గత నెల జరిగిన ఫైరింగ్ ఘటనకు సంబంధించి పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
కుల్సుంపురాలో గత నెల జరిగిన ఫైరింగ్ ఘటనకు సంబంధించి పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్‌లో గత నెల 21వ తేదీన జరిగిన పెళ్లి వేడుకలో ఓ వ్యక్తి తన వద్ద ఉన్న పిస్టల్‌తో గాలిలోకి కాల్పులు జరిపాడు. ఇందుకు సంబంధించి పోలీసులకు సీసీటీవీ ఫుటేజి లభించింది. దీనిపై ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం మొఘల్‌పురాకు చెందిన మసూద్‌ను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు సలాఉద్దీన్ కోసం గాలింపు చేపట్టారు.