హిజ్బుల్‌ కమాండర్‌ హతం | Hizbul Terrorist Masood Killed in Encounter | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదరహిత జిల్లాగా అవతరించిన దోడా

Published Mon, Jun 29 2020 12:39 PM | Last Updated on Mon, Jun 29 2020 12:44 PM

Hizbul Terrorist Masood Killed in Encounter - Sakshi

కశ్మీర్‌: హిజ్బుల్ ముజాహిదీన్ క‌మాండ‌ర్ మ‌సూద్ అహ్మ‌ద్ భ‌ట్‌ను భ‌ద్ర‌తా ద‌ళాలు సోమవారం హ‌త‌మార్చాయి. ద‌క్షిణ క‌శ్మీర్ జిల్లాలోని కుల్‌చోరాలో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో అహ్మ‌ద్ భ‌ట్‌తో పాటు మ‌రో ఇద్ద‌రు ఉగ్రవాదులను హ‌త‌మార్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో దోడా ఇక ‘ఉగ్ర‌వాదరహిత’ జిల్లాగా మారిన‌ట్లు అధికారులు ప్రకటించారు. ఆర్మీ, జమ్మూకశ్మీర్‌ పోలీసులు‌, సీఆర్‌పీఎఫ్ ద‌ళాలు సంయుక్తంగా ఈ ఆప‌రేష‌న్ చేప‌ట్టాయని తెలిపారు. ఎన్‌కౌంట‌ర్ జరిగిన ప్రాంతం నుంచి ఓ ఏకే రైఫిల్‌, రెండు తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
 

జ‌మ్మూక‌శ్మీర్ పోలీసు చీఫ్ దిల్‌బాగ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. హిజ్బుల్ క‌మాండ‌ర్ అహ్మద్ భ‌ట్‌తో పాటు ఇద్దు ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాదుల‌ను హ‌త‌మార్చిన‌ట్లు తెలిపారు. మ‌సూద్‌ గతంలో ఓ అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్నాడు. దోడా పోలిస్ స్టేష‌న్‌లో అత‌నిపై కేసు నమోదయ్యింది. అప్ప‌టి నుంచి ప‌రారీలో ఉన్న మ‌సూద్ ఆ తర్వాత హిజ్బుల్‌ గ్రూపులో చేరాడు. కశ్మీర్‌ వేదికగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నాడు. ద‌క్షిణ క‌శ్మీర్ నుంచి ఉగ్ర‌వాదాన్ని తరిమివేయాల‌న్న లక్క్ష్యంతో భ‌ద్ర‌తా ద‌ళాలు ప‌నిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. త్రాల్ ప్రాంతంలో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్ర‌వాదుల‌ను హ‌తమార్చ‌డంతో ఆ ప్రాంతం ఉగ్రవాదరహితంగా మారిన‌ట్లు పోలీసులు ప్రకటించారు.

ఈ ఏడాది భద్రతా దళాలు కశ్మీర్‌లో దాడులను వేగవంతం చేశాయి. 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చాయి. అయితే ఈ ఎన్‌కౌంటర్‌ల పట్ల పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం తీవ్ర నిరసనలు తెలిపింది. ఎన్‌కౌంటర్లలో మరణించిన ఉగ్రవాదులను ‘అమాయకులు’ అని అభివర్ణించింది. ఉగ్రవాదుల చొరబాట్లను ఆపడానికి ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో మన సరిహద్దులో భద్రతా గ్రిడ్‌ను కఠినతరం చేసింది. భద్రతా దళాలు ఈ నెలలోనే దాదాపు నలభై మంది ఉగ్రవాదులను హతమార్చాయి. వీరిలో ఎక్కువ మంది ఉగ్రవాదానికి కేంద్రంగా పరిగణించే దక్షిణ కశ్మీర్‌లోనే హతమయ్యారు. ఈ నెలలో హతమయిన వారిలో జైష్-ఈ-మొహమ్మద్, లష్కర్-ఈ-తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్లు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement