ఇమ్రాన్‌ను అన్‌ఫాలో చేసిన దుండగులు | Jammu Kashmir Governor Twitter Account Hacked Unfollowed Pak PM | Sakshi
Sakshi News home page

ఇమ్రాన్‌ను అన్‌ఫాలో చేసిన దుండగులు

Published Wed, May 1 2019 9:53 AM | Last Updated on Wed, May 1 2019 9:56 AM

Jammu Kashmir Governor Twitter Account Hacked Unfollowed Pak PM - Sakshi

మాలిక్‌ అకౌంట్‌ను హ్యాక్‌ చేసిన దుండగులు ఇమ్రాన్‌ను అన్‌ఫాలో చేశారని వెల్లడించింది.

శ్రీనగర్‌ : జమ్మూ కశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ ట్విటర్‌ అకౌంట్‌ హ్యాకింగ్‌కు గురైంది. ఆయన పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ను ఫాలో అవడమే దీనికి కారణంగా గవర్నర్‌ కార్యాలయం మంగళవారం తెలిపింది. మాలిక్‌ అకౌంట్‌ను హ్యాక్‌ చేసిన దుండగులు ఇమ్రాన్‌ను అన్‌ఫాలో చేశారని వెల్లడించింది. ఈ సంఘటను పోలీసుల దృష్టికి తీసుకెళ్లామని ఒక ప్రకటన విడుదల చేసింది. ఇదిలాఉండగా.. పీడీపీ, బీజేపీ పొత్తు విచ్ఛిన్నం కావడంతో జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసింది. దాంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు.

ఇక పుల్వామా ఉగ్రదాడి అనంతరం గవర్నర్‌ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. జమ్మూ-శ్రీనగర్‌ హైవేపై సాధారణ పౌరుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. వారంలో కేవలం రెండు రోజులు మాత్రమే ఆ దారిగుండా ప్రయాణం సాగించాలని ఆదేశాలు జారీ చేశారు. మిలటరీ వాహనాల రవాణా సాఫిగా సాగడానికి ఇది మంచి ప్రత్యామ్నాయంగా ఆయన ప్రకటించారు. కాగా, మాలిక్‌ నిర్ణయంపై ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement