
లక్నో : దేశంలో గవర్నర్లు చేసేందుకు పని ఏమీ ఉండదని గోవా గవర్నర్ సత్యపాల్ మాలిక్ అన్నారు. జమ్ము కశ్మీర్ గవర్నర్ అయితే వైన్ తాగుతూ గోల్ఫ్ ఆడుతూ కాలక్షేపం చేస్తుంటారని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో జమ్ము కశ్మీర్ గవర్నర్‌గానూ వ్యవహరించిన మాలిక్ ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మన దేశంలో గవర్నర్లకు పనీపాటా ఏమీ ఉండదు. జమ్ము కశ్మీర్ గవర్నర్ అయితే సాధారణంగా వైన్ తాగుతూ గోల్ఫ్ ఆడుతూ సేదతీరుతుంటారు. ఇతర రాష్ట్రాల గవర్నర్లు మాత్రం వివాదాలకు దూరంగా ఉంటార’ని అన్నారు. యూపీలోని భాగ్పట్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.