
జమ్మూ: పాకిస్తాన్, ఉగ్రవాదులు ఎన్ని ఆటంకాలు కలిగించినప్పటికీ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామని జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అన్నారు. ఉగ్రవాదుల చొరబాట్లను సైన్యం విజయవంతంగా తిప్పికొడుతుండటంతో పాకిస్తాన్‌కు దిక్కుతోచడం లేద న్నారు. ఇక్కడి వాతావరణాన్ని చెడగొట్టేందుకు పాకిస్తాన్ విఫలయత్నాలు చేస్తోందని, అయినా లోయలో శాంతి నెలకొని ఉందని ఆయన సంతో షం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో ఎన్నికలు నిర్వ హించడం పాకిస్తాన్‌కు ఇష్టం లేదు, అందుకే ఉగ్రవాదుల చొరబాటును ప్రోత్సహిస్తోంది. చొర బాట్లను నిరోధించడం ద్వారా పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగించాం’అని ఆయన శనివారం ఇక్కడ మీడియాకు వెల్లడించారు.
పీవోకేలోని హిజ్బుల్ ముజాహిదీన్ నేత సలావుద్దీన్ పంచాయతీ ఎన్నికలను ఉగ్రవాదుల ద్వారా భగ్నం చేయాలని ప్రయత్నించినప్పటికీ, ప్రజల సహాయంలో సైన్యం ఆ ప్రక్రియను విజయవంతంగా ముగించిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. జమ్మూలో స్వామి వివేకానంద మెడికల్ మిషన్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించిన వివేకానంద 156వ జయంతి కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడారు. వివేకానంద బోధనలను ప్రజలు ఆచరించడం ద్వారా మెరుగైన సమాజానికి దోహద పడాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రిలో కొత్తగా నెలకొల్పిన ఈఎన్‌టీ విభాగాన్ని, ఆపరేషన్ థియేటర్‌ను ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment