masood
-
భార్య ఉందని హత్య ఆలస్యం.. మసూద్ మర్డర్‌కు ప్రతీకారంగానే?
సాక్షి, కర్ణాటక: దక్షిణ కన్నడ జిల్లా బెళ్లారెలో బీజేపీ నేత ప్రవీణ్ నెట్టారు హత్య కేసులో కేరళలో తలదాచుకున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏడీజీపీ అలోక్‌కుమార్ తెలిపారు. గురువారం మంగళూరులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రవీణ్ హత్య తరువాత నిందితులు శియాబుద్దీన్, రియాజ్, బషీర్‌లు కేరళకు పరారయ్యారని, తలపాడి చెక్‌పోస్టు వద్ద అరెస్టు చేశామని చెప్పారు. వీరికి ఆశ్రయమిచ్చిన వారిని కూడా విచారిస్తున్నాం. ఎందుకు హత్య చేశారు అనేదానిపై కూలంకషంగా విచారణ చేస్తున్నాం. హంతకులతో కలిసి శియాబుద్దీన్ పథకం పన్నారు. ప్రవీణ్ ప్రతి రోజూ భార్యతో షాపునకు వచ్చి వెళ్తుండడంతో హత్యను వాయిదా వేస్తూ వచ్చారు. చివరకు జూలై 26వ తేదీ రాత్రి ప్రవీణ్ ఒక్కడే షాపు నుంచి రావడం చూసి దాడి చేశారు. మసూద్ హత్యకు ప్రతీకారం? మసూద్ అనే వ్యక్తి హత్యకు ప్రతీకారంగా ప్రవీణ్‌ను చంపారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నామని ఏడీజీపీ తెలిపారు. ప్రవీణ్ కేసులో ఇప్పటివరకు 10 మందిని పోలీసులు అరెస్ట్‌చేశారు. జూలై 19వ తేదీన బెళ్లారెలో మసూద్ అనే వ్యక్తిపై కొందరు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి మంగళూరులో చికిత్స పొందుతూ రెండురోజుల తరువాత మృతి చెందాడు. ఇందుకు బదులుగా ప్రవీణ్‌పై దాడి జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ప్రవీణ్ హత్యకు ముందే కేరళలో ఎక్కడ తలదాచుకోవాలా అని హంతకులు ప్లాన్ సిద్ధం చేశారు. 15 రోజుల్లో ఏడు చోట్ల హంతకులు ఆశ్రయం పొందారు. దీంతో పోలీసులు నిందితుల కుటుంబసభ్యులు, ఆత్మీయులను తీవ్ర విచారణ చేపట్టారు. రకరకాల రీతిలో ఒత్తిడి పెంచడంతో కుటుంబసభ్యుల విజ్ఞప్తి మేరకు నిందితులు బయటకు వచ్చారు. ఈ కేసును ఎన్ఐఏ కూడా విచారిస్తోంది. చదవండి: (బీజేపీ నేత దారుణ హత్య.. అక్కడి నుంచే ప్లాన్ జరిగింది!) -
హిజ్బుల్ కమాండర్ హతం
కశ్మీర్: హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ మసూద్ అహ్మద్ భట్‌ను భద్రతా దళాలు సోమవారం హతమార్చాయి. దక్షిణ కశ్మీర్ జిల్లాలోని కుల్‌చోరాలో జరిగిన ఎన్కౌంటర్లో అహ్మద్ భట్‌తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో దోడా ఇక ‘ఉగ్రవాదరహిత’ జిల్లాగా మారినట్లు అధికారులు ప్రకటించారు. ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయని తెలిపారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి ఓ ఏకే రైఫిల్, రెండు తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. With today’s operation at Khull Chohar by Anantnag Police along with 19 RR,CRPF in which 2 LET terrorists including one district commander & one HM commander Masood were neutralised, Doda district in Jammu Zone becomes totally militancy free once again.@Sandeep_IPS_JKP pic.twitter.com/sCvioo2f3X — J&K Police (@JmuKmrPolice) June 29, 2020 జమ్మూకశ్మీర్ పోలీసు చీఫ్ దిల్బాగ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. హిజ్బుల్ కమాండర్ అహ్మద్ భట్‌తో పాటు ఇద్దు లష్కరే తోయిబా ఉగ్రవాదులను హతమార్చినట్లు తెలిపారు. మసూద్ గతంలో ఓ అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్నాడు. దోడా పోలిస్ స్టేషన్లో అతనిపై కేసు నమోదయ్యింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న మసూద్ ఆ తర్వాత హిజ్బుల్ గ్రూపులో చేరాడు. కశ్మీర్ వేదికగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నాడు. దక్షిణ కశ్మీర్ నుంచి ఉగ్రవాదాన్ని తరిమివేయాలన్న లక్క్ష్యంతో భద్రతా దళాలు పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. త్రాల్ ప్రాంతంలో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను హతమార్చడంతో ఆ ప్రాంతం ఉగ్రవాదరహితంగా మారినట్లు పోలీసులు ప్రకటించారు. ఈ ఏడాది భద్రతా దళాలు కశ్మీర్లో దాడులను వేగవంతం చేశాయి. 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చాయి. అయితే ఈ ఎన్కౌంటర్ల పట్ల పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం తీవ్ర నిరసనలు తెలిపింది. ఎన్కౌంటర్లలో మరణించిన ఉగ్రవాదులను ‘అమాయకులు’ అని అభివర్ణించింది. ఉగ్రవాదుల చొరబాట్లను ఆపడానికి ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో మన సరిహద్దులో భద్రతా గ్రిడ్‌ను కఠినతరం చేసింది. భద్రతా దళాలు ఈ నెలలోనే దాదాపు నలభై మంది ఉగ్రవాదులను హతమార్చాయి. వీరిలో ఎక్కువ మంది ఉగ్రవాదానికి కేంద్రంగా పరిగణించే దక్షిణ కశ్మీర్‌లోనే హతమయ్యారు. ఈ నెలలో హతమయిన వారిలో జైష్-ఈ-మొహమ్మద్, లష్కర్-ఈ-తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్లు ఉన్నారు. -
బీజేపీ మైనారిటీ మోర్చా పదాధికారుల నియామకం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర మైనారిటీ మోర్చాకు పదాధికారులను నియమించారు. ఉపాధ్యక్షులుగా మసూద్, మహ్మద్ సాజిద్, అబ్దుల్ ముజీద్, రియాజ్ ఉల్ అన్సారీ, హసమ్ హుస్సేన్, ప్రధాన కార్యదర్శు లుగా అబ్దుల్ వహీద్, షేక్ బాబా, కార్యదర్శులుగా మహ్మద్ మునీరుద్దీన్, మహ్మద్ మొయినుద్దీన్, ఖాజాఖాన్ అలియాస్ సర్వర్, మహ్మద్ మునీర్‌ఖాన్, షయనా బింట్ అస్లామ్, అధికార ప్రతినిధిగా షేక్ ఖదీర్ నియమితులయ్యారు. క్రిస్టియన్ వెల్ఫేర్, ఉర్దూ అకాడమీ యాక్టివిటీస్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, స్వచ్ఛభారత్ అభియాన్, సోషల్ మీడియా, హజ్ అఫైర్స్ కమిటీలకు బాధ్యులను మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అఫ్సర్ పాషా నియమించారు. -
పెళ్లి వేడుకలో ఫైరింగ్...ఒకరి అరెస్టు
కుల్సుంపురాలో గత నెల జరిగిన ఫైరింగ్ ఘటనకు సంబంధించి పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్లో గత నెల 21వ తేదీన జరిగిన పెళ్లి వేడుకలో ఓ వ్యక్తి తన వద్ద ఉన్న పిస్టల్‌తో గాలిలోకి కాల్పులు జరిపాడు. ఇందుకు సంబంధించి పోలీసులకు సీసీటీవీ ఫుటేజి లభించింది. దీనిపై ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం మొఘల్‌పురాకు చెందిన మసూద్‌ను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు సలాఉద్దీన్ కోసం గాలింపు చేపట్టారు. -
సరిహద్దుపై ఆమోదయోగ్య ఒప్పందం
గాంగ్జౌ: నాలుగు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం చైనా చేరుకున్నారు. చైనాలోని ప్రముఖ వాణిజ్య నగరమైన గాంగ్జౌలో ప్రణబ్‌కు ఆ విదేశాంగ ఉప మంత్రి లియూ జెన్మిన్ అధికారికంగా స్వాగతం పలికారు. అణు సరఫరా దేశాల కూటమి(ఎన్ఎస్జీ)లో భారత్ చేరికను చైనా వ్యతిరేకించడం, జైషే మహమ్మద్ అధినేత మసూద్‌పై ఐరాసలో నిషేధ తీర్మానాన్ని అడ్డుకోవడం వంటి అంశాల్ని ఈ పర్యటన లోరాష్ట్రపతి లేవనెత్తనున్నారు. బుధవారం భారత్-చైనా బిజినెస్ ఫోరంలో రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ భారత వ్యాపారవేత్తలు కూడా హాజరుకానున్నారు. గురువారం బీజింగ్ చేరుకుని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తోపాటు ఇతర నాయకులతో రాష్ట్రపతి చర్చిస్తారు. చైనా ప్రధాని లీ కెకియాంగ్, ఆ దేశ పీపుల్స్ కాంగ్రెస్ చైర్మన్ ఝాంగ్ డేజియాంగ్‌లతో కూడా భేటీ అవుతారు. పర్యటన సందర్భంగా చైనా జాతీయ చానల్‌తో ప్రణబ్ మాట్లాడుతూ సరిహద్దు వివాదంలో నిజాయతీతో కూడిన పరస్పర ఆమోదయోగ్య ఒప్పందాన్ని భారత్ కోరుకుంటోందని చెప్పారు. గ్వాంగ్రలో భారత రాయభారి విజయ్ గోఖలే ఏర్పాటు చేసిన విందులో ప్రణబ్ ప్రసంగిస్తూ... ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వంపై చైనా దేశాధినేతలతో మాట్లాడతానని చెప్పారు. విభేదాలు పెంచుకునేందుకు భారత్ ఎప్పుడూ ప్రయత్నించలేద ని, తగ్గించేందుకే కృషిచేసిందన్నారు. గతంలో ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు, రక్షణ మంత్రి హోదాలో చైనాలో పర్యటించిన ప్రణబ్... రాష్ట్రపతి హోదాలో చైనాకు వెళ్లడం ఇదే తొలిసారి. నేపాల్ మీదుగా భారత్‌కు రైలు మార్గం! భారత్‌కు నేపాల్ మీదుగా రైలు మార్గం నిర్మించి సంబంధాల్ని మరింత మెరుగుపర్చుకోవాలని చైనా భావిస్తోందని ఆ దేశ జాతీయ మీడియా వెల్లడించింది. టిబెట్ నుంచి నేపాల్‌కు రైల్వే లైను నిర్మించే పనిలో ఉన్న చైనా ఆ మార్గాన్ని భారత్‌లోని బిహార్ వరకూ విస్తరించాలనే ఆలోచనలో ఉందని గ్లోబల్ టైమ్స్ పత్రిక మంగళవారం పేర్కొంది. ఈ రైలు మార్గం నిర్మాణం వల్ల భారత్‌తోపాటు, దక్షిణాసియా దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని చైనా భావిస్తోంది. టిబెట్ నుంచి నేపాల్‌లోని రసువగధికి రైలు మార్గంపై ఇప్పటికే ఇరు దేశాలు చర్చించాయి. 2020లోపు ఈ మార్గాన్ని పూర్తి చేసే లక్ష్యంతో ముందడుగు వేస్తోన్న చైనా అక్కడి నుంచి బిహార్‌లోని బిర్గంజ్కు 240 కిలోమీటర్ల ైరె ల్వే లైను నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం . -
ఆ తర్వాతే 'మసూద్' గురించి తెలిసింది
-
ఉగ్రముప్పు.. పారాహుషార్!
కేంద్ర నిఘా సంస్థల హెచ్చరిక జనవరి 26న ఒబామా భారత్రాక అప్రమత్తమైన నగర పోలీసులు పటిష్ట భద్రత చర్యలు తీసుకోవాలని స్కూళ్లకు నోటీసులు జారీ సిటీబ్యూరో: పాకిస్తాన్‌లోని పెషావర్ ఆర్మీ పాఠశాలలో తాలిబన్ ఉగ్రవాదులు సాగించిన నరమేధం.. ఆస్ట్రేలియాలో సిడ్నీకేఫ్‌పై ఉగ్రవాదుల దాడి... భారత్‌పై దాడులు చేస్తామని లష్కర్-ఏ-తోయిబా ఉగ్ర నేత మసూద్ ప్రకటన.. జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్యఅతిథిగా అమెరికా అధ్యక్షుడు బారాక్ ఒబామా భారత్ వస్తున్న నేపథ్యంలో ఉగ్రవాదుల ముప్పు ఉందని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి అన్ని పాఠశాలలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. స్కూళ్ల ప్రిన్సిపాల్స్, టీచర్లకు అవగాహన కల్పించేం దుకు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారు. శుక్రవారం సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి అబిడ్స్ డివిజన్లోని ఈడెన్ గార్డెన్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రవాదులు బాంబు దాడులు, కాల్పులకు పాల్పడిన సమయంలో విద్యార్థులను ఎలా రక్షించాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇదే రకంగా సైఫాబాద్, చిక్కడపల్లిలో సైతం ఈ విధమైన మాక్‌డ్రిల్‌ను పోలీసులు నిర్వహించారు. స్కూళ్ల భద్రతపై నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని స్కూల్ యాజమాన్యాలకు సూచించారు. మరోపక్క కార్డన్ సర్చ్ పేరుతో ఆసీఫ్‌నగర్, అఫ్జల్‌గంజ్ తదితర ప్రాంతాల్లోని బస్తీలను చుట్టుముట్టి ప్రతి ఇంటిని మూడు రోజుల నుంచి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. మరోపక్క టాస్క్‌ఫోర్స్ పోలీసులు నగరంలోని లాడ్జీలు, రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లలో తనిఖీలు చేపట్టారు. నగరానికి వచ్చే కొత్త వ్యక్తులపై నిఘా ఉంచాలని ఠాణా ఇన్చార్జిలకు ఆదేశాలు జారీ చేశారు. భిక్షాటన చేస్తూ ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న వారి వేలి ముద్రలను సైతం సేకరిస్తున్నారు. ఈ రూపంలో కూడా దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయనే ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలోనే ఈ దిశగా కూడా పోలీసులు ఓ కన్నేసి ఉంచారు. నగరంలో ఉగ్రమూలాలు.. హైదారాబాద్‌లో ఆర్మీ పాఠశాలలు ఉండడం, పాఠశాలకు వచ్చిపోయే రహదారులపై కూడా భద్రత చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్ బాంబు పేలుడు ఘటనలో నిందితుడు ఖలీద్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. దర్యాప్తులో అతను పాక్‌లోని తాలిబన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని తేలింది. అంతేకాకండా నగరంలో ఇటీవల ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఉగ్రవాద సంస్థ (ఐఎస్ఐఎస్)లో చేరేందుకు ఇంజినీరింగ్ విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు సైతం ఆకర్షితులైన విషయం కూడా ఇటీవలే వెలుగు చూసింది. ఈ రెండు ఉదంతాలు ప్రమాదకర పరిణామమేనని భావించిన నిఘా సంస్థలు నగరంపై ప్రత్యేక దృష్టి సారించాయి. జాగ్రత్తలు తీసుకోండిలా... ► 300 మంది పిల్లలు ఉన్న స్కూళ్లు ప్రజా భద్రత చట్టం కిందికి వస్తాయి ► ఈ స్కూళ్లలో నాణ్యమైన సీసీ కెమెరాలు లోపల, బయట ఏర్పాటు చేసుకోవాలి ►స్కూల్ గేటు నుంచి 50 మీటర్ల దూరం వరకు కవర్ చేసే విధంగా సీసీ కెమెరాలు పెట్టాలి ►{పయివేటు సెక్యూరిటీ గార్డులను నియమించాలి ►డోర్‌ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసుకోవాలి ► విద్యార్థులకు భద్రతపై అవగాహన కల్పించాలి ►ఇందుకోసం పది రోజుల గడువు -
మోడీని ముక్కలు ముక్కలుగా నరుకుతాం
నరేంద్ర మోడీని ముక్కలు ముక్కలుగా నరుకుతాం. ఉత్తరప్రదేశ్ కి ఆయన వస్తే చంపి పోగులు పెడతాం' ఇదీ ఉత్తరప్రదేశ్ లోని సహారన్ పూర్ లోకసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇమ్రాన్ మసూద్ బెదిరింపు. తన నియోజకవర్గంలోని ముస్లిం ఓటర్లను రెచ్చగొట్టేందుకు ఆయన ఒక సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. మాట అనేసి మసూద్ మరిచిపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడీ వ్యాఖ్యలు యూపీలో దుమారం రేపుతున్నాయి. 'గుజరాత్ లో ముస్లిం జనాభా నాలుగు శాతమే. అదే యూపీలో ముస్లిం జనాభా 42 శాతం. ఉత్తరప్రదేశ్ కి మోడీ వస్తే ముక్కలు ముక్కలుగా చేసేస్తాం. ఖబడ్దార్' అని ఆయన వ్యాఖ్యానించారు. మసూద్ మొదట్లో సమాజ్ వాదీ పార్టీ నేత. 2012 ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ లో చేరి, అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఈ మధ్య మళ్లీ సమాజ్ వాదీ పార్టీలో చేరేందుకు ప్రయత్నించి, భంగపడ్డారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థి అయ్యారు. మసూద్ వ్యాఖ్యలపై బిజెపి మండిపడింది. ఈసీకి ఫిర్యాదు చేసేందుకు కమలనాథులు సిద్ధమౌతున్నారు. అందుకే ఇప్పుడు మసూద్ మాట మార్చి, నేను ఆ ప్రసంగం చేయలేదని సంజాయిషీలు ఇస్తున్నారు.