
న్యూఢిల్లీ: రైతులతో పాటు మొత్తం 8 మందిని బలిగొన్న లఖీంపూర్ ఖేరీ కేసులో కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు బుధవారం 8 వారాల మధ్యంతర బెయిలిచ్చింది. ‘‘పాస్‌పోర్టును ట్రయల్ కోర్టుకు సమర్పించాలి.
బెయిల్ సమయంలో ఉత్తరప్రదేశ్, ఢిల్లీల్లో ఉండొద్దు. ఎక్కడ ఉండేదీ ట్రయల్ కోర్టుకు, స్థానిక పోలీస్ స్టేషన్‌కు తెలపాలి. అక్కడ వారానికోసారి వ్యక్తిగతంగా హాజరై అటెండెన్స్ నమోదు చేయాలి’’ అని ఆదేశించింది. సాక్షులు తదితరులను ప్రభావితం చేయకుండా ఉండేందుకే ఈ షరతు విధిస్తున్నట్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జె.కె.మహేశ్వరి ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్‌ను, అతని కుటుంబాన్ని బెదిరించేందుకు ప్రయత్నిస్తే బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించింది. మరో నలుగురు నిందితులకూ మధ్యంతర బెయిల్ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment