూర్తి చేసుకున్న తథాగతరాయ్ స్థానంలో సత్యపాల్ మాలిక్ ను రాష్ట్రపతి బదిలీ చేశారు. సత్యపాల్ మాలిక్ గతంలో జమ్ముకశ్మీర్, బిహార్ గవర్నర్ గా పని చేశారు. 2018 ఆగస్టులో మాలిక్ జమ్మూకశ్మీర్ గవర్నర్ గా విధులు నిర్వర్తించారు. అయితే జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదాను ఇచ్చే ఆర్టికల్ 370 ను రద్దు చేసిన తరువాత 2019 అక్టోబర్ లో సత్యపాల్ మాలిక్ ను గోవాకు బదిలీ చేస్తూ,ఆయన స్థానంలో గిరిష్ చంద్రముర్మును నియమించారు. కాగా, గతంలో మాలిక్ గవర్నర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. గవర్నర్లకు పెద్ద పని ఏదీ ఉండదని, గవర్నర్ గా పని చేసే వారు వైన్ తాగి, గోల్ఫ్ ఆడుతారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో దేశంలో గవర్నర్ వ్యవస్థపై చర్చ కూడా జరిగింది. -
‘పాకిస్తాన్‌కు తలొగ్గిన మాజీ సీఎంలు’
పనాజీ : జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, ముఫ్తీ మహ్మద్ సయ్యద్‌లపై గోవా గవర్నర్ సత్యపాల్ మాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను కశ్మీర్ గవర్నర్‌గా ఉన్న సమయంలో (2018) ఒమర్, ముఫ్తీలు కశ్మీరీ ప్రజల నిర్ణయానికి విరుద్ధంగా వ్యవహరించారని అన్నారు. 2018లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, పాకిస్తాన్ ఒత్తిడితో ఆ ఇద్దరు సీఎంలు ఎన్నికలను బాయ్‌కాట్ చేశారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా పాక్ ప్రమేయంతో వారు కుట్రపన్నారని విమర్శించారు. అంతేకాకుండా కశ్మీరీ వ్యతిరేకులతో వారిద్దరూ చేతులు కలిపారని వివాదాస్పద రీతిలో వ్యాఖ్యానించారు. అయినప్పటికీ తాను ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయగలిగామని చెప్పుకొచ్చారు. తాను కశ్మీర్ గవర్నర్‌గా ఉన్న సమయంలో స్థానిక ప్రజల అనేక సమస్యలను పరిష్కరించానని పేర్కొన్నారు. -
గోవా గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
లక్నో : దేశంలో గవర్నర్లు చేసేందుకు పని ఏమీ ఉండదని గోవా గవర్నర్ సత్యపాల్ మాలిక్ అన్నారు. జమ్ము కశ్మీర్ గవర్నర్ అయితే వైన్ తాగుతూ గోల్ఫ్ ఆడుతూ కాలక్షేపం చేస్తుంటారని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో జమ్ము కశ్మీర్ గవర్నర్‌గానూ వ్యవహరించిన మాలిక్ ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మన దేశంలో గవర్నర్లకు పనీపాటా ఏమీ ఉండదు. జమ్ము కశ్మీర్ గవర్నర్ అయితే సాధారణంగా వైన్ తాగుతూ గోల్ఫ్ ఆడుతూ సేదతీరుతుంటారు. ఇతర రాష్ట్రాల గవర్నర్లు మాత్రం వివాదాలకు దూరంగా ఉంటార’ని అన్నారు. యూపీలోని భాగ్పట్లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చదవండి: అక్కడ కుక్కలు, గుర్రాల పేరుతో భూములు! -
అక్కడ కుక్కలు, గుర్రాల పేరుతో భూములు!
పణజి: బిహార్‌లో రెవెన్యూ రికార్డులు సరిగా లేదని గోవా గవర్నర్ సత్యపాల్ మాలిక్ వాఖ్యానించారు. మంగళవారం 70వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని గోవా విశ్వవిద్యాలయం మైదాన ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. జమీందారీ నిర్మూలన చట్టం అమలు బిహార్‌లో సమర్థవంతంగా జరగలేదని పేర్కొన్నారు. మాలిక్ 2017-18 మధ్య కాలంలో బిహార్ గవర్నర్‌గా సేవలందించారు. బిహార్‌లో కుక్కలు, గుర్రాలు, కర్రల పేరుతో కూడా సొంత భూములు ఉన్నాయని తెలిపారు. జమీందారీ నిర్మూలన చట్టం ఉత్తరప్రదేశ్‌లో మాత్రమే సమర్థవంతంగా అమలులో ఉందని పేర్కొన్నారు. తాను బిహార్ గవర్నర్‌గా పనిచేసిన కాలంలో.. రెవెన్యూ రికార్డులు సరిగా లేవని, అక్కడ కుక్కలు, గుర్రాలు, కర్రల పేరిట భూమి నమోదు చేయడాన్ని చూసి షాక్‌కు లోనయ్యానని చెప్పారు. జమీందారీ చట్టంలోని లోపాల వల్లే.. ఇప్పుడు అక్కడ కొంతమంది భూస్వాముల పేరిట 4,000-5,000 వరకు భిగా భూములు ఉన్నాయని వెల్లడించారు. జమీందారీ నిర్మూలన చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసిన యూపీ మాజీ ముఖ్యమంత్రి చౌదరి చరణ్ సింగ్‌ను ఈ సందర్భంగా మాలిక్ కొనియాడారు. బిహార్ నుంచి జమ్మూకశ్మీర్‌కు గవర్నర్‌గా వెళ్లిన సత్యపాల్ మాలిక్.. ఇటీవల ఆర్టికల్ 370 రద్దు తరువాత ఈ నెలలో (నవంబర్) గోవాకు బదిలీ అయ్యారు. -
జమ్మూకశ్మీర్‌కు నూతన లెఫ్టినెంట్ గవర్నర్
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఆయనను గోవా గవర్నర్‌గా పంపనుంది. ఇక జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఐఏఎస్ గిరీశ్ చంద్ర ముర్ముని నియమించింది. లఢక్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా రాధాకృష్ణ మాథూర్‌ని నియమించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు మిజోరాం గవర్నర్‌గా పీఎస్ శ్రీధరన్ పిళ్లైను నియమించింది. ఇక జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్రం రాష్ట్రాన్ని రెండుగా విభజించిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్, లఢఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా రాష్ట్రం విడిపోయింది. జమ్ముకశ్మీర్‌కు అసెంబ్లీ ఉండగా.. లడఖ్‌లో చట్టసభ ఉండదు. ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు అక్టోబర్ 31 నుంచి మనుగడలోకి వస్తాయి. (చదవండి : జమ్మూ కశ్మీర్.. 81 బ్లాకుల్లో బీజేపీ విజయం) ఐఏఎస్ గిరీశ్ చంద్ర ముర్ము.. 1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ గిరీశ్ చంద్ర ముర్ము ప్రధాని మోదీకి అత్యంత నమ్మకస్తుడు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో గిరీశ్ ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటీరీగా పనిచేశారు. గిరీశ్ ప్రస్తుతం కేంద్ర ఆర్థికశాఖలో వ్యయ నిర్వహణ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. -
పాక్‌కు కశ్మీర్ గవర్నర్ హెచ్చరిక
శ్రీనగర్ : ఉగ్రవాదులను భారత్‌లోకి పంపేందుకు ప్రయత్నిస్తోన్న పాకిస్తాన్‌కు కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ హెచ్చరించారు. తీరు మార్చుకోకపోతే ఆదివారం జరిగిన దాడుల వంటివి పునరావృతమవుతాయని స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడారు. కశ్మీర్లో ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ గురించి అడుగగా.. ఇంటర్నెట్ సేవలను ప్రారంభిస్తే ఆ సౌలభ్యాన్ని ఉగ్రవాదులే ఎక్కువగా ఉపయోగించే అవకాశముందని వెల్లడించారు. నవంబర్ 1 నుంచి కశ్మీర్లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని వెల్లడించారు. ‘ఇక్కడ ఉన్న యువకులను అడుగుతున్నా. ఇన్నాళ్లు మీరేం సాధించారు? మీ ఆశయాలు నెరవేరడానికి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకొని రాష్ట్రాభివృద్ధికి కలిసి రావాల’ని కోరారు. కాగా, ఆదివారం సాయంత్రం భారత ఆర్మీ పాక్ ఆక్రమిత కశ్మీర్లో చేసిన దాడుల్లో ఉగ్రవాదులతో పాటు పాక్ సైనికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
కశ్మీర్లో ఆంక్షల ఎత్తివేత
శ్రీనగర్: పర్యాటకులపై విధించిన ఆంక్షలను జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఎత్తివేసింది. ఉగ్రవాద ప్రమాద నేపథ్యంలో పర్యాటకులంతా కశ్మీర్ నుంచి తక్షణమే వెళ్లిపోవాలంటూ ఆగస్ట్ 2న జారీ చేసిన హెచ్చరికను ఎత్తివేస్తున్నట్లు గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రకటించారు. ఇది అక్టోబర్ 10 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ ఆగస్ట్ 5న కేంద్రం నిర్ణయం తీసుకోవడానికి మూడు రోజుల ముందు ఈ ఆంక్షలను విధించారు. అక్టోబర్ 24న జరగాల్సిన బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్నికలకు సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు వీలుగా జైళ్లలో ఉన్న ఆయా పార్టీల నేతలను కలుసుకునేందుకు ఇతర నేతలకు అనుమతినిస్తున్నట్లు కూడా గవర్నర్ ప్రకటించారు. ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో వరుసగా 65వ రోజు కశ్మీర్‌లోయలో జనజీవనం స్తంభించింది. మార్కెట్లు, ఇతర దుకాణాలు మూసివున్నాయి. ప్రజా రవాణా వ్యవస్థకు చెందిన వాహనాలు ఇంకా రోడ్డెక్కలేదు. ప్రైవేటు వాహనాలు, టాక్సీలు, ఆటోలు మాత్రమే తిరుగుతున్నాయి. కశ్మీర్లో లాండ్‌లైన్ టెలిఫోన్ సేవలను పునరుద్ధరించారు. చాలా ప్రాంతాల్లో ఇంకా సెల్‌ఫోన్ సర్వీసులు అందుబాటులోకి రాలేదు. కాగా, మాజీ సీఎంలు, ఎన్సీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా తదితర ప్రధాన పార్టీల నేతలను గృహ నిర్బంధం కొనసాగుతోంది. (చదవండి: కశ్మీర్ ప్రగతి ప్రస్థానం షురూ) -
మారకుంటే మరణమే
శ్రీనగర్: కశ్మీర్లో విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులపై గవర్నర్ సత్యపాల్ మాలిక్ విరుచుకుపడ్డారు. పద్ధతి మార్చుకోకుంటే త్వరలో ప్రాణాలు కోల్పోతారని హెచ్చరించారు. జమ్మూలో జరిగిన ఓ కార్యక్రమంలో మాలిక్ మాట్లాడుతూ..‘పాక్‌కు అమ్ముడుపోయిన కొందరు యువకులు కశ్మీర్‌లోయలో పండ్లవ్యాపారులను చంపేస్తామని బెదిరిస్తున్నారు. నేను వీళ్లకు ఒకటే చెబుతున్నా. వెంటనే మీ(ఉగ్రవాదులు) పద్ధతిని మార్చుకోండి. పండ్ల వ్యాపారులను చంపే విషయం తర్వాత చూసుకోవచ్చు. మీరైతే మాత్రం తప్పకుండా చనిపోతారని గ్యారెంటీతో చెబుతున్నా’ అని వ్యాఖ్యానించారు. -
వచ్చే 3నెలల్లో 50వేల ఉద్యోగాలు భర్తీ..
శ్రీనగర్/న్యూఢిల్లీ: వచ్చే మూడు నెలల్లో జమ్మూకశ్మీర్‌లో 50వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రకటించారు. రాష్ట్రంలో ఉద్రిక్తతలు, జననష్టం నివారణకే నిషేధాజ్ఞలు విధించి, కొనసాగిస్తున్నామన్నారు. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసిన అనంతరం జరిగిన మొదటి మీడియా సమావేశంలో గవర్నర్ మాట్లాడారు. ‘వచ్చే 3నెలల్లో రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నాం. రాష్ట్ర చరిత్రలో∙ఇది అతిపెద్ద రిక్రూట్మెంట్. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని యువతను కోరుతున్నా. రాష్ట్రానికి సంబంధించి కేంద్రం త్వరలోనే భారీ ప్రకటన చేసే వీలుంది’ అని చెప్పారు. ‘జాతి వ్యతిరేక శక్తులు ఇంటర్నెట్ను చాలా తేలిగ్గా స్వార్థానికి ఉపయోగించుకుంటాయి అందుకే సేవలను పునరుద్ధరించేందుకు మరికొంత సమయం పడుతుంది’ అని అన్నారు. ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా , మెహబూబా ముఫ్తీ తదితర రాజకీయ పార్టీల నేతల నిర్బంధంపై అడిగిన ప్రశ్నకు ఆయన.. ‘వాళ్లు పెద్ద నేతలవ్వాలని మీరు కోరుకోవడం లేదా? ఇప్పటి వరకు నేను 30 పర్యాయాలు జైలు కెళ్లా. ఎమర్జెన్సీ సమయంలో ఆరు నెలలు జైలు జీవితం గడిపా. వాళ్లను అక్కడే ఉండనివ్వండి. ఎంత ఎక్కువ కాలం జైలులో ఉంటే ఎన్నికలప్పుడు అంతపెద్ద నాయకులవుతారు’ అని వ్యాఖ్యానించారు. ‘రాష్ట్ర ప్రజలపై బయటి నుంచి ఎటువంటి ఒత్తిడులు ఉండబోవని హామీ ఇస్తున్నా. వారి గుర్తింపు, మతం, సంస్కృతులను పరిరక్షిస్తాం’ అని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం ప్రాణనష్టం నివారించేందుకు ముందు జాగ్రత్తగా రాష్ట్రంలో నిషేధాజ్ఞలు విధించామని, ఫలితంగా భద్రతా బలగాల చర్యల్లో ఒక్కరు కూడా చనిపోలేదన్నారు. ఇంటర్నెట్ చాలా ప్రమాదకరం ‘ఇంటర్నెట్ చాలా ప్రమాదకరమైంది. మనకు చాలా తక్కువగా ఇది ఉపయోగపడుతోంది. కానీ, భారత్ వ్యతిరేక విషప్రచారానికి, కశ్మీర్‌పై పుకార్ల వ్యాప్తికి ఉగ్రవాదులకు, పాక్‌కు ఇది సులువైన అస్త్రంగా మారింది. ఇంటర్నెట్ సేవలను క్రమేణా పునరుద్ధరిస్తాం’ అని తెలిపారు. రాహుల్ రాజకీయ బాలుడు కశ్మీర్లో హింస కొనసాగుతోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడంపై గవర్నర్ మాలిక్ ఎద్దేవా చేశారు. గొప్ప కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ తీరు రాజకీయాల్లో బాలుడి మాదిరిగా ఉందని వ్యాఖ్యానించారు. గత వారం రాహుల్ చేసిన ప్రకటనను వాడుకుని పాక్ ఐరాసలో భారత్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిందన్నారు. ముందుగా కశ్మీర్‌పై కాంగ్రెస్ పార్టీ వైఖరిని వెల్లడించాలి.ఎన్నికల సమయంలో ఆర్టికల్ 370ను సమర్థించే కాంగ్రెస్ నేతలను ప్రజలే చెప్పులతో కొడతారు’ అని పేర్కొన్నారు. ‘రాహులే నాయకుడైతే పార్లమెంట్లో కాంగ్రెస్ నేత(ఆధిర్ రంజన్ చౌధురి) కశ్మీర్‌పై ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడినప్పుడే ఆపి తగిన బుద్ధి చెప్పి ఉండేవాడు’ అని గవర్నర్ అన్నారు. రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ కశ్మీర్ స్వతంత్రప్రతిపత్తిని నిర్వీర్యం చేసే ఆర్టికల్ 370 రద్దుని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను బుధవారం చేపట్టిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పరిశీలనకు పంపింది. ఈ పిటిషన్ల విచారణకు అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ వెల్లడించింది. అక్టోబర్ మొదటి వారంలో రాజ్యాంగధర్మాసనం పిటిషన్లను విచారిస్తుందని స్పష్టం చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రాజ్యాంగంలోని ఒక ఆర్టికల్‌ను ఎలా రద్దు చేస్తారంటూ దాఖలైన పిటిషన్లకు సంబంధించి కేంద్రానికి, జమ్ము కశ్మీర్ పాలనా యంత్రాంగానికి నోటీసులు పంపింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కశ్మీర్‌పై జీవోఎం రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఏర్పాటు చేసిన కేంద్రం కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాంత సమగ్రాభివృద్ధికి ప్రయత్నాలు ప్రారంభించింది. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్– 370 రద్దుతోపాటు రాష్ట్రాన్ని మూడు కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ, కశ్మీర్, లదాఖ్‌గా విభజించడం తెల్సిందే. ఈ ప్రాంతాల అభివృద్ధితోపాటు, సామాజిక, ఆర్థిక సమస్యలను అధ్యయనం చేసేందుకు కేంద్రం మంత్రుల బృందాన్ని (జీవోఎం) నియమించింది. అక్టోబర్ 31వ తేదీ నుంచి పని ప్రారంభించే ఈ కమిటీలో న్యాయ, సామాజిక న్యాయం, సాధికారిత, వ్యవసాయ, పెట్రోలియం శాఖల మంత్రులు రవిశంకర్, గహ్లోత్, నరేంద్ర తోమర్, ప్రధాన్‌తోపాటు ప్రధాని కార్యాలయంలో మంత్రి జితేంద్ర సభ్యులు. ఈ బృందం ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం వంటి వాటిపై అధ్యయనం చేయనుంది. కేంద్ర పాలిత ప్రాంతాల అభివృద్ధి, ఆర్థిక, సామాజిక పరంగా తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. ఈ బృందం తొలి సమావేశం సెప్టెంబర్‌లో ఉంటుంది. ‘కశ్మీర్’ అంతర్గత అంశమే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కశ్మీర్లో హింసను పాకిస్థాన్ ప్రేరేపిస్తోందని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కశ్మీర్ ఉగ్రవాదుల దుశ్చర్యల వెనుక పాక్ హస్తం ఉందన్నారు. కశ్మీర్ అంశం ముమ్మాటికీ భారతదేశ అంతర్గత వ్యవహారమని తేల్చిచెప్పారు. ఈ మేరకు రాహుల్ బుధవారం ట్విట్టర్లో ట్వీట్ చేశారు. చాలా విషయాల్లో ప్రభుత్వ చర్యలతో తాను విభేదించినప్పటికీ కశ్మీర్ అంశం భారత అంతర్గత వ్యవహారం అనడంలో తాను స్పష్టతతో ఉన్నట్లు తెలిపారు. ఇందులో జోక్యం చేసుకోవడానికి పాకిస్థాన్‌కు, ఇతర దేశాలకు ఎలాంటి హక్కు లేదన్నారు. అయితే, కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ ప్రవేశపెట్టిన పిటిషన్లో రాహుల్ పేరును అనవసరంగా లాగారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా విమర్శించారు. పాక్ తన అసత్య ప్రచారానికి అండగా రాహుల్ పేరును వాడుకుంటోందని దుయ్యబట్టారు. రాహుల్ క్షమాపణ చెప్పాలి: జవదేకర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీరుపై జవదేకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్లో హింసాకాండ గురించి ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశాన్ని కించపరిచేవిగా, ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్‌కు మద్దతునిచ్చేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. రాహుల్, కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని జవదేకర్ బుధవారం డిమాండ్ చేశారు. కశ్మీర్లో హింస కొనసాగుతోందని, ఎంతోమంది మరణిస్తున్నారని, అత్యంత బాధ్యతారహిత రాజకీయాల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని రాహుల్ ఇటీవల వ్యాఖ్యానించడం తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై జవదేకర్ అభ్యంతరం వ్యక్తంచేశారు. పాకిస్థాన్ వాదనకు ఊతమిచ్చేలా మాట్లాడడం ఏమిటని రాహల్‌ను ప్రశ్నించారు. కశ్మీర్ వ్యవహారం భారతదేశ అంతర్గత వ్యవహారమని రాహుల్ బుధవారం ట్వీట్ చేయడంపై జవదేకర్ స్పందించారు. ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో కశ్మీర్ అంశంపై రాహుల్ యూ–టర్న్ తీసుకున్నారని చెప్పారు. అంతేగానీ స్వయంగా ఆయనలో అలాంటి అభిప్రాయమేలేదన్నారు. రాహుల్‌కు ముద్దు వయనాడ్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీకి ఒక వ్యక్తి ముద్దు పెట్టాడు. ఒక చోట జనం గుమిగూడి ఉండగా.. కారులో వెళ్తున్న రాహుల్ అక్కడ ఆగాడు. అంతలోనే డ్రైవర్ పక్క సీటులో కూర్చొని ఉన్న రాహుల్ బుగ్గపై బయటి నుంచి నీలిరంగు చొక్కా ధరించిన ఒక వ్యక్తి ముద్దు పెట్టాడు. దీంతో వెంటనే ఆ వ్యక్తిని కొందరు వెనక్కి లాగేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
‘తీవ్రవాదులే ఎక్కువ వాడుతున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో కమ్యూనికేషన్ వ్యవస్థను స్తంభింపజేయడాన్ని గవర్నర్ సత్యపాల్ మాలిక్ సమర్థించుకున్నారు. మొబైల్, ఇంటర్నెట్ సేవలను తీవ్రవాదులు, పాకిస్తాన్ ఎక్కువగా వాడుతున్నందునే సమాచార వ్యవస్థను స్తంభింపజేయాల్సి వచ్చిందన్నారు. మొబైల్ సర్వీసులను క్రమంగా పునరుద్ధరించనున్నట్టు తెలిపారు. కుప్వారా, హంద్వారా జిల్లాల్లో సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ‘ఫోన్, ఇంటర్నెట్ మాధ్యమాన్ని మనం తక్కువగానే వినియోగిస్తున్నాం. మన దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి తీవ్రవాదులు, పాకిస్తాన్ ఈ సేవలను ఎక్కువగా వాడుతున్నాయి. అందుకే వీటిని నిలిపివేశాం. మొబైల్ సేవలను క్రమంగా పునరుద్ధరిస్తామ’ని ఆయన అన్నారు. ప్రతి కశ్మీరీ పౌరుడి జీవితం తమకు ఎంతో విలువైనదని, ఒక్క ప్రాణం కూడా పోకూడదని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో చోటుచేసుకున్న ఘటనల్లో పౌరులు ఎవరూ గాయపడలేదని, హింసకు దిగినవారే క్షతగాత్రులయ్యారని వెల్లడించారు. రాష్ట్రంలో త్వరలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పౌరుల ప్రాణాలు కాపాడేందుకే సమాచార వ్యవస్థను నిలిపివేసినట్టు అంతకుముందు సత్యపాల్ మాలిక్ వ్యాఖ్యానించారు. ఈ నెల 5 నుంచి మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో కశ్మీర్లో వాస్తవ పరిస్థితి ప్రపంచానికి తెలియకుండా పోయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. (ఇది చదవండి: అణచివేతతో సాధించేది శూన్యం) -
‘ఫోన్ల కంటే ప్రాణాలే ముఖ్యం’
సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలపై గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కమ్యూనికేషన్ వ్యవస్ధ స్థంభించడంపై వ్యాఖ్యానిస్తూ టెలిఫోన్లు లేకున్నా పరవాలేదని ప్రాణ నష్టం సంభవించకూడదనేదే తమ విధానమని స్పష్టం చేశారు. గతంలో కశ్మీర్లో సంక్షోభాలు నెలకొన్న సందర్భాల్లో తొలివారంలోనే కనీసం 50 మంది ప్రాణాలు కోల్పోయేవారని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో చోటుచేసుకున్న నిరసనల్లో జమ్ము కశ్మీర్లో ఏ ఒక్కరూ మరణించలేదని కేవలం చెదురుమదురు ఘటనలు జరిగాయని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కమ్యూనికేషన్ వ్యవస్థను అతిత్వరలో పునరుద్ధరిస్తామని వెల్లడించారు. మూడు వారాలు గడిచినా కశ్మీర్ లోయలో పలు ప్రాంతాల్లో ఇప్పటికీ ఫోన్ కనెక్టివిటీ అందుబాటులో లేదు. నిషేధాజ్ఞలు కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతుండగా పలు చోట్ల స్కూళ్లు ఇంకా తెరుచుకోకపోవడం విశేషం -
జమ్మూకశ్మీర్ గవర్నర్ కీలక ముందడుగు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు క్రమంగా మెరుగవుతున్నాయి. ఆర్టికల్ 370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్, లధాఖ్ విభజన తదితర కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల అనంతరం భద్రతా బలగాల నీడలోకి వెళ్లిపోయిన కశ్మీర్ లోయలో పరిస్థితులు క్రమంగా కుదుటపడుతున్నాయి. దీంతో ఇప్పటికే పలు ఆంక్షలు ఎత్తివేసి.. పాఠశాలలను తెరిచిన సంగతి తెలిసిందే. రోడ్ల మీద జనజీవన సంచారం కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ ప్రజలకు చేరువయ్యేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ కీలక ముందడుగు వేశారు. ప్రజలు తమ సమస్యలు నేరుగా ప్రభుత్వ యంత్రాంగానికి విన్నవించుకొనే అవకాశం కల్పించారు. శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో ఒకరోజు ముందు గురువారం గవర్నర్ సలహాదారు కేకే శర్మ స్వయంగా ప్రజల సమస్యలు తెలుసుకోనున్నారని, శ్రీనగర్‌లోని గవర్నర్ గ్రీవెన్స్ సెల్లో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఆయన నేరుగా ప్రజల సమస్యలు వింటారని, ప్రజలు ఏమైనా ఫిర్యాదులు, సమస్యలు, ఇబ్బందులు ఉంటే ఈ కార్యక్రమంలో తెలియజేయాలని జమ్మూకశ్మీర్ సమాచార శాఖ తెలిపింది. ప్రస్తుతం గవర్నర్ తర్వాత అత్యంత కీలకమైన ప్రభుత్వ హోదాలో ఆయన సలహాదారు ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పరిణామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని.. వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం, ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నించడం ఎంతైనా ఆహ్వానించదగ్గ పరిణామమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
మాలిక్‌గారూ.. నన్ను ఎప్పుడు రమ్మంటారు!?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ, జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. కశ్మీర్ లోయకు రావాలంటూ మాలిక్ ఇచ్చిన ఇన్విటేషన్‌ను తాను స్వీకరిస్తున్నానని, ఎలాంటి నిబంధనలు లేకుండా తాను కశ్మీర్ ప్రజలు కలిసి ముచ్చటిస్తానని రాహుల్ తాజాగా ట్విటర్లో స్పష్టం చేశారు. తనను ఉద్దేశించి సత్యపాల్ మాలిక్ చేసిన ట్వీట్‌కు రాహుల్ స్పందిస్తూ.. ‘డియర్ మాలిక్‌జీ... నా ట్వీట్‌కు మీరిచ్చిన దుర్బలమైన బదులును చూశాను. జమ్మూకశ్మీర్‌ను సందర్శించి.. అక్కడి ప్రజలతో మాట్లాడాలంటూ మీరిచ్చిన ఆహ్వానాన్ని ఎలాంటి నిబంధనలు లేకుండా స్వీకరిస్తున్నాను. ఎప్పుడు రమ్మంటారు?’అని పేర్కొన్నారు. కశ్మీర్ లోయలోని పరిస్థితులపై రాహుల్ వదంతులను వ్యాప్తి చేస్తున్నారని, ప్రతిపక్ష నాయకులను లోయలో పర్యటించేందుకు అనుమతించాలంటూ కోరడం ద్వారా ఈ అంశాన్ని రాజకీయం చేయాలని ఆయన చూస్తున్నారని సత్యపాల్ మాలిక్ మంగళవారం మండిపడిన సంగతి తెలిసిందే. కశ్మీర్లో పర్యటించేందుకు తమకు హెలికాప్టర్ అవసరం లేదని, స్వేచ్ఛాయుతంగా పర్యటించి.. స్థానిక పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేతల బృందానికి అవకాశం ఇవ్వాలని రాహుల్ అంతకుముందు కోరగా.. అందుకు సత్యపాల్ మాలిక్ సిద్ధమేనని పేర్కొన్నట్టు కథనాలు వచ్చాయి. -
‘విమానం కాదు.. స్వేచ్ఛ కావాలి’
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజన అనంతరం కశ్మీర్ లోయలో హింస పెరిగిపోయిందనే వార్తలొస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రాహుల్ వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర గవర్నర్ సత్య పాల్ మాలిక్ స్పందిస్తూ.. ‘కశ్మీర్ లోయను సందర్శించడానికి ఎయిర్‌క్రాఫ్ట్ పంపుతా. వచ్చి.. ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసుకోండి’ అని రాహుల్‌ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. తాజాగా గవర్నర్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. విమానం కాదు కావాల్సింది.. స్వేచ్ఛ అంటూ రాహుల్ మండి పడ్డారు. ‘డియర్ గవర్నర్ మీ ఆహ్వానం మేరకు నేను, ప్రతిపక్ష నేతలు జమ్మూకశ్మీర్, లదాఖ్‌లో పర్యటిస్తాం. అయితే మాకు కావాల్సింది ఎయిర్ క్రాఫ్ట్ కాదు... స్వేచ్ఛ. ప్రజలను కలిసి, వారితో స్వయంగా మాట్లాడే అవకాశం కల్పించండి చాలు’ అంటూ రాహుల్ తీవ్రంగా స్పందించారు. Dear Governor Malik, A delegation of opposition leaders & I will take you up on your gracious invitation to visit J&K and Ladakh. We won’t need an aircraft but please ensure us the freedom to travel & meet the people, mainstream leaders and our soldiers stationed over there. https://t.co/9VjQUmgu8u — Rahul Gandhi (@RahulGandhi) August 13, 2019 -
నివురుగప్పిన నిప్పులా జమ్మూకశ్మీర్!
శ్రీనగర్/జమ్మూ/న్యూఢిల్లీ : ఓవైపు భారీగా బలగాల మోహరింపు.. మరోవైపు కేంద్రం మౌనంతో జమ్మూకశ్మీర్‌లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా తయారైంది. జమ్మూకశ్మీర్‌లో శాశ్వతనివాసం, స్వయంప్రతిపత్తికి సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 35ఏ, ఆర్టికల్ 370లను కేంద్రం రద్దుచేయబోతోందన్న వదంతుల నేపథ్యంలో ప్రతిపక్షాలు గవర్నర్ సత్యపాల్ మాలిక్‌తో శనివారం భేటీ అయ్యాయి. ఉగ్రముప్పు ఉన్నప్పటికీ పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తన భద్రతాసిబ్బంది కళ్లుగప్పి నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ఇంటికి వెళ్లారు. కేంద్రం తీసుకునే ఎలాంటి చర్యనైనా కలసికట్టుగా ఎదుర్కొందామని కోరారు. అనంతరం ఇతర కశ్మీరీ నేతలతో కలిసి గవర్నర్ సత్యపాల్ మాలిక్‌తో భేటీ అయ్యారు. దీంతో జమ్మూకశ్మీర్‌కు సంబంధించి ఎలాంటి రాజ్యాంగ నిబంధనల్ని సవరించడం లేదనీ, వదంతుల్ని నమ్మవద్దని మాలిక్ రాజకీయ నేతలు, మద్దతుదారులకు విజ్ఞప్తి చేశారు. జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న అనిశ్చితిపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయగా, ఈ విషయంలో కశ్మీరీ ప్రజలకు పార్లమెంటు హామీ ఇవ్వాలని ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా కోరారు. రంగంలోకి ఐఏఎఫ్ విమానాలు.. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి జరగొచ్చన్న ఆర్మీ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర పాలనా యంత్రాంగం అప్రమత్తమయ్యాయి. పలువురు పర్యాటకుల్ని, అమర్నాథ్ యాత్రికులను ప్రత్యేక వాహనాల్లో శ్రీనగర్ విమానాశ్రయానికి తరలించాయి. జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం నాటికి 20,000 నుంచి 22,000 మంది పర్యాటకులు ఉన్నారు. అయితే ఉగ్రహెచ్చరికల నేపథ్యంలో గుల్మార్గ్, పెహల్గామ్ వంటి పర్యాటక ప్రాంతాల నుంచి 6,126 మంది పర్యాటకులను శ్రీనగర్‌కు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా 5,829 మందిని 32 విమానాల్లో శనివారం తమ స్వస్థలాలకు తరలించారు. భారత వాయుసేన(ఐఏఎఫ్)కు చెందిన విమానాల్లో మరో 387 మందిని గమ్యస్థానాలకు చేర్చారు. ఈ సందర్భంగా పలు విమానయాన సంస్థలు టికెట్ల రీషెడ్యూల్, రద్దుపై విధించే అదనపు చార్జీలను ఆగస్టు 15 వరకూ ఎత్తివేశాయి. టికెట్లను రద్దుచేసుకుంటే అదనపు చార్జీలు విధించబోమని రైల్వేశాఖ చెప్పింది. మరోవైపు భారత పర్యటనలో భాగంగా జమ్మూకశ్మీర్‌కు వెళ్లవద్దని తమ పౌరులను బ్రిటన్, జర్మనీ దేశాలు హెచ్చరించాయి. భద్రతా సిబ్బందిని సంప్రదించాకే కశ్మీర్లో పర్యటించాలనీ, ప్రస్తుతం అక్కడి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ఆస్ట్రేలియా తమ పౌరులకు స్పష్టం చేసింది. అవన్నీ వదంతులే.. నమ్మొద్దు: గవర్నర్ మాలిక్ జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని ప్రతినిధుల బృందం శనివారం గవర్నర్ సత్యపాల్ మాలిక్‌తో సమావేశమైంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 35ఏ, ఆర్టికల్ 370లను రద్దు చేయబోతోందని చెలరేగుతున్న వదంతులపై స్పష్టత ఇవ్వాల్సిందిగా కోరింది. దీంతో గవర్నర్ స్పందిస్తూ..‘ఆర్మీ హెచ్చరికల తీవ్రతను దృష్టిలో ఉంచుకునే అమర్నాథ్ యాత్రను తక్షణం నిలిపివేయాల్సి వచ్చింది. ఇక నాకు తెలిసినంతవరకూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనల్ని సవరించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయడంలేదు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం తీసుకున్న చర్యలకు కొందరు ఇతర కారణాలను ఆపాదిస్తున్నారు. దీనివల్ల ప్రజల్లో అనవసరంగా భయాందోళన చెలరేగుతుంది’ అని తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై వచ్చే వదంతుల్ని, పుకార్లను నమ్మవద్దనీ, ప్రశాంతంగా ఉండాలని రాజకీయ నేతలు, వారి మద్దతుదారులకు గవర్నర్ సత్యపాల్ మాలిక్ విజ్ఞప్తి చేశారు. ‘బుద్ధ అమర్నాథ్ యాత్ర’ రద్దు: వీహెచ్‌పీ ఉగ్రదాడి హెచ్చరికల నేపథ్యంలో పూంఛ్ జిల్లాలో ఈ నెల 6 నుంచి పది రోజుల పాటు సాగనున్న ‘బుద్ధ అమర్నాథ్ యాత్ర’ను రద్దు చేసుకుంటున్నట్లు విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) ప్రకటించింది. ఈ విషయమై వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు లీలాకరణ్ శర్మ మాట్లాడుతూ..‘అమర్నాథ్ యాత్రామార్గంలో అమెరికా తయారీ స్నైపర్ తుపాకీ, మందుపాతర లభ్యంకావడం, మరోవైపు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భక్తుల భద్రత రీత్యా బుద్ధ అమర్నాథ్ యాత్రను నిలిపివేస్తున్నాం. అలాగే కుల్గామ్ జిల్లాలో కౌశర్నాగ్ యాత్ర, కిష్త్వర్ జిల్లాలో మచైల్ యాత్రను నిలిపివేస్తున్నట్లు కూడా ఆపేస్తున్నాం’ అని చెప్పారు. మోదీ ప్రకటన చేయాలి: ప్రతిపక్షాలు అమర్నాథ్ యాత్రను కేంద్ర ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేయడంతో దేశ ప్రజల్లో తీవ్రమైన ఆందోళన నెలకొందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ తెలిపారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితిపై ప్రధాని మోదీ ఉభయసభలను ఉద్దేశించి ఓ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏల కొనసాగింపు విషయంలో తమకు పార్లమెంటు నుంచి హామీ కావాలని ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా చెప్పారు. భారత్‌లో విలీనం సందర్భంగా జమ్మూకశ్మీర్‌కు ఇచ్చిన హామీలు కాలాతీతమైనవని వ్యాఖ్యానించారు. ప్రజలను భయపెడుతున్నారు: బీజేపీ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించేందుకు కాంగ్రెస్, పీడీపీ, ఎన్సీ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ విమర్శించింది. ఈ విషయమై రాష్ట్ర బీజేపీ చీఫ్ రవీంద్ర రైనా మాట్లాడుతూ..‘రాజకీయ నేతలు ప్రజలను భయాందోళనకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. రాజకీయ పార్టీలన్నీ కేంద్రానికి సహకరించాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 ఏ కారణంగా రాష్ట్రంలో ప్రశాంతత అనేది కరువైంది. ఆగస్టు 15న లోయలోని అన్ని పంచాయతీల్లో మువన్నెల జెండాను ఎగురవేస్తాం’ అని ప్రకటించారు. భద్రతా సిబ్బందికి ముఫ్తీ షాక్ పీడీపీ అధినేత్రి, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ భద్రతా సిబ్బందికి షాక్ ఇచ్చారు. ఉగ్రముప్పు ఉన్నందున ఇంటి నుంచి బయటకు వెళ్లరాదని హెచ్చరించినప్పటికీ ఆమె శుక్రవారం రాత్రి సిబ్బంది కళ్లు కప్పి గుప్కార్ రోడ్డులోని ఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా ఇంటికి చేరుకున్నారు. కశ్మీరీల హక్కుల్ని కాపాడుకునేందుకు చేతులు కలుపుదామని కోరారు. అయితే తన ఆరోగ్యం బాగోలేనందున కుమారుడు ఒమర్ అబ్దుల్లాతో ఈ విషయాన్ని చర్చించాలని ఫరూక్ సూచించారు. ఒమర్ ఆదివారం నిర్వహించే అఖిలపక్ష భేటీకి రావాలని కోరారు. దీంతో ముఫ్తీ పీపుల్స్ కాన్ఫరెన్స్ అధినేత సజ్జద్ లోనే, జేకేపీఎం అధినేత, మాజీ ఐఏఎస్ అధికారి షా ఫైజల్‌తో భేటీ అయ్యారు. అనంతరం వీరంతా రాజ్‌భవన్‌కు వెళ్లారు. రాజ్యాంగం ఏం చెబుతోంది? జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ, కశ్మీర్, లడఖ్ పేరిట మూడు ముక్కలుగా చేయడం అసాధ్యం కాదని కొందరు రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. రాజ్యాంగంలోని కొన్ని నిబంధనల మేరకు పాకిస్తాన్ పక్కనే ఉన్న రాష్ట్రాల సరిహద్దులు మార్చవచ్చని అంటున్నారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను మరో అధికరణ 368(1) ద్వారా సవరించవచ్చు. ఇందుకోసం తొలుత లోక్‌సభ, ఆ తర్వాత రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కనీసం సగం రాష్ట్రాలు ఇందుకు ఆమోదం తెలిపితే, ఆర్టికల్ 370 రద్దవుతుంది. ఇది జరిగిన వెంటనే జమ్మూకశ్మీర్ సరిహద్దుల్ని నిర్ణయించే అధికారం పార్లమెంటుకు లభిస్తుంది. ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం ఇప్పటికే ఉన్న రాష్ట్రాలకు సరికొత్తగా సరిహద్దుల్ని ఏర్పాటు చేయడంతో పాటు కొత్త రాష్ట్రాలకు సరిహద్దుల్ని నిర్ణయించవచ్చు. కానీ దీనికి ఆర్టికల్ 370 అడ్డుపడుతున్న నేపథ్యంలో ఈ అధికరణాన్ని తొలగించడం తప్ప మరో మార్గం లేదని నిపుణులు అంటున్నారు. ఈ విషయమై లోక్‌సభ మాజీ కార్యదర్శి సుభాష్ కశ్యప్ మాట్లాడుతూ..‘ఆర్టికల్ 370 అన్నది తాత్కాలిక నిబంధనే తప్ప ప్రత్యేకమైన నిబంధన కాదు. మన రాజ్యాంగంలో తాత్కాలిక, పరివర్తన, ప్రత్యేకమైన అనే నిబంధనలున్నాయి. వీటిలో తాత్కాలికమన్నది అత్యంత బలహీనమైనది’ అని తెలిపారు. 35ఏ ఎందుకంత ప్రాముఖ్యం? ► జమ్మూకశ్మీర్ సంస్థానాధీశుడు మహారాజా హరి సింగ్ 1927, 1932లో జారీ చేసిన ఉత్తర్వుల్లో రాష్ట్ర పరిధిలోని అంశాలు, ప్రజల హక్కులను నిర్వచించారు. ఇదే చట్టాన్ని వలస వచ్చిన వారికీ వర్తింపజేశారు. ► కశ్మీర్ పగ్గాలు చేపట్టిన షేక్ అబ్దుల్లా 1949లో భారత ప్రభుత్వంతో జరిపిన చర్చల ఫలి తంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 370 చేరింది. దీంతో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి లభించింది. ఆ రాష్ట్రంపై భారత ప్రభుత్వ అధికారాలు.. రక్షణ, విదేశీ వ్యవహారాలు, సమాచార రంగాలకే పరిమితమయ్యాయి. ► షేక్ అబ్దుల్లా, నెహ్రూ మధ్య కుదిరిన ఢిల్లీ ఒప్పందం ప్రకారం 1954లో రాష్ట్రపతి ఉత్త ర్వుల మేరకు జమ్మూకశ్మీర్‌కు సంబంధించి 35ఏతోపాటు మరికొన్ని ఆర్టికల్స్‌ను రాజ్యాంగంలో చేర్చారు. ►1956లో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం రూపుదిద్దుకుంది. దాని ప్రకారం.. 1911కు పూర్వం అక్కడ జన్మించిన, వలస వచ్చిన వారే కశ్మీర్ పౌరులు. అంతేకాకుండా, 1911కు ముందు పదేళ్లకు తక్కువ కాకుండా అక్కడ ఉంటున్న వారికే స్థిరాస్తులపై హక్కుంటుంది. జమ్మూకశ్మీర్ నుంచి వలసవెళ్లిన వారు, ఇంకా పాకిస్తాన్ వెళ్లిన వారు కూడా రాష్ట్ర పౌరులుగానే పరిగణిస్తారు. శ్రీనగర్–నిట్ క్లాసులు బంద్ శ్రీనగర్‌లోని ప్రఖ్యాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో తరగతుల్ని నిరవధికంగా సస్పెండ్ చేస్తున్నట్లు సంస్థ రిజిస్టార్ తెలిపారు. తరగతులు ప్రారంభమయ్యే విషయమై తాము త్వరలోనే సమాచారం అందజేస్తామని వెల్లడించారు. శ్రీనగర్ జిల్లా యంత్రాంగం నుంచి అందిన ఆదేశాల నేపథ్యంలోనే ఈ ఉత్తర్వులు జారీచేస్తున్నామని చెప్పారు. అయితే ఈ ప్రకటనను జిల్లా కలెక్టర్ షాíß ద్ ఖండించారు. ‘శ్రీనగర్–నిట్‌ను మూసివేయాల్సిందిగా మేం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో రకరకాల వదంతులు చెలరేగుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని మాత్రమే సూచించాం’ అని కలెక్టర్ షాహిద్ అన్నారు. నిత్యావసర దుకాణాలు, పెట్రోల్ బంకులు, ఏటీఎంల ముందు ప్రజలు క్యూకట్టారు. శ్రీనగర్‌లో పెట్రోల్‌బంక్ వద్ద స్థానికుల పడిగాపులు -
కిక్కిరిసిన శ్రీనగర్ విమానాశ్రయం
శ్రీనగర్: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అనూహ్యంగా జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న ప్రతిష్టాత్మక అమర్నాథ్ యాత్రను నిలిపేసి యాత్రికులు, పర్యాటకులు కశ్మీర్ లోయ నుంచి ఉన్నపళంగా వెనక్కు వెళ్లిపోవాలని కోరిన సంగతి తెలిసిందే. కశ్మీర్ లోయలో ఉగ్రమూకలు దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించిన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ హెచ్చరిక జారీ చేసింది. తీర్థయాత్రకు వచ్చిన వారు, పర్యాటకులు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లేందుకు ఒక్కసారిగా శ్రీనగర్ విమానాశ్రయానికి క్యూ కట్టడంతో వారికి టికెట్లు దొరకడం లేదు. భారీగా తరలి వచ్చిన యాత్రికులతో విమానాశ్రయం కిక్కిరిసింది. శ్రీనగర్ నుంచి అదనపు విమానాలను నడపడానికి విమానయాన సంస్థలు సిద్ధంగా ఉండాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశాలు జారీ చేసింది. రద్దీకి అనుగుణంగా జమ్మూకశ్మీర్ విమాన సర్వీసులను రీషెడ్యూల్ చేస్తున్నట్టు ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్టారా ప్రకటించాయి. కశ్మీర్ లోయలో ఎన్నడూ ఇటువంటి భయాందోళనక వాతావరణం చూడలేదని పలువురు యాత్రికులు పేర్కొన్నారు. దాల్ సరస్సు వద్ద షికారా ఎక్కుతున్న పర్యాటకులు కశ్మీర్ లోయలో శాంతి పెంపోందించేందుకు సహకరించాలని, పుకార్లను నమ్మవద్దని జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కోరారు. విద్యా సంస్థలను మూసివేయడానికి ఎలాంటి ఆదేశాలు జారీ కాకపోవడంతో యథాతథంగా కొనసాగుతున్నాయి. కశ్మీర్ రాష్ట్రంలో నెలకొన్న భయాందోళన పరిస్థితుల్లో స్థానికులు నిత్యావసరాలను నిల్వ చేయడానికి స్టోర్స్, ఏటీఎంలు, ఫార్మసీలకు క్యూ కడుతున్నారు. అంతేకాక పెట్రోల్ కోసం బంకుల వద్ద గంటల తరబడి వేచివుండాల్సి వస్తోంది. శ్రీనగర్‌లో పెట్రోల్ బంక్ వద్ద ప్రజలు -
గవర్నర్ మాటిచ్చారు..కానీ..
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్ 35ఏపై కేంద్రం వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని ఆ రాష్ట్ర మాజీ సీఎం, ఎన్సీ అధినేత ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. భారీ సంఖ్యలో కేంద్ర బలగాల మోహరింపు, అమర్నాథ్ యాత్రను అర్ధారంతరంగా నిలిపివేయడం తదితర పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో ఆయన శనివారం గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ...‘ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ప్రత్యేక హోదాను నిలిపివేసే ఉద్దేశం లేదని గవర్నర్ తెలిపారు. కానీ ఈ విషయంలో ఆయన మాటలే అంతిమం కాదు కదా. ఆర్టికల్ 35ఏ విషయంలో భారత ప్రభుత్వమే పార్లమెంటులో సరైన సమాధానమివ్వాలి. తమ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలి’ అని ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. ‘ గురువారం ఇక్కడ 25 వేల బలగాలను దింపారు. వారం గడవకముందే మరో 10 వేల మంది సైనికులను పంపారు. ఈ విషయాల గురించి ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. పౌరులను ఎంతో వేదనకు, ఒత్తిడికి గురిచేస్తున్నారు’ అని మండిపడ్డారు. కాగా బీజేపీ- పీడీపీ కూటమిలో చీలికలో ఏర్పడిన అనంతరం జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం అక్కడ గవర్నర్ పాలన కొనసాగుతోంది. -
‘దారికొస్తున్న కశ్మీరం’
న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్లో పరిస్థితి ప్రస్తుతం మెరుగుపడిందని, హురియత్ చర్చలకు సిద్ధంగా ఉందని ఆ రాష్ట్ర గవర్నర్ సత్య పాల్ మాలిక్ అన్నారు. కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, జితేంద్ర సింగ్‌ల సమక్షంలో జరిగిన ఓ కార్యక్రమంలో గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ చొరవ చూపినా విముఖత ప్రదర్శించిన హురియత్ నేతలు ఇప్పుడు చర్చలకు సంసిద్దత వ్యక్తం చేస్తున్నారని, శుక్రవారం ప్రార్ధనల సమయంలోనూ సమస్యలు సైతం సద్దుమణిగాయని ఆయన చెప్పుకొచ్చారు. జమ్ము కశ్మీర్‌లోని యురిలో ఉగ్ర దాడి అనంతరం నిలిచిన భారత్- పాక్ చర్చలు తిరిగి ప్రారంభించాలని హురియత్ చీప్ మిర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ ప్రకటన నేపథ్యంలో గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే ఓ వైపు హింసాత్మక ఘటనలు, ఉగ్రదాడులు జరుగుతుంటే చర్చలు జరపలేమని భారత్ పలుమార్లు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. జమ్మూ కశ్మీర్ గవర్నర్ పాలనలో ఉండగా ఎన్ఎన్ వోహ్రా స్ధానంలో ఈ ఏడాది ఆగస్టులో సత్య పాల్ మాలిక్‌ను కేంద్రం నియమించింది. -
ఇమ్రాన్‌ను అన్‌ఫాలో చేసిన దుండగులు
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ట్విటర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. ఆయన పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ను ఫాలో అవడమే దీనికి కారణంగా గవర్నర్ కార్యాలయం మంగళవారం తెలిపింది. మాలిక్ అకౌంట్‌ను హ్యాక్ చేసిన దుండగులు ఇమ్రాన్‌ను అన్‌ఫాలో చేశారని వెల్లడించింది. ఈ సంఘటను పోలీసుల దృష్టికి తీసుకెళ్లామని ఒక ప్రకటన విడుదల చేసింది. ఇదిలాఉండగా.. పీడీపీ, బీజేపీ పొత్తు విచ్ఛిన్నం కావడంతో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసింది. దాంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. ఇక పుల్వామా ఉగ్రదాడి అనంతరం గవర్నర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. జమ్మూ-శ్రీనగర్ హైవేపై సాధారణ పౌరుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. వారంలో కేవలం రెండు రోజులు మాత్రమే ఆ దారిగుండా ప్రయాణం సాగించాలని ఆదేశాలు జారీ చేశారు. మిలటరీ వాహనాల రవాణా సాఫిగా సాగడానికి ఇది మంచి ప్రత్యామ్నాయంగా ఆయన ప్రకటించారు. కాగా, మాలిక్ నిర్ణయంపై ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. -
‘పుల్వామా’ను రాజకీయం చేయడం కాదా?!
సాక్షి, న్యూఢిల్లీ : ‘కశ్మీర్ లోయలో పేలుడు పదార్థాలతో నిండిన ఓ వాహనం స్వేచ్ఛగా సంచరించిందంటే ఇది కచ్చితంగా ఇంటెలిజెన్స్ వర్గాల వైఫల్యమే’ అని 44 మంది సైనికులను పొట్టన పెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజు అంటే, శుక్రవారం నాడు జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన వ్యాఖ్య ఇది. అదే రోజు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించగా, ఈ విషయంలో ఏ నిర్ణయానికైనా ప్రభుత్వానికి అండగా ఉంటామని యావత్ ప్రతిపక్షం ప్రకటించింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకాకపోవడం గమనార్హం. (‘పుల్వామా’ సూత్రధారి ఫొటో మార్ఫింగ్) పుల్వామా దాడి సంఘటనను తాము రాజకీయం చేయదల్చుకోలేదని, అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అన్ని పార్టీ కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నామని బీజేపీ అధిష్టానం శుక్రవారం నాడు ప్రకటించింది. ఆ మేరకు శుక్రవారం ఒడిశా, చత్తీస్‌గఢ్‌లలో జరగాల్సిన తన సభలను బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రద్దు చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇటార్సిలో జరగాల్సిన తన సభను కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రద్దు చేసుకున్నారు. అయితే అదే రోజు ఝాన్సీలో జరగాల్సిన బహిరంగ సభను మాత్రం మోదీ రద్దు చేసుకోలేదు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం కోసం వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీనే గెలిపించండంటూ ఆ సమావేశంలో మోదీ ఓటర్లకు పిలుపునిచ్చారు. మోదీ శనివారం మహారాష్ట్ర నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తన ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రస్తావించడంతోపాటు పల్వామా సంఘటన గురించి ప్రస్తావించి ప్రతి కన్నీటి బొట్టుకు ప్రతికారం తీర్చుకుంటామని ప్రకటించారు. అదివారం అస్సాం ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ ‘ కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, బీజేపీ ప్రభుత్వం కనుక జవానుల ప్రాణ త్యాగాన్ని వృధా పోనీయం’ అని వ్యాఖ్యానించారు. గుజరాత్ బీజేపీ నాయకుడు భరత్ పాండ్యా సోమవారం నాడు వడోదరలో మాట్లాడుతూ కేంద్రంలో ఇంతకుముందున్న మన్మోహన్ సింగ్ ప్రభుత్వం జాతీయ భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోక పోవడం వల్ల నేడు జవాన్ల ప్రాణాలు పోయాయని అన్నారు. ‘నేడు జాతీయవాదాన్ని నింపుకున్న హృదయాలతో యావత్ జాతి ఐక్యంగా నిలబడింది. ఈ ఐక్యతను ఓట్లుగా మలుచుకోవడం మన బాధ్యత’ అని పాండ్య పిలుపునిచ్చారు. సీఆర్పీఎఫ్ జవాన్ల అంత్యక్రియల్లో పాల్గొనాల్సిందిగా దేశంలోని బీజేపీ ముఖ్యమంత్రులను, రాష్ట్ర మంత్రులను బీజేపీ అధిష్టానం శుక్రవారం నాడే ఆదేశించింది. టెర్రరిజానికి వ్యతిరేకంగా ఆదివారం నాడు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలను నిర్వహించాల్సిందిగా పార్టీ కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేసింది. నిరసన సభల్లో పార్టీ జెండాలకు బదులుగా పార్టీ ఎన్నికల గుర్తయిన కమలాన్ని ఎక్కువ ప్రదర్శించాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ పార్టీ కార్యకర్తలను ఆదేశించారు. శవం పక్కన చిద్విలాసంగా బీజేపీ ఎంపీ ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావోలో శనివారం నాడు సీఆర్పీఎఫ్ జవాను అజిత్ కుమార్ అంతిమ యాత్రలో బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ పాల్గొన్నారు. తాను అంతిమ యాత్రలో పాల్గొంటున్నానని, పైగా సైనికుడి భౌతికకాయం పక్కనున్నననే విషయాన్ని కూడా విస్మరించిన బీజేపీ ఎంపీ, పార్టీ ర్యాలీలో పాల్గొన్నట్లుగా చిద్విలాసంగా నవ్వుతూ ప్రజలకు అభివాదం చేస్తూ, చేతులూపుతూ వెళ్లారు. దీనిపై సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా విమర్శలు వెల్లువెత్తాయి. పుల్వామా ఉగ్ర దాడికి సంబంధించి అనేక వైఫల్యాలు వెలుగులోకి వచ్చిన వాటిపై చర్య తీసుకోవాల్సిందిగా బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకరావడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. ఇదే విషయమై ఆ పార్టీ సీనియర్ నేతలను ప్రశ్నించగా, బీజేపీకి ప్రచార బలగాలు ఎక్కువున్నాయని, ఈ సమయంలో తాము ఏం మాట్లాడినా ‘జాతి వ్యతిరేకులు’ అంటూ ముద్ర వేసే ప్రమాదం ఉందని వారన్నారు. ఈ విషయంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక్కరే ధైర్యంగా మాట్లాడుతున్నారు. -
కొత్త ఉగ్రవాదులకు వల పన్నడం కుదరకే..
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు సృష్టించిన మారణ హోమాన్ని కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని పాకిస్తాన్ చెప్పడం దారుణమని మండిపడ్డారు. ఎన్నికలు ముగిసిన అనంతరం పాకిస్తాన్ నిరాశలో మునిగిపోయిందని, కొత్త ఉగ్రవాదులకు వల పన్నడం వీలు కాకపోవడం వల్లే తమ ఉనికిని చాటుకునేందుకు ఈ దారుణానికి తెగబడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్ చెత్తగా వాగుతోంది. ఉగ్రవాదులు నిర్భయంగా ర్యాలీలు చేసుకునేందుకు అనుమతినిస్తూ, మేమైనా చేయగలమనే అహంకారంతో భారత్‌ను బహిరంగంగానే హెచ్చరించాలని చూస్తోంది’ అని వ్యాఖ్యానించారు. తాను ఈరోజు అమర జవానుల సంస్మరణ సభకు హాజరవుతున్నానని తెలిపారు. తనతో పాటు కేంద్ర హోం మంత్రి రాజ్‌రాథ్ సింగ్ కూడా కశ్మీర్ వస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భద్రతా, ఇంటలెజిన్స్ వర్గాలతో భేటీ అయి, ఘటనకు గల కారణాల గురించి చర్చిస్తామని పేర్కొన్నారు. కాగా గురువారం పుల్వామాలో ఉగ్రవాదులు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్‌పొరా వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఓ ఆత్మాహుతి దళసభ్యుడు జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకున్నాడు. తన కారుతో కాన్వాయ్‌లోని ఓ బస్సును ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న ఓ బస్సు తునాతునకలు కాగా, కాన్వాయ్‌లోని పలు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. J&K Governor Satya Pal Malik to ANI: I will be leaving for the wreath laying ceremony of the martyrs in Kashmir. HM Rajnath Singh is also coming. We will hold a review meeting with top security and intelligence officials. We will find out where the lapses occurred. (File pic) pic.twitter.com/aUMOiYoq6K — ANI (@ANI) February 15, 2019 J&K Governor Satya Pal Malik to ANI: Pakistan is frustrated, after successful elections they could not recruit new terrorists, stone pelting has stopped, so it wanted to do something. We have alerted all installations and cantonments as Pakistan may do something else. (File pic) pic.twitter.com/gBEQCyB8sv — ANI (@ANI) February 15, 2019 -
పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించాం
జమ్మూ: పాకిస్తాన్, ఉగ్రవాదులు ఎన్ని ఆటంకాలు కలిగించినప్పటికీ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామని జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అన్నారు. ఉగ్రవాదుల చొరబాట్లను సైన్యం విజయవంతంగా తిప్పికొడుతుండటంతో పాకిస్తాన్‌కు దిక్కుతోచడం లేద న్నారు. ఇక్కడి వాతావరణాన్ని చెడగొట్టేందుకు పాకిస్తాన్ విఫలయత్నాలు చేస్తోందని, అయినా లోయలో శాంతి నెలకొని ఉందని ఆయన సంతో షం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో ఎన్నికలు నిర్వ హించడం పాకిస్తాన్‌కు ఇష్టం లేదు, అందుకే ఉగ్రవాదుల చొరబాటును ప్రోత్సహిస్తోంది. చొర బాట్లను నిరోధించడం ద్వారా పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగించాం’అని ఆయన శనివారం ఇక్కడ మీడియాకు వెల్లడించారు. పీవోకేలోని హిజ్బుల్ ముజాహిదీన్ నేత సలావుద్దీన్ పంచాయతీ ఎన్నికలను ఉగ్రవాదుల ద్వారా భగ్నం చేయాలని ప్రయత్నించినప్పటికీ, ప్రజల సహాయంలో సైన్యం ఆ ప్రక్రియను విజయవంతంగా ముగించిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. జమ్మూలో స్వామి వివేకానంద మెడికల్ మిషన్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించిన వివేకానంద 156వ జయంతి కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడారు. వివేకానంద బోధనలను ప్రజలు ఆచరించడం ద్వారా మెరుగైన సమాజానికి దోహద పడాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రిలో కొత్తగా నెలకొల్పిన ఈఎన్టీ విభాగాన్ని, ఆపరేషన్ థియేటర్‌ను ప్రారంభించారు. -
మళ్లీ నోరుజారిన గవర్నర్..
సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్లో హింస తగ్గుముఖం పట్టిందని చెబుతూ ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కశ్మీర్లో రాళ్ల దాడులు, ఉగ్రవాద సంస్ధల్లో నియామకాలను నిరోధించామని ఆయన చెప్పకొచ్చారు. పట్నాలో ఒకరోజు జరిగే హత్యలు కశ్మీర్లో వారం రోజుల్లో జరిగే మరణాలతో సమానమని గవర్నర్ వ్యాఖ్యానించారు. కాగా, కశ్మీర్లో శాంతి భద్రతల పరిస్ధితిని వివరించేందుకు పట్నాతో పోలిక తెస్తూ గవర్నర్ చేసిన వ్యాఖ్యల పట్ల బిహార్ నేతలు మండిపడుతున్నారు. జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ రద్దు చేసిన సందర్భంలోనూ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తాను బదిలీ ముప్పును ఎదుర్కొంటున్నానని బహిరంగంగా వెల్లడించారు. ఢిల్లీ ఆదేశాలను పాటిస్తే తాను సజద్ లోన్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని, అలా చేసి తాను చరిత్రహీనుడిగా మిగిలిపోదల్చుకోలేదని వ్యాఖ్యానించారు. నిజాయితీలేని వ్యక్తిగా తాను ఉండదలుచుకోలేదని ఫలితంగా ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొంటానని చెప్పుకొచ్చారు. కాగా గత నాలుగు నెలలుగా జమ్మూ కశ్మీర్లో హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టాయని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. -
కేంద్రంపై కశ్మీర్ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తాజా వ్యాఖ్యలు కేంద్రంలోని బీజేపీ సర్కారును ఇరకాటంలో పడేశాయి. అసెంబ్లీని తాను రద్దు చేయకుంటే కేంద్రం ఒత్తిడి కారణంగా జేకేపీసీ (జమ్మూ కశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్) పార్టీ అధినేత సజ్జాద్‌లోన్‌తో తాను సీఎంగా ప్రమాణం చేయించాల్సి వచ్చేదని సత్యపాల్ అన్నారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. నిజాయితీ లేని వ్యక్తిగా మిగిలిపోవడం ఇష్టం లేకనే తాను అసెంబ్లీని రద్దు చేశానని పేర్కొన్నారు. ‘ఇప్పుడు ఆ సమస్య మొత్తం ముగిసింది. ఎవరేమనుకున్నా, నేను సరైన నిర్ణయమే తీసుకున్నానని నా మనస్సు చెబుతోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. గవర్నర్ పాలనలో ఉన్న కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), కాంగ్రెస్‌ల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ గవర్నర్‌ను పీడీపీ కోరడం, తర్వాత కొన్ని గంటల్లోనే బీజేపీ మద్దతుతో తామూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు జేకేపీసీ సంప్రదించడంతో గవర్నర్ సత్యపాల్ అసెంబ్లీనే రద్దు చేసిన విషయం తెలిసిందే. కేంద్రం ఆదేశాల మేరకే గవర్నర్ ఇలా చేశారని కాంగ్రెస్ ఆరోపించగా.. ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్- మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ మాత్రం భిన్నంగా స్పందించారు. శాసనసభను రద్దు చేయకుండా సమావేశపరిచి గవర్నర్ బలపరీక్ష నిర్వహించి ఉంటే ఎవరి బలం ఎంతో తేలేదని ఫరూక్ అబ్దుల్లా అభిప్రాయపడగా... ‘ఫ్యాక్స్ యంత్రాన్ని పట్టించుకోకుండా, కేంద్రం ఆదేశాలను బేఖాతరు చేసి అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్ నిర్ణయం జమ్మూ కశ్మీర్‌కు నిజంగా గొప్పది’ అని ముఫ్తీ ట్వీట్ చేశారు. -
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ రద్దు ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమే!
జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పర్చే అవకాశాన్ని రాజకీయపార్టీలకు ఇవ్వకుండా అసెంబ్లీని రద్దుపరచడం ద్వారా గవర్నర్ సత్పాల్ మాలిక్ వాస్తవానికి రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించారు. ప్రధానమంత్రి కార్యాలయం ఆ సమయంలో ఏం కోరుకుంటోందో దాన్ని మాత్రమే గవర్నర్ పాటించినట్లుంది. గవర్నర్ తన చర్యను సమర్థించుకోవడమే కాకుండా, పీడీపీ, ఎన్సీ, కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు పంపిన ఉత్తరాన్ని ఫ్యాక్స్ మిషన్ పనిచేయనందున స్వీకరించలేకపోయినట్లు ప్రకటించడం ఆవేదన కలిగించే విషయం. జమ్మూ కశ్మీర్ అనేది సైనిక సమస్య కాదు, పాలనాపరమైన సమస్య కాదు. అదొక రాజకీయ సమస్య. పరస్పర చర్చలద్వారానే దాన్ని పరిష్కరించాలి. జమ్మూ కశ్మీర్లో నూతన ప్రభుత్వాన్ని ఏర్పర్చడానికి రాజకీయ పార్టీలను అనుమతించకుండా ఆ రాష్ట్ర గవర్నర్ తీసుకున్న రాజ్యాంగ వ్యతిరేక చర్య కశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుగొనడంలో నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వానికి ఆసక్తి లేదని స్పష్టం చేస్తోంది. దానికంటే ఎన్నికల్లో జాతీయవాద మనోభావాలను వాడుకోవడం పట్లే దానికి ఆసక్తి ఉన్నట్లుంది. ఇది ఒక రాష్ట్రంలో లేక ఒక నిర్దిష్ట సామాజిక బృందం అనుభవిస్తున్న చారిత్రక వేదన పట్ల దేశంలోని ఇతర ప్రాంతాల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతూ సమస్యకు మరిం తగా నిప్పు రాజేస్తున్నట్లుగా ఉంది. జమ్మూకశ్మీర్‌లో రాజకీయ పార్టీలను చర్చలబల్ల వద్దకు తీసుకొచ్చి ప్రభుత్వ ఏర్పాటు కోసం సాధ్యమైనన్ని ప్రయత్నాలు చేసివుండాలని మనలో చాలామంది భావన. జాతీయ ప్రయోజనాల రీత్యా జాతీయ పార్టీలని చెప్పుకుంటున్నవి ఆ రాష్ట్ర ప్రజల మనోభావాలను గౌరవించి ద్వితీయపాత్రకు మాత్రమే పరిమితం కావలసి ఉంది. కానీ బీజేపీ నేరుగా రాష్ట్రాన్ని పాలిం చడానికి రాజకీయ సంప్రదింపులు జరిపే ఉద్దేశంతోనే సత్పాల్ మాలిక్‌ని జమ్మూ కశ్మీర్‌కు గవర్నర్‌గా పంపించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆయన లక్ష్యం కశ్మీర్ రాజకీయ పార్టీలను హిందుత్వ రాజకీయ ప్రయోజనాల కోసం విభజించడమే. సాజిద్ లోనేని దాంట్లోభాగంగానే ప్రోత్సహించారు. ఆ రకంగా నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ వంటి స్థానిక రాజకీయ పార్టీల ఆధిపత్యానికి గండి కొట్టవచ్చని, లేదా తగ్గించవచ్చని భావించారు. తన ప్రజలపైనే యుద్ధం చేస్తూ, వ్యవస్థల విశ్వసనీయతనే విధ్వంసం చేయడానికి పూనుకున్న ప్రభుత్వాన్ని మనం ఎక్కడైనా చూశామా? హింసాత్మక ఘటనలు పెరిగాయి కాబట్టి కశ్మీరులో గత నాలుగేళ్లుగా పరిస్థితి దిగజారిపోలేదని, కశ్మీర్ సమస్య పరి ష్కారానికి కేంద్రం ఏరకమైన ఆసక్తీ చూపకపోవడమే అక్కడ అశాంతికి కారణమని మనందరికీ తెలుసు. కశ్మీర్ సమస్య పట్ల కఠిన పరిష్కారమే మార్గమని, అంటే సాయుధ బలగాలకు స్వేచ్ఛ ఇచ్చి వారెప్పుడు కోరుకుంటే అప్పుడు రాజకీయ ప్రక్రియను అనుమతించని విధంగా పరిష్కరించాలని ఆర్ఎస్ఎస్ మేధో బృందం చాలవరకు భావిస్తోంది. కశ్మీర్.. యుద్ధం ద్వారా గెలవాల్సిన ప్రాంతంగా సంఘ్ పరివార్ భావిస్తోంది. భారత్‌లో మన బానిసత్వానికి గుర్తుగా మిగిలిన ఇస్లామ్ చిహ్నాలను పూర్తిగా రద్దు చేయాలంటూ రాత్రింబవళ్లు మొత్తుకుంటున్న సంఘ్ భక్తపరివార్కి ఇలాంటి తరహా విజయం సంతృప్తినిస్తుం దని ఆర్ఎస్ఎస్ భావన. అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచిన తర్వాత ఉన్నట్లుండి గవర్నర్‌కు రాష్ట్రంలో ఇక సుస్థిర ప్రభుత్వం సాధ్యం కాదని స్ఫురించిందంటే కేంద్రం ఆజ్ఞలకు వెన్నెముక లేని గవర్నర్ పూర్తిగా లొంగిపోయినట్లే లెక్క. పైగా ఇతర ప్రతిపక్ష పార్టీలు పంపిన ఉత్తరాలను గవర్నర్ తిరస్కరించారు. వాస్తవానికి మునుపెన్నడూ లేనంత రాజకీయ ఐక్యతను ప్రదర్శించిన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు ఉమ్మడిగా వెళ్లి గవర్నర్‌ను కలవాలని నిర్ణయించాయి. కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి మరో ఆలోచన ఉన్నట్లుంది. కశ్మీర్ నుంచి ఈశాన్య భారత్ వరకు హిందుత్వ ప్రభుత్వాన్ని స్థాపించాలనే అమిత్‌షా, నరేంద్రమోదీల స్వప్న సాకారం చేయడానికి జమ్మూకశ్మీర్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం ఆశిం చింది. ప్రభుత్వాన్ని ఏర్పర్చే అవకాశాన్ని రాజకీయపార్టీలకు ఇవ్వకుండా అసెంబ్లీని రద్దుపరచడం ద్వారా మాలిక్ వాస్తవానికి రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించారు. ప్రధానమంత్రి కార్యాలయం ఆ సమయంలో ఏం కోరుకుంటోందో దాన్ని మాత్రమే గవర్నర్ పాటించినట్లుంది. గవర్నర్ తన చర్యను సమర్థించుకోవడమే కాకుండా, పీడీపీ, ఎన్సీ, కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు పంపిన ఉత్తరాన్ని ఫ్యాక్స్ మిషన్ పనిచేయనందున స్వీకరించలేకపోయినట్లు ప్రకటించడం ఆవేదన కలిగించే విషయం. పైగా ఆర్ఎస్ఎస్ నియమించిన రామ్ మాధవ్ సమస్యపట్ల ఏమాత్రం అవగాహన లేకుండానే మీడియా వద్దకు హుటాహుటిన పరుగెత్తుకెళ్లి, పాకిస్తాన్ ఆదేశాల ప్రకారమే ఆ మూడు పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పర్చాలని కోరుకుంటున్నట్లుగా ఆరోపించి అభాసుపాలయ్యారు. రామ్‌మాధవ్ వ్యవహరించిన తీరు కశ్మీర్ సమస్య పట్ల బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధీ లేదన్న విషయాన్ని ప్రతిబింబిస్తోంది. సంవత్సరాలపాటు రాష్ట్రాన్ని పాలించిన ప్రభుత్వాన్ని, కొద్ది నెలలక్రితం వరకు భాగస్వామిగా అధికారం చలాయించిన పార్టీని జాతి వ్యతిరేకమైనదిగా ఎలా ముద్రవేస్తారు? జమ్మూకశ్మీర్ వ్యవహా రాల్లో వేలుపెట్టేందుకు రామ్ మాధవ్ లాంటి వ్యక్తిని నియమించినప్పుడే కేంద్రప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో మనం అర్థం చేసుకున్నాం. బీజేపీతో సమస్య ఏమిటంటే అది ప్రజాతీర్పుకు వెన్నుపోటు పొడిచింది. గుజరాత్ బుడగ పేలిపోయింది. అభివృద్ధి ఎజెండా గాల్లో కలిసింది. మన వ్యవస్థలు తమ స్వతంత్రప్రతిపత్తిని, బలాన్ని కోల్పోతున్నాయి. ప్రజలమీద యుద్ధం ప్రకటించి ప్రభుత్వమే వ్యవస్థలను విధ్వంసం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అది జమ్మూ కశ్మీర్‌ను కోరుకుంటోంది కానీ కశ్మీర్ ప్రజలతో మాట్లాడాలని భావించదు. భారత్‌లోని సవర్ణులతో కశ్మీర్గురించి చర్చించాలని అనుకుంటోది తప్పితే కశ్మీర్ ప్రజలతో మాట్లాడాలని అనుకోవడం లేదు. ఇక ఆర్ఎస్ఎస్ జాతీయవాద నమూనా ప్రకారం, వారికి కశ్మీరీ ముస్లింలతో పని లేదు, అక్కడి ప్రజలతో పనిలేదు కానీ అఖండభారత్‌లో భాగంగా కశ్మీర్ భౌగోళిక ప్రాంతం మాత్రమే వారిక్కావాలి. ఒకవేళ వారు ప్రజల గురించి ఆలోచించినప్పటికీ జమ్మూలోని హిందువుల గురించే ఆలోచిస్తారు. ఇంతకంటే మించిన వంచన లేదు. ఇప్పుడు కశ్మీర్‌కి కావలసింది భారత్ నుంచి ఒక ప్రేమాస్పదమైన వెచ్చటి కౌగిలింత మాత్రమే. యువతకు ఉద్యోగం, అవకాశాలు అవసరం. రాజకీయ వాణిని వినాలి. రాజకీయ చర్చలపట్ల విశ్వాసం ప్రకటించినందుకే అక్కడ ఎంతోమంది సాహస జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ కశ్మీర్ సైనిక సమస్య, పాలనాపరమైన సమస్య కాదు. అదొక రాజకీయ సమస్య. చర్చలద్వారానే దాన్ని పరిష్కరించాలి. రాజ్యాంగాన్ని, చట్టపాలనను విశ్వసిస్తున్న రాజకీయ పార్టీల ప్రతిష్టను మసకబార్చి మీరు చేసేదేమీ ఉండదు. ద్వేషానికి, హింసకు వ్యతిరేకంగా పోరాడుతూ అనేకమంది నేతలను కోల్పోయిన కశ్మీర్ రాజకీయపార్టీలపై మరకలువేయడానికి ప్రయత్నిస్తే తర్వాత మీరు మాట్లాడేందుకు మనిషి కూడా మిగలడు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు కశ్మీర్లో ఇలాంటి అంగుష్టమాత్రపు రాజకీయాల్లో మునగకూడదు. -విద్యాభూషణ్ రావత్, మానవ హక్కుల కార్యకర్త, జర్నలిస్టు -
కశ్మీర్ అసెంబ్లీ రద్దు అన్ని విధాల తప్పే!
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్ అసెంబ్లీని హఠాత్తుగా రద్దు చేస్తూ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ బుధవారం నాడు తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యకరమే కాకుండా చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని కూడా చెప్పవచ్చు. జమ్మూ కశ్మీర్ రాజ్యాంగంలోని అధికరణ 53 (2బీ) ప్రకారం రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసే అధికారం గవర్నర్‌కు ఉంది. అయితే అది భారత రాజ్యాంగంలోని 172 (2బీ) అధికరణలోని అంశాలకు అనుగుణంగా ఉండాలి. సత్యపాల్ మాలిక్ తీసుకున్న నిర్ణయం అందుకు భిన్నంగా ఉండడమే కాకుండా, ఇలాంటి సందర్భాల్లో పరిగణలోకి తీసుకోవాల్సిందిగా సుప్రీం కోర్టు గతంలో సూచించిన మార్గదర్శకాలకు కూడా భిన్నంగా ఉంది. ఓ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసే అంశంలో హేతుబద్ధమైన నిర్ణయం తీసుకోవాలంటూ సూచిస్తున్న భారత రాజ్యాంగంలోని 172 (2బీ) అధికరణంలో అంత స్పష్టత లేకపోవచ్చేమోగానీ ‘ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ భారత ప్రభుత్వం’ కేసులో 1994, మార్చి 11న, ఆ తర్వాత ‘రామేశ్వర ప్రసాద్ వర్సెస్ భారత ప్రభుత్వం’ కేసులో 1996, జనవరి 24వ తేదీన సుప్రీం కోర్టు స్వయంగా ఇచ్చిన తీర్పుల్లో స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ప్రధానంగా ఈ తీర్పుల ప్రాతిపదికనే కశ్మీర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, ఎన్సీపీలు కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. పరస్పర భిన్న విధానాలు కలిగిన ఈ పార్టీల మధ్య సరైన సఖ్యత ఉండదని, అవి స్వార్థ ప్రయోజనాలకు కోసం అక్రమ పద్ధతిలో కూటమిగా చేతులు కలపవచ్చని గవర్నర్ మాలిక్ భావించడం, అందుకని సుస్థిర ప్రభుత్వాన్ని అందించలేవని అనుకోవడం, అందుకని రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తున్నానని ప్రకటించడం అర్థరహితం. భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు వచ్చిన పార్టీలకు తగిన సంఖ్యా బలం ఉందా, లేదా అన్నదే తప్ప, వాటి సిద్ధాంతాలు, విధానాలు ఏమిటీ? అని చూడాల్సిన అవసరం లేదు. అలా చూసిన సందర్భాలు కూడా లేవు. అంతకుముందు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ–పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీల విధానాలు పరస్పర భిన్నమైనవి కావా? ఆ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదా? అందుకే ఆ ప్రభుత్వం ఎక్కువకాలం నిలబడలేదనుకుంటే, ఈ పార్టీలకు కూడా ఓ సారి అవకాశం ఇచ్చి చూస్తే వచ్చే నష్టం ఏముంది? ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు వచ్చిన పార్టీలకు సరైన సంఖ్యా బలం ఉందా, లేదా అన్న విషయాన్ని తెలుసుకునేందుకు సంఖ్యాబలాన్ని తనిఖీ చేయవచ్చు, ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇస్తే ఎమ్మెల్యేల బేరసారాలకు పాల్పడతారని అనుమానించిన సందర్భాల్లో 24 గంటల్లోగా విశ్వాస పరీక్షను కోరవచ్చు. అలాంటి సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయి. ‘కనిపించని చీకటిలో జరిగే బేరసారాల ద్వారా ముడుపులు తీసుకొని ఓ పార్టీకి లేదా కూటమికి మద్దతు ఇచ్చేందుకు ఎమ్మెల్యేలు ముందుకు వచ్చారని ఓ గవర్నర్ అనుమానించడం, భావించడం తప్పు. అందుకు స్పష్టమైన ఆధారాలు ఉండాలి. అప్పుడే ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధంగా లేకపోవడమో, అనవసరమైన ఖర్చు ఎందుకనో, మరే కారణంగానో భిన్న విధానాలు, సిద్ధాంతాలు కలిగిన పార్టీలకు కూడా మద్దతుకు ముందుకు రావచ్చు. ఓ పార్టీ నాయకుడు ఒప్పుకోకపోయినా, అందుకు భిన్నంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు మద్దతివ్వవచ్చు’ అని రామేశ్వర ప్రసాద్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. అంతేకాకుండా ‘ఈ కారణంగా అసెంబ్లీని రద్దు చేయవచ్చనే ఉద్దేశంతో అసెంబ్లీ రద్దుకు గవర్నర్ నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. ప్రభుత్వం ఏర్పాటుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయా, లేవా అన్న విషయాన్ని పరిశీలించాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం లేదని సుస్పష్టంగా భావించినప్పుడు మాత్రమే అసెంబ్లీ రద్దుకు నిర్ణయం తీసుకోవాలి’ అని ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఈ రెండు తీర్పుల కారణంగా కశ్మీర్ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ మాలిక్ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు రేపు తప్పు పట్టవచ్చు. అంత మాత్రాన అసెంబ్లీని గవర్నర్ పునరుద్ధరిస్తారని భావించలేం. అలా పునరుద్ధరిస్తే తప్పు ఒప్పుకున్నట్లు అవుతుందని గవర్నర్ భావించవచ్చు. గవర్నర్ నిర్ణయం తప్పో, ఒప్పో చెబుతానుగాని, రాజ్యాంగపరంగా ఆయన నిర్వహించాల్సిన విధుల్లో తాను జోక్యం చేసుకోనని సుప్రీం కోర్టు చెబుతుంది. అందుకనే గతంలో ఓ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టినా, ఆ అసెంబ్లీని పునరుద్ధరించకపోగా ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. కొత్త ప్రభుత్వం కూడా ఏర్పాటయింది. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకోవడం దేశంలోని గవర్నర్లకు అలవాటుగాను, పరిపాటుగాను మారిపోయింది. అందుకే అప్పుడప్పుడు గవర్నర్ వ్యవస్థ రద్దు చేయాలనే నినాదం బయటకు వస్తుంది. దీన్ని ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఏదోనాడు సుప్రీం కోర్టే జోక్యం చేసుకోవాలేమో!? -
అసెంబ్లీ రద్దు అనుచితం
సరిగ్గా అయిదు నెలలక్రితం పీడీపీ–బీజేపీ కూటమి ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత జమ్మూ– కశ్మీర్లో రాజకీయం వేడెక్కింది. చకచకా జరిగిన పరిణామాల పర్యవసానంగా హఠాత్తుగా బుధవారం అసెంబ్లీ రద్దయింది. ఎప్పుడూ పరస్పరం కత్తులు నూరుకునే ప్రాంతీయ పక్షాలు మెహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పీడీపీ, ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్‌లు కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేయడం మొదలు పెట్టగానే బీజేపీ నాయకత్వం అప్రమత్తమైంది. ఫలితంగా పీపుల్స్ కాన్ఫరెన్స్ నాయకుడు సజ్జాద్ గని లోన్ ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇప్పించాలంటూ వాట్సాప్ మాధ్యమం ద్వారా గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కు లేఖ పంపారు. తాము లేఖ ఇవ్వబోతే గవర్నర్ కార్యాలయం స్పందించలేదని, దాన్ని ఫ్యాక్స్ చేయడానికి ప్రయత్నిస్తే అవాంతరాలు వచ్చాయని మెహబూబా చెబుతున్నారు. కేంద్రంలో ఉండే ప్రభుత్వాలు రాష్ట్రాల్లో తమకనుకూలమైన పరిస్థితులు ఉంటే ఒకరకంగా, లేనట్టయితే మరో రకంగా వ్యవహరించడం మన దేశంలో రివాజుగా మారింది. ఈ సంస్కృతిని ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీయే అయినా ఇతర పక్షాలు కూడా అందుకు భిన్నంగా లేవు. ఇష్టానుసారం ప్రభుత్వాలను బర్తరఫ్ చేయడం, బలహీనులకు అధికారం కట్టబెట్టడం ఆనవాయితీ అయింది. ఎస్ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడ్డాక ఈ ధోరణికి కాస్త అడ్డుకట్ట పడినా పూర్తిగా సమసిపోలేదు. ఇప్పుడు జమ్మూ–కశ్మీర్ గవర్నర్ చేసింది ఇటువంటిదే. 87మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటుచేసే పార్టీకి లేదా కూటమికి కనీసం 44మంది మద్దతు అవసరం. సభలో 28మంది సభ్యులున్న పీడీపీ, 12మంది సభ్యులున్న కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి. 15మంది సభ్యులున్న నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) దీనికి బయటినుంచి మద్దతిస్తానని చెప్పింది. అంటే మొత్తంగా ఈ పార్టీలకు 56మంది ఎమ్మెల్యేలున్నట్టు లెక్క. అటు సజ్జాద్ తమకు 25మంది సభ్యులున్న బీజేపీతోపాటు మరో 18మంది ఎమ్మెల్యేల మద్దతున్నదని గవర్నర్‌కు పంపిన లేఖలో చెప్పారు. అంటే ఆ పక్షం తమకు 44మంది సభ్యుల బలం ఉందని చెప్పింది. ఇక్కడ న్యాయంగా గవర్నర్ విశ్వసించాల్సింది ఎవరిని? సజ్జాద్ పార్టీకి ఆయనతోపాటు మరో ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. ఈ ఇద్దరికీ బీజేపీ మద్దతు ఉన్నట్టు అర్ధమవుతూనే ఉంది. కానీ మరో 18మంది ఎక్కణ్ణుంచి వచ్చినట్టు? సజ్జాద్ వారి పేర్లు ఇచ్చారా? ఆ ఎమ్మెల్యేల నుంచి వచ్చిన మద్దతు లేఖలు గవర్నర్‌కి సమర్పించారా? ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధపడిన రెండు పక్షాల్లో ఎవరికీ సుస్థిర ప్రభుత్వాన్ని నెలకొల్పే సత్తా లేదన్న నిర్ణయానికి ఆయనెలా వచ్చినట్టు? వాస్తవానికి పీడీపీలో చీలిక తీసుకొచ్చి, తమ సన్నిహితుడు సజ్జాద్ గని లోన్‌కు అధికార పగ్గాలు కట్టబెట్టాలని బీజేపీ కొంతకాలంగా అనుకుంటోంది. ప్రస్తుత అసెంబ్లీ గడువు 2020 డిసెంబర్‌తో ముగుస్తుంది. ప్రస్తుతానికి సజ్జాద్‌తో నెట్టుకొచ్చి, ఆ తర్వాత అసెంబ్లీని రద్దు చేయించి ఆర్నెల్లలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలతోపాటు దానికి కూడా ఎన్నికలు జరిపించాలని బీజేపీ వ్యూహం రచించింది. ఈ విషయం మీడియాలో గుప్పుమన్నా పీడీపీలో మొదట్లో పెద్దగా కదలిక లేదు. తగినంత రాజకీయ అనుభవం లేకనో, తమ పార్టీనుంచి ఎవరూ బయటికి పోరన్న ధీమానో... మొత్తానికి మెహబూబా నిర్లిప్తంగా ఉండిపోయారు. కానీ మంగళవారం ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, ఎంపీ ముజఫర్ హుస్సేన్ బేగ్ చేసిన ప్రకటనతో ఆమె మేల్కొన్నారు. సజ్జాద్ తన కుమారుడితో సమానమని ఆయన చెప్పడంతో కొందరు ఎమ్మెల్యేలు జారుకునేలా ఉన్నారని మెహబూబాకు అర్ధమైంది. అందుకే బుధవారం ఆదరా బాదరాగా కాంగ్రెస్, ఎన్సీలను కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ రాజకీయాల సంగతెలా ఉన్నా...జమ్మూ–కశ్మీర్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న సున్నితమైన ప్రాంతం. అక్కడ అటు వేర్పాటువాదం, ఇటు ఉగ్రవాదం దశాబ్దాలుగా సమస్యగా మారాయి. అందుకే అక్కడ అస్థిరత నెలకొన్నప్పుడు ప్రధాన రాజకీయ పక్షాలు, కేంద్ర ప్రభుత్వమూ ఆచి తూచి అడుగులేయాలి. తమకు అలవాటైన రాజకీయపుటెత్తులు అక్కడ ప్రయోగిస్తే పరిస్థితి వికటిస్తుంది. అది దేశ ప్రయో జనాలకు చేటు తెస్తుంది. తాజా పరిణామాలపై బీజేపీ నాయకులు చేస్తున్న ప్రకటనలు విపరీత ధోరణులతో ఉన్నాయి. రాష్ట్రంలోని మూడు ప్రధాన పక్షాలూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామ నడంలో కుట్ర దాగున్నదని అనడం అత్యంత దారుణం. ప్రజలెన్నుకున్న పార్టీలు తమ విభేదాలు మరిచి ఒకటై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనడం ఏమంత అపరాధం? ఎలాంటి కుట్ర? వాస్తవానికి జమ్మూ–కశ్మీర్లో ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల్లో గవర్నర్ పాలన కన్నా ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వం ఉండటం అత్యవసరం. రెండేళ్ల వ్యవధి ఉండగానే అసెంబ్లీ రద్దు చేయడం తప్పుడు సంకేతాలు పంపుతుంది. గవర్నర్ అన్ని ప్రత్యామ్నాయాలూ పరిశీలించి, ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికీ సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసే సత్తా లేదని సంతృప్తి చెందాక ఆ నిర్ణయా నికొస్తే ఎవరూ అభ్యంతరం చెప్పరు. అందుకోసం అసెంబ్లీని సమావేశపరిచి అక్కడే బలా బలాలు తేలిస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేది. కానీ దానికి విరుద్ధంగా జమ్మూ–కశ్మీర్లో బూటకపు ప్రజాస్వామ్యం నడుస్తున్నదన్న వేర్పాటువాదుల ప్రచారానికి బలం చేకూర్చే విధంగా రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారే వ్యవహరించడం విడ్డూరం. అసెంబ్లీ రద్దు అంశాన్ని ఏ పార్టీ అయినా కోర్టులో సవాలు చేస్తే గవర్నర్ నిర్ణయం న్యాయ పరీక్షకు నిలబడుతుందా అన్నది సందేహమే. రాజకీయ పక్షాల బలాబలాలు తేలాల్సింది చట్టసభల్లో తప్ప రాజ్భవన్లలో కాదని పలుమార్లు న్యాయ స్థానాలు స్పష్టం చేశాయి. అయినా స్వీయ రాజకీయ ప్రయోజనాలకోసం ఎంతకైనా తెగించటం అధికారంలో ఉన్నవారికి అలవాటైపోయింది. ఇది విచారకరం. -
కేంద్రం వైఖరిలో మార్పునకు ఇది సంకేతమా?
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్ 13వ రాష్ట్ర గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్ గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెల్సిందే. పౌర అధికారులను, మాజీ సైనిక అధికారులను రాష్ట్ర గవర్నర్‌గా నియమించే సంప్రదాయానికి తెరదించి ఓ రాజకీయ అనుభవశాలిని గవర్నర్‌గా నియమించడం విశేషం. 1965లో తొట్టతొలి గవర్నర్‌గా కరణ్ సింగ్ నియామకం అనంతరం ఓ రాజకీయ వ్యక్తిని నియమించడం మళ్లీ ఇదే తొలిసారి. ప్రస్తుతం గవర్నర్ పాలనలో ఉన్న కశ్మీర్‌కు సత్యపాల్ మాలిక్‌ను నియమించడం పట్ల రాజకీయ వర్గాల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కశ్మీర్ సమస్యకు ఇంతకాలం సైనిక పరిష్కారాన్నే కోరుకున్న కేంద్రం వైఖరిలో వచ్చిన మార్పునకు ఇది సూచనని, రాజకీయ కోణం నుంచి కశ్మీర్ సమస్యను చూసేందుకు రాజకీయ అనుభవశాలిని నియమించారని ఎక్కువ మంది భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 72 ఏళ్ల మాలిక్ కొన్ని దశాబ్దాల తన రాజకీయ జీవితంలో పలు పార్టీలు మారారు. మాలిక్‌తోపాటు పలు పార్టీలకు సేవలిందించి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న కేసీ త్యాగి కథనం ప్రకారం మాలిక్ ‘సోషలిస్ట్’గా మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి. ప్రస్తుతం జనతాదళ్ (యూ)లో కొనసాగుతున్న ఆయన మీరట్‌లో సోషలిస్ట్ యువజన నాయకుడిగా పనిచేశారు. భారత్‌తో సోషలిస్ట్ ఉద్యమాన్ని తీసుకొచ్చిన రామ్ మనోహర్ లోహియా, కశ్మీర్‌కు చెందిన షేక్ మొహమ్మద్ అబ్దుల్లాలతో స్ఫూర్తి పొందిన వ్యక్తి. సత్ప్రవర్తన కలిగిన మాలిక్ ఏ పార్టీలో కూడా తన పని విధానంలో చెడ్డ పేరు తెచ్చుకోలేదు. ఆయన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి లోక్‌దళ్ పార్టీ తరఫున 1974లో ఎన్నికయ్యారు. 1980లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1984లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1985లో యూపీ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 1986లో మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1987లో ఆయన వీపీ సింగ్ నాయకత్వంలోని జన్మోర్చాలో చేరారు. జన్‌మోర్చా జనతా దళ్‌లో విలీనమైన తర్వాత 1989లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత వీపీ సింగ్‌తో విభేదించి సమాజ్‌వాది పార్టీలో చేరారు. 2004లో బీజేపీలో చేరారు. 2017లో బిహార్ గవర్నర్‌గా నియమితులయ్యారు. వీపీ సింగ్ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు జనతాదళ్‌లో మాలిక్, త్యాగీలు కలసి పనిచేశారు. అప్పుడు కశ్మీర్ సమస్య పట్ల వీపీ ప్రభుత్వం దృక్పథం భిన్నంగా ఉండేదని, ఒక్క చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించకోగలమని కేంద్రం బలంగా విశ్వసించిందని త్యాగి తెలిపారు. సోషలిస్ట్, ఆపార రాజకీయ అనుభవం కలిగిన మాలిక్‌ను కశ్మీర్ గవర్నర్‌గా నియమించడం కశ్మీర్ రాజకీయ పార్టీల్లో కొత్త ఆశలు చిగురింపచేశాయి. కశ్మీర్‌కు ఇది మరో ప్రయోగం లాంటిదేనని, అయితే రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తిని నియమించడం మంచి ప్రత్యామ్నాయం అని, సమస్యను అర్థం చేసుకొని పరిష్కార మార్గం కనుగొనే అవకాశం ఉంటుందని నేషనలిస్ట్ కాంగ్రెస్ సీనియర్ లెజిస్లేచర్ అలీ మొహమ్మద్ సాగర్ అభిప్రాయపడ్డారు. కేంద్రం ఇష్టప్రకారమే ఈ నియామకం జరిగి ఉన్నట్లయితే మాలిక్ నియామకాన్ని హర్షించాల్సిందేనని ఆయన అన్నారు. సైనికేతర వ్యక్తిని నియమించడం పట్ల పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ బహిరంగంగానే హర్షం వ్యక్తం చేసింది. సత్ఫాలన అందించడంతో పాటు అన్ని పార్టీలను కలుపుకొని కశ్మీర్ సమస్య పరిష్కారం దిశగా మాలిక్ ముందడుగు వేస్తారని ఆ పార్టీ అదనపు అధికార ప్రతినిధి నజ్మూ సాకిబ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తున్న 35ఏ, 370 అధికరణలను ఎత్తివేయకుండా అడ్డుకుంటారన్న ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. మాలిక్ నియామకం సరైందన్న రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి అశోక్ మాలిక్ కశ్మీర్ పట్ల పాక్ దృక్పథం మారిందనే అభిప్రాయంతోని ఏకీభవించలేదు. మాలిక్ నియామకాన్ని మామూలు విషయంగా తీసుకోకూడదని, ఇందులో కచ్చితంగా ఏదో మతలబే ఉంటుందని బీజేపీ నైజం బాగా తెల్సిన రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మాలిక్ సేవలను ఉపయోగించుకునే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు కేంద్రం కృషి చేయవచ్చని వారు భావిస్తున్నారు. కశ్మీర్ సమస్యకు రాజకీయ పరిష్కారానికి తాము వెరవమని చెప్పడానికి, మరోరకంగా రాష్ట్రంలో పార్టీ లక్ష్యాలను నెరవేర్చుకోవడం కోసమే మాలిక్‌ను కేంద్రం నియమించి ఉంటుందని కశ్మీర్ యూనివర్శిటీలోని పొలిటికల్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ ఐజాజ్ వాణి అభిప్రాయపడ్డారు. అధికార రాజకీయాల కోసమే కేంద్రం ప్రయత్నించినట్లయితే కశ్మీర్ పరిస్థితి మరింత క్షీణించే ప్రమాదం ఉందని కూడా ఆయన హెచ్చరించారు.