Hizbul Mujahideen commander
-
‘ఉగ్రవాద కమాండర్ వర్ధంతిని జరపడం సిగ్గుచేటు’
లండన్ : హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బర్హాన్ వనీ మరణించి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన వర్ధంతి రోజున యూకేకు చెందిన పాకిస్తాన్ వేర్పాటువాద సంస్థలు లండన్‌లోని భారత హైకమిషన్ ఎదుట నిరసనలు చేపట్టారు. గ్లోబల్ కశ్మీర్, పాకిస్తాన్ కౌన్సిల్ చైర్మన్ రాజా సికందర్ ఖాన్ మాట్లాడుతూ.. భారత సంకేళ్ల నుంచి తన మాతృభూమి విముక్తి కోసం తన జీవితానికి త్యాగం చేసిన షాహీద్ బుర్హాన్ వనీ అమరుడై నాలుగేళ్ల జ్ఞాపకార్థం తాము సంఘీభావం తెలుపుతున్నామని తెలిపారు. ఈ నిరసనకు ఓవర్సీస్ పాకిస్తాన్ వెల్ఫేర్ కౌన్సిల్,గ్లోబల్ పాకిస్తాన్, కాశ్మీర్ సుప్రీం సహా బృందాలు మద్దతిచ్చాయి. కాగా కశ్మీర్లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు బుర్హాన్ వనీ నేతృత్వం వహించిన విషయం తెలిసిందే. 2016 జూలైలో జరిగిన ఎన్కౌంటర్లో బర్హాన్ వనీని భారత ఆర్మీ సైన్యం మట్టుబెట్టింది. (నేపాల్‌లో భారత న్యూస్ చానళ్ల నిలిపివేత) మెట్రోపాలిటన్ పోలీసులు, యూకే విదేశీ, కామన్వెల్త్ కార్యాలయం,హోమ్ ఆఫీస్ అందించిన భద్రతా సహకారాన్ని లండన్‌లోని భారత హైకమిషన్ స్వాగతించింది. 2016లో బర్హాన్ మరణించక ముందు తన బృందంతో కశ్మీర్లో ఎన్నో అల్లర్లు, దాడులు జరిపాడని ఈ దాడుల్లో ఎంతో మంది జవాన్లు, పౌరులు మరణించినట్లు భారత మిషన్ కమ్యూనికేషన్ పేర్కొంది. అంతర్జాతీయంగా ఉగ్రవాద సంస్థ అయిన హిజ్బుల్ ముజాహిదీన్‌కు జమ్మూ కాశ్మీర్లో హింసాత్మక ఘటనలు సృష్టించిన చరిత్ర ఉందని అధికారులు స్పష్టం చేశారు. (భారత్-చైనా సరిహద్దులో మెరుగవుతున్న పరిస్థితులు) -
హిజ్బుల్ కమాండర్ హతం
కశ్మీర్: హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ మసూద్ అహ్మద్ భట్‌ను భద్రతా దళాలు సోమవారం హతమార్చాయి. దక్షిణ కశ్మీర్ జిల్లాలోని కుల్‌చోరాలో జరిగిన ఎన్కౌంటర్లో అహ్మద్ భట్‌తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో దోడా ఇక ‘ఉగ్రవాదరహిత’ జిల్లాగా మారినట్లు అధికారులు ప్రకటించారు. ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయని తెలిపారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి ఓ ఏకే రైఫిల్, రెండు తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. With today’s operation at Khull Chohar by Anantnag Police along with 19 RR,CRPF in which 2 LET terrorists including one district commander & one HM commander Masood were neutralised, Doda district in Jammu Zone becomes totally militancy free once again.@Sandeep_IPS_JKP pic.twitter.com/sCvioo2f3X — J&K Police (@JmuKmrPolice) June 29, 2020 జమ్మూకశ్మీర్ పోలీసు చీఫ్ దిల్బాగ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. హిజ్బుల్ కమాండర్ అహ్మద్ భట్‌తో పాటు ఇద్దు లష్కరే తోయిబా ఉగ్రవాదులను హతమార్చినట్లు తెలిపారు. మసూద్ గతంలో ఓ అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్నాడు. దోడా పోలిస్ స్టేషన్లో అతనిపై కేసు నమోదయ్యింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న మసూద్ ఆ తర్వాత హిజ్బుల్ గ్రూపులో చేరాడు. కశ్మీర్ వేదికగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నాడు. దక్షిణ కశ్మీర్ నుంచి ఉగ్రవాదాన్ని తరిమివేయాలన్న లక్క్ష్యంతో భద్రతా దళాలు పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. త్రాల్ ప్రాంతంలో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను హతమార్చడంతో ఆ ప్రాంతం ఉగ్రవాదరహితంగా మారినట్లు పోలీసులు ప్రకటించారు. ఈ ఏడాది భద్రతా దళాలు కశ్మీర్లో దాడులను వేగవంతం చేశాయి. 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చాయి. అయితే ఈ ఎన్కౌంటర్ల పట్ల పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం తీవ్ర నిరసనలు తెలిపింది. ఎన్కౌంటర్లలో మరణించిన ఉగ్రవాదులను ‘అమాయకులు’ అని అభివర్ణించింది. ఉగ్రవాదుల చొరబాట్లను ఆపడానికి ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో మన సరిహద్దులో భద్రతా గ్రిడ్‌ను కఠినతరం చేసింది. భద్రతా దళాలు ఈ నెలలోనే దాదాపు నలభై మంది ఉగ్రవాదులను హతమార్చాయి. వీరిలో ఎక్కువ మంది ఉగ్రవాదానికి కేంద్రంగా పరిగణించే దక్షిణ కశ్మీర్‌లోనే హతమయ్యారు. ఈ నెలలో హతమయిన వారిలో జైష్-ఈ-మొహమ్మద్, లష్కర్-ఈ-తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్లు ఉన్నారు. -
హిజ్బుల్ టాప్ కమాండర్ దిగ్బంధం
కశ్మీర్ : జమ్మూకశ్మీర్‌లోని భద్రతా దళాలు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది రియాజ్ నైకూను దిగ్బంధం చేశాయి. పుల్వామా జిల్లాలోని అవంతిపురాలో రాత్రి నుంచి భద్రతా దళాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. అయితే బేగ్‌పుర గ్రామంలో ఉగ్రవాది రియాజ్ ఉన్నట్లు గుర్తించారు. హిజ్బుల్ ముజాయిద్దీన్ కమాండర్ అయిన రియాజ్ తలపై 12 లక్షల రివార్డు ఉంది. కాగా ఈ ప్రాంతంలో ఉన్న టెర్రరిస్టు గ్రూపులకు రియాజ్ పెద్ద దిక్కుగా ఉన్నాడని భద్రతా దళాలు పేర్కొన్నాయి. ఒకవేళ రియాజ్‌ను అరెస్టు చేసినా లేక హతమార్చినా.. ఇది స్థానికంగా ఉన్న ఉగ్రమూకలకు పెద్ద దెబ్బగా చెప్పచ్చు. జమ్మూకశ్మీర్ పోలీసులు ఈ ఆపరేషన్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని ట్విటర్ ద్వారా తెలియజేశారు. ఉగ్రవాదులను మట్టుబెట్టుడానికి కాల్పులు జరుగుతున్నట్లు చెప్పారు. మంగళవారం రాత్రి నుంచి సీనియర్ అధికారులు అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు ట్విటర్లో పేర్కొన్నారు. రియాజ్ సొంత ఊరైన బేగ్‌పురాకు హిజ్బుల్ కమాండర్ వచ్చినట్లు సమాచారం రావడంతో.. ఆ ప్రాంతాన్ని రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్, స్పెషనల్ ఆపరేషన్స్ గ్రూప్ దళాలు చుట్టుముట్టాయి. ఆ గ్రామానికి చెందిన అన్ని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను మూసివేసి తమ నియంత్రణలోకి తెచ్చుకున్నట్లు అధికారులు వెల్లడించారు. Contact established in the third operation at #Beighpors #Awantipur. Top terrorist commander is trapped. Exchange of fire on. Details shall follow.. https://t.co/umZv0JgVbs — J&K Police (@JmuKmrPolice) May 6, 2020 -
వనీ బ్రిగేడ్‌లో ఆఖరి కమాండర్ హతం
శ్రీనగర్, జమ్మూ కశ్మీర్ : హిజ్బుల్ మొజాహిదీన్(ఐఎమ్) ప్రముఖ ఉగ్రవాది బుర్హాన్ వనీ బ్రిగేడ్‌లోని ఆఖరి కమాండర్‌ను భారత భద్రతా దళాలు ఆదివారం మట్టుబెట్టాయి. ఇప్పటికే పలువురు కీలక కమాండర్లను భద్రతా బలగాలు మట్టుబెట్టగా.. షోపియాన్ జిల్లాలో ఆదివారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో బుర్హాన్ వనీ బ్రిగేడ్‌లో ఆఖరివాడైన సద్దాం పద్దర్ మృతి చెందిన్నట్లు పోలీసు వర్గాలు ప్రకటించాయి. షోపియాన్‌లో భద్రతా బలగాలకు, మిలిటెంట్లకు మధ్య ఆదివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో మొత్తం ఐదుగురు తీవ్రవాదులు హతమయ్యారు. జైనాపుర ప్రాంతంలోని బడిగాం గ్రామంలో ఉగ్రవాదులు నక్కారనే సమాచారం తెలుసుకున్న భద్రతా బలగాలు ఆ గ్రామాన్ని చుట్టుముట్టాయి. తీవ్రవాదుల ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు కార్డన్ సెర్ఛ్ ఆపరేషన్ చేపట్టగా.. భద్రతా బలగాల రాకను గమనించిన మిలిటెంట్లు కాల్పులకు దిగారు. ప్రతిగా రక్షక దళాలు కూడా ఎదురు కాల్పులు ప్రారంభించాయి. కాగా, ఈ కాల్పుల్లో ఒక ఆర్మీ జవాను, పోలీసు అధికారి గాయపడ్డారు. కొంత కాలంగా తీవ్రవాద సంస్థలో పని చేస్తున్న కశ్మీర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మహ్మర్ రఫి బట్ కూడా ఈ కాల్పుల్లో మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మిగతా ముగ్గురిని గుర్తించాల్సివుందని పోలీసులు పేర్కొన్నారు. Encounter concluded at Badigam Zainpora Shopian, 5 bodies of terrorists recovered. Well done boys - Army/ CRPF/J&K Police. — Shesh Paul Vaid (@spvaid) May 6, 2018 -
క్రికెటర్ కావాలనుకుని.. ఉగ్రవాదయ్యాడు
తెలివితేటలు ఉన్న కుర్రాడు సమున్నత లక్ష్యాన్ని వదిలి దారితప్పితే ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవుతాయో.. ఎన్కౌంటర్లో హతమైన హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హన్ వనీ ఉదంతమే నిదర్శనం. రెండుపదుల వయసులోనే కరుడుగట్టిన ఉగ్రవాదిగా మారిన వనీ.. ఇలా మారుతాడని చిన్నతనంలో ఊహించలేదు. 10 ఏళ్ల వయసులో అతను కన్న కలలు వేరు. సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలన్నది వనీ ఆశయమని అతని తండ్రి ముజఫర్ వనీ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అలాగే కశ్మీర్ క్రికెటర్ పర్వేజ్ రసూల్ మాదిరి క్రికెటర్ కావాలని, దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కోరుకునేవాడని తెలిపాడు. ముజఫర్ వనీ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్. పిల్లలు బాగా చదువుకుని కశ్మీర్ అడ్మినిస్ట్రేటీవ్ సర్వీస్, ఐఏఎస్ వంటి ఉన్నతాధికారులు కావాలని ఆయన చెబుతుంటారు. తండ్రి మాటలకు ప్రేరణతో బుర్హన్ కూడా బాగా చదువుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని కోరుకున్నాడు. అయితే వక్రదారి పట్టడంతో అతని లక్ష్యం నెరవేరలేదు. ఉగ్రవాద భావజాలంతో అతని జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. కశ్మీర్ కల్లోలానికి కారణమయ్యాడు. భద్రత దళాల ఎన్కౌంటర్లో వనీ మరణించాక జరిగిన అల్లర్లలో దాదాపు 80 మరణించగా, రెండున్నర నెలల పాటు కశ్మీర్లో కర్ఫ్యూ వాతావారణం నెలకొంది. పరిస్థితులు ఇప్పుడిప్పుడే సద్ధుమణుగుతున్నాయి. 2010 అక్టోబర్ 5న బుర్హన్ ఇల్లు వదిలి వెళ్లిపోయాడని ముజఫర్ చెప్పాడు. స్నేహితులను కలిసేందుకు వెళుతున్నానని తన తల్లికి చెప్పి వెళ్లాడని, ఆ తర్వాత తిరిగిరాలేదని తెలిపాడు. ఉగ్రవాదుల్లో చేరాడని ఆ తర్వాత తెలిసిందని చెప్పాడు. ఎన్కౌంటర్లో చనిపోయే రెండు నెలల ముందు అతన్ని మార్చేందుకు ప్రయత్నించానని తెలిపాడు. గత ఐదేళ్లలో తాను బుర్హన్ను రెండు లేదా మూడు సార్లు కలిశానని, అది కూడా రెండు మూడు నిమిషాలకు మించి మాట్లాడలేదని చెప్పాడు. రెండున్నరేళ్ల క్రితం చివరిసారి కలిశానని, బుర్హన్ సొంత పంథాలో సాగాడని, తాను కుటుంబం కోసం ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్నానన్నాడు. బుర్హన్కు ముందు తన మరో కుమారుడు ఖలీద్ గతేడాది ఏప్రిల్‌లో భద్రత దళాల కాల్పుల్లో మరణించాడని తెలిపాడు. తన మూడో కొడుకు నవీద్ అన్నల బాటలో నడవకుండా చదువుకోవాలని భావిస్తున్నాడని, తన కూతురు టీచర్ కావాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. బుర్హన్ ఎన్కౌంటర్ తర్వాత కశ్మీర్లో ఈ స్థాయిలో హింస జరుగుతుందని ఊహించలేదని ముజఫర్ చెప్పాడు. రెండు నెలలుగా ఎంతో నష్టపోయామని, మార్పు రావాలని కోరుకుంటున్నామని అన్నాడు. తాను ఇద్దరు కుమారులను కోల్పోయానని, ఎన్నో కుటుంబాలు సొంతవారిని పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. భారత్, పాకిస్థాన్‌ల మధ్య సమస్యల పరిష్కారానికి చర్చలే ఉత్తమమని అభిప్రాయపడ్డాడు. కశ్మీర్ సమస్యను పరిష్కరించడం తప్పనిసరని, లేకుంటే దాడులు జరగవచ్చని చెప్పాడు.