సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర మైనారిటీ మోర్చాకు పదాధికారులను నియమించారు. ఉపాధ్యక్షులుగా మసూద్, మహ్మద్ సాజిద్, అబ్దుల్ ముజీద్, రియాజ్ ఉల్ అన్సారీ, హసమ్ హుస్సేన్, ప్రధాన కార్యదర్శు లుగా అబ్దుల్ వహీద్, షేక్ బాబా, కార్యదర్శులుగా మహ్మద్ మునీరుద్దీన్, మహ్మద్ మొయినుద్దీన్, ఖాజాఖాన్ అలియాస్ సర్వర్, మహ్మద్ మునీర్‌ఖాన్, షయనా బింట్ అస్లామ్, అధికార ప్రతినిధిగా షేక్ ఖదీర్ నియమితులయ్యారు.
క్రిస్టియన్ వెల్ఫేర్, ఉర్దూ అకాడమీ యాక్టివిటీస్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, స్వచ్ఛభారత్ అభియాన్, సోషల్ మీడియా, హజ్ అఫైర్స్ కమిటీలకు బాధ్యులను మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అఫ్సర్ పాషా నియమించారు.