
శ్రీనగర్: కశ్మీర్‌లో విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులపై గవర్నర్ సత్యపాల్ మాలిక్ విరుచుకుపడ్డారు. పద్ధతి మార్చుకోకుంటే త్వరలో ప్రాణాలు కోల్పోతారని హెచ్చరించారు. జమ్మూలో జరిగిన ఓ కార్యక్రమంలో మాలిక్ మాట్లాడుతూ..‘పాక్‌కు అమ్ముడుపోయిన కొందరు యువకులు కశ్మీర్‌లోయలో పండ్లవ్యాపారులను చంపేస్తామని బెదిరిస్తున్నారు. నేను వీళ్లకు ఒకటే చెబుతున్నా. వెంటనే మీ(ఉగ్రవాదులు) పద్ధతిని మార్చుకోండి. పండ్ల వ్యాపారులను చంపే విషయం తర్వాత చూసుకోవచ్చు. మీరైతే మాత్రం తప్పకుండా చనిపోతారని గ్యారెంటీతో చెబుతున్నా’ అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment